breaking news
Anti-Paper Leak Bill 2026
-
యాంటీ పేపర్ లీక్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం
-
లీకేజీ ముఠాలను వదలం: మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ సెల్ఫీ వీడియోల పరంపర కొనసాగుతోంది. పార్లమెంట్ ఉభయ సభల్లో ‘ప్రశ్నాపత్రాల లీకేజీల నివారణ బిల్లు’ ఆమోదం పొందిన వేళ ప్రధాని మోదీ గురువారం రాత్రి ఇన్‌స్టా గ్రామ్ ఖాతాలో సెల్ఫీ వీడియో ఒకటి విడుదలచేశారు. ‘‘అత్యంత పటిష్టమైన పరీక్ష విధానాన్ని తీసుకొచ్చేందుకు అనుక్షణం శ్రమిస్తున్నాం. పేపర్ లీకేజీలు కోట్లాది మంది పరీక్షార్థుల భవిష్యత్తుకు ప్రమాదకరంగా పరిణమించాయి. కోట్లాదిమంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న పేపర్ లీకేజీ గ్యాంగ్‌లను, లీకేజీ మాఫియాను వదిలేది లేదు. నేను మాట ఇచ్చినట్లే శక్తివంతమైన పేపర్ల లీకేజీ నివారణ బిల్లును రూపొందించాం. అది ఇప్పుడు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందడం సంతోషకరం. పేపర్ల లీకేజీలపై మా పోరాటం భవిష్యత్తులోనూ కొనసాగుతుంది’’ అని మోదీ హామీ ఇచ్చారు. -
‘లీకేజీ’ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలను అరికట్టడానికి, దోషులకు కఠిన శిక్ష విధించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ రాజ్యసభలో ఆమోదం పొందింది. బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లును కేంద్ర సహాయం మంత్రి జితేంద్ర సింగ్ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిపై సభలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. బిల్లును వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు వాకౌట్ చేయగా, మూజువాణి ఓటుతో బిల్లుపై ఆమోదముద్ర వేశారు. ఉభయ సభల ఆమోదం పొందడంతో బిల్లు ఇక రాష్ట్రపతి వద్దకు వెళ్లనుంది. రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారనుంది. పరీక్షల్లో అక్రమాలు, ప్రశ్నపత్రాల లీకేజీలను సహించే ప్రసక్తే లేదని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ తేల్చిచెప్పారు. నిజాయతీగా కష్టపడి చదివే విద్యార్థులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు రాజ్యసభలో ప్రకటించారు. ఈ బిల్లు ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం–2024కు కొనసాగింపు అని ఆయన చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి దేశంలోనే మొట్టమొదటిగా 2024లో చట్టం తీసుకొచ్చినట్లు గుర్తుచేశారు. ప్రస్తుత సవరణ ఒక ముందడుగు అని అభివర్ణించారు. పరీక్షల వ్యవస్థలో మెరిట్, పారదర్శకత, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తూ విద్యార్థులు, యువత ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం, సమర్థవంతంగా మార్చే లక్ష్యంతో, ఇటీవలి అనుభవాలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సవరణలను తీసుకొచ్చినట్లు జితేంద్ర సింగ్ తెలియజేశారు. పరీక్షల్లో సంస్కరణలపై నిర్మాణాత్మక సూచనలను స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. యువతను శాంతింపజేయడానికే బిల్లు: ఖర్గే నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనకు దిగిన విద్యార్థులపై పోలీసుల దమనకాండకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షానే బాధ్యుడని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ప్రజలు ఏదో ఒకరోజు ఆయనకు బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు. పేపర్ లీక్ నిరోధక బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో ఖర్గే మాట్లాడారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పేపర్ లీక్‌పై వారిద్దరూ ఎందుకు నోరుమెదపడం లేదని నిలదీశారు. విద్యార్థులపై లాఠీచార్జి, బాష్పవాయువు ప్రయోగానికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు, విద్యార్థులను కొడుతున్న సాధారణ దుస్తుల్లోని వ్యక్తులు ఎవరు అనే ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం చెప్పలేకపోతే, రాజీనామా చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రశ్నపత్రాల లీకేజీని ఎలా అరికడతారో చెప్పకుండా కేవలం యువతను శాంతింపజేయడానికే ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. అధిక జరిమానాలు, కఠినమైన శిక్షలు, ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల వంటి చర్యలు ఎలాంటి మార్పు తీసుకురావని తేల్చిచెప్పారు. పరీక్షలను నిర్వహించే సంస్థలు, పరీక్షల విధానంలో సమగ్ర సంస్కరణలు చేపట్టకపోతే పేపర్ లీకేజీలు జరుగుతూనే ఉంటాయని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినందుకు యువతకు ఖర్గే అభినందనలు తెలియజేశారు. యువత పోరాటం, పార్లమెంట్లో ప్రతిపక్షాల నిరసనల కారణంగానే ప్రభుత్వం చివరికి తలవంచిందని అన్నారు. -
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలను, అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026’(యాంటీ పేపర్ లీక్ బిల్లు) కు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు ఇప్పటికే లోక్‌సభ ఆమోదం తెలపగా, తాజాగా రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఈ బిల్లుకు ఆమోద ముద్ర లభించినట్లయ్యింది. ఇటీవల దేశంలో ‘నీట్’ (NEET) వంటి ప్రధాన పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీల నేపథ్యంలో పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో, విద్యార్థుల్లో నమ్మకాన్ని పెంచేందుకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారుప్రశ్నపత్రాల లీకేజీలు, మోసపూరిత చర్యలకు పాల్పడే దోషులకు కనీసం 5 ఏళ్ల నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.రూ. 10 కోట్ల వరకు జరిమానా: వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే అక్రమార్కులకు రూ. 10 కోట్ల వరకు భారీ జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు. పేపర్ లీక్ కేసులను వేగంగా విచారించి, మూడు నెలల వ్యవధిలోనే పరిష్కరించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ బిల్లు ప్రతిపాదించింది. -
“ఏసీ గదుల నుంచి మిమ్మల్ని బయటకు ఈడ్చుకొస్తాం”
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విద్యార్థులు పెల్లెట్ దాడుల్లో గాయపడిన ఘటనపై ప్రతిపక్షం సిగ్గుపడుతోందని, కొందరు చూపు కోల్పోయారని ఆరోపిస్తూ, ప్రభుత్వం కూడా అదే భావనతో ఉందా అని మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు చేస్తూ.. ఏదో ఒక రోజు ప్రతిపక్షం “మిమ్మల్ని ఏసీ గదుల నుంచి బయటకు ఈడ్చుకొచ్చి” ప్రజల ముందుకు తీసుకొస్తుందని ఖర్గే అన్నారు. దీంతో రాజ్యసభలో దుమారం చెలరేగింది. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా... ఖర్గే పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమైన పదాలు వాడారని ఆరోపించారు. ప్రసంగించే సమయంలో భావోద్వేగాలకు లోనుకావద్దని ఆయన సూచించారు.ఆ తర్వాత మల్లికార్జున ఖర్గే మళ్లీ స్పందిస్తూ.. “మిమ్మల్ని ఏసీ గదుల నుంచి బయటకు ఈడ్చుకొస్తాం” అన్న తన వ్యాఖ్య విద్యార్థులు, మహిళలు, ప్రజల శక్తిని ఉద్దేశించిందేనని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నవారిని చివరకు వారి గదుల నుంచి బయటకు వచ్చేలా చేసేది ప్రజాశక్తేనని ఆయన అన్నారు.విద్యార్థుల నిరసనలు, పోలీసుల చర్యల అంశంపై మల్లికార్జున ఖర్గే ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బిహార్‌లో ఏకే-47లు ఎందుకు వినియోగించారని ఆయన ప్రశ్నించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌కు పార్లమెంట్ ప్రాంగణంలో “యుద్ధ వీరుడి” తరహాలో ఎలా స్వాగతం పలికుతారని కూడా ఆయన ప్రశ్నించారు.విద్యార్థుల నిరసనలను చల్లార్చేందుకే ప్రశ్నపత్ర లీకుల నిరోధక బిల్లును ప్రభుత్వం హడావుడిగా తీసుకొచ్చిందని ఖర్గే ఆరోపించారు. సవరణ బిల్లును ప్రతిపక్షం స్వాగతిస్తోందని మల్లికార్జున ఖర్గే అన్నారు. అయితే ప్రశ్నపత్ర లీకులను ఎలా అడ్డుకుంటారో ఇందులో స్పష్టంగా చెప్పలేదని, అందువల్ల ఇది అసంపూర్ణంగానే ఉందని పేర్కొన్నారు. లీకులను ఎదుర్కొనే వ్యూహాన్ని వివరించకుండా, శిక్షలకు సంబంధించిన సంఖ్యలను మాత్రమే ప్రభుత్వం మార్చిందని ఆయన ఆరోపించారు. ప్రశ్నపత్ర లీకుల నిరోధక బిల్లు రాజ్యసభలో చర్చకు వచ్చిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు చేశారు. “మీ నోరు కుట్టేశారా?” అంటూ ఆయన ప్రశ్నించారు. -
యాంటీ పేపర్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
సాక్షి,ఢిల్లీ: యాంటీ పేపర్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓట్లతో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాసమైంది. పరీక్షల నిర్వహణ, పలు సంస్కరణలు చేపడుతూ బిల్లు రూపకల్పన జరిగింది. బిల్లు ఆమోదం తర్వాత రేపటికి లోక్‌సభ వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్మెంట్ బిల్లు, 2026 (యాంటీ పేపర్ లీక్ బిల్లు) పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను ప్రతిపాదిస్తోంది. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వివాదాలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ఈ సవరణ బిల్లును కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కూడా పాసయ్యింది. పేపర్ లీకేజీలు, కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏళ్ల నుండి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే గరిష్ట జరిమానాను రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల వరకు పెంచారు.పేపర్ లీక్ చేసే వారికి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష,రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధిస్తారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సదరు నిందితులు లేదా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు తప్పు చేస్తే రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఆయా సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.పేపర్ లీక్ కేసులను వేగంగా తేల్చడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసు దర్యాప్తును 2 నెలల్లోగా (60 రోజులు) పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ దాఖలు చేసిన 3 నెలల లోపే కోర్టులు తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగే ఇటువంటి పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించుతుంది. ఈ చట్టం దేశంలోని అన్ని ప్రధాన కేంద్ర నియామక, ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది. ఈ కొత్త బిల్లులో దాదాపు 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా గుర్తించారు.క్వశ్చన్ పేపర్లు లేదా ఆన్సర్ కీ లీక్ చేయడం.ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం.నకిలీ అడ్మిట్ కార్డులు సృష్టించడం లేదా ఫేక్ వెబ్సైట్లు నడపడం.ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం వంటి అంశాలునన్నాయి. -
లోక్‌సభలో పేపర్‌లీకేజీల బిల్లు
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ వంటి కీలక పోటీపరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలతో ఉద్యమించిన విద్యార్థిలోకాన్ని శాంతింపజేసేందుకు, లీకేజీ నేరగాళ్ల వెన్నులో వణుకుపుట్టేలా అత్యంత కఠిన శిక్షలు, అత్యధిక జరిమానాలతో నూతన చట్టానికి తుదిరూపునిచ్చి సంబంధిత బిల్లును మోదీ సర్కార్ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పరీక్షలు(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లు,2026ను ప్రధానికార్యాలయానికి సహాయ మంత్రి అయిన జితేంద్ర సింగ్ సోమవారం లోక్‌సభలో విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టారు. బిల్లు ప్రతిపాదించేముందు నిబంధనల ప్రకారం సీనియర్ విపక్ష సభ్యులైన సౌగతా రాయ్(టీఎంసీ), మనీశ్ తివారీ(కాంగ్రెస్), ఎన్కే ప్రేమచంద్రన్(ఆర్ఎస్పీ)లను బిల్లుపై మాట్లాడాల్సిందిగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కోరారు. దానికి వాళ్లు ముందుకురాకపోవడంతో ఇక బిల్లును ప్రవేశపెట్టాలని సహాయమంత్రి జితేంద్రను స్పీకర్ కోరడంతో ఆయన బిల్లును సభముందుకు తెచ్చారు. వెంటనే స్పీకర్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ పరీక్షలను పటిష్టంగా నిర్వహించేందుకు తెస్తున్న బిల్లు ఇది. మీరు నినాదాలు ఆపేసి బిల్లుపై చర్చలో పాల్గొంటే బాగుంటుంది. చర్చ వేళ మీరు ఇచ్చే సూచనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోనుంది’’ అని స్పీకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం, దాని ఏజెన్సీలు నిర్వహించే పబ్లిక్ ఎగ్జామ్‌లో అవకతవకలకు పాల్పడే వాళ్లను ప్రత్యేక చట్టాల కింద శిక్షించేందుకు మోదీ సర్కార్ 2024లో పబ్లిక్ ఎగ్జామ్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టం తెచ్చింది. యూపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వేస్, బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ పరీక్షలు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇతర ప్రభుత్వ సంస్థలు చేపట్టే పరీక్షల పేపర్లను లీక్‌చేసే వాళ్లను, ముఠాలను ఈ చట్టనిబంధనల కింద శిక్షిస్తున్నారు. తాజాగా నీట్ లీకేజీ ఉదంతం, విద్యామంత్రిగా ధర్మేంద్ర రాజీనామా డిమాండ్లు, విద్యార్థి నిరసనోద్యమంలో మోదీ సర్కార్ చట్టసవరణ చేస్తూ కొత్త బిల్లును తేవడం తెల్సిందే.బిల్లులో ఏముంది? → అక్రమ పద్దతులను అనుసరిస్తూ పోటీపరీక్షల ప్రశ్నపత్రాలను వ్యక్తిగతంగా లీక్‌చేసిన నేరగాళ్లకు కనిష్టంగా ఐదేళ్లు, గరిష్టగా పదేళ్ల శిక్ష పడేలా బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచారు. ఈ నేరగాళ్లకు రూ.50 లక్షల వరకు జరిమానా విధిస్తారు. → వ్యక్తిగతంగా కాకుండా ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత నేరం చేసిన వాళ్లకు గరిష్టంగా ఏడేళ్ల జైలుశిక్ష విధించేలా బిల్లులో ప్రతిపాదనలు చేర్చారు. వీళ్లకు గరిష్టంగా రూ.10 కోట్ల జరిమానా విధిస్తారు. → 2024లో అమల్లోకి వచ్చిన పాత చట్టం ప్రకారం పేపర్ లీకేజీ వ్యక్తిగతం నేరగాళ్లకు మూడు నుంచి ఐదేళ్ల జైలుశిక్ష విధించేవారు. వ్యవస్థీకృత నేరగాళ్లకు గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.1 కోటి జరిమానా విధిస్తారు. వీటిని పెంచుతూ సవరణ బిల్లును తెచ్చారు.→ లీకేజీ సంబంధిత కేసుల సత్వర విచారణ కోసం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏదైనా సెషన్స్ కోర్టును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుగా ఏర్పాటుచేయాలని కొత్త బిల్లులో ప్రతిపాదించారు.→ కేసును రోజువారీగా కోర్టులో విచారిస్తూ, ఆ కేసులో నేరాభియోగం(చార్జ్‌షీట్) దాఖలైన మూడు నెలల్లోపు కేసు విచారణ ముగించాలని బిల్లులో ప్రతిపాదించారు. కేసు తీవ్రత దృష్టా అవసరమైతే ప్రత్యేక టాస్క్ఫోర్స్నుఏర్పాటుచేయొచ్చు.→ పరీక్షల నిర్వహణ కోసం అవసరమైతే ఇతర విభాగాల సాయం తీసుకోవచ్చు.→ పరీక్ష కేంద్రాలు, పరీక్షార్థుల తనిఖీ, బయోమెట్రిక్ నమోదు, భద్రతా ప్రమాణాలు, సీట్ల కేటాయింపు, ప్రశ్నపత్రాల కూర్పు, పేపర్ల లోడింగ్, ఇని్వజిలేషన్లకు సంబంధించి కొత్త నిబంధనలు,ప్రమాణాల రూపకల్పనకు సంబంధించి బిల్లులో ప్రతిపాదనలుచేశారు→ పేపర్ లీక్ చేయడం, ఓఎంఆర్ షీట్ ట్యాంపరింగ్, నకిలీ వెబ్సైట్ల రూపకల్పన, నకిలీ ఐడీ కార్డులను జారీచేయడం ఇలా 15 అనైతిక చర్యలను నేరాలుగా పేర్కొన్నారు. నేడు చర్చ! వరసబెట్టి వాయిదాలపర్వంతో ముగుస్తున్న లోక్‌సభ సెషన్లో తొలిసారిగా మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్ట సవరణ బిల్లు–2026 ను మంగళవారం లోక్‌సభో చర్చించనున్నారు. చర్చ కోసం అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లను స్పీకర్ బిర్లా ఒప్పించడంతో చర్చ సాధ్యంకానుందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. సభలో బిల్లుపై ఏడు గంటలపాటు చర్చించే వీలుంది. -
పేపర్ లీకులకు చెక్.. లోక్ సభలో కీలక బిల్లు
-
పార్లమెంట్ ఉభయ సభల్లో గందరగోళం.. రేపటికి వాయిదా
పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు వచ్చింది. విపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్‌సభ, రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. పరీక్షల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు తీసుకొస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. నిరసనల సమయంలో జరిగిన పరిణామాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.పార్లమెంట్ సమావేశాలు.. 6వ రోజు అప్డేట్స్రాజ్యసభ రేపటికి వాయిదారాజ్యసభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో మళ్లీ గంగదగోళంరేపటికి వాయిదా వేసిన డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్లోక్సభ రేపటికి వాయిదాలోక్సభ సమావేశాలు తిరిగి ప్రారంభంసభలో గందరగోళం.. రేపటికి వాయిదాకాంగ్రెస్ సహా విపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని సభా కార్యక్రమాలుయాంటీ పేపర్ లీక్ బిల్లుపై జరగని చర్చవాయిదాల పర్వంలోక్సభ సాయంత్రం 5 గంటల వరకు వాయిదా3 గంటల వరకు వాయిదా పడి మళ్లీ ప్రారంభమైన రాజ్యసభఆ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళనరాజ్యసభ మళ్లీ సాయంత్రం 5.15 గంటల వరకు వాయిదాఓం బిర్లా కీలక ప్రకటనలోక్సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లువిపక్షాల నిరసనల మధ్యే ప్రవేశపెట్టిన కేంద్రంచర్చ ముందుకు సాగకపోవడంతో వాయిదామధ్యాహ్నం 2గం. తిరిగి ప్రారంభం కానున్న లోక్సభలోక్సభ స్పీకర్ ఓం బిర్లా కీలక ప్రకటనబిల్లుపై ఎంపీల సూచనలు కోరిన స్పీకర్.మధ్యాహ్నం 1 గంట వరకు సవరణలకు అవకాశం.చర్చకు తగిన సమయం ఇస్తామని హామీ.పేపర్ లీక్‌కు భారీ శిక్షలుయాంటీ పేపర్ లీక్ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్‌లో వ్యక్తులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ప్రతిపాదన.జరిమానా రూ.50 లక్షల నుంచి రూ.10 కోట్ల వరకు ఉండే అవకాశం.విద్యార్థుల లాఠీఛార్జిపై రగడపోలీసుల చర్యలపై హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వాలని పవన్ ఖేరా డిమాండ్.నిరసనలను అణచివేయడం సరికాదని వ్యాఖ్య.సుప్రీంకోర్టు వ్యాఖ్యలను స్వాగతించిన కాంగ్రెస్.సమగ్ర కథనం: లాఠీచార్జ్ ఎలా చేస్తారు?.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుపేపర్ లీక్ బిల్లుకు కేంద్రం ప్రాధాన్యంలోక్సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుస్పందించిన పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరెన్ రిజిజుబిల్లు ఆమోదమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటనవిద్యార్థుల భవిష్యత్ రక్షణే ప్రధాన ఉద్దేశమని వెల్లడి.పేపర్ లీక్‌లకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం.విపక్షాలు ఇతర అంశాలతో దృష్టి మళ్లించొద్దని సూచన.పరీక్షల వ్యవస్థపై నమ్మకం పెంచడమే లక్ష్యమని వ్యాఖ్య.లోక్‌సభ సైతం వాయిదామధ్యాహ్నానికి లోక్‌సభ వాయిదావిపక్షాల నిరసనల నడుమే.. యాంటీ పేపర్ లీక్ బిల్లు పెట్టిన కేంద్రంవిపక్షాల ఆందోళనలతో ముందుకు సాగని చర్చలోక్‌సభ మధ్యాహ్నం 2గం. కు వాయిదారాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదావాయిదా తర్వాత కూడా మారని సీన్పెద్దల సభలో విపక్షాల నిరసన గళంప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలంటూ విపక్షాల డిమాండ్మధ్యాహ్నం 2గం. దాకా సభ వాయిదా వేసిన చైర్మన్వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన ఉభయ సభలులోక్సభలో కొనసాగుతున్న విపక్షాల ఆందోళనవిపక్షాల నిరసనల నడుమే లోక్‌సభ ముందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి జితేంద్ర జింగ్నీట్ నిరసనలు.. కేంద్రంపై పప్పు యాదవ్ ఫైర్ నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన.. ప్రభుత్వ చర్యలు తీవ్రంగా తప్పుబట్టిన స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ఉన్న విద్యార్థులను నేరస్తుల్లా చూస్తున్నారా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.“మన పిల్లలు ఉగ్రవాదులా? మన కూతురు నేరస్తురాలా? హక్కుల కోసం గొంతెత్తడం తప్పా?” అని పప్పు యాదవ్ వ్యాఖ్యానించారు.బిహార్‌లో దాదాపు 800 మంది విద్యార్థులను జైలుకు పంపించారని ఆరోపించారు.విద్యార్థుల ఆందోళనలపై ప్రభుత్వ వైఖరితో దేశంలో భయానక వాతావరణం నెలకొన్నదని ఆయన విమర్శించారు.ఖర్గే తీవ్ర వ్యాఖ్యలునీట్ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అత్యంత అరుదైన ఘటన (rarest of rare) గా అభివర్ణించారు.ఈ అంశంపై రాజ్యసభలో తక్షణ చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను ఖర్గే కోరారు.రూల్ 267 కింద చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నిబంధన ప్రకారం ఆ రోజు జాబితాలో ఉన్న ఇతర కార్యక్రమాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చ చేపట్టవచ్చు.భారత చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఖర్గే పేర్కొంటూ.. ఈ అంశంపై వెంటనే చర్చ అవసరమని అన్నారు.ఖర్గే డిమాండ్‌పై స్పందించిన రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్.. రూల్ 267 అమలుకు ఆ అంశం నిజంగా “rarest of rare” స్థాయిలో ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.నీట్ నిరసనల అంశం మాన్సూన్ సమావేశాల్లో రాజకీయంగా వేడెక్కే సూచనలు కనిపిస్తున్నాయి.మోదీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్పార్లమెంట్ ఉభయ సభలు వాయిదాపార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీల నిరసనప్రధాని మోదీపై లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్విద్యార్థుల్ని అణచివేయడంలో మోదీ ప్రభుత్వ తీరు ఎక్కడైనా ఒక్కటేఢిల్లీలో పెల్లెట్లు.. పట్నాలో ఏకే 47 ప్రయోగించారుప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే स्टूडेंट्स पर लाठीचार्ज और पैलेट गन के इस्तेमाल के विरोध में विपक्ष संसद परिसर में विरोध प्रदर्शन कर रहा है#Parliament pic.twitter.com/ihXExAzby2— Poonam Pandey (@pandeypoonam20) July 27, 2026 बिहार के सीवान में छात्र प्रदर्शन के दौरान AK-47 से फायरिंग करने वाले SIT जवान अभिषेक पटेल को सस्पेंड कर दिया गया है!सिवान में छात्र आंदोलन के दौरान पुलिस अधिकारी अभिषेक पटेल ने छात्रों की दिशा में AK-47 असॉल्ट राइफल से फायरिंग की थी! pic.twitter.com/ZjyQa8fGOK— Sadaf Afreen صدف (@s_afreen7) July 27, 2026జంతర్ మంతర్‌లో లాఠీఛార్జిపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలుఛలో సంసద్ ర్యాలీ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుశాంతియుతంగా నిరసన తెలిపే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు: సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ధర్మాసనం.విద్యార్థుల ఆందోళనలను సాకుగా చూపి పోలీసుల మితిమీరిన బలప్రయోగాన్ని సమర్థించుకోలేం ఆందోళనల్లో ఆకతాయిలు ప్రవేశించి పోలీసులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళనకరంశాంతియుత నిరసనలు, పోలీసు చర్యల నిర్వహణకు దేశవ్యాప్తంగా ఒకే రకమైన ఏకరూప మార్గదర్శకాలు అవసరం.నిరసనల్లో చొరబడే సామాజిక విద్రోహ శక్తులపై చర్యలకు అధికారులకు పూర్తి అధికారాలు ఉండాలినిరసనల్లో హింసకు తావులేకుండా నిరసనకారులు 'ఆత్మశిక్షణ' పాటించడం అత్యంత కీలకమన్న సుప్రీంకోర్టు.విద్యార్థుల నిరసనలు, పోలీసుల దాష్టీకంపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా.ఉభయ సభలు వాయిదా!ఆరో రోజు అదే తీరునీట్పై చర్చకు పట్టుబట్టిన విపక్షాలుప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ఉభయ సభలు మధ్యాహ్నం 12గం. దాకా వాయిదాప్రారంభమైన పార్లమెంట్ ఉభయ సభలులోక్సభలో విపక్ష ఎంపీల ఆందోళనపబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026 నేడే ప్రవేశపెట్టాలని కేంద్రం యోచనలాఠీ ఛార్జిపై చర్చకు పట్టుబడుతున్న విపక్షాలు పార్లమెంట్‌కు ధర్మేంద్ర ప్రధాన్.. పోటాపోటీ నినాదాలుపార్లమెంట్ ఆవరణలో ఎన్డీయే, ఇండియా కూటమి ఎంపీలు పోటాపోటీ నినాదాలుపార్లమెంట్కు వచ్చిన మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ధర్మేంద్ర ప్రధాన్‌కు హీరో వెల్ కమ్ చెప్పిన ఎన్డీయే ఎంపీలుకేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఇండియా కూటమి ఎంపీలునీట్ లీకేజీ వ్యవహారంలో.. యువత నిరసనతో రాజీనామా చేసిన ధర్మేంద్ర ప్రధాన్ఊహించినట్లే.. కాంగ్రెస్ వాయిదా తీర్మానంపార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానంవిద్యార్థులపై లాఠీఛార్జి, పెల్లెట్ గన్స్‌తో దాడిపై చర్చకు నోటీసుజంతర్ మంతర్ ధర్నా సమయంలో విద్యార్థులపై భద్రతా బలగాల బలప్రయోగంచలో సంసద్‌ను అడ్డకునే కమ్రంలో జులై 20న చోటు చేసుకున్న పరిణామాలుతీవ్రంగా ఖండించిన కాంగ్రెస్అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీవిద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలంటున్న విపక్ష నేతపరీక్షా బిల్లు.. చర్చలో పాల్గొనేది వీళ్లే!నేడు లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026పై చర్చబిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్బిల్లుపై 8–12 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగే అవకాశంబీజేపీ తరఫున బన్సూరి స్వరాజ్ చర్చ ప్రారంభంబీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రసంగంటీడీపీ తరఫున లావు శ్రీకృష్ణ దేవరాయలుజేడీయూ నుంచి లల్లన్ సింగ్ సభలో మాట్లాడనున్నారుశివసేన తరఫున డా. శ్రీకాంత్ షిండే ప్రసంగంఅప్నా దల్ (ఎస్) నుంచి అనుప్రియా పటేల్ చర్చలో పాల్గొననున్నారుఎల్జేపీ (రామ్ విలాస్) నుంచి అరుణ్ భారతికి అవకాశంఎన్సీపీ తరఫున సునీల్ తట్కరేతృణమూల్ కాంగ్రెస్ నుంచి సయోని ఘోష్ లేదా మితాలి బాగ్ పాల్గొనే అవకాశంపరీక్షల సంస్కరణలు, పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు బిల్లు ప్రధాన లక్ష్యంబిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించే అవకాశంపై ఆసక్తిసభ.. సజావుగా సాగేనా?సీజేపీ ఆందోళన విరమణతో పార్లమెంట్ సమావేశాలపై అందరి దృష్టిగతవారమంతా విపక్షాల నిరసనలతోనే గడిచిన పార్లమెంట్కేంద్ర మంత్రి రాజీనామా కోరుతూ సభను అడ్డుకున్న విపక్షాలునీట్ లీకేజీపై చర్చ.. ప్రత్యేక చట్టంకు సిద్ధమని ప్రకటించిన కేంద్రంఅయినా వెనక్కి తగ్గని విపక్షాలు, చివరకు..ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో శాంతించిన యువతఆందోళన విరమించిన కాక్రోచ్ జనతా పార్టీనేడు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లుకాసేపట్లో ఖర్గే కార్యాలయంలో విపక్షాల సమావేశంయువతపై జరిగిన దాడుల విషయంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూస్తున్న విపక్షాలుదాడికి బాధ్యత వహించాలని ఇప్పటికే అమిత్ షాకు లేఖ రాసిన రాహుల్ గాంధీ బిల్లులో కీలక ప్రతిపాదనలుపేపర్ లీక్ కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధించేలా నిబంధనలు.లీకేజీలకు పాల్పడిన వ్యక్తులకు గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష.నిందితులపై రూ.50 లక్షల వరకు జరిమానా.వ్యవస్థీకృతంగా పేపర్ లీక్‌లకు పాల్పడే ముఠాలకు రూ.10 కోట్ల వరకు జరిమానా.ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు.కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేసేలా నిబంధనలు.ఎన్డీయే వ్యూహం ఏంటి?పేపర్ లీక్‌లను అరికట్టేందుకు తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని చాటే ప్రయత్నం.యువ ఎంపీలను రంగంలోకి దించి బిల్లుపై బలమైన వాదనలు వినిపించాలనే వ్యూహం.బీజేపీ నుంచి బన్సూరీ స్వరాజ్, తేజస్వీ సూర్య చర్చకు నాయకత్వం వహించే అవకాశం.టీడీపీ, జేడీయూ, శివసేన, ఎన్సీపీ, ఇతర మిత్రపక్షాల ఎంపీలు కూడా చర్చలో పాల్గొననున్నారు.విపక్షాల వ్యూహం ఏమిటి?బిల్లుకు వ్యతిరేకంగా కాకుండా.. నీట్ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించాలని భావిస్తున్నాయి.పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యం, విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావాన్ని లేవనెత్తే అవకాశం.జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ మార్చ్ సమయంలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించనున్నారు.ఘటనలపై ప్రధాని క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసే అవకాశం.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత తొలి పార్లమెంట్ సమరంనీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు.ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషి విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు.కొత్త మంత్రి తొలిసారి విద్యాశాఖకు సంబంధించిన ప్రశ్నలను ఎదుర్కోనున్నారు.నీట్ వివాదంపై ప్రభుత్వ వైఖరి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.10 గంటల పాటు చర్చబిల్లుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చకు అవకాశం.దాదాపు 8 నుంచి 10 గంటల పాటు చర్చ జరగనున్నట్లు సమాచారం.అధికార, విపక్ష సభ్యులు తమ వాదనలు వినిపించనున్నారు.36 రోజుల ఉద్యమం తర్వాత..నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలు జరిగాయి.విద్యార్థుల నిరసనలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి.పార్లమెంట్ మార్చ్ సమయంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఉద్యమం ముగిసింది.


