ఏసీపీ దామోదర్‌పై సీపీకి వల్లభనేని వంశీ లాయర్ ఫిర్యాదు | Advocate Devi Satya Sri Lodges Complaint Against Central ACP Damodar With CP Over Civil Disputes | Sakshi
Sakshi News home page

ఏసీపీ దామోదర్‌పై సీపీకి వల్లభనేని వంశీ లాయర్ ఫిర్యాదు

Sep 9 2026 3:01 PM | Updated on Sep 9 2026 4:21 PM

Advocate Devi Satya Sri Lodges Complaint Against Central ACP Damodar with CP

సాక్షి,విజయవాడ: సెంట్రల్ ఏసీపీ దామోదర్ తీరుపై వల్లభనేని వంశీ న్యాయవాది దేవి సత్యశ్రీ పోలీసు కమిషనర్ రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. సివిల్ వివాదాలతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఏసీపీ దామోదర్ అందులో జోక్యం చేసుకుంటున్నారని ఆమె సీపీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సంబంధం లేని సివిల్ వివాదాల విషయంలో తరచూ లొకేషన్‌కు రావాలని తమను బెదిరిస్తున్నారని న్యాయవాది దేవి సత్యశ్రీ ఆరోపించారు. ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పోలీస్ కమిషనర్‌ను కలిసిన ఆమె.. సివిల్ వివాదాల్లో అక్రమంగా జోక్యం చేసుకుంటున్న ఏసీపీ దామోదర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement