
వాషింగ్టన్: నోబెల్ కమిటీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని నిరూపించిందని ఆరోపించారు.
వెనిజులా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న మరియా కొరీనా మచాడోకు 2025 నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే, నార్వే నోబెల్ కమిటీ అవార్డు ప్రకటనపై వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది .
ఈ అవార్డును డొనాల్డ్ ట్రంప్ తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ సందర్భంగా మరోసారి నోబెల్ కమిటీ శాంతి కంటే రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తుందని ఈ అవార్డుల ప్రధానంతో నిరూపించింది’ అని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కానీ, అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందాలు చేసుకోవడం, యుద్ధాలను ముగించడం, ప్రాణాలను కాపాడేందుకు కృషి చేస్తుంటారు. ఆయన గొప్ప మానవతావాది. అలాంటి వారు తమ సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించగలరు’ అని పేర్కొన్నారు.