వరల్డ్ ఫేమస్ టాప్‌-10 వింటర్ ఫెస్టివల్స్ ఇవే | Top 10 Most Famous Winter Festivals In The World | Sakshi
Sakshi News home page

వరల్డ్ ఫేమస్ టాప్‌-10 వింటర్ ఫెస్టివల్స్ ఇవే

Jan 11 2026 8:22 PM | Updated on Jan 11 2026 8:22 PM

Top 10 Most Famous Winter Festivals In The World

మనకు పండుగల సీజన్‌ ఇది. అలాగే ప్రపంచంలో అనేక ప్రాంతాల్లోనూ పండుగల సీజనే. చల్లని వాతావరణం వణకిస్తుంది...అలాగే ఎన్నో విందు వినోదాలనూ తెస్తుంది. కాలాలన్నింటిలో అత్యధికులు ఇష్టపడేది శీతాకాలమే. కురిసే మంచు తడిసే నేల కురిపించే అందాల నడుమ పందిరి వేసే సందళ్ల ఎన్నో.. అందుకే.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో శీతాకాల పండుగలు బాగా ప్రాచుర్యం పొందాయి.

పలు దేశాలు చల్లని వాతావరణంలో కళ, సంస్కృతి, సంప్రదాయంతో మమేకమైన వినోద భరిత కార్యకలాపాలను ఆస్వాదించడానికి ప్రజలను ఒకచోట చేర్చే ఉత్తేజకరమైన శీతాకాల పండుగలను నిర్వహిస్తాయి.  ఈ పండుగలు సంగీతం, లైట్లు, అలంకరణలు, ఆహారం  ఉత్తేజకరమైన సంప్రదాయాలతో ఆకట్టుకుంటాయి.  మంచు శిల్పాల నుంచి రంగురంగుల కవాతుల వరకు, ప్రతి పండుగలో సందర్శకులను ఆకర్షించే ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇవి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తాయి. అలాంటి అత్యంత ప్రాచుర్యం పొందిన ప్రపంచంలోని టాప్‌–10 అత్యంత ప్రజాదరణ పొందిన శీతాకాల పండుగలు...

👉చైనాలో జరిగే హార్బిన్‌ అంతర్జాతీయ  మంచు శిల్ప ఉత్సవం ప్రపంచంలోనే అతిపెద్దది. ఇది డిసెంబర్‌ నెలలో క్రిస్మస్‌ రోజున ప్రారంభమై ఫిబ్రవరి మధ్య వరకూ కొనసాగుతుంది.

👉జపాన్‌లో సప్పోరో మంచు ఉత్సవం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి 4వ తేదీ  నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది ఈ పండుగ.

👉కెనడా లోని క్యూబెక్‌ సిటీలో నిర్వహించే క్యూబెక్‌ వింటర్‌  కార్నివాల్‌ కూడా అత్యధిక సంఖ్యలో సందర్శకుల్ని ఆకర్షిస్తుంది. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ సందడే సందడి..

👉11వ శతాబ్ధపు చారిత్రక మూలాలు ఉన్న ఇటలీ లోని ది వెనిస్‌  కార్నివాల్‌ కళ్లు తిరిగే కలర్‌ పుల్‌ సందడిని మోసుకొస్తుంది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 17వ తేదీ వరకూ కొనసాగుతుంది.

👉అమెరికాలో నిర్వహించే సెయింట్‌ పాల్‌ వింటర్‌ కార్నివాల్‌ తనదైన శైలితో సందర్శకుల్ని ఆహ్వానిస్తుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ దాకా ఈ ఫెస్టివల్‌ జరుగుతుంది

👉దాదాపు 50ఏళ్ల క్రితం ప్రారంభమైంది కెనడా రాజధాని ప్రాంతం లో జరిగే వింటర్‌లూడ్‌ ఫెస్టివల్‌. ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 16వ తేదీ వరకూ కొనసాగుతుంది.

👉నెదర్లాండ్స్‌లో నిర్వహించే ఆమ్‌స్టర్‌ డామ్‌ లైట్‌ ఫెస్టివల్‌ను  లెగసీ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. చిత్రకళతో పాటు బోట్‌ టూర్స్‌ తదితర విశేషాలకు వేదికైన ఈ పండుగ గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైంది.. జనవరి 18వ తేదీ వరకూ కొనసాగుతుంది.

👉స్కాట్లాండ్‌లో ఏకంగా 3 నెలల పాటు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జరుగుతుంది  అప్‌ హెల్లీ యా ఫైర్‌ ఫెస్టివల్‌.. జనవరి 9న ప్రారంభమై మార్చి 20వ తేదీ వరకూ జరుగుతుంది.

👉సెవన్‌ వండర్స్‌ ఆఫ్‌ ద వింటర్‌గా పేరొందింది దక్షిణ కొరియా లోని హ్వాచియోన్‌లో నిర్వహించే సాంచియోనియో ఐస్‌ ఫెస్టివల్‌. ఇది జనవరి 10న ప్రారంభమై ఫిబ్రవరి 1 వరకూ జరుగుతుంది.

👉స్కాట్లాండ్‌ లో జరిగే హోగ్మనే ఉత్సవం...కొత్త సంవత్సరానికి స్వాగత వేడుక. ఇది కూడా అత్యంత ప్రాచుర్యం పొందిన  వింటర్‌ ఫెస్టివల్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement