మాపై దాడి చేస్తే అంతే.. ట్రంప్‌కు ఖమేనీ తీవ్ర హెచ్చరిక | Khamenei said that an attack on Iran would turn into a regional war | Sakshi
Sakshi News home page

మాపై దాడి చేస్తే అంతే.. ట్రంప్‌కు ఖమేనీ తీవ్ర హెచ్చరిక

Feb 2 2026 4:05 AM | Updated on Feb 2 2026 4:07 AM

Khamenei said that an attack on Iran would turn into a regional war

అమెరికా, ఇరాన్ మధ్య ప్రస్తుత పరిస్థితుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవలే ట్రంప్ ఆ దేశానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అణుఒప్పందం విషయంలో ఇరాన్ తగ్గకపోతే వెనిజువెలా సీన్‌ను మించి రిపీట్ అవుతుందని హెచ్చరించారు. దీనిపై ఇరాన్ సుప్రీం ఖమేనీ ఘాటుగా రిప్లై ఇచ్చారు. అమెరికా తమపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధానికి దారి తీస్తుందని ట్రంప్‌ను హెచ్చరించారు.

ఇటీవల ఇరాన్‌ విషయంలో అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా స్పందిచారు. ప్రస్తుతం ఇరాన్ వైపు అమెరికా నావిక దళం వెళుతుందని అది ఇంతకు ముందు వెనిజువెలా వెళ్లన దాని కంటే పెద్దదన్నారు. సమయం మించిపోతుందని అణు ఒప్పందం విషయంలో ఇరాన్ దిగిరాకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయన్నారు. దానికి ఇరాన్ సైతం తీవ్రంగా స్పందించింది. కాగా తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ట్రంప్‌ను తీవ్రంగా హెచ్చరించారు.

ఆదివారం ఇరాన్ శాసనసభలో ఆదేశ సుప్రీం లీడర్ ఖమేనీ మాట్లాడారు. " టంప్ వాక్చతుర్యానికి ఇరానీయులు భయపడవద్దు.మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు. కానీ మాపై దాడి చేస్తే గట్టిగా బదులిస్తాం. ఒకవేళ మాపై దాడి చేస్తే అది ప్రాంతీయ యుద్ధంగా మారే అవకాశం ఉందనే విషయం గుర్తుంచుకోండి" అని అన్నారు. అంతేకాకుంగా ఇరాన్‌లో జరిగిన నిరసనలను అమెరికా, ఇజ్రాయెల్ ప్రోత్సాహంతోనే జరిగాయని ఖమేని అభివర్ణించారు.

అల్లర్లు జరిపిన వారు ప్రభుత్వ కార్యాలయాలపై, మసీదులపై, బ్యాంకులపై దాడిచేశారని అది ఇరాన్‌పై జరిగిన తిరుగుబాటన్నారు. దానిని భద్రతా బలగాలు విజయవంతంగా  అణిచివేశాయని తెలిపారు ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో మూడు వేల మంది పౌరులు మరణించినట్లు ఆ దేశం అంగీకరించింది. ఇటు ట్రంప్ హెచ్చరికలు.. అటు ఖమేనీ తగ్గేదేలే అనడంతో ప్రస్తుతం  ఏం జరగనుందా అని ప్రపంచ దేశాలు ఆందోళనలో ఉన్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement