ఇరాన్ మతపరమైన రాజధానిగా పిలువబడే ఖోమ్ నగరంపై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త బలగాలు మరోసారి భారీ ఎయిర్ స్ట్రైక్ చేశాయి. మార్చి 11న (యుద్ధం ప్రారంభమైన 12వ రోజు) జరిగిన ఈ దాడిలో భారీ పేలుడు సంభవించి, ఆకాశంలో భయంకరమైన పుట్టగొడుగు (మష్రూమ్ క్లౌడ్) ఆకారంలో పొగ మేఘం ఏర్పడింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఈ దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది.ఈ పేలుడు ఖోమ్‌లోని సైనిక డిపోలు, మిస్సైల్ స్టోరేజ్ లేదా ఇంధన నిల్వ స్థావరాలపై జరిగిన సాంప్రదాయిక (కన్వెన్షనల్) బాంబు దాడి వల్లే సంభవించినట్లు భావిస్తున్నారు. న్యూక్లియర్ పేలుడు కాదని, ఎలాంటి ప్రారంభ ఫ్లాష్, షాక్‌వేవ్ లేదా ఎంపీ ఎఫెక్ట్ లేకపోవడం దీనికి ఆధారాలుగా చెబుతున్నారు.
ఈ యుద్ధం ఫిబ్రవరి 28న సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమెనీ హత్యతో ప్రారంభమైంది. ఆ తర్వాత టెహ్రాన్, ఇస్ఫహాన్, ఖోమ్, కర్మాన్‌షాహ్ వంటి నగరాల్లో వందలాది టార్గెట్లపై అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు దాడులు కొనసాగిస్తున్నాయి. ఇరాన్ నుంచి ప్రతీకార దాడులు కూడా జరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్యం మరింత ఉద్రిక్తతకు గురవుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తమవుతోంది.
Holy Cow....
A massive mushroom cloud today over the city of Qom, Iran’s clerical capital. pic.twitter.com/4gin3HE9WZ— Mossad Commentary (@MOSSADil) March 11, 2026


