ఇన్‌ఫ్లుయెన్సర్లకు గడ్డుకాలం? | Draft California bill sets penalties for influencers who keep mum on being paid for political ads | Sakshi
Sakshi News home page

ఇన్‌ఫ్లుయెన్సర్లకు గడ్డుకాలం?

Aug 10 2026 6:09 AM | Updated on Aug 10 2026 6:09 AM

Draft California bill sets penalties for influencers who keep mum on being paid for political ads

పెయిడ్‌ ప్రమోషన్‌ అని చెప్పితీరాలి 

లేదంటే ఐదువేల డాలర్ల జరిమానా 

కొత్త బిల్లు ప్రవేశపెట్టిన మార్క్‌ బెర్మన్‌

శాక్రమెంటో (అమెరికా): కాలిఫోర్నియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఇక గడ్డుకాలమే. ఎందుకంటే.. ఇకపై డబ్బు తీసుకుని రాజకీయ ప్రచారం చేస్తే.. ఆ విషయాన్ని పోస్టుల్లోనే స్పష్టం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయని వారిపై జరిమానా విధించేందుకు కాలిఫోర్నియా రాష్ట్రం పరిశీలిస్తోంది. కాలిఫోర్నియాతోపాటు టెక్సస్‌ రాష్ట్రం కూడా ఈ విషయమై ఇప్పటికే తమ విధానాలను స్పష్టం చేశాయి. డబ్బు తీసుకుని ప్రచారం చేస్తూంటే ఆ విషయాన్ని తమ పోస్టుల్లో స్పష్టంగా చెప్పాలని కంటెంట్‌ క్రియేటర్లకు స్పష్టం చేశాయి. ఇలా చేయని వారిపై జరిమానా విధించేందుకు కాలిఫోర్నియా ఇప్పుడు సిద్ధమవుతోంది.  

ఇన్‌ఫ్లుయెన్సర్ల సాయంతో ఓట్లు సంపాదించుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నించడం కొత్తేమీ కాదు. పార్టీలు చాలాకాలంగా ప్రముఖ నటులు, ఇన్‌ఫ్లుయెన్సర్లతో కలిసి పనిచేస్తున్నాయి. అయితే ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్‌లో కొంత మార్పు వచి్చంది. పెద్ద సంఖ్యలో ఫాలోయర్లు ఉన్న వారితోపాటు లక్ష కంటే తక్కువ మంది ఫాలోయర్లు ఉన్న వారినీ పార్టీలు వాడుకోవడం మొదలైంది. తద్వారా పార్టీలకు నిర్దిష్టంగా కొంతమందిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేసే అవకాశం దొరుకుతోంది. దీంతో రాజకీయ ప్రకటనలకు సంబంధించిన పారదర్శకత నిబంధనలు కంటెంట్‌ క్రియేటర్లకు కూడా వర్తింప చేయాలన్న చర్చ మొదలైంది. 2028 నాటి అధ్యక్ష ఎన్నికల్లోనే కాకుండా.. త్వరలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లోనూ కంటెంట్‌ క్రియేటర్లు కీలకపాత్ర పోషిస్తారని అంచనా.  

కేంద్ర స్థాయిలో నిబంధనల లేమి 
కంటెంట్‌ క్రియేటర్లు తాము డబ్బు తీసుకున్నామని చెప్పే విషయమై కాలిఫోర్నియా సెనేటర్‌ ఆడమ్‌ షిఫ్‌ గత నెలలో కేంద్ర స్థాయిలో ఒక బిల్లు ప్రవేశపెట్టినా దానిపై ఇంకా ఓటింగ్‌ జరగాల్సి ఉంది. ఇదే సమయంలో ఫెడరల్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ఇలాంటి నిబంధనను రూపొందించాలని కొన్ని సంస్థలు డిమాండ్‌ చేస్తున్నాయి. కాలిఫోర్నియాలోనూ ఇలాంటి చట్టం ఆమోదించి మూడేళ్లవు తున్నా అమలు మాత్రం చాలా కష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో డెమోక్రాట్ల సభ్యుడు మార్క్‌ బెర్మన్‌ కొత్త బిల్లును ప్రవేశపెట్టారు.

తనకు చెల్లించిన పారితోషికాన్ని కంటెంట్‌ క్రియేటర్‌ వెల్లడించకపోతే, వారితోపాటు రాజకీయ పార్టీ ప్రచార కమిటీకి కూడా జరిమానా విధించే అధికారాన్ని రాష్ట్ర ఫెయిర్‌ పాలిటికల్‌ ప్రాక్టీసెస్‌ కమిషన్‌కు దక్కేందుకు ఈ బిల్లు సాయపడుతుంది. ఫలితంగా కమిషన్‌ కోర్టు ప్రక్రియను పక్కనపెట్టి నేరుగా జరిమానా విధించవచ్చు. జరిమానా మొత్తం ఒక్కో ఉల్లంఘనకు ఐదువేల డాలర్ల వరకూ ఉండవచ్చు. అయితే ఈ కొత్త బిల్లు చిన్న క్రియేటర్లపై భారం మోపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జరిమానా పడితే, న్యాయవాదులను నియమించుకోవడం భారమవుతుందని ఒక క్రియేటర్‌ తెలిపారు.  

పారదర్శకతపై ఆందోళన
డబ్బు తీసుకున్నట్లు వెల్లడించకుండా ఓటర్లను ప్రభావితం చేసే కంటెంట్‌ క్రియేటర్లను ఇటీవలి కాలంలో తరచూ గుర్తిస్తూండటంతో ఎన్నికల్లో పారదర్శకత అంశంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2022లో సె నెట్‌ అభ్యర్థి జాన్‌ ఫెట్టర్‌మన్‌ తరఫున ప్రచా రం నిర్వహించిన వారు ‘జెర్సీ షోర్‌’కు చెందిన నికోల్‌ ‘‘స్నూకీ’’పొలిజీకి డబ్బు చెల్లించి ఓ వీడియో చేయించింది. అందులో రిప బ్లికన్‌ పార్టీ ప్రత్యర్థి న్యూజెర్సీని విడిచి వెళ్లడంపై వ్యంగ్య వ్యాఖ్యలు ఉన్నాయి.

2023 లో లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై టెక్సాస్‌ అటార్నీ జనరల్‌ కెన్‌ పాక్స్‌టన్‌ను అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు కూడా కంటెంట్‌ క్రియేటర్లకు డబ్బులిచ్చి అతడికి మద్దతుగా మాట్లాడించారని ఆ విషయాన్ని బయటపెట్టలేదని తెలిసింది. డెమోక్రాట్ల నేత టామ్‌ స్టేయర్‌ కూడా ఎన్నికల్లో గెలుపు కోసం కంటెంట్‌ క్రియేటర్లతో పనిచేయించారని, డబ్బు ఇచి్చన విషయాన్ని మా త్రం వెల్లడించలేదని విమర్శలున్నాయి. ఈ అంశంపై ప్రస్తుతం దర్యాప్తు సాగుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement