కాంగోలో విరిగిపడ్డ కొండచరియలు.. వందల సంఖ్యలో మృతులు | 200 people died in a landslide in Congo | Sakshi
Sakshi News home page

కాంగోలో విరిగిపడ్డ కొండచరియలు.. వందల సంఖ్యలో మృతులు

Feb 1 2026 10:49 PM | Updated on Feb 1 2026 11:18 PM

200 people died in a landslide in Congo

రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో  దారుణం జరిగింది. అక్కడ మిలిషీయా గ్రూపులో కంట్రోల్‌లో ఉన్న ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి 200 మంది వరకూ మరణించారు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ బుధవారం ఉత్తర కివు ‍ప్రావిన్సులోని రుబియ గనులలో బుధవారం భారీవర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి.  అయితే ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే భద్రతా బలగాలు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడిన వారిని రుబియాలోని ఆసుపత్రులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో దాదాపు 200కుపైగా ప్రజలు ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు తెలుస్తోంది.

భారీస్థాయిలో వర్షాలు కురవడంతో చాలా మట్టుకు మృతదేహాలు బురదలో చిక్కుకుపోయాయని వాటిని వెలిక్కితీయడం కష్టమవుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతం ఎం23 అనే తిరుగుబాటు గ్రూపు ఆదీనంలో ఉంది. అయితే ఈ ఘటనపై అక్కడి ప్రభుత్వం స్పందించింది. కొండచరియలు విరిగిన ప్రమాదంలో మృతిచెందిన వారికి సంఘీబావం ప్రకటించింది. తిరుగుబాటు గ్రూపులో ఈ ప్రాంతంలోని సహాజవనరులను అక్రమంగా దోచుకుంటున్నారని ఆరోపించింది.

ఉత్తర కాంగో ప్రాంతంలో ఉన్న రుబియా ప్రాంతంలనో గనులలో అధిక స్థాయిలో ఖనిజ నిల్వలున్నాయి. దీంతో అక్కడి స్థానిక మిలిషీయా గ్రుపులకు ప్రభుత్వానికి మధ్య తరచుగా యుద్ధం జరుగుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement