breaking news
World top-10
-
శాంసంగ్‌ను దాటిన హువావే
లండన్: స్మార్ట్‌ఫోన్స్ విక్రయాల్లో ప్రపంచ టాప్ సెల్లర్‌గా హువావే నిలిచినట్టు పరిశోధన సంస్థ కెనలిస్ వెల్లడించింది. శాంసంగ్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానాన్ని కైవసం చేసుకుందని తెలిపింది. రెండవ త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) హువావే 5.58 కోట్ల స్మార్ట్ఫోన్లను విక్రయించినట్టు కెనలిస్ ప్రకటించింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 5 శాతం తగ్గుదల. శాంసంగ్ విషయానికి వస్తే క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 30 శాతం అమ్మకాలు తగ్గి 5.37 కోట్ల యూనిట్లు నమోదైంది. హువావేకు కోవిడ్–19 కలిసి వచ్చిందని కెనలిస్ తెలిపింది. చైనాలో ఈ కంపెనీ అమ్మకాలు గడిచిన త్రైమాసికంలో 8 శాతం వృద్ధి చెందాయి. కంపెనీ మొత్తం విక్రయాల్లో చైనా వాటా 70 శాతముంది. చైనా రికవరీ హువావేకు కలిసి వచ్చింది. శాంసంగ్‌కు యూఎస్, యూరప్, బ్రెజిల్, భారత్ ప్రధాన మార్కెట్లు. చైనా నుంచి సమకూరుతుంది తక్కువే. -
టాప్-10 సంపన్న దేశాల్లో భారత్
న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక న్యూఢిల్లీ: ప్రపంచంలోని టాప్-10 సంపన్న దేశాల్లో భారత్ 7వ స్థానంలో నిలిచింది. న్యూ వరల్డ్ వెల్త్ నివేదిక ప్రకారం... భారత్ 5,600 బిలియన్ డాలర్ల (మొత్తం వ్యక్తులది) సంపదతో ఈ స్థానం సంపాదించుకోగా, 48,900 బిలియన్ డాలర్ల సంపదతో జాబితాలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. దీని తర్వాత రెండు, మూడు స్థానాల్లో చైనా (17,400 బిలియన్ డాలర్లు), జపాన్ (15,100 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. నాలుగు, ఐదు, ఆరవ స్థానాల్లో వరుసగా యునెటైడ్ కింగ్డమ్ (9,200 బిలియన్ డాలర్లు), జర్మనీ (9,100 బిలియన్ డాలర్లు), ఫ్రాన్స్ (6,600 బిలియన్ డాలర్లు) నిలిచాయి. ఇక కెనడా (4,700 బిలియన్ డాలర్లు), ఆస్ట్రేలియా (4,500 బిలియన్ డాలర్లు), ఇటలీ (4,400 బిలియన్ డాలర్లు) దేశాలు భారత్ తర్వాత వరుసగా 8, 9, 10వ స్థానాల్లో ఉన్నాయి. న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ వ్యక్తి నికర ఆస్తులను సంపదగా పరిగణలోకి తీసుకుంది. మనకు జాబితాలో చోటు దక్కడానికి ప్రధాన కారణం మన దేశ జనాభానే. కాగా కేవలం 2.2 కోట్ల మంది జనాభాతో ఆస్ట్రేలియా జాబితాలో చోటుపొందటం విశేషం.