టెలీఅవీవ్: ప్రధాని మోదీ ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం టెలీఅవీవ్ ఎయిర్‌పోర్టులో కొద్దిసేపటి క్రితమే ల్యాండ్ అయ్యింది. ఈ సందర్భంగా ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యూహు, ఆయన సతీమణి సారా నెతన్యూహుతో కలిసి ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారు. భారత ప్రధాని 2 రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఇరు దేశాలు రక్షణకు సంబంధించిన పలు కీలక ఒప్పందాలు చేసుకోనున్నట్లు సమాచారం.
ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడమే లక్ష్యంగా భారత ప్రధాని మోదీ బుధవారం నుంచి రెండ్రోజులపాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు.‘‘ పరస్పర ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన భాగస్వామ్యం, సమష్టి దార్శనికతల సుసాధ్యమే లక్ష్యంగా, ఉమ్మడి సవాళ్ల పరిష్కారమే ధ్యేయంగా, ఇరుదేశాలు సుదృఢ, సుదీర్ఘకాల వ్యూహాత్మక సంబంధాలను సమున్నత స్థాయికి తీసుకుపోయే ఉద్దేశంతో మోదీ, నెతన్యాహూలు చర్చలు జరుపుతారు’’ అని భారత విదేశాంగ శాఖ ఇదివరకే ప్రకటన విడుదల చేసింది. అనంతరం రణక్షేత్రంగా మారిన గాజా అంశం సైతం ఇరు దేశాధినేతలు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
పర్యటనలో భాగంగా మోదీ అక్కడి పార్లమెంట్‌లో ప్రసంగించనున్నారు. మరోవైపు ఇరాన్- అమెరికా ఉద్రిక్తల వేళ పశ్చిమాసియాలో మోదీ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు (బుధవారం) రాత్రి మోదీకి, నెతన్యాహూ ప్రత్యేక ప్రైవేట్ విందు ఇవ్వనున్నారు. ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇజ్రాయిల్‌లో పర్యటించడం ఇది రెండోసారి.


#WATCH | Tel Aviv: PM Narendra Modi arrives in Israel.
Israeli Prime Minister Benjamin Netanyahu, along with his wife Sara Netanyahu, receive him at the airport
(Source: Reuters) pic.twitter.com/BStw87lujA— ANI (@ANI) February 25, 2026


