లీకేజీ ముఠాలను వదలం: మోదీ | No Mercy for Paper Leak Mafia, PM Narendra Modi Selfie Message | Sakshi
Sakshi News home page

లీకేజీ ముఠాలను వదలం: మోదీ

Jul 31 2026 5:19 AM | Updated on Jul 31 2026 5:19 AM

No Mercy for Paper Leak Mafia, PM Narendra Modi Selfie Message

ప్రధాని మరో సెల్ఫీ వీడియో

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోల పరంపర కొనసాగుతోంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లో ‘ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణ బిల్లు’ ఆమోదం పొందిన వేళ ప్రధాని మోదీ గురువారం రాత్రి ఇన్‌స్టా గ్రామ్‌ ఖాతాలో సెల్ఫీ వీడియో ఒకటి విడుదలచేశారు. ‘‘అత్యంత పటిష్టమైన పరీక్ష విధానాన్ని తీసుకొచ్చేందుకు అనుక్షణం శ్రమిస్తున్నాం. 

పేపర్‌ లీకేజీలు కోట్లాది మంది పరీక్షార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరంగా పరిణమించాయి.  కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పేపర్‌ లీకేజీ గ్యాంగ్‌లను, లీకేజీ మాఫియాను వదిలేది లేదు. నేను మాట ఇచ్చినట్లే శక్తివంతమైన పేపర్ల లీకేజీ నివారణ బిల్లును రూపొందించాం. అది ఇప్పుడు పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆమోదం పొందడం సంతోషకరం. పేపర్ల లీకేజీలపై మా పోరాటం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది’’ అని మోదీ హామీ ఇచ్చారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement