ఇండోనేషియాలో భారీ భూకంపం నేపథ్యంలో భారత్కు ప్రస్తుతం సునామీ హెచ్చరికలు లేవని ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియన్ నేషనల్ సెంటర్(ఇన్‌కాయిస్) వెల్లడించింది.
న్యూఢిల్లీ : ఇండోనేషియాలో భారీ భూకంపం నేపథ్యంలో భారత్కు ప్రస్తుతం సునామీ హెచ్చరికలు లేవని ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియన్ నేషనల్ సెంటర్(ఇన్‌కాయిస్) వెల్లడించింది. భారత్‌కు చాలా దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది.
ఇండోనేషియా మలుకు దీవుల్లో శనివారం భారీ భుకంపం సంభవించిన విషయం తెలిసిందే. సముద్రంలో 46 కి.మీ. లోతులో ఏర్పడ్డ ఈ భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌పై 7.3గా నమోదైంది. కాగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లలేదని ఇండోనేషియా అధికారులు ప్రకటించారు. అయితే భూకంప తీవ్రతతో ప్రజలు ఒక్కసారిగా భయపడి....ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీసినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.