వెనెజువెలాలో భయానక దృశ్యాలు.. 164కు చేరిన మృతులు | Venezuela Earthquake 2026 LIVE Updates Telugu News | Sakshi
Sakshi News home page

వెనెజువెలాలో భయానక దృశ్యాలు.. 164కు చేరిన మృతులు

Jun 25 2026 12:01 PM | Updated on Jun 25 2026 5:28 PM

Venezuela Earthquake 2026 LIVE Updates Telugu News

వెనెజువెలాను భారీ భూకంపాలు అతలాకుతలం చేశాయి. రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాలు శిథిలాల కుప్పలుగా మారాయి. భవనాలు కూలిపోవడం, రోడ్లకు పగుళ్లు ఏర్పడటం, దుమ్ము మేఘాలతో నగరాలు కమ్ముకుపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. శిథిలాల మధ్య చిక్కుకున్నవారి కోసం సహాయక బృందాలు నిర్విరామంగా గాలింపు చర్యలు చేపట్టారు. సునామీ హెచ్చరికలు కొనసాగుతున్న వేళ.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించారు.

Earthquake in Caracas Aad Venezuela HD Photos6

 

వెనెజువెలా భూకంపంలో పెరిగిన మృతుల సంఖ్య

  • ఇప్పటివరకూ 164 మంది మృతదేహాలు వెలికితీత.. 974 మందికి తీవ్ర గాయాలు
  • భూకంప ధాటికి కుప్పకూలిన భవనాలు
  • శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నట్లు సమాచారం

యుగాంతం వచ్చేసిందా?.. వెనెజువెలాలో భయానక దృశ్యాలు

  •  భారీ భూకంపాలతో వెనెజువెలా రాజధాని కారకాస్‌ సహా పలు ప్రాంతాలు అతలాకుతలం.
  •  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లో భవనాలు ఊగిపోతూ కూలిపోయిన దృశ్యాలు.
  • ప్రకంపనలు మొదలవగానే ప్రజలు ఇళ్ల నుంచి, కార్యాలయాల నుంచి రోడ్డుపైకి పరుగులు.
  •  విమానాశ్రయంలో టెర్మినల్‌ మొత్తం కంపిపోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
  •  సీసీటీవీ ఫుటేజీల్లో కొన్ని సెకన్ల వ్యవధిలోనే వీధులు వణికిపోయిన దృశ్యాలు రికార్డు.
  •  రహదారుల్లో పగుళ్లు, వాహనాలు ఊగిపోవడం, భవనాల గోడలు కూలిపోవడం చోటుచేసుకున్నాయి.
  •  భూమి కంపించడంతో జంతువులు కూడా భయంతో పరుగులు తీసిన దృశ్యాలు వీడియోల్లో కనిపించాయి.
  •  శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం రెస్క్యూ బృందాలు రాత్రంతా గాలింపు చర్యలు కొనసాగించాయి.
  •  పలు ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌, మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు.
  •  యుగాంతాన్ని తలపించే ఈ దృశ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి.
     

 

ముందే గుర్తించిన గూగుల్‌!

 

  • వెనెజువెలాలో ప్రకంపనలకు కొన్నిక్షణాల ముందు మోగిన ఆండ్రాయిడ్‌ ఫోన్లు
  • గూగుల్‌ నుంచి భూకంపం రాబోతోందని అలర్ట్‌
  • అప్రమత్తమై పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్న పలువురు!
  • భూ ప్రకంపనలను ముందుగానే గుర్తించే ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలోని యాక్సిలెరోమీటర్‌ సెన్సార్లు
  • ప్రకంపనలు నమోదైతే ఫోన్లు Google Android Earthquake Alerts Systemకు సమాచారం
  • ఒకే ప్రాంతంలోని అనేక ఫోన్ల నుంచి వచ్చిన డేటాను విశ్లేషించి భూకంపాన్ని నిర్దారించుకునే గూగుల్‌
  • భూకంపంలో ముందుగా వచ్చే P-Wavesను ఫోన్లు గుర్తించడంతో.. విధ్వంసకర S-Waves రాకముందే హెచ్చరికలు పంపే అవకాశం
  • ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఈ భూకంప హెచ్చరిక వ్యవస్థలో భాగం
  • భారత్‌లోనూ 2023 నుంచి ఈ సేవ అందుబాటులోకి 
  • Android 5, ఆ పైబడిన ఫోన్లలో ఈ అలర్ట్‌లు పనిచేస్తాయి.

శిథిలాల దిబ్బగా నగరాలు

  • భారీ భూకంపంతో నాశనమైన రాజధాని కారకస్‌!
  • ఘోరంగా దెబ్బ తిన్న తీర ప్రాంతం లా గ్వైరా
  • పలు చోట్ల కుప్పకూలిన బహుళ అంతస్తుల భవనాలు 
  • రోడ్లు, హైవేల్లో భారీ పగుళ్లు
  • మొత్తం.. దుమ్ము, శిథిలాలతో నిండిపోయిన నగరాలు

Earthquake in Caracas Aad Venezuela HD Photos8

క్షతగాత్రుల హాహాకారాలు

  • వెనెజువెలాలో కొనసాగుతున్న సహాయక చర్యలు
  • శిథిలాల కింద చిక్కుకుని పలువురి ఆర్తనాదాలు
  • తమ వారి జాడ కోసం వెతుక్కుంటున్న వేల మంది!
  • ఇప్పటివరకు అధికారికంగా.. 32 మంది మృతి, 700 మంది గాయాలు
  • అమెరికా జియాలజికల్ సర్వే అంచనా ప్రకారం మరణాలు.. 10,000 నుంచి 1 లక్ష వరకు! 

Earthquake in Caracas Aad Venezuela HD Photos10

హరర్ మూవీలా.. 

  • భారీ భూకంపంతో వెనెజువెలాకు కాళరాత్రి 
  • భవనాలు కూలిపోతుండటంతో రోడ్లపైకి పరుగులు తీసిన ప్రజలు
  • రాత్రంతా రోడ్ల మీదే గడిపిన పౌరులు
  • పొగ, దుమ్ము వల్ల కనిపించని పరిస్థితి
  • కుటుంబ సభ్యులను శిథిలాల మధ్య వెతుక్కుంటున్న దృశ్యాలు
  • కాళ్లు చేతులు తెగి పడి సాయం కోసం ఆర్తనాదాలు పెడుతున్న ప్రజలు!
  • హరర్‌ మూవీని తలపిస్తున్న రాజధాని కాకారస్‌
     

నాన్‌ స్టాప్‌గా సహాయక చర్యలు

  • వెనెజువెలాలో ఎమర్జెన్సీ ప్రకటన
  • భూకంపం తర్వాత కొనసాగుతున్న సహాయక చర్యలు
  • శిథిలాల మధ్య చిక్కుకున్న రక్షించే ప్రయత్నం
  • ఎక్స్‌కవేటర్లు, రెస్క్యూ బృందాలు మోహరింపు
  • విరామం లేకుండా కొనసాగుతున్న సహాయక చర్యలు
  • రెస్క్యూ బృందాలకు.. స్థానికులు, వలంటీర్లు సహాయం 
  • ఒక టీనేజ్ అమ్మాయిని సజీవంగా బయటకు తీయడంతో.. చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసిన ప్రజలు

Earthquake in Caracas Aad Venezuela HD Photos11

కారకాస్‌లో హృదయ విదారక దృశ్యాలు

  • ధనిక ప్రాంతమైన అల్టామిరాలో పెద్ద ఎత్తున నష్టం
  • కూలిన అపార్ట్‌మెంట్ల ముందు కుటుంబ సభ్యుల వేచి చూడటం
  • రెసిడెన్సియాస్ ఒబెలిస్కో భవనంలో చిక్కుకున్నవారి కోసం ఆందోళన

మౌలిక సదుపాయాలపై తీవ్ర ప్రభావం

  • భూకంపం ధాటికి తీర నగరం లా గ్వైరాలో భారీ విధ్వంసం
  • దేశ ప్రధాన విమానాశ్రయం సిమోన్ బొలివార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ మూసివేత
  • సముద్రతీర హోటళ్లు, భవనాలు కూడా ధ్వంసం
  • రాత్రంత అంధకారంలోనే ఉండిపోయిన పలు ప్రాంతాలు
  • కమ్యూనికేషన్‌ సైతం కట్‌

Earthquake in Caracas Aad Venezuela HD Photos13

ప్రభుత్వ అత్యవసర చర్యలు

  • దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షురాలు
  • వేల మంది మరణించి ఉంటారనే ఆందోళన
  • అన్ని ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయని ప్రకటన

రెండు భారీ భూకంపాలు ఒక్కసారిగా..

  • వెనెజువెలాను కుదిపేసిన రెండు భారీ భూకంపాలు
  • 7.2, 7.5 తీవ్రతతో.. వరుసగా 39 సెకన్లలో ప్రకంపనలు
  • స్థానిక సమయం ప్రకారం సాయంత్రం 6 గంటల తర్వాత ఘటన
  • 20కుపైగా ఆఫ్టర్‌షాక్స్ (4.9–6.4 తీవ్రత) నమోదు
  • శతాబ్ధం తర్వాత వచ్చిన అతిపెద్ద భూకంపాల్లో ఒకటిగా పేర్కొంటున్న శాస్త్రవేత్తలు

👉 :​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement