భారీ భూకంపం.. 80 మంది మృతి

Earthquake In Indonesia 80 Peoples Are Death - Sakshi

జకార్త : ఇండోనేషియా లంబోక్‌ దీవుల్లో సోమవారం భారీ భూకంపం సంభంవించింది. రిక్టర్‌ స్కేల్‌పై  భూకంప తీవ్రత 7.0 శాతంగా నమోదైంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో 80 మందికి పైగా మృతి చెందగా, వేలాది పౌరులు తీవ్ర గాయలపాలయ్యారు. ఈ ఘటన జరిగిన కొన్నిగంటల పాటుల స్పల్ప భూప్రకంపనలు కొనసాగాయి. భూకంపం ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి. వందాలాది ఇళ్లు ధ్వంసంకాగా, వేలాది ప్రజలు నిరాశ్రలయ్యరు.

కాగా భారీ భూకంప హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఆదివారమే సునామీ హెచ్చరికల్ని జారీచేసిన విషయం తెలిసిందే. పసిఫిస్‌ సముద్రంలోని రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో ఉన్న ఇండోనేషియాలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. గత నెల 29న లంబోక్‌లో 6.4 తీవ్రతతో భూకంపం రావడంతో 17 మంది చనిపోగా, వందలాది ఇళ్లు ధ్వంసమయిన విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top