వెనిజులా బేస్‌బాల్ జట్టు చరిత్ర సృష్టించింది. రాజకీయ ఉద్రికత్తల వేల అమెరికాను వారి సొంతగడ్డపై (మియామీ) 3–2 తేడాతో ఓడించి, తమ మొదటి వరల్డ్ బేస్‌బాల్ క్లాసిక్ (WBC) టైటిల్‌ను సాధించింది. తొమ్మిదో ఇన్నింగ్స్‌లో యూజెనియో సుయారెజ్ కీలక హిట్‌తో వెనిజులాకు చరిత్రాత్మక విజయాన్ని అందించాడు. ఈ విజయాన్ని వెనిజులా ప్రజలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు.
వెనిజులా తాత్కాలిక నాయకురాలు డెల్సీ రోడ్రిగెస్ ఈ విజయాన్ని జాతీయ ఉత్సవ దినంగా ప్రకటించారు. ఈ విజయం వెనిజులా ప్రజల అభిరుచి, ప్రతిభ, ఐక్యతకు ప్రతీక అని పేర్కొన్నారు.
కాగా, ఈ ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మదురోను సైనిక దాడితో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత ట్రంప్‌కు అనుకూలమైన డెల్సీ రోడ్రిగెస్ వెనిజులా తాత్కాలిక నాయకురాలిగా బాధ్యతలు చేపట్టారు.


