Live Updates
వెనెజువెలా అధ్యక్షుడిని నిర్ణయించేది మేమే: ట్రంప్
మదురోను పట్టించినందుకు రూ.400 కోట్ల రివార్డు ఇచ్చిన అమెరికా
- మదురో లొకేషన్‌ను ట్రాక్ చేసిన సీఐఏ సీక్రెట్ సోర్స్
- వెనెజువెలా ప్రభుత్వంలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ ఏజెంట్
- నికోలస్ మదురో ఏం చేస్తున్నాడు? ఎప్పుడు ఎక్కడి వెళ్తున్నాడనే సమాచారం అమెరికాకు చేరేస్తున్న సీఐఏ ఏజెంట్
- మదురో గురించి సమాచారం అందించిన ఏజెంట్‌ను వెనెజువెలాలో ఎలా నియమించిందో వెల్లడి కాని ఆధారాలు
- కానీ అరెస్టు పరిణామలతో మదురో గురించి సమాచారం ఇచ్చినందుకు రూ.400 కోట్లు రివార్డు ఇచ్చిన అమెరికా ప్రభుత్వం
2026-01-03 21:17:17
వెనెజువెలా అధ్యక్షుడిని నిర్ణయించేది మేమే
- వెనెజువెలా అధ్యక్షుడిని నిర్ణయించేది అమెరికానే
- వెనెజువెలా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా పాలు పంచుకుంటుందని ట్రంప్ వెల్లడి
- మరొకరికి అధికారం అప్పగిస్తే వెనెజువెలాలో మదురో విధానాలు కొనసాగకూడదు
- మేం ఈ నిర్ణయంలో పాలుపంచుకుంటాం
- వెనెజువెలా ప్రజలకు స్వేచ్ఛ బతికే హక్కును కల్పిస్తాం
2026-01-03 21:06:00
నికోలస్ మడురో, ఆయన భార్య పడక గదిలో ఉండగా..
- పడక గదిలో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సెలియా ఫ్లోరెస్
- పడక గది బద్దలు కొట్టి మరి అదుపులోకి తీసుకున్నట్లు వెలుగులోకి అంతర్జాతీయ మీడియా కథనాలు
- ఈ ఆపరేషన్‌ను నిర్వహించిన అమెరికా మిలిటరీ స్పెషల్ డెల్టా ఫోర్స్
- మూడు గంటలపాటు సాగిన ఈ మిషన్‌లో అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం
2026-01-03 20:55:54
నికోలస్ మదురోను పట్టుకుంది వీళ్లే
- అమెరికా సైన్యం అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో
- మదురోను పట్టుకున్న ఫస్ట్ స్పెషల్ ఫోర్స్ ఆపరేషనల్ డిటాచ్ మెంట్ డెల్టా(1st SFOD-D) సభ్యుల ఫొటులు విడుదల
- వెనెజువెలాలో రహస్య ప్రాంతంలో ఉన్న నికోలస్ మదురోను మూడుగంటల్లో పట్టుకున్న అమెరికా ఆర్మీ డెల్టా ఫోర్స్
- వ్యూహాత్మక సైనిక ఆస్తులను దాడి చేసి.. మదురోను పట్టుకున్నట్లు నివేదికలు

2026-01-03 18:12:38
ప్రభుత్వ పతనం.. ప్రతిపక్షాల రాక
- వెనెజువెలాలో ప్రభుత్వం పడిపోవచ్చు.. సీనియర్ నాయకులు రాజీనామా చేయవచ్చు లేదా పారిపోవచ్చు
- కానీ ప్రతిపక్ష నాయకుడు ఎడ్ముండో గొంజాలెజ్ ఉర్రూటియా 2024 ఎన్నికల్లో అభ్యర్థిగా బరిలోకి దిగారు
- ప్రస్తుతం గొంజాలెజ్ పరారీలో ఉన్నాడు
- స్పెయిన్‌లో నివసిస్తున్నట్లు వార్తలు
- అతనికి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా కొరినా మచాడో మద్దతు ఇస్తున్నారు
2026-01-03 18:12:38
రాజ్యాంగం ప్రకారం..
- రాజ్యాంగం ఆర్టికల్ 233 ప్రకారం..అధ్యక్షుడి పూర్తి గైర్హాజరీలో ఉంటే ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ అధికారం చేపట్టే అవకాశం
- 30 రోజుల్లో కొత్త అధ్యక్ష ఎన్నికలు
- ఎన్నికైన కొత్త అధ్యక్షుడికి 6సంవత్సరాల పదవీకాలం
2026-01-03 18:12:38
అధ్యక్షుడు మదురోను అరెస్టుతో వెనెజువెలా ఏం జరగనుంది?
- అధ్యక్షుడు మదురోను అరెస్టుతో వెనెజువెలా ఏం జరగనుందనే అంశంపై రాని స్పష్టత
- దేశ రాజ్యాంగం ప్రకారం, అధ్యక్షుడు నికోలస్ మదురో తన పదవిలో కొనసాగకపోతే.. అతని ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగెజ్ అధికారం చేపడతారు.
- అదే సమయంలో వెనెజువెలాకు నిజమైన అధ్యక్షుడు ప్రవాస నాయకుడు ఎడ్ముండో గొంజాలెజ్ అని ప్రతిపక్షాల పిలుపు
2026-01-03 18:12:38
నికోలస్ మదురో ఫొటోలు వైరల్
- అమెరికా సైన్యానికి చిక్కిన వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో ఫొటోలు వైరల్
- ఫొటోల్లో డీఈఏ (డ్రగ్ ఎన్ ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్)అధికారులు మదురోను రహస్య ప్రదేశానికి తీసుకెళ్తున్నట్లు అనుమానం
- డీఈఏ అనేది అమెరికా ప్రభుత్వ సంస్థ
- డ్రగ్స్‌కు సంబంధించిన నేరాలను నిరోధించడమే దీని పని
- అక్రమ మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై చర్యలు తీసుకుంటుంది
- యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ కింద పనిచేస్తుంది
2026-01-03 17:59:08
వెనెజువెలా ప్రజలు ధైర్యం కోల్పోవద్దు
- వెనెజువెలా ప్రజలు ధైర్యం కోల్పోవద్దని మంత్రి డియోస్డాడో కాబెల్లో విజ్ఞప్తి
- ప్రశాంతంగా ఉండాలని దేశ ప్రజలకు పిలుపు
2026-01-03 17:52:50
వెనెజువెలాకు పెరుగుతున్న మద్దతు
- వెనెజువెలా తన భవిష్యత్తును బాహ్య జోక్యం లేకుండా నిర్ణయించుకునే హక్కు కలిగి ఉందని స్పష్టం
- వెనెజువెలా ప్రజలతో ఐక్యతను, బొలివేరియన్ నాయకత్వానికి మద్దతిస్తున్నట్లు ప్రకటన
- ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం కోరిన వెనెజువెలా
- కరాకస్‌లో రష్యా రాయబార కార్యాలయం సాధారణంగా పనిచేస్తోందని రష్యా పౌరులకు ఎటువంటి నష్టం జరగలేదని తెలిపిన రష్యా
2026-01-03 17:49:47
వెనెజువెలాపై అమెరికా దాడిని ఖండించిన రష్యా
- అమెరికా సైనిక దాడిని సాయుధ దాడిగా అభివర్ణించిన రష్యా
- అమెరికా చూపిన కారణాలు అసంబద్ధమైనవి
- ప్రగ్మాటిక్ ఎంగేజ్‌మెంట్ కంటే సిద్ధాంతపరమైన శత్రుత్వం పైచేయి సాధించింది’అంటూ విమర్శలు
- పరిస్థితి మరింత ఉద్రిక్తం కాకుండా చర్చల ద్వారా పరిష్కారం అవసరమని సూచన
2026-01-03 17:49:47
క్రిమినల్ ముఠాలకు నికోలస్ మదురో నాయకుడు
- ప్రమాదకరమైన మాదకద్రవ్యాలను అమెరికాలోకి తరలించడానికి వెనెజువెలా ఒక ప్రధాన మార్గంగా మారిందని ట్రంప్ ఆరోపణలు
- ఈ కారణంగానే వెనెజువెలా క్రిమినల్ ముఠాలు ‘ట్రైన్ డి అరాగ్వా’,‘కార్టెల్ డి లాస్ సోలేస్’లను విదేశీ ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించారు.
- కార్టెల్ డి లాస్ సోల్స్ కు అధ్యక్షుడు మదురో స్వయంగా నాయకత్వం వహిస్తున్నారని ట్రంప్ విమర్శలు
2026-01-03 16:40:30
వెనెజువెలాపై అమెరికా దాడి అందుకేనా?
- వెనెజువెలా చమురుపై కూడా అమెరికా దృష్టి
- చమురుపై ఆధారపడిన వెనెజువెలా ఆర్థిక వ్యవస్థ
- దేశం నుంచి ప్రతిరోజూ 9 మిలియన్ బ్యారెళ్ల చమురు ఎగుమతి
- వెనెజువెలా అతిపెద్ద చమురు కొనుగోలుదారు చైనా
- వెనెజువెలా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలను కలిగి ఉందని అంచనా
- ఇటీవలే వెనెజువెలాకు సంబంధించిన చమురు ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్న అమెరికా
2026-01-03 16:40:30
వెనెజువెలాపై అమెరికా దాడికి గల కారణాలు
- వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను విధానాలే దాడులకు కారణం
- మిలియన్ల మంది వెనెజువెలా ప్రజలు అమెరికాకు వచ్చారని ట్రంప్ ఆరోపణ
- ఉద్దేశపూర్వకంగా నేరస్థులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని దేశ జైళ్లు, మానసిక ఆసుపత్రుల నుంచి బయటకు పంపి అమెరికాకు పారిపోవాలని మదురో బలవంతం చేశారని విమర్శలు
2026-01-03 16:40:30
ఆధారాలు చూపించండి
- వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా ప్రాణం తీసిందా?
- ఆయన బ్రతికే ఉంటే ఆధారాలు చూపించాలన్న వెనెజువెలా ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్
- శనివారం ఉదయం ఆ దేశ ప్రభుత్వ టీవీ ఛానెల్లో మాట్లాడుతూ..నికోలస్ మదురో బ్రతికే ఉన్నారని రుజువులు, ఆచూకీ గురించి సమాచారం ఇవ్వాలని డిమాండ్
2026-01-03 16:25:54
వీర వెనెజువెలా ప్రజలారా!
- వీర వెనెజువెలా ప్రజలారా! పితృభూమి సైనికులారా! బొలివార్ సంతానమా!అంటూ వీడియో విడుదల
- అమెరికా దాడిని అత్యంత క్రిమినల్ సైనిక దాడిగా అభివర్ణించిన వ్లాదిమిర్
- గౌరవం, కర్తవ్యబోధ, చరిత్ర మనల్ని పిలుస్తున్నాయి
- స్వేచ్ఛా పితృభూమి నినాదం ప్రతిచోటా మార్మోగాలి.
- విజయం మనదే, ఎందుకంటే తర్కం, గౌరవం మనతో ఉన్నాయి. మేము గెలుస్తాం’అంటూ జాతినుద్దేశిస్తూ వ్యాఖ్యలు
2026-01-03 15:52:23
అమెరికాది సైనిక దాడి కాదు..క్రిమినల్ దాడి
- వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ లోపెజ్ సందేశం
- అమెరికా చేసిన అత్యంత క్రిమినల్ సైనిక దాడికి వెనెజువెలా ప్రజలు బలయ్యారు
- మేము ప్రతిఘటిస్తాము.
- మా గౌరవం, కర్తవ్యబోధ, చరిత్ర మాకు పిలుపునిస్తోంది
- స్వేచ్ఛా పితృభూమి నినాదం ప్రతి మూలలో మార్మోగాలి. విజయం మనదే’అంటూ పిలుపు
2026-01-03 15:52:23
వెనెజువెలాపై అమెరికా దాడి ఎప్పుడు చేసిందంటే?
- జనవరి 3వ తేదీ తెల్లవారుజామున అమెరికా సైన్యం వెనెజువెలా రాజధాని కరాకస్‌తో పాటు మిరాండా, అరాగ్వా, లా గువైరా రాష్ట్రాల్లోని పౌర, సైనిక స్థావరాలపై దాడులు జరిపిందని వెనెజువెలా ప్రభుత్వ ఆరోపణలు
- ఈ దాడుల్లో సివిలియన్ ప్రాంతాలు కూడా ప్రభావితమయ్యాయని వీడియోలో పేర్కొన్న రక్షణ మంత్రి వ్లాదిమిర్ లోపెజ్
2026-01-03 15:42:10
నేను సేఫ్.. అమెరికా దాడులపై వెనెజువెలా రక్షణ మంత్రి
- అమెరికా సైనిక దాడిని ఖండించిన వెనెజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ లోపెజ్
- అమెరికా దాడులపై వ్లాదిమిర్ లోపెజ్ ఫేస్‌బుక్‌లో వీడియో విడుదల
- బంకర్‌లో సురక్షితంగా ఉన్నానని ప్రకటన
2026-01-03 15:42:10
ప్రెస్‌మీట్ పెట్టి అన్నీ విషయాలు చెబుతా
- మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై వెనెజువెలా చుట్టుముట్టిన అమెరికా
- ఇరు దేశాల మధ్య ఘర్షణ పెరిగిన తరుణంలో దాడికి పాల్పడిన అమెరికా
- వెనెజువెలా సమీపంలోని సముద్రంలో సైనికులు, విమానాలు, యుద్ధనౌకలను మోహరించిన అమెరికా
- వెనెజువెలాపై దాడి, అమెరికా అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో
- ఈ వరుస పరిణామలపై ఫ్లోరిడా కాలమాన ప్రకారం శనివారం ఉదయం 11గంటలకు ప్రెస్‌మీట్‌లో వెల్లడిస్తామన్న ట్రంప్
- భారత కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 9.30కి ట్రంప్ ప్రెస్‌మీట్
- తన ప్రైవేట్ లగ్జరీ ఎస్టేట్ మార్-ఎ-లాగోలో ఈప్రెస్‌మీట్ ఉంటుందని ట్రంప్ అధికారిక ప్రకటన
2026-01-03 15:30:25
డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
- అమెరికా అదుపులో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో
- మదరోతో పాటు ఆయన భార్యను అదుపులోకి తీసుకున్నాం
- వెనెజువెలాపై భీకర దాడులు చేశాం
- నికోలస్ మదురోను అమెరికాకు తీసుకు వస్తున్నాం
- డ్రగ్స్ కార్యకలాపాలకు వెనెజువెలా అడ్డగా మారింది
2026-01-03 15:18:41
అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటాం
- దాడి తరువాత, వెనెజువెలా (venezuela) అధ్యక్షుడు నికోలస్ మదురో అధికారిక ప్రకటన
- అమెరికా దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరిక
- వెనెజువెలాలో చమురు, ఖనిజ వనరులను స్వాధీనం చేసుకోవడానికి అమెరికా తిరుగుబాటు
- ఆరోపణలు చేసిన నికోలస్ మదురో
2026-01-03 15:12:32
Advertisement


