సాక్షి,ఢిల్లీ: యాంటీ పేపర్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మూజువాణి ఓట్లతో యాంటీ పేపర్ లీక్ బిల్లు పాసమైంది. పరీక్షల నిర్వహణ, పలు సంస్కరణలు చేపడుతూ బిల్లు రూపకల్పన జరిగింది. బిల్లు ఆమోదం తర్వాత రేపటికి లోక్‌సభ వాయిదా పడింది.
కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టిన పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) అమెండ్‌మెంట్ బిల్లు, 2026 (యాంటీ పేపర్ లీక్ బిల్లు) పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు అత్యంత కఠినమైన నిబంధనలను ప్రతిపాదిస్తోంది. ఇటీవల జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వివాదాలు, దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో ఈ సవరణ బిల్లును కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు కూడా పాసయ్యింది.
పేపర్ లీకేజీలు, కాపీయింగ్, ఇతర అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు కనీసం 5 ఏళ్ల నుండి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అలాగే గరిష్ట జరిమానాను రూ.10 లక్షల నుండి రూ.50 లక్షల వరకు పెంచారు.పేపర్ లీక్ చేసే వారికి కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష,రూ.10 కోట్ల వరకు భారీ జరిమానా విధిస్తారు. అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే సదరు నిందితులు లేదా సంస్థల ఆస్తులను జప్తు చేసే అధికారం కూడా ఈ బిల్లు కల్పిస్తుంది.పరీక్షలు నిర్వహించే ఏజెన్సీలు తప్పు చేస్తే రూ.5 కోట్ల వరకు జరిమానా విధించడంతో పాటు, ఆయా సంస్థలను 8 ఏళ్ల పాటు బ్లాక్‌లిస్ట్‌లో పెడతారు.
పేపర్ లీక్ కేసులను వేగంగా తేల్చడానికి ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తారు. కేసు దర్యాప్తును 2 నెలల్లోగా (60 రోజులు) పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ దాఖలు చేసిన 3 నెలల లోపే కోర్టులు తీర్పును వెలువరించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా జరిగే ఇటువంటి పరీక్షల మోసాలను విచారించడానికి కేంద్రం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను రంగంలోకి దించుతుంది. ఈ చట్టం దేశంలోని అన్ని ప్రధాన కేంద్ర నియామక, ప్రవేశ పరీక్షలకు వర్తిస్తుంది.
ఈ కొత్త బిల్లులో దాదాపు 15 రకాల చట్టవిరుద్ధమైన చర్యలను నేరాలుగా గుర్తించారు.క్వశ్చన్ పేపర్లు లేదా ఆన్సర్ కీ లీక్ చేయడం.ఓఎంఆర్ షీట్లను ట్యాంపరింగ్ చేయడం.నకిలీ అడ్మిట్ కార్డులు సృష్టించడం లేదా ఫేక్ వెబ్‌సైట్లు నడపడం.ఒకరి బదులు మరొకరు పరీక్ష రాయడం కంప్యూటర్ నెట్‌వర్క్‌లను హ్యాక్ చేయడం వంటి అంశాలునన్నాయి.


