వెనెజువెలా, జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరిక జారీ | Massive Earthquakes Shake Venezuela And Japan, Tsunami Alerts Issued In Caribbean Region, Watch Videos Inside | Sakshi
Sakshi News home page

వెనెజువెలా, జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరిక జారీ

Jun 25 2026 5:22 AM | Updated on Jun 26 2026 12:11 AM

Earthquakes hit Japan and Venezuela

భారీ భూకంపాలతో వెనెజువెలా, జపాన్‌ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు కుప్పకూలిపోగాa.. ప్రాణ నష్టం సైతం వాటిల్లినట్లు తెలుస్తోంది. వెవెజువెలాలో నిమిషాల వ్యవధిలోనే శక్తివంతమైన రెండు ప్రకంపనలు సంభవించాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. 

వెనిజులాలో సుమారు 7.5, 7.1 తీవ్రతలతో(రిక్టర్‌ స్కేలుపై)తో వరుసగా రెండు శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి.  స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో.. మోంటాల్‌బాన్ ప్రాంతంలో 13.2 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. దీని ప్రభావం కొలంబియా, కారకాస్‌లో కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కరేబియన్ తీర ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు అమెరికా సునామీ కేంద్రం తెలిపింది. 

ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని అపార్ట్‌మెంట్లలో పగుళ్లు ఏర్పడ్డాయి, అద్దాలు పగిలిపోయాయి.

వెనిజులాలో సంభవించిన భూకంపం కారణంగా ప్యూర్టో రికో, అమెరికా వర్జిన్ దీవులకు సునామీ ముప్పు ఉందని సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. అయితే అమెరికా తీర ప్రాంతాలకు ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని పేర్కొంది.



“అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన తర్వాత, సముద్ర మట్టం హెచ్చుతగ్గులు, బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా ప్యూర్టో రికో, వర్జిన్ దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఇవి తీర ప్రాంతాలు, బీచ్‌లు, నౌకాశ్రయాలు, తీర జలాల్లో ప్రమాదకరంగా మారవచ్చు” అని తెలిపింది. 

ఇక, జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇక్కడి నష్టం వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement