ఇరాన్‌లో భూకంపం.. తీవ్రత ఎంతంటే? | Earthquake in Iran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో భూకంపం.. తీవ్రత ఎంతంటే?

Feb 2 2026 5:09 AM | Updated on Feb 2 2026 5:15 AM

Earthquake in Iran

ఆదివారం దక్షిణ ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాలలో భూకంపం సంభవించింది.  అక్కడి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం కొన్ని ప్రాంతాలలో భూమి కంపించినట్లు జియోలాజికల్ సర్వే అథారిటీ తెలిపింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3గా నమోదైనట్లు పేర్కొంది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని తెలిపింది.

కొన్నిచోట్ల భవనాలకు పగుళ్లు రావడం మినహా ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదని  మెహర్, బిద్ధన్ అఖండ్ ప్రాంతాలలోని భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని అక్కడి అధికారులు పేర్కొన్నారు. భూకంపం రావడంతో ప్రజలు పెద్దఎత్తున బాహ్య ప్రదేశాలకు పరుగులు తీశారని  తెలిపారు. అంతే కాకుండా ఖతార్‌లోనూ యూఏఈలోనూ స్వల్పంగా  భూ ప్రకంపనలు వచ్చినట్లు ఆ దేశాలు ప్రకటించాయి. అయితే దానివల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని పేర్కొన్నాయి. అయితే భూకంప తీవ్రత ఎలా ఉందనే అంశం అధికారులు పరిశీలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement