మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. అక్కసుతో పాక్ తీర్మాణం | Pakistan Passes Resolution Against India-Israel Hexagon Alliance, Labels It Anti-Muslim | Sakshi
Sakshi News home page

మోదీ ఇజ్రాయెల్ పర్యటన.. అక్కసుతో పాక్ తీర్మాణం

Feb 25 2026 5:42 PM | Updated on Feb 25 2026 6:08 PM

Pakistan decision against Israel, India alliance

ఇస్లామాబాద్‌: ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన వేళ పాకిస్థాన్ తన అక్కసు వెళ్లగక్కింది. ఇజ్రాయెల్‌- భారత్ మైత్రికి వ్యతిరేకంగా ఆ దేశ చట్టసభలో తీర్మానం చేసింది. ఈ షడ్బుజ కూటమిని యాంటీ ముస్లిం- ఉ‍మ్మాబ్లాక్‌ గా అభివర్ణించింది.  ఆ దేశ మంత్రి పాల్వాశా మహ్మద్ జియా ఖాన్ ప్రవేశ పెట్టిన ఈ బిల్లుకు ఆ దేశ చట్టసభలు ఏకగ్రీవంగా మద్దతిచ్చాయి.

నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఆ దేశ ‍ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ మోదీకి సాధరంగా స్వాగతం పలికారు. అయితే ఇదిలా ఉండగా.. బెంజిమిన్ నెతన్యాహూ భారత్‌ మరియు ఇతర దేశాలతో కలిసి "హెక్సాగన్ అలయెన్స్" ( ఆరుభుజాల కూటమి) ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నట్లు ‍ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై పాకిస్థాన్ మండిపడింది. ఈ కూటమి ముస్లిం దేశాలకు వ్యతిరేక బ్లాక్‌గా పాక్ అభివర్ణించింది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్ పల్వాషా మహమ్మద్ జై ఖాన్ ఈ కూటమికి వ్యతిరేకంగా తీర్మాణం ప్రవేశ పెట్టారు.

ఈ తీర్మాణంలో "ఇజ్రాయెల్ ప్రతిపాదించిన ఈ కూటమి "యాంటీ- ముస్లిం ఉమ్మా (సమూహం)". ప్రస్తుతం ఇజ్రాయెల్ ఆధీనంలో ఉన్న పాలస్తీనాలోని చారిత్రక ప్రాంతాలను మార్చే యత్నం చేస్తే సహిందేది లేదు. పాలస్తీనాకు స్వతంత్రంగా వ్వవహరించే అంశానికి తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది". అని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల ఇజ్రాయెల్ సోమాలిలాండ్‌ను స్వతంత్ర్య దేశంగా గుర్తించడాన్ని పాకిస్థాన్ సెనేట్ తిరస్కరించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయ సూత్రాలకు వ్యతిరేకమని తెలిపింది.

మరోవైపు, నెతన్యాహూ ప్రతిపాదించిన “హెక్సాగన్ అలయన్స్”లో భారత్, ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మరియు సోమాలిలాండ్ (ఆఫ్రికా ప్రాంతం) ఉన్నాయి.  ఈ కూటమి లక్ష్యం “రాడికల్ షియా” మరియు “రాడికల్ సున్నీ” భావజాలలకు వ్యతిరేకంగా  వ్యవహరించేడమేనని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement