రష్యా, ఉక్రెయిన్‌ల దాడుల్లో ఏడుగురు మృతి | Russia says Ukrainian drone attack: 7 dead and many injured | Sakshi
Sakshi News home page

రష్యా, ఉక్రెయిన్‌ల దాడుల్లో ఏడుగురు మృతి

Aug 10 2026 5:20 AM | Updated on Aug 10 2026 5:20 AM

Russia says Ukrainian drone attack: 7 dead and many injured

కీవ్‌: రష్యా, ఉకెయ్రిన్‌ల పరస్పర దాడుల్లో కనీసం ఏడుగురు చనిపోగా, పదులసంఖ్యలో క్షతగాత్రులయ్యారు. రష్యా సరిహద్దుల్లోని బెల్గొరోడ్‌పై ఉక్రెయిన్‌ చేపట్టిన డ్రోన్‌ దాడుల్లో నాలుగేళ్ల చిన్నారి సహా ఐదుగురు చనిపోగా, మరో 25 మంది వరకు గాయపడ్డారు. 

రష్యా క్షిపణి దాడుల్లో ఉక్రెయిన్‌లో ఖర్కీవ్‌లో ఇద్దరు చనిపోగా, 13 మంది గాయపడ్డారు. తీర నగరం ఒడెసాపై జరిగిన మరో దాడిలో 8 మంది గాయపడ్డారు. ఒడెసా చుట్టుపక్కల ప్రాంతాలపై రష్యా డజన్లకొద్దీ క్షిపణలను ప్రయోగించిందని స్థానిక యంత్రాంగం పేర్కొంది. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌ డ్రోన్‌ సరిహద్దుల్లోని తమ గ్రామంపై పడిందని మాల్దోవా తెలిపింది. ఘటనలో ఎవరికీ అపాయం వాటిల్లలేదని పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement