భారత్- పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల వేళ అమెరికా- పాక్ సంయుక్తంగా “Inspired Gambit 2026” జాయింట్ కౌంటర్ టెర్రరిజం సైనిక విన్యాసం పంజాబ్ ప్రావిన్సులో చేపడుతుంది. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై ఇరు దేశాలు ఉమ్మడి డ్రిల్ నిర్వహిస్తున్నాయి.
హంతకులే సంతాప సభలు చేస్తారు అనే ఒక నానుడి మన వాడుక భాషలో చాలా ప్రాచుర్యంలో ఉంది. పాకిస్థాన్ విషయంలో ఇది సరిగ్గా సరిపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ముష్కరులను ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తున్న ఆ దేశం ఇప్పుడు అమెరికాతో సంయుక్తంగా కలిసి జాయింట్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేపడుతుంది. ఇటీవల భారత భద్రతా ఏజెన్సీలు 131 మంది ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లో ఉన్నారని నివేదికలు అందించగా అందులో 122 మంది పాకిస్థాన్‌కు చెందిన వారేనని పేర్కొంది.
అయినప్పటీకీ ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లుగా అమెరికాతో డ్రిల్ నిర్వహిస్తుంది. కాగా ప్రస్తుతం సరిహద్దు రేఖ వెంబడి భారత బలగాలు నిఘాను ముమ్మరం చేశాయి. ఉగ్రవాదుల చొరబడే అవకాశం ఉందని భద్రతా బలగాలు హెచ్చరించడంతో కట్టుదిట్టమైన పహారా నిర్వహిస్తున్నాయి. ఆ ప్రాంతంలోనే ఈ ఆపరేషన్ నిర్వహిస్తుండడంతో భారత్ మరింత అప్రమత్తమైంది. డ్రోన్లు, ఇతర పేలుడు పదార్థాలు భారత సరిహద్దులోకి పడకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.
అయితే ఈ ఆపరేషన్‌పై భారత ఆర్మీ అధికారులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలకు ఉగ్రవాద నిరోధక చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తున్న దేశం. భారత్‌పైకి దాడి చేసే ముష్కరులు ఆశ్రయం కల్పిస్తుందన్నారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాక్-అమెరికా దౌత్య సంబంధాలు చాలా మెరుగైన సంగతి తెలిసిందే.


