ప్రకృతి ప్రకోపానికి టిబెట్ వణికిపోయింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. గురువారం రాత్రి సంభవించిన 7.0 తీవ్రతతో కూడిన భారీ భూకంపం పెను విధ్వంసం సృష్టించింది. ఈ విలయంలో ఇప్పటివరకు 18 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 32 మంది గాయపడ్డారు. భూకంప కేంద్రానికి సమీపంలోని ప్రాంతాల్లో ఏడు భూప్రకంపనలు సంభవించినట్లు అమెరికా భూగర్భ పరిశోధనా సంస్థ (USGS) వెల్లడించింది.
పలు భవనాలు దెబ్బతినడంతో పాటు విద్యుత్, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థలు స్తంభించడంతో చైనా ప్రభుత్వం అత్యవసర సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రకంపనలన్నీ పర్వత ప్రాంతంలోనే చోటుచేసుకున్నాయి. వీటిలో అత్యధికంగా 5.2 తీవ్రతతో ఓ ప్రకంపన నమోదైంది. ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతులో సంభవించింది. భూకంపం తీవ్రత 7.0గా నమోదైందని, భూకంప కేంద్రం భూమికి 18 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు యూఎస్‌జీఎస్ డేటా వెల్లడించింది.
#BREAKINGNEWS First video coming out of China after a powerful 7.0⚡️Magnitude earthquake has struck Xizang region causing major damage to buildings At least 16 people were killed and 32 injured after a magnitude 7.0 earthquake struck Tibet, China, earlier, with hundreds of homes collapsing. #FlavioBolsonaroNaLancha #China #earthquake #Prabhas #GMMTVLiveHouse
— Mukund Shahi (@Mukundshahi73) October 23, 2026
ఇదీ చదవండి: సౌదీ యువరాజు దార్శనికతకు పరీక్ష!


