భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక | heavy earthquake shakes chile, tsunami warning issued | Sakshi
Sakshi News home page

భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

Dec 25 2016 8:22 PM | Updated on Sep 4 2017 11:35 PM

భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక

భారీ భూకంపం చిలీని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది.

భారీ భూకంపం చిలీని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. దక్షిణ చిలీలోని ప్యూర్టో మాంట్ నగరానికి 225 కిలోమీటర్ల దూరంలో ఇది సంభవించింది. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 
 
భూ ఉపరితలానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించిందని చెబుతున్నారు. దీని  ఫలితంగా భూకంప కేంద్రానికి వెయ్యి కిలోమీటర్ల పరిధివరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. అయితే భూకంపం వల్ల సంభవించిన నష్టం వివరాలు మాత్రం ఇంతవరకు అందలేదు.

దక్షిణ చిలీలోని తారాహుయిన్లో భూకంప దాటికి పాడైన రోడ్డు
Advertisement
 
Advertisement
Advertisement