మన విద్యార్థుల శరీరంలోకి పెల్లెట్లను దించారు
సభలో అమిత్ షాపై రాహుల్ గాంధీ ఆగ్రహం
విద్య ఖరీదైన వ్యాపారంగా, విద్యా వ్యవస్థ క్రూరంగా మారిందని ఆందోళన
విద్యార్థుల అసలైన శత్రువు ఆర్‌ఎస్‌ఎస్ అని ధ్వజం
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనకు దిగిన విద్యార్థులను కఠినంగా అణచివేయాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, కాల్పులకు అమిత్ షా ఆమోదం తెలిపారని మండిపడ్డారు. పేపర్ లీక్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీజేపీని, ఆ పార్టీ మద్దతుదారులను పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఇందుకోసం మూడు వర్గాలను ప్రస్తావించారు.
విద్యార్థులు, తమకు అంతా తెలుసని భావిస్తూ దేవుడిలా నటించేవారు, ఆ రెండో వర్గమే సాక్షాత్తూ దేవుడని నమ్మే అంధభక్తులు ఉన్నారని విమర్శించారు. హోంమంత్రి అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఈ రోజు సభకు రాలేదని రాహుల్ అన్నారు. విద్యార్థులపై హింసకు పాల్పడే హక్కు అమిత్ షాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆయన మన విద్యార్థుల శరీరంలోకి పెల్లెట్లను(తుపాకీ గుళికలను) దించారని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలో విద్య నేడు ఖరీదైన వ్యాపారంగా, విద్యా వ్యవస్థ క్రూరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆర్‌ఎస్‌ఎస్ గుప్పిట్లోకి విద్యా వ్యవస్థ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్)పై కూడా రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తూ, విద్యార్థులకు ఏమి బోధించాలనే దానిని ఆ సంస్థే నిర్దేశిస్తోందని ఆరోపించారు. విద్యా వ్యవస్థ ఆత్మను ఆర్‌ఎస్‌ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడూ విద్యా శాఖను నడపలేదని, ఆ పని చేసింది ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమేనని ఆక్షేపించారు. విద్యార్థుల అసలైన శత్రువు ఆర్‌ఎస్‌ఎస్ అని విమర్శించారు.
అన్‌పార్లమెంటరీ పదం తొలగింపు
కొంతమంది విద్యార్థులతో జరిపిన సంభాషణ యువత విద్య, జ్ఞానాన్ని ఎలా చూస్తుందనే దానిపై తనకు ఒక అవగాహన కల్పించిందని రాహుల్ అన్నారు. విద్యారి్థగా ఉండడం అంటే ఏమిటని తాను ఒక విద్యారి్థని అడిగానని చెప్పారు. అంటే కళాశాల లేదా పాఠశాలలో చదువుకోవడం, పుస్తకాలు చదవడం అని అర్థమా? అని అడిగితే.. విశాలమైన దృక్పథం, విశాలమైన హృదయం కలిగినవారే విద్యార్థి అని ఆమె సమాధానమిచ్చారని పేర్కొన్నారు.
‘‘విద్యార్థి అంటే తనకు అన్నీ తెలియవని అంగీకరించే వ్యక్తి. తనకు తెలిసిన విషయాల స్థానంలో కొత్త జ్ఞానం వచ్చి చేరుతుంది. విశ్వం నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుందని అతనికి తెలుసు. జ్ఞానం కూడా నిరంతరం మారుతూ ఉంటుందని అతను అర్థం చేసుకుంటాడు. విద్యారి్థకి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం వినమ్రత అని ఆమె అన్నారు’’అని రాహుల్ వెల్లడించారు. తమకు అన్నీ తెలుసని భావించే మరో వర్గం గురించి కూడా ఆమె వివరించారని పేర్కొన్నారు.
‘‘తమకు అన్నీ తెలుసని కొందరు వ్యక్తులు దృఢంగా నమ్ముతారు. విశ్వం స్థిరమైనదని, జ్ఞానం తమ అంతరంగం నుంచే ఉద్భవిస్తుందని వారు భావిస్తారు. వారు అహంకారంతో ఉంటారు. వారు ఇతరుల మాట వినరు, సత్యాన్ని గౌరవించరు’’అని చెప్పారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఉపయోగించిన ఒక పదంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యారి్థని తనతో చెప్పిన మాటలనే సభలో ప్రస్తావించానని, సభలోని ఏ సభ్యుడినీ ఉద్దేశించి అనలేదని రాహుల్ బదులిచ్చారు. రాహుల్ ఉపయోగించిన అన్‌పార్లమెంటరీ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. దాంతో స్పీకర్ ఆ పదాన్ని తొలగించారు.
ఎన్డీయే సభ్యుల తీవ్ర అభ్యంతరం
సభలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల పట్ల అధికార ఎన్డీయే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. దాంతో సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. రాహుల్ అబద్ధాల పుట్ట అంటూ బీజేపీ ఎంపీలు ఎదురుదాడికి దిగారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, అందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం జోక్యం చేసుకున్నారు. ఇక్కడ చర్చ జరుగుతున్నది అమిత్ షాపై కాదని అన్నారు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని రాహుల్‌కు సూచించారు.


