గోమా: తూర్పు కాంగోలోని సెంజ్ పట్టణం సమీపంలో సోమవారం జరిగిన బాంబు పేలుడులో కనీసం 30 మందికి లోగా మరణించారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. సైన్యానికి, ప్రభుత్వ అనుకూల సాయుధ ముఠాలకు మధ్య ఘర్షణలో భాగంగా ఈ దుర్ఘటన జరిగింది. ఇరు వర్గాల మధ్య ఇటీవలే అమెరికా మధ్యవర్తిత్వంలో వాషింగ్టన్ లో శాంతి ఒప్పందం కుదిరింది.
అయినా వారి మధ్య ఘర్షణలకు మాత్రం తెర పడటం లేదు. రువండా సరిహద్దుల సమీపంలోని పుష్కలమైన ఖనిజ నిల్వలకు నిలయమైన ప్రాంతాలపై పట్టు కోసం ఇటు సర్కారు, దాని అదీనంలో లేని సైన్యంతో పాటు కనీసం 100కు పైగా సాయుధ ముఠాలు పోటీ పడుతున్నాయి. ఫలితంగా ఏకంగా 70 లక్షల మందికి పైగా అక్కడి నుంచి పొట్ట చేతబట్టుకుని వలస బాట పట్టారు.


