న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026’(యాంటీ పేపర్ లీక్ బిల్లు) కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలపగా, తాజాగా రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర లభించినట్లయ్యింది.
ఇటీవల దేశంలో ‘నీట్’ (NEET) వంటి ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో, విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు
ప్రశ్నపత్రాల లీకేజీలు, మోసపూరిత చర్యలకు పాల్పడే దోషులకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.రూ. 10 కోట్ల వరకు జరిమానా: వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే అక్రమార్కులకు రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు.
పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించి, మూడు నెలల వ్యవధిలోనే పరిష్కరించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది.


