breaking news
Paper leak
-
ఉద్యమం.. ఉద్రిక్తం
రాంచీ: దేశ రాజధానిలో నీట్ లీకేజీ ఉదంతంపై విద్యార్థుల సారథ్యంలో కొనసాగిన ఉద్యమం చివరకు పోలీసుల లాఠీచార్జ్‌తో ఉద్రిక్తంగా ముగియగా అదే బాష్పవాయుగోళాల ప్రయోగాలు, రక్తసిక్తమైన విద్యార్థులు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాల దృశ్యాలు సోమవారం జార్ఖండ్ రాజధానిలో పునరావృతమయ్యాయి. జార్ఖండ్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్(జేపీఎస్సీ), జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిటీ(జేఎస్ఎస్సీ)ల్లో సంస్కరణలు కోరుతూ, అక్రమాలమయమైన గత పోటీపరీక్షలను రద్దుచేయాలన్న డిమాండ్లతో ఉద్యమిస్తున్న ఆందోళనకారుల నిరసన ఉద్రిక్తంగా మారింది. సోమవారం పాత అసెంబ్లీ ప్రాంగణం నుంచి కొత్త అసెంబ్లీ భవనం దాకా ‘విధాన్ సభ మార్చ్’గా బయల్దేరిన వేలాది మంది విద్యార్థులు, పరీక్షార్థులు త్రివర్ణపతాకాలు, ప్రభుత్వ వ్యతిరేక నినాదాల ప్లకార్డులు చేతబూని న్యాయంకోరుతూ అసెంబ్లీకి సమీపప్రాంతానికి చేరుకోగానే పోలీసులు అడ్డుకున్నారు. జగన్నాథ్ ఆలయ రోడ్డులో చివరి అంచె బ్యారీకేడ్లను పరీక్షార్థులు బద్దలుకొట్టేందుకు యతి్నంచగా పోలీసులు జలఫిరంగులను ఎక్కుపెట్టారు. మెరుపులా దూసుకొస్తున్న నీటి ఉదృతికి తడుస్తున్నా విద్యార్థులు అలాగే ముందుకు కదలడంతో పోలీసులు బాష్పవాయుగోళాలను ప్రయోగించారు. అయినాసరే పరీక్షార్థుల నుంచి ప్రతిఘటన పెరగడంతో పోలీసులు లాఠీలకు పనిజెప్పారు. లాఠీచార్జ్‌లో చాలా మంది పరీక్షార్థులు గాయపడ్డారు. చిన్నా పెద్దా, అమ్మాయిలు అనే తేడా లేకుండా తలలు పగలగొడుతూ పోలీసులు ఇష్టమొచి్చనట్లు చితకబాదారని రక్తసిక్తమైన ఉద్యమకారుడు పీయూశ్ కుమార్ సోనీ చెప్పారు. బారీకేడ్లను విజయవంతంగా దాటిన కొందరు ఉద్యమకారులు అసెంబ్లీ గేటు నంబర్ 1 వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ‘‘శాంతియుతంగా నిరసన చేపడుతున్న మాపై లాఠీల వర్షం కురిపించారు. రక్తమోడుతున్నా ఉద్యమపంథాను వీడేదేలేదు. హేమంత్ సోరెన్ సారథ్యంలోని ప్రభుత్వం పరీక్షార్థుల డిమాండ్లను అస్సలు పట్టించుకోవట్లేదు. ఇన్నిసార్లు చర్చలు జరిపినా సానుకూలంగా స్పందించలేదు. అందుకే అసెంబ్లీ మార్చ్‌కు సిద్ధపడ్డాం’’అని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. ‘‘ఈరోజే సీఎం హేమంత్ పుట్టినరోజు. బర్త్‌డే రోజు బహుమానాలు ఇస్తారనుకుంటే లాఠీదెబ్బలే గిఫ్ట్‌గా ఇచ్చారు. మా డిమాండ్లు నెరవర్చేదాకా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు. లాఠీచార్జ్‌తో పోలీసులు శారీరక దెబ్బకొట్టగలరేమోగానీ మా ఆలోచనలను దెబ్బతీయలేరు’’అని ఉద్యమనేతలు ప్రకటించారు. బల ప్రయోగం.. బాష్పవాయుగోళాలు.. నిరాహారదీక్షలు, ఉద్యమం ఆరంభమై 16 రోజులు గడిచినా చర్చల్లో ఎలాంటి పురోగతి కని్పంచకపోవడం, డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పకోకపోవడంతో సోమవారం ఉదయం 10.30 గంటలకు ధుర్వాలోని ఓల్డ్ అసెంబ్లీ కాంప్లెక్స్ నుంచి వేలాదిగా ఉద్యమకారులు ర్యాలీగా బయల్దేరారు. 