తూర్పు ఇండోనేసియాలోని మలుకు దీవుల వద్ద సముద్ర గర్భంలో శనివారం ఉదయం 10:31 గంటలకు భారీ భూకంపం సంభవించింది.
జకార్తా: తూర్పు ఇండోనేసియాలోని మలుకు దీవుల వద్ద సముద్ర గర్భంలో శనివారం ఉదయం 10:31 గంటలకు భారీ భూకంపం సంభవించింది. కోటా టెర్నెట్ ప్రాంతానికి 154 కి.మీ. దూరంలో 46 కి.మీ. లోతులో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో నమోదైందని అమెరికా జియాలజికల్ సర్వే వెల్లడించింది. భూకంప కేంద్రానికి 300 కి.మీ. పరిధిలోని తీర ప్రాంతాలకు సునామీ ముప్పు పొంచి ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.