ఆప్ఘనిస్తాన్‌ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వరదలు కారణంగా 17 మంది మృతిచెందారని, 11 మంది గాయపడినట్లు ఆఫ్ఘానిస్తాన్ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. హెరాత్ ప్రావిన్స్‌లోని కబ్కాన్ జిల్లాలో గురువారం ఒక ఇంటి పైకప్పు కూలిపోవడంతో ఐదుగురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సోమవారం(డిసెంబర్ 29, 2025) నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో పలు ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. మధ్య, ఉత్తర, దక్షిణ, పశ్చిమ ప్రాంతాల్లో నష్టం అధికంగా జరిగినట్లు అధికారులు తెలిపారు. వరదలు కారణంగా పశువులు కూడా చనిపోయాయి. వరద ప్రభావం 1,800 కుటుంబాలపై పడిందన్నారు.
సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. వరద తీవ్రతను అంచనా వేయడానికి బృందాలను పంపించినట్లు ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా చాలా కాలంగా వర్షాలు లేక కరువు పరిస్థితులు ఎదుర్కొంటుంది. భారీ వర్షాలు కురిసిప్పటికీ ఆకస్మిక వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు పరిస్థితి మరింత దారుణంగా మారింది.


