ప్రధాని మోదీకి అభిజీత్ దీప్కే సూచన
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులతో సంప్రదింపుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాను వినియోగించుకోవడంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకొని, దానికి బదులుగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారా లని సూచించారు.
నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా వ్యవహరించడానికే సరిగ్గా సరిపోతారని ఎద్దేవా చేశారు. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని, దేశాన్ని నడిపే బాధ్యతను మరొకరికి అప్పగించాలని అన్నారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనను విరమించినప్పటికీ నిరసనకారులపై వేధింపులు ఆగడం లేదని దీప్కే ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన నిరసన కారుల ఆగ్రహం చల్లారలేదని తేల్చిచెప్పారు. యువత ఆగ్రహాన్ని బీజేపీ ఎందుకు అర్థం చేసుకో లేకపోతోందని ప్రశ్నించారు.


