breaking news
Tsunami Warning
-
ఒకే రోజు.. మూడు విపత్తులు.. చిగురుటాకులా వణికిన ఇండోనేషియా
అత్యంత శక్తివంతమైన భూకంపం ఇండోనేషియాను కుదిపేసింది. ప్రకంపనల ధాటికి భవనాలు పేకమేడల్లా ఒరిగిపోతూ నేల కూలాయి. అదే సమయంలో సముద్ర గర్భంలో అలజడి రేగడంతో సునామీ వస్తుందేమోనని వణికిపోయారు. మరోవైపు.. అగ్నిపర్వతం బద్దలు కావడం అలజడి రేపింది. ఫ్లోరెస్ దీవి, మరికొన్ని చోట్ల రికార్డైన భయానక దృశ్యాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ వేకువ జామున 7.7 తీవ్రతతో వచ్చిన ప్రధాన భూకంపంతో ఇండోనేషియా చిగురుటాకులా వణికిపోయింది. ఆ తర్వాత వరుసగా ఆఫ్టర్‌షాక్స్ భయపెట్టాయి. 6.1, 5.9, 5.6 తీవ్రతలతో వరుస ప్రకంపనలు కొనసాగడంతో ఫ్లోరెస్ తీర ప్రజలు భయం భయంగా గడిపారు. ఎండె నగరానికి సమీపంలో భూకంప కేంద్రం నమోదు కాగా.. తూర్పు నుసా టెంగారా, పశ్చిమ నుసా టెంగారా, దక్షిణ సులవేసి ప్రాంతాల్లో సైతం జనాలు ప్రాణాలు అరచేత పట్టుకుని రోడ్ల మీదే గడిపారు. బలమైన ప్రకంపనలు పలు ప్రాంతాల్లో దాదాపు నిమిషం పాటు నమోదయ్యాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.🚨 The earthquake in Indonesia was magnitude 7.7. For many people, the early morning began with disaster. 🇮🇩#Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert pic.twitter.com/c4edaQnCEh— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 15, 2026#BREAKING : New Footage shows the Aftermath of Flores Indonesia Following 7.7m earthquake. 10 Dead & More than 1000 injured: Reports #Indonesia #Earthquake #BreakingNews #EarthquakeAlert #IndonesiaEarthquake #EarthquakeNews #NaturalDisaster https://t.co/2V8cg4oQ7m pic.twitter.com/NrAVUu5g5u— Indian Observer (@ag_Journalist) August 15, 2026🚨 7.7-MAGNITUDE EARTHQUAKE HITS INDONESIA 🇮🇩A powerful earthquake struck off the coast of Ternate, causing panic and evacuations. Authorities are assessing possible damage and casualties.#Indonesia #Earthquake #BreakingNews #Ternate pic.twitter.com/WdP3JgvAGF— Mahrosh Pervaiz (@MahroshPervaiz1) August 14, 2026🚨🇮🇩 BREAKING | 7.7-Magnitude Earthquake Hits IndonesiaA powerful 7.7-magnitude #earthquake struck off #Flores Island in eastern #Indonesia early Saturday, causing buildings to collapse and triggering widespread panic and evacuations. A #tsunami warning was issued but later… pic.twitter.com/OKTgVxpBaH— pradhyumn sharma (@pradhyu78651514) August 15, 2026కుప్పకూలిన భవనాలు.. వీధుల్లోకి పరుగులుభూకంపం తీవ్రతకు ఫ్లోరెస్ దీవిలోని పలు భవనాలు దెబ్బతిన్నాయి. మౌమెరే ప్రాంతంలోని పోర్టు టెర్మినల్ వెయిటింగ్ రూమ్ కూలిపోయింది. భవనాల శిథిలాలు పడుతుండటంతో ప్రజలు భయంతో పరుగులు తీసిన దృశ్యాలు కనిపించాయి. “భూకంపం చాలా తీవ్రంగా అనిపించింది. ఇంట్లో ఉన్న వారంతా ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరుగులు తీశాం” అని స్థానికులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ఇళ్లు, గిడ్డంగులు, ప్రభుత్వ భవనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఆసుపత్రుల్లో కలకలం.. బయటే చికిత్సప్రకంపనలతో ఆసుపత్రుల్లోనూ భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రోగులను భద్రత దృష్ట్యా బయటకు తరలించారు. బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, వైద్య పరికరాలను బయట ఏర్పాటు చేసి తాత్కాలిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.సిక్కా ప్రాంతంలోని సెయింట్ పీటర్ మేజర్ సెమినరీలో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో భవనం పైకప్పు కూలిపోయింది. అందులోని విద్యార్థులు, నన్స్ భయంతో పరుగులు తీశారు. పాస్టర్ ఒకరు రెండో అంతస్తు నుంచి దూకడంతో గాయపడ్డారు.సునామీ హెచ్చరిక.. ఎత్తివేతఫ్లోరెస్ సముద్ర గర్భంలో భూకంపం సంభవించడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే కొన్ని గంటల తర్వాత హెచ్చరికను ఉపసంహరించారు.INDONESIA 🇮🇩 | #EARTHQUAKE 7.7 📹 IMAGES OF PANIC: Fear broke out near the coast of Ternate, and people had to be evacuated to safe areas. Authorities are assessing possible damage and casualties. There is a tsunami alert 🌊 pic.twitter.com/CSjsv5ckqW— Elizabeth J Trump (@eliza_Trump212) August 15, 2026మరింతగా మృతులు?ఈ ప్రకృతి విలయంలో ఇప్పటివరకు 20 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. భవనాల శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక బృందాలు రంగంలోకి దిగి నష్టం అంచనా వేస్తున్నాయి. ప్రాణ నష్టంపై ఇప్పుడే అంచనాకు రావడం కష్టమని ఓ అధికారి అంటున్నారు. ఇక ఆస్తి నష్టం భారీగానే జరగొచ్చని తెలుస్తోంది.బద్ధలైన అగ్నిపర్వతం.. బూడిద మేఘాలుహల్మహెరా దీవిలోని మౌంట్ ఇబు అగ్నిపర్వతం బద్దలై.. భారీగా బూడిదను వెదజల్లింది. ఏకంగా 5 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘాలు వ్యాపించాయి.🚨 BREAKING: Double disaster strikes Indonesia!🌋 Mount Ibu erupted on Halmahera, blasting a massive 5 km ash plume into the sky.💥 Shortly after, a powerful 7.7-magnitude earthquake rocked Flores Island.🌊 A tsunami warning has been activated for coastal areas.Stay safe and… pic.twitter.com/xviRMcR5i6— Byte Brief (@Byte_brief) August 15, 2026రింగ్ ఆఫ్ ఫైర్..భూకంపాలు, అగ్నిపర్వతాలకు ఇండోనేషియా అత్యంత ప్రమాదకర ప్రాంతం. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’ పరిధిలో ఉండటంతో అక్కడ తరచూ భారీ ప్రకంపనలు సంభవిస్తుంటాయి. 1992లో ఇదే ఫ్లోరెస్ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం సునామీకి దారితీసి వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. 2004లో సుమత్రా సమీపంలో సంభవించిన భారీ భూకంపం ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన సునామీల్లో ఒకదానికి కారణమైంది. ప్రస్తుతం ఫ్లోరెస్ దీవిలో ఆఫ్టర్‌షాక్స్ కొనసాగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. -
7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
మెక్సికో-గ్వాటెమాల సరిహద్దు సమీపంలోని పసిఫిక్ తీరంలో సంభవించిన భారీ భూకంపం మధ్య అమెరికా దేశాలను వణికించింది. శుక్రవారం రిక్టర్ స్కేల్‌పై 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం మెక్సికోతో పాటు గ్వాటెమాల, ఎల్ సాల్వడార్ ప్రాంతాల్లో బలంగా నమోదైంది. భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ చేయడంతో తీర ప్రాంత ప్రజల్లో ఆందోళన నెలకొంది. అయితే ఇప్పటివరకు భారీ ప్రాణనష్టం, పెద్ద ఎత్తున ఆస్తి నష్టం నమోదుకాలేదు.అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం.. భూకంప కేంద్రం మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రం, ఆక్విలెస్ సెర్డాన్ ప్రాంతానికి నైరుతి దిశగా సముద్రంలో 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. భూకంపం భూమి లోపల సుమారు 15 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఆ తర్వాత 4.9 నుంచి 6 తీవ్రత మధ్య పలు ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) నమోదయ్యాయి.సునామీ హెచ్చరికలు.. తీర ప్రాంతాల్లో అప్రమత్తతభూకంపం సముద్రంలో సంభవించడంతో అమెరికా సునామీ హెచ్చరిక వ్యవస్థ, మెక్సికో అధికారులు అప్రమత్తమయ్యారు. మెక్సికో నేవీ ప్రజలను తీర ప్రాంతాలకు వెళ్లొద్దని సూచించింది. సుమారు ఆరు గంటల పాటు బీచ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరించింది.మెక్సికో, గ్వాటెమాల తీరాల్లో ఒక మీటర్ వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే పెద్ద ఎత్తున సునామీ ఏర్పడే పరిస్థితి కనిపించలేదని తర్వాత స్పష్టం చేశారు.భయంతో పరుగులు తీసిన ప్రజలుచియాపాస్ రాష్ట్రంలోని తపచులా నగరంలో భూకంపం మొదట స్వల్పంగా ప్రారంభమై తర్వాత తీవ్రత పెరిగింది. ఆసుపత్రిలో పనిచేస్తున్న అలెజాండ్రా మెండోజా మాట్లాడుతూ.. "మొదట ఇది సాధారణ ప్రకంపన అనుకున్నాం. కానీ క్రమంగా తీవ్రత పెరగడంతో అందరం భవనం నుంచి బయటకు వచ్చాం" అని తెలిపారు.గ్వాటెమాల రాజధాని గ్వాటెమాల సిటీలో భూకంపం సమయంలో రద్దీగా ఉన్న రోడ్లపైకి ప్రజలు పరుగులు తీశారు. పలు భవనాలను ఖాళీ చేయించారు. కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపించాయి.ఇద్దరికి గాయాలుమెక్సికోలోని తపచులాలో ఇద్దరు గాయపడ్డారు. వారిలో ఓ హైతీ వలస మహిళ భయంతో ఓ అపార్ట్మెంట్ భవనం నుంచి సుమారు నాలుగు మీటర్ల ఎత్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించగా ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. మరో వ్యక్తికి ఓ దుకాణం అద్దం పగిలి స్వల్ప గాయాలయ్యాయి.మెక్సికో అధ్యక్షురాలి స్పందనమెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ మాట్లాడుతూ.. చియాపాస్, టబాస్కో రాష్ట్రాల్లో ప్రాథమికంగా ఎలాంటి పెద్ద నష్టం కనిపించలేదని తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, తీర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అయితే మెక్సికో సిటీ వరకు ప్రకంపనలు అనిపించినప్పటికీ అక్కడ భూకంప హెచ్చరిక వ్యవస్థ పనిచేయలేదు. భూకంపం ప్రారంభ దశలో నమోదైన శక్తి హెచ్చరిక స్థాయిని దాటలేదని అధికారులు వివరించారు.గ్వాటెమాలలో పాఠశాలలు మూసివేతగ్వాటెమాల ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలను తాత్కాలికంగా మూసివేసింది. శాన్ మార్కోస్, క్వెట్జాల్టెనాంగో తదితర భూకంప ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. రెడ్‌క్రాస్ అత్యవసర బృందాలను రంగంలోకి దింపి నష్టాన్ని అంచనా వేస్తోంది.భూకంపాలకు సున్నితమైన ప్రాంతంమెక్సికో, గ్వాటెమాల ప్రాంతాలు భూకంపాలకు అత్యంత సున్నితమైన ప్రాంతాల్లో ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ భారీ భూకంపాలు సంభవించాయి. 2017లో మెక్సికోలో సంభవించిన 7.1 తీవ్రత భూకంపం వందలాది ప్రాణాలను బలిగొంది.తాజా భూకంపం మూడు దేశాల్లో ప్రకంపనలు సృష్టించినప్పటికీ.. ప్రస్తుతం పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆఫ్టర్‌షాక్స్, సునామీ ముప్పును దృష్టిలో ఉంచుకుని అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. -
జంట భూకంపాల దెబ్బ.. వెనెజువెలాలో భారీగా మృతులు?
దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి. రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. మృతులు, క్షతగాత్రుల సంఖ్య భారీగా ఉండేలా కనిపిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. మృతుల సంఖ్య లక్ష దాకా ఉండొచ్చని అమెరికా భూకంప పరిశోధనా సంస్థ (USGS) హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది.స్థానిక కాలమానం ప్రకారం.. బుధవారం సాయంత్రం వెనెజువెలా పశ్చిమ ప్రాంతంలో మొదట 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. రాజధాని కారకాస్‌కు పశ్చిమంగా ఉన్న సాన్ ఫెలిపే సమీపంలో దీని కేంద్రం నమోదైంది. కేవలం 39 సెకన్ల వ్యవధిలోనే యుమారే ప్రాంతం వద్ద మరో 7.5 తీవ్రతతో మరింత శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఆ తర్వాత 20 సార్లు భూమి స్వల్పంగా కంపించింది. ఈ ధాటికి జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. క్షణాల్లోనే.. భవనాలు కూలిపోవడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్ సరఫరా అంతరాయం కలగడం తీవ్ర నష్టాన్ని కలిగించాయని తెలుస్తోంది.ఈ ఘటనను "సిస్మిక్ డబ్లెట్"(seismic doublet earthquake)గా యూఎస్జీఎస్ అభివర్ణించింది. అంటే.. చాలా తక్కువ వ్యవధిలో ఒకే ప్రాంతాన్ని రెండు భారీ భూకంపాలు తాకడం. ప్రాథమిక అంచనాల ప్రకారం భారీ ప్రాణనష్టం సంభవించి ఉండొచ్చని తెలుస్తోంది. మృతుల సంఖ్య 10 వేలుగా ఉండొచ్చని స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. కానీ, భూకంపం తీవ్రతను బట్టి ఆ సంఖ్య లక్ష వరకు చేరవచ్చని యూఎస్జీఎస్ అంచనా వేస్తోంది. అయితే అధికారికంగా ఇప్పటివరకు మృతులు, గాయపడిన వారి సంఖ్యను వెనెజువెలా ప్రభుత్వం ప్రకటించలేదు. Venezuela shaken by a pair 7.2 and 7.5 magnitude earthquakes. Devastation is quite high, media says. pic.twitter.com/sj7CzuwdBL— Straturka (@straturka) June 25, 2026పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగెజ్ దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. రాష్ట్ర టెలివిజన్ ద్వారా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆమె, ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయని వెల్లడించారు.భూకంప ప్రభావంతో కారకాస్ అంతర్జాతీయ విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాలు, వాణిజ్య కేంద్రాలు దెబ్బతిన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. సహాయక బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించే పనిలో నిమగ్నమయ్యాయి. జూన్ 24న వెనెజువెలాకు జాతీయ సెలవు దినం. దీంతో ఇళ్లలోనే ఎక్కువ మంది ఉండిపోయారు. దీంతో మృతుల సంఖ్కయ ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. Tras los fuertes sismos registrados esta tarde en el país, hemos decretado Estado de Emergencia en todo el territorio nacional. Hacemos un llamado a todos los ciudadanos y ciudadanas a mantenerse atentos, en resguardo y con la mayor calma posible. pic.twitter.com/WFlj6rVs0U— Delcy Rodríguez (@delcyrodriguezv) June 25, 2026ఇక అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. దెబ్బతిన్న భవనాలకు దూరంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరించింది. మరోవైపు ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు నయీబ్ బుకెలె, అమెరికా కాంగ్రెస్ సభ్యురాలు మరియా ఎల్విరా సలజార్, వెనెజువెలా ప్రతిపక్ష నేతలు సహా పలువురు అంతర్జాతీయ నాయకులు వెనెజువెలా ప్రజలకు సంఘీభావం ప్రకటించారు.ప్రస్తుతం వెనెజువెలా వ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే శిథిలాల తొలగింపు, దూర ప్రాంతాల నుంచి సమాచారం సేకరణ పూర్తయిన తర్వాతే అసలు నష్టం, ప్రాణనష్టం ఎంత జరిగిందన్న విషయం స్పష్టమయ్యే అవకాశం ఉంది. భూకంపాల తీవ్రత దృష్ట్యా వెనెజువెలా ఇటీవల కాలంలో ఎదుర్కొన్న అతిపెద్ద ప్రకృతి విపత్తులలో ఇది ఒకటిగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వెనెజువెలా, జపాన్‌లో భారీ భూకంపాలు.. సునామీ హెచ్చరిక జారీ
భారీ భూకంపాలతో వెనెజువెలా, జపాన్ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. భయంతో జనాలు బయటకు పరుగులు తీశారు. పలు చోట్ల భవనాలు కుప్పకూలిపోగాa.. ప్రాణ నష్టం సైతం వాటిల్లినట్లు తెలుస్తోంది. వెవెజువెలాలో నిమిషాల వ్యవధిలోనే శక్తివంతమైన రెండు ప్రకంపనలు సంభవించాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. వెనిజులాలో సుమారు 7.5, 7.1 తీవ్రతలతో(రిక్టర్ స్కేలుపై)తో వరుసగా రెండు శక్తిమంతమైన ప్రకంపనలు వచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో.. మోంటాల్బాన్ ప్రాంతంలో 13.2 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. దీని ప్రభావం కొలంబియా, కారకాస్‌లో కనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కరేబియన్ తీర ప్రాంతానికి సునామీ హెచ్చరిక జారీ చేసినట్లు అమెరికా సునామీ కేంద్రం తెలిపింది. ఒక ప్రత్యక్ష సాక్షి తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని అపార్ట్మెంట్లలో పగుళ్లు ఏర్పడ్డాయి, అద్దాలు పగిలిపోయాయి.A powerful 7.1-magnitude earthquake just struck Altamira, Caracas, Venezuela. pic.twitter.com/wFsX2GwrHs— Weather Monitor (@WeatherMonitors) June 24, 2026వెనిజులాలో సంభవించిన భూకంపం కారణంగా ప్యూర్టో రికో, అమెరికా వర్జిన్ దీవులకు సునామీ ముప్పు ఉందని సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. అయితే అమెరికా తీర ప్రాంతాలకు ఎలాంటి సునామీ హెచ్చరిక జారీ చేయలేదని పేర్కొంది.“అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిశీలించిన తర్వాత, సముద్ర మట్టం హెచ్చుతగ్గులు, బలమైన సముద్ర ప్రవాహాల కారణంగా ప్యూర్టో రికో, వర్జిన్ దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. ఇవి తీర ప్రాంతాలు, బీచ్‌లు, నౌకాశ్రయాలు, తీర జలాల్లో ప్రమాదకరంగా మారవచ్చు” అని తెలిపింది. ఇక, జపాన్‌లో 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇక్కడి నష్టం వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. MORE: Multiple structures have reportedly collapsed after a strong earthquake struck Caracas. https://t.co/r1EaakspGy— Breaking911 (@Breaking911) June 24, 2026WATCH: Terrifying Moment Powerful 7.1-Magnitude Earthquake Rocks Caracas, Venezuela pic.twitter.com/D9A5cXEV6e— Breaking911 (@Breaking911) June 24, 2026 -
భూకంప బీభత్సం.. సునామీ హెచ్చరికలతో హైఅలర్ట్!
ఒక్కసారిగా భూమి కంపించింది. క్షణాల్లో భవనాలు ఊగిపోయాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రోడ్లపైకి పరుగులు తీశారు. ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ప్రాంతాన్ని 8.2 తీవ్రత భూకంపం వణికించగా.. ఇప్పుడు అందరి దృష్టి సముద్రంపైనే ఉంది. ఎందుకంటే భూకంపం తర్వాత సునామీ హెచ్చరికలు జారీ కావడంతో తీరప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.ఫిలిప్పీన్స్‌లోని మిండనావో ద్వీపం సమీపంలో సోమవారం సంభవించిన భారీ భూకంపం ఆ దేశాన్ని అతలాకుతలం చేసింది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ప్రకారం రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం భూమికి కేవలం 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. ఉపరితలానికి అత్యంత సమీపంలో భూకంప కేంద్రం ఉండటంతో ప్రకంపనల తీవ్రత మరింత ఎక్కువగా నమోదైంది.మొదట భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేసిన అధికారులు.. ఆ తర్వాత 7.8గా, అనంతరం 8.2గా సవరించారు. దీంతో ఇది ఇటీవలి కాలంలో పసిఫిక్ ప్రాంతంలో నమోదైన అత్యంత శక్తివంతమైన భూకంపాల్లో ఒకటిగా మారింది.కూలిన భవనాలు.. పరుగులు తీసిన ప్రజలుభూకంపం సంభవించిన వెంటనే పలు ప్రాంతాల్లో భవనాలు బలంగా కంపించాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో భవనాలు కూలిపోవడం, ప్రజలు అరుస్తూ బయటకు పరుగులు తీయడం కనిపించింది. ఓ పాఠశాలలో విద్యార్థులను అత్యవసరంగా బయటకు తరలించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. జనరల్ సాంటోస్ నగరంలో ఇళ్లలోని టీవీలు, ఫర్నిచర్, ఇతర గృహోపకరణాలు కిందపడిపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. కొన్ని వాణిజ్య భవనాలకు కూడా నష్టం వాటిల్లినట్లు సమాచారం.ఒకరు మృతి.. పలువురికి గాయాలుతాజా సమాచారం ప్రకారం కనీసం ఒకరు మృతి చెందగా, నలుగురికి పైగా గాయపడ్డారు. సరంగాని ప్రావిన్స్‌లోని అలాబెల్ పట్టణ పోలీస్ స్టేషన్‌కు పగుళ్లు ఏర్పడ్డాయి. "ఇటీవలి సంవత్సరాల్లో మేము అనుభవించిన అత్యంత బలమైన భూకంపం ఇదే" అని స్థానిక అధికారులు తెలిపారు.సునామీ భయంభూకంపం తర్వాత అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం వెంటనే అలర్ట్ జారీ చేసింది. ఫిలిప్పీన్స్, ఇండోనేషియా తీరప్రాంతాలకు సునామీ ముప్పు ఉందని హెచ్చరించింది. ఫిలిప్పీన్స్ అగ్నిపర్వతాలు, భూకంపాల పరిశోధనా సంస్థ (PHIVOLCS) కొన్ని ప్రాంతాల్లో ఒక మీటర్‌కు పైగా ఎత్తులో సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో వేలాది మందిని తీరప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇండోనేషియా కూడా తన ఈశాన్య తీరప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేసింది.రింగ్ ఆఫ్ ఫైర్లోనే ప్రమాదంఫిలిప్పీన్స్ "పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్"గా పిలిచే అత్యంత భూకంప ప్రబల ప్రాంతంలో ఉంది. భూమి టెక్టానిక్ ఫలకాలు కలిసే ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనలు సంభవిస్తుంటాయి.ఇప్పుడు అందరి చూపు సముద్రంపైనేభూకంపం వల్ల జరిగిన నష్టం కంటే ఇప్పుడు సునామీ ముప్పే అధికారులను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది. సముద్ర మట్టంలో మార్పులను నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. సునామీ ప్రమాదం పూర్తిగా తొలగే వరకు తీరప్రాంతాలకు వెళ్లొద్దని అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. (8 มิ.ย. 69) เวลา 06:37 น. ตามเวลาประเทศไทย เกิดแผ่นดินไหว จุดศูนย์กลางอบู่บริเวณ Mindanao, Philippines ขนาด 8.2 ลึก 10 กม. ญี่ปุ่นประกาศเตือนสึนามิ ขอให้ทุกคนปลอดภัยนะ ภัยธรรมชาติน่ากลัวมาก#earthquake #Philippines #tsinami pic.twitter.com/Zi5mIOsGBy— เลิฟบูววววว (@Lali_M17) June 8, 2026 UPDATE: At least one dead, 4 injured after the earthquake in southern Philippines. The police chief of Alabel town in Sarangani told Reuters the police building cracked during the quake, which hit while officers were mid-flag-raising ceremony.Magnitude still being confirmed.… pic.twitter.com/ncqtqHTGBX— Global Report (@Global_ReportHQ) June 8, 2026Another video captures the Jollibee building collapse in General Santos, Philippines following powerful earthquake. No word on casualties. https://t.co/LJEVl0qTjC pic.twitter.com/DgixNijwoY— AZ Intel (@AZ_Intel_) June 8, 2026 -
జపాన్‌లో మళ్లీ భూకంపం.. సునామీ ముప్పు ఉందా?
టోక్యో: సరిగ్గా వారం రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం తాలూకు భయం నుండి జపాన్ ప్రజలు ఇంకా తేరుకోకముందే, ఆ దేశాన్ని ప్రకృతి మరోసారి వణికించింది. సోమవారం(నేడు) తెల్లవారుజామున ఉత్తర జపాన్ను భారీ తీవ్రతతో కూడిన భూకంపం కుదిపేసింది. అయితే, అదృష్టవశాత్తూ ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు లేకపోవడంతో ప్రజలు, ప్రభుత్వ అధికారులు తాత్కాలికంగా ఊపిరి పీల్చుకున్నారు.本日5時24分頃、北海道十勝地方南部を震源とする地震が発生し、北海道浦幌町で最大震度5強の強い揺れを観測しました。津波の心配はありません。…— 高市早苗 (@takaichi_sanae) April 26, 2026భూకంప తీవ్రత ఎంతంటే?జపాన్ వాతావరణ శాఖ అందించిన తాజా అధికారిక వివరాల ప్రకారం ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.2గా నమోదైంది. జపాన్‌కు ఉత్తరాన ఉన్న ప్రధాన దీవి అయిన హక్కైడోలోని చిన్న పట్టణమైన సరబెట్సు కు పశ్చిమంగా 18 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. దీని లోతు భూగర్భంలో సుమారు 81 కిలోమీటర్లు ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS)తెలిపింది. ఈ ప్రకంపనల ధాటికి పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. సునామీ ముప్పు ఉందా? నష్టం ఏమైనా జరిగిందా?ఈ హఠాత్పరిణామంతో సముద్ర తీరప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనకు గురైనప్పటికీ, అధికారులు వారికి ఊరటనిచ్చే వార్త చెప్పారు. ఈ తాజా భూకంపం కారణంగా ఎలాంటి సునామీ వచ్చే అవకాశం లేదని, ఎలాంటి అడ్వైజరీ జారీ చేయలేదని జపాన్ జాతీయ వాతావరణ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం కానీ, భవనాలు కూలిపోయి ఆస్తి నష్టం జరిగినట్లు కానీ ఎటువంటి నివేదికలు అందలేదు. అయినప్పటికీ అత్యవసర సహాయక బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నాయి.వారం క్రితమే వణికిన జపాన్వారం రోజుల క్రితమే జపాన్‌లో ఏకంగా 7.7 తీవ్రతతో ఒక అతిపెద్ద భూకంపం సంభవించి దేశాన్ని అతలాకుతలం చేసింది. ఆ తీవ్ర పరిణామం తరువాత, ఈశాన్య తీరప్రాంతంలో భవిష్యత్తులో ‘మెగా భూకంపం’ వచ్చే ప్రమాదం స్వల్పంగా పెరిగిందని జపాన్ ఉన్నతాధికారులు సలహా హెచ్చరికలు జారీ చేశారు. ఆ ఘటన తాలూకు పీడకలల నుండి ప్రజలు బయటపడక ముందే తాజాగా ఈ 6.2 తీవ్రతతో ప్రకంపనలు రావడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. వరుసగా వస్తున్న ఈ ప్రకృతి విపత్తుల కారణంగా జపాన్ ప్రభుత్వం ప్రస్తుతం హై అలర్ట్‌లో ఉంది.ఇది కూడా చదవండి: బెంగాల్ కోటలో సెలబ్రిటీలకు షాక్ -
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
రష్యాలో భారీ భూకంపం సంభవించింది. భవనాలు తీవ్రంగా ఊగిపోయాయి. ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌స్కేల్‌పై భూకంపం తీవ్రత 7.8గా నమోదు అయింది. దీంతో యూఎస్ జాతీయ ఆరోగ్య సర్వీస్ విభాగం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రాణ, ఆస్తి నష్టంపై స్పష్టత రావాల్సి ఉంది. పెట్రోపావ్లోవ్స్-కామ్చాట్స్కీ రీజియన్‌లో గురువారం అర్ధరాత్రి దాటాక ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కేంద్రం 10 కి.మీ దూరంలో ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. అనంతరం స్వల్ప వ్యవధిలో మరో ఐదుసార్లు స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రష్యాలో తరచూ భూకంపాలు సంభవించడానికి ప్రధాన కారణం—అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ (Pacific Ring of Fire) లో భాగంగా ఉండటం. ఇది భూమి మీద అత్యంత చురుకైన భూకంప, అగ్నిపర్వత ప్రాంతం. ప్రధానంగా కమ్చట్కా ద్వీపకల్పం ప్రాంతం పసిఫిక్ ప్లేట్-యూరేషియన్ ప్లేట్ మధ్య ఉంది. ఇవి ఒకదానిని మరొకటి గుద్దుతూ కదలడం వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఇదిలా ఉంటే.. ఇటు ఇండోనేషియాలోనూ 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. సెంట్రల్ పపువా ప్రావిన్స్‌లో శుక్రవారం వేకువ జాము సమయంలో ప్రకంపనలు వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. 28 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని సమాచారం. -
రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు
రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. ప్రకంపనల తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.4గా నమోదైంది. రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పంతో పాటు హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు.పెట్రోపావ్లోవ్స్క్-కామ్చాట్కా నగరానికి తూర్పున 143 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహా సముద్రంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి ముందు దాదాపు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో ఐదు భూకంపాలు నమోదైనట్లు యూఎస్జీఎస్ తెలిపింది.ఈ భారీ భూకంపాలు.. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:28 నుంచి 3:49 గంటల మధ్య సంభవించాయి. ఈ భూకంపాల కారణంగా కొన్ని భవనాలు దెబ్బతిన్నాయని, అయితే ప్రాణ నష్టం గురించి ఇప్పటివరకు స్పష్టమైన సమాచారం వెల్లడికాలేదు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు హెచ్చరించారు. -
జపాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
టోక్యో: జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.6గా నమోదైంది. దీంతో సునామీ హెచ్చరికల్ని జపాన్ వాతావరణ సంస్థ జారీ చేసింది. సముద్ర అలలు 5 మీటర్ల వరకు ఎగిసిపడ్డాయని వెల్లడించింది. ఇషికావా, నీగాటా, టొయామా ప్రిఫెక్చర్ల తీర ప్రాంతాలలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. భూకంప ప్రభావంతో సముద్ర అలలు తీరం వైపు దూసుకొస్తున్నాయి. సునామీ అలలతో నోటో, ఇషికావా జపాన్‌లో నదిలో అలలు ప్రవాహానికి వ్యతిరేక దిశలో ప్రవహిస్తున్నాయి. సునామీ వచ్చే అవకాశం ఉండటంతో జపాన్ పశ్చిమ తీరంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. #Tsunami waves are flowing back up the river in Noto, Ishikawa japan#Japan #earthquakes #EarthwuakeInJapan pic.twitter.com/2MKF7u7U7i — Ritesh Kumar (@riteshkumar1926) January 1, 2024 భూకంప దృశ్యాలు భీతికొల్పుతున్నాయి. భూప్రకంపనలతో స్టోర్‌లోని వస్తువులు చెల్లాచెదురవుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భూకంపానికి సంబందించి ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం గురించి ఇప్పటివరకు ఎటువంటి నివేదికలు విడుదల చేయలేదు. హొకురీకు అణు విద్యుత్ ప్లాంట్లలో ఏవైనా అవకతవకలు జరిగాయా? అని అధికారులు తనిఖీ చేస్తున్నారు. Store Owner records his store shake after 7.4 m earthquake hit Japan Tsunami warning is in Effect#Japan #tsunami #warning #deprem #sismo #地震 #earthquake #japanese #japannews pic.twitter.com/KJxlv0j1ii — Hollow dreams (@ChrisKolen001) January 1, 2024 మార్చి 11, 2011న, జపాన్‌లోని హోన్షు ద్వీపం ఈశాన్య తీరంలో 9.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. జపాన్ చరిత్రలో అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది. భయంకరమైన సునామీ ఏర్పడటానికి కారణమైంది. ఈ విపత్తులో 18,000 మందికి పైగా మరణించారు. ఫుకుషిమా దైచి అణు విద్యుత్ ప్లాంట్‌లో అణు అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఇదీ చదవండి: Happy New Year: 2024.. దునియాలో కొత్తగా జరగనుంది? -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
Philippines Massive Earthquake Tsunami Warning ఫిలిప్సీన్స్‌లో మరోసారి భారీగా భూమి కంపించింది. మిండనావోలో శనివారం 7.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) వెల్లడించింది. భూకంపం 63 కిమీ (39 మైళ్లు) లోతులో ఉందని EMSC తెలిపింది. దీంతో జనం భయకంపితులయ్యారు. 50కి పైగా నివాసాలు, ఇతర భవనాలను ధ్వంసమైనాయి. దీంతో అమెరికా సునామీ హెచ్చరికల వ్యవస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. నవంబరు 17న సంభవించిన భూకంపంలో సారంగని, సౌత్ కోటాబాటో, దావో ఆక్సిడెంటల్ ప్రావిన్సులో కొంత ప్రాణ నష్టం జరిగింది. కాగా పసిఫిక్ "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఉన్న ఫిలిప్పీన్స్‌లో తరచుగా భూకంపాలు సంభవిస్తాయి. ఈ ప్రాంతాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే ప్రపంచంలో అత్యంత భూకంప , అగ్నిపర్వత క్రియాశీల జోన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. PHIVOLCS has issued a #Tsunami Warning for the #Philippines after the powerful #earthquake (#lindol) in #Mindanao. People in the Philippines and nearby countries need to check local authorities for local tsunami information and the aftershocks of the earthquake. #sismo #quake https://t.co/YEsbKT3sVs pic.twitter.com/TlCo8Y0lsR — 🌊 Earthquake Updates Worldwide - #StopWar 🎗️ (@InfoEarthquakes) December 2, 2023 -
అలస్కాలో భూకంపం: సునామీ వార్నింగ్
వాషింగ్టన్: అలస్కాలో భారీ భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 6.12కు సంభవించిన ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.8గా నమోదైంది. దీంతో సునామీ వచ్చే అవకాశం ఉందని అమెరికా జియాలాజికల్ సర్వే హెచ్చరికలు జారీ చేసింది. ఆంకరేజ్కు నైరుతి దిశగా 500 మైళ్లు, పెర్రివిల్లేకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 60 మైళ్ల దూరంలో ఈ భూకంప కేంద్రం నమోదైంది. దీంతో ఆ ప్రాంతం నుంచి చుట్టుపక్కల 300 కిలోమీటర్ల మేర సునామీ ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. భూకంపంలో సంభవించిన ప్రాణనష్టం, ఆస్తి నష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది (మెక్సికోలో భారీ భూకంపం) చదవండి: 7.3 తీవత్రతో భూకంపం, సునామీ హెచ్చరిక -
ఇండోనేసియాలో భారీ భూకంపం
జకార్తా: ఇండోనేసియాను భూకంపం వణికించింది. సులావేసి దీవిలో శుక్రవారం సంభవించిన ప్రకంపనలకు పలు ఇళ్లు కూలిపోగా, ఒకరు చనిపోయినట్లు తెలిసింది. రిక్టర్ స్కేలుపై 7.5 తీవ్రతగా నమోదైన ఈ భూకంప కేంద్రం సులావేసి పట్టణానికి సుమారు 56 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం అనంతరం సునామీ హెచ్చరికలు జారీచేసిన అధికారులు కొంతసేపటికి విరమించుకున్నారు. పాలూ అనే పట్టణంలో నీటి ఉధృతికి పలు భవనాలు కుప్పకూలాయి. సముద్ర అలలు సుమారు 1.5 మీటర్ల ఎత్తుకు ఎగిశాయని విపత్తు నిర్వహణ అధికారులు చెప్పారు. సునామీ అలలకు భయపడి స్థానికులు ఎత్తయిన ప్రదేశాల్లో తలదాచుకుంటున్నారు. భూకంప కేంద్రానికి చాలా దూరంలో ఉన్న ప్రజలు ప్రకంపనలు తమ నివాసాల్లోనూ వచ్చినట్లు తెలిపారు. భూకంపం ధాటికి పలు ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. కూలిపోయిన భవనాల శిథిలాలు, రాళ్లు రహదారులపైకి కొట్టుకొచ్చాయి. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు వాహనాల్లో ఎగువ ప్రాంతాల వైపు బయల్దేరడంతో పాలూ పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. భూకంప ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లోకి సహాయక బృందాలు చేరుకుంటున్నారు. ప్రకంపనల ధాటికి ఎంతమంది చనిపోయారు? ఎందరు గాయాలపాలయ్యారు? అన్న సమాచారం తెలియరాలేదు. -
భారీ భూకంపం.. కుదేలైన ‘ఇండోనేషియా’
-
ఇండోనేషియాలో భారీ భూకంపం..
-
భారీ భూకంపం.. 80 మంది మృతి
జకార్త : ఇండోనేషియా లంబోక్ దీవుల్లో సోమవారం భారీ భూకంపం సంభంవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.0 శాతంగా నమోదైంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో 80 మందికి పైగా మృతి చెందగా, వేలాది పౌరులు తీవ్ర గాయలపాలయ్యారు. ఈ ఘటన జరిగిన కొన్నిగంటల పాటుల స్పల్ప భూప్రకంపనలు కొనసాగాయి. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. వందాలాది ఇళ్లు ధ్వంసంకాగా, వేలాది ప్రజలు నిరాశ్రలయ్యరు. కాగా భారీ భూకంప హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఆదివారమే సునామీ హెచ్చరికల్ని జారీచేసిన విషయం తెలిసిందే. పసిఫిస్ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గత నెల 29న లంబోక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో 17 మంది చనిపోగా, వందలాది ఇళ్లు ధ్వంసమయిన విషయం తెలిసిందే. -
ఇండోనేసియాలో భారీ భూకంపం
మతరమ్: ఇండోనేసియాలోని లంబోక్ దీవిని ఆదివారం భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దెబ్బకు లంబోక్‌లో 39 మంది మృతి చెందగా, 52 మంది గాయపడ్డారు. తొలుత భారీ తీవ్రతతో, అనంతరం కొంచెం తక్కువ తీవ్రతతో భూమి కంపించింది. ఈ ఘటన జరిగిన కొన్నిగంటల పాటు స్వల్ప భూప్రకంపనలు కొనసాగాయి. ఈ భూకంప తీవ్రతకు పక్కనే ఉన్న బాలిలోని భవనాలు కంపించాయి. ట్రెక్కింగ్ కేంద్రాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. రిక్టర్ స్కేలుపై 7.0 తీవ్రతతో భూకంపం రావడంతో అధికారులు సునామీ హెచ్చరికల్ని జారీచేశారు. అనంతరం వాటిని ఉపసంహరించుకున్నారు. ఈ భూకంప కేంద్రం లంబోక్ భూగర్భంలో 10 కి.మీ లోతున ఉన్నట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. గత నెల 29న లంబోక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో 17 మంది చనిపోగా, వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. పసిఫిక్ సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఇండోనేసియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. -
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
-
ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం, సునామీ హెచ్చరిక
మనీలా: ఫిలిప్పీన్స్‌లో శనివారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.8గా నమోదైంది. దీని ప్రభావం వల్ల పలు భవంతులు దెబ్బతినగా, ఇద్దరు గాయపడ్డారు. ప్రభుత్వ భవనాలు బీటలుబారాయి. సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. మిండనావో ద్వీపంలో 41 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. జనం నిద్రపోతున్న సమయంలో భూప్రకంపనలు వచ్చాయి. ప్రజలు భయంతో నిద్రలేచి, ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. కొందరు హడావుడిగా బయటకు వెళ్లే ప్రయత్నంలో గాయపడ్డారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. ఈ నెల 12న మిండనావోలోనే సంభవించిన భూకంపంలో పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. గత ఫిబ్రవరిలో మిండనావోలోని సురిగావోలో వచ్చిన భూకంపం వల్ల ఎనిమిదిమంది మరణించగా, మరో 250 మందికిపైగా గాయపడ్డారు. -
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
-
భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
భారీ భూకంపం చిలీని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దక్షిణ చిలీలోని ప్యూర్టో మాంట్ నగరానికి 225 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని ఫలితంగా భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధివరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే భూకంపం వల్ల సంభవించిన నష్టం వివరాలు మాత్రం ఇంతవరకు అందలేదు. దక్షిణ చిలీలోని తారాహుయిన్లో భూకంప దాటికి పాడైన రోడ్డు -
ఇండోనేసియాలో భారీ భూకంపం
జకార్తా: తూర్పు ఇండోనేసియాలోని మలుకు దీవుల వద్ద సముద్ర గర్భంలో శనివారం ఉదయం 10:31 గంటలకు భారీ భూకంపం సంభవించింది. కోటా టెర్నెట్ ప్రాంతానికి 154 కి.మీ. దూరంలో 46 కి.మీ. లోతులో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైందని అమెరికా జియాలజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రానికి 300 కి.మీ. పరిధిలోని తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. -
భారత్‌కు సునామీ హెచ్చరికలు లేవు
-
భారత్‌కు సునామీ హెచ్చరికలు లేవు: ఇన్కాయిస్
న్యూఢిల్లీ : ఇండోనేషియాలో భారీ భూకంపం నేపథ్యంలో భారత్‌కు ప్రస్తుతం సునామీ హెచ్చరికలు లేవని ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియన్ నేషనల్ సెంటర్(ఇన్కాయిస్) వెల్లడించింది. భారత్‌కు చాలా దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఇండోనేషియా మలుకు దీవుల్లో శనివారం భారీ భుకంపం సంభవించిన విషయం తెలిసిందే. సముద్రంలో 46 కి.మీ. లోతులో ఏర్పడ్డ ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.3గా నమోదైంది. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. అయితే భూకంప తీవ్రతతో ప్రజలు ఒక్కసారిగా భయపడి....ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. -
ఇండోనేసియాకు సునామీ హెచ్చరిక
జకర్తా: ఇండోనేసియా సముద్ర జలాల్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 7.3గా నమోదైంది. శనివారం ఉదయం తూర్పు ఇండోనేసియా మలూకు ద్వీపాలు కంపించాయి. సునామీ వచ్చే అవకాశముందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సముద్రంలో 46 కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఇండోనేసియాకు 300 కిలోమీటర్ల పరిధిలో సునామీ వచ్చే అవకాశముందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. ఇండోనేసియాతో పాటు ఫిలిప్పీన్స్, జపాన్, తైవాన్, దక్షిణ పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. కాగా భూకంప కేంద్రం భారత్‌కు చాలా దూరంలో ఉందని ఇన్కాయిస్ వెల్లడించింది. భారత్‌కు సునామీ హెచ్చరికలు లేవని పేర్కొంది. 2004లో హిందూ మహాసముద్రంలో సంభవించిన భూకంపం వల్ల ఆగ్నేయాసియా దేశాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. 1.70 లక్షల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. -
విజ్ఞాన ఖని.. భాగ్యనగరం
ఇప్పటికే అనేక రంగాల్లో తనదైన గుర్తింపును తెచ్చుకున్న భాగ్యనగరం నాలెడ్జ్ హబ్‌గా మారుతోంది. సృజనాత్మకత, కొత్త ఆలోచనలున్న యువతకు సాదర స్వాగతం పలుకుతోంది. ప్రపంచస్థాయి పరిశోధనలకు కేంద్రంగా ఎదుగుతోంది. నాలెడ్జ్ హబ్ దిశగా ప్రస్థానం కొనసాగిస్తున్న హైదరాబాద్‌లో ఉన్నత విద్య, పరిశోధనలు, ఇంటర్న్‌షిప్-ఫెలోషిప్ అవకాశాలపై ఫోకస్... పరిశోధన ల్లో మేటి.. సిటీ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ).. బెంగళూరు, ముంబై నగరాల తర్వాత అత్యధికంగా నిధులు అందజేసేది హైదరాబాద్ నగరానికే. ఇక్కడ దాదాపు 100 ప్రతిష్టాత్మక పరిశోధన సంస్థలు కొలువుదీరి ఉన్నాయి. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎన్జీఆర్ఐ), సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్ (సీడీఎఫ్‌డీ), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్ఐఎన్), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏనిమల్ బయోటెక్నాలజీ, సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్ వంటి సంస్థల్లో నిత్యం వివిధ అంశాలపై పరిశోధనలు చేస్తుంటారు. వీటిల్లో మానవాళి ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు పరిష్కారాలను కనుగొంటున్నారు. వీటితోపాటు ట్రిపుల్ ఐటీ, ఐఐటీలలో అకడమిక్స్‌తోపాటు పరిశోధనల్లోనూ విద్యార్థులను భాగస్వాములను చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సెన్సైస్(ఐ.ఎల్.ఎస్) ఉంది. ఇక్కడ క్యాన్సర్, కార్డియో వాస్క్యులర్ డిసీజెస్, మెటబాలిక్ డిజార్డర్స్ తదితర వ్యాధులపై పరిశోధనలు చేస్తున్నారు. సిటీ అమ్ములపొదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఘన చరిత్ర ఉంది. ఇక్కడ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆస్ట్రానమీ, బోటనీ తదితర అంశాల్లో పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న టెక్నాలజీతో పోటీపడేందుకు ధీటుగా యువతలో పరిశోధనలపట్ల ఆసక్తి పెంచేందుకు ‘నేషనల్ నాలెడ్జ్ నెట్వర్క్ (ఎన్‌కేఎన్)’ తోడ్పాటును అందిస్తోంది. సైన్స్, టెక్నాలజీ, హయ్యర్ ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, అగ్రికల్చర్ తదితర అంశాల్లో యూనివర్సిటీలు, కాలేజీలు, పరిశోధన సంస్థలకు చేయూతనిస్తుంది. ఎన్‌కేఎన్ పరిధిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీ, ఉస్మానియా విశ్వవిద్యాలయాలున్నాయి. పరిశోధనలకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తున్నారు. సునామీ హెచ్చరికల నుంచి తోకచుక్కల గమనం వరకు.. భౌగోళికంగా హైదరాబాద్‌కు గల ప్రత్యేక స్థానం.. ప్రయోగశాలలు, పరిశోధకులకు అనువుగా ఉంటోంది. ఆ ప్రత్యేకతే.. యువతను సాంకేతిక పరిశోధనల్లో భాగస్వాములను చేస్తుందంటున్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటరమణ. సముద్రతీరం లేకపోయినా సునామీ హెచ్చరికల కేంద్రం ఏర్పాటుకు అనువైన ప్రాంతంగా హైదరాబాద్ ఉండటం భౌగోళికంగా కలిసొచ్చే ప్రాధాన్యత అంటారాయన. వాతావరణాన్ని, సముద్రాలను అధ్యయనం చేసి తుపానులు, సునామీ హెచ్చరికల్ని ఎప్పటికప్పుడు తెలియజేయడానికి నగరంలో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్(ఇన్కాయిస్) ఏర్పాటైంది. అదేవిధంగా అంతరిక్షంలో ఆవిష్కృతమవుతున్న వింతలను.. తోకచుక్కల గమనాన్ని కనిపెట్టేందుకు దేశంలోనే తొలిసారిగా బేగంపేటలో 1908లో నిజాం అబ్జర్వేటరీ ఏర్పాటైంది. విద్యార్థుల్లో పరిశోధనలకు అవసరమైన స్కిల్స్‌ను పెంపొందించడానికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు అబ్జర్వేటరీ డెరైక్టర్ డాక్టర్ ఎస్.ఎన్.హసన్ తెలిపారు. పరిశోధనలు చేసే విద్యార్థులకు ఇంగ్లిష్‌పై పట్టు ఉండాలి. ఎందుకంటే.. ప్రపంచవ్యాప్తంగా జరిగే పరిశోధనలను తెలుసుకోవాలంటే ఇంగ్లిష్ అవసరమనేది హసన్ అభిప్రాయం. ఇంటర్న్‌షిప్‌లు, ఫెలోషిప్‌లు - ఇంటర్నేషనల్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ పౌడర్ మెటలర్జీ అండ్ న్యూ మెటీరియల్స్(ఏఆర్‌సీఐ) విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ను అందిస్తోంది. ఏటా 60 మంది విద్యార్థులకు సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రాం (ఎస్.ఆర్.పి)లో శిక్షణ ఇస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థులు పరిశోధనల పట్ల ఆకర్షితులయ్యేందుకు ఇంటర్న్‌షిప్ ఉపయోగపడుతుందని వివరించారు ఏఆర్‌సీఐ అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ జి.పద్మనాభం. వేసవిలో నిర్వహించే ఇంటర్న్‌షిప్‌కు ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ ఇస్తామంటున్నారు. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎమ్మెస్సీ విద్యార్థులు అర్హులు. ఇక్కడ సీనియర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. - మరో ప్రముఖ పరిశోధన సంస్థ సీసీఎంబీ ప్రతిఏటా వేసవిలో దేశంలోని పరిశోధన, విద్యాసంస్థల విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తుంటుంది. ఎమ్మెస్సీ, బీటెక్ విద్యార్ధులకు 60 రోజుల శిక్షణలో సైంటిఫిక్, క్లాసురూం పాఠ్యాంశాలుంటాయి. తర్వాత విద్యార్ధులు తాము నేర్చుకున్న అంశంపై ప్రాజెక్టు రిపోర్టు అందజేయాల్సి ఉంటుంది. - ఇవేకాకుండా దాదాపు అన్ని పరిశోధన సంస్థలు జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్, పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌లు అందిస్తూ పరిశోధకుల మెప్పు పొందుతున్నాయి. మహిళలను ప్రోత్సహించే ఉద్దేశంతో అనేక చర్యలు చేపడుతున్నాయి. టెక్నాలజీని అప్డేట్ చేసుకుంటే ఉన్నతమైన కెరీర్ ‘‘గతంతో పోల్చితే మేధోవలసలు తగ్గుతున్నాయి. దేశంలోనే పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా పరిశోధనలకు భారీస్థాయిలో నిధులు కేటాయిస్తోంది. దీంతో పరిశోధన రంగంలోకి ప్రవేశించే యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్డేట్ చేసుకోవడం ద్వారానే కెరీర్‌ను ఉన్నతంగా మలచుకోవచ్చు’’ - డాక్టర్ కళాచంద్సేన్, సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఎన్జీఆర్ఐ సీ++ నుంచి ఆకాశ్ వరకు.. జావా.. సీ, సీ++, లైనక్స్, ఎస్‌క్యూఎల్ సర్వర్, యానిమేషన్, మల్టీమీడియా వంటి కోర్సుల శిక్షణ నుంచి చంద్రయాన్-1కు అవసరమైన మేధో పరిజ్ఞానం అందించేంత అవకాశాలు హైదరాబాద్ సొంతం. కేవలం ఐటీ రంగానికే పరిమితం కాకుండా.. సోషల్‌సెన్సైస్, లా, హ్యుమానిటీస్, ఫారెన్ లాంగ్వేజెస్, ఇంజనీరింగ్, హాస్పిటాలిటీ, సెన్సైస్.. ఇలా అన్ని విభాగాల్లో నగరం దేశంలోనే తనదైన ముద్ర వేసుకుంది. సృజనాత్మకత, నూతన ఆలోచనలతో వచ్చే యువతకు సిటీలో అనేక అవకాశాలున్నాయి. కొన్నేళ్లుగా నగరంలో పెరుగుతున్న స్టార్ట్అప్లే ఇందుకు నిదర్శనం. కొత్త కంపెనీని ఏర్పాటు చేసి.. పదిమందికి ఉపాధి కల్పించాలనుకునేవారికి సిటీలో అనేక సంస్థలు అవసరమైన గెడైన్స్, సీడ్ ఫండింగ్ అందిస్తున్నాయి. వాటిలో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), మైక్రో, స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ) వంటివి ముఖ్యమైనవి. ముఖ్యమైన వెబ్‌సైట్స్: www.acsir.res.in, www.ngri.org.in, www.drdo.gov.in, www.ccmb.res.in, dbtindia.nic.in, dst.gov.in, ninindia.org -
చిలీలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక
చిలీ తీరాన్ని భారీ భూకంపం తాకింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 8.2గా నమోదైంది. దీంతో ఒమత్తం లాటిన్ అమెరికా పసిఫిక్ తీరం మొత్తానికి సునామీ హెచ్చరికలు జారీచేసినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. ప్రస్తుతానికి భూకంపం, సునామీ వల్ల నష్టాలు జరిగినట్లు ఇంకా ఏమీ తెలియరాలేదు. ఎల్క్విక్ గనుల ప్రాంతానికి 86 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన ఈ భూకంపం సముద్ర మట్టానికి కేవలం 10 కిలోమీటర్ల దిగువన మాత్రమే ఉంది. దాంతో ఇది చాలా బలంగా ఉన్నట్లు యూఎస్జీఎస్ తెలిపింది. ప్రపంచంలోనే భూకంపాలు అత్యంత ఎక్కువగా వచ్చే దేశాల్లో దక్షిణ అమెరికా దేశమైన చిలీ ఒకటి. దీనికి ఉత్తరాన పెరూ, ఈశాన్యంలో బొలీవియా, తూర్పున అర్జెంటీనా ఉన్నాయి. సునామీ ప్రమాదం పొంచి ఉండటంతో చిలీ అధికారులు టీవీ చానళ్ల ద్వారా ప్రచారం చేసి, తీరప్రాంతాల వాసులను వెంటనే ఖాళీ చేయించారు. పెరూ, ఈక్వెడార్, కొలంబియా, పనామా, కోస్టారికా, నికరాగువా దేశాల్లోని తీరప్రాంతాలన్నింటికీ సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది. దాదాపు రెండు మీటర్ల ఎత్తున అలలు వచ్చి చిలీలోని పిసగువా పట్టణాన్ని తాకే ప్రమాదం ఉంది. ఇది చాలా విధ్వంసకంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. 2010 సంవత్సరంలో కూడా చిలీలో 8.8 తీవ్రతతో భూకంపం, తర్వాత సునామీ రావడంతో అనేక పట్టణాలు చెల్లాచెదురైపోయాయి.