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తూ పది కేజీల బరువు తగ్గిన ఉద్యమనేత దేవేంద్రనాథ్ మహతో సైతం అంబులెన్స్‌లో అసెంబ్లీ వైపుగా కదిలారు. జేఎస్ఎస్సీ పరీక్షల్ని రద్దుచేయాలి. సీబీఐ విచారణ జరపాలి. జేఎస్ఎస్సీపై దాడులకు సీఐడీ ఎందుకు జంకుతోంది? అన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉద్యమకారులు ముందుకు కదిలారు. నాలుగు కిలోమీటర్ల ఈ మార్గంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఇండియన్ రిజర్వ్ బెటాలియన్, జిల్లా పోలీసులు, క్విక్ రెస్పాన్స్ టీమ్ బృందాలు మొహరించాయి. ఒక్కో బారీకేడ్‌ను దాటుకుంటూ పరీక్షార్థులు మందుకొచ్చేకొద్దీ వాళ్లను పోలీసులు నిలువరించే ప్రయత్నంచేశారు. ఈ క్రమంలో తొలుత వాగ్వాదం జరిగింది. శానససభలో మా డిమాండ్లు విని్పంచకపోతే న్యాయం ఎలా జరుగుతుంది? అని పోలీసులతో ఉద్యమకారులు వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో తోపులాట జరగడంతో పోలీసులు జలఫిరంగులను ప్రయోగించారు. అయినాసరే ఉద్యమకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు తొలత టియర్‌గ్యాస్ షెల్స్‌ను, తర్వాత లాఠీలను ప్రయోగించిచారు. తమపై విద్యార్థులు రాళ్లదాడి చేయడంతోనే లాఠీచార్జ్ చేయాల్సి వచి్చందని రాంచీ సిటీ ఎస్పీ పరాశ్ రాణా చెప్పారు. నిరననకారుల దాడిలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడినట్లు ప్రకటించారు. చర్చల పర్వం కొనసాగుతుండగా ర్యాలీ చేపట్టడమేంటని ప్రభుత్వం అసహనం వ్యక్తంచేసింది. 98 శాతం డిమాండ్లకు ఒప్పుకున్నాసరే ఉద్యమపంథాను ఎందుకు వీడట్లేరని ప్రభుత్వం నిలదీసింది. అయితే 13 పరీక్షల్ని రద్దుచేయాలంటే కనీసం మూడు పరీక్షలకే ఒప్పుకున్నారని, జేపీఎస్సీ, జేఎస్ఎస్లో సంస్కరణల ఊసే ఎత్తేట్లేరని, సీబీఐ విచారణకు ప్రభుత్వం సాహసించట్లేదని ఉద్యమకారులు ఆరోపించారు.జేపీఎస్సీ మాజీ చైర్పర్సన్ అరెస్ట్ జార్ఖండ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలపై జేపీఎస్సీ మాజీ ఛైర్పర్సన్, 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఎల్.ఖియాంగ్టేను సోమవారం జార్ఖండ్ సీఐడీ అధికారులు అరెస్ట్‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామాచేశాక గత ఏడాది ఈయనను ప్రభుత్వం జేపీఎస్సీ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. గత నెలలో ఈయనను సీఐడీ నాలుగుసార్లు ప్రశ్నించింది. ముగ్గురు జేపీఎస్సీ సభ్యులు రాజీనామాచేశాక ఒత్తిడి పెరగడంతో జూలై 22న ఖియాంగ్టే తన పదవికి రాజీనామా చేయడం తెల్సిందే. ఖియాంగ్టే అరెస్ట్‌తో ఈ ఉదంతంలో అరెస్టుల సంఖ్య ఇరవైకి పెరిగింది.రంగంలోకి ఈడీ.. ఇన్ని రోజులు ఈ ఉదంతంలో సీఐడీ కేసు నమోదుచేసిన దర్యాప్తుచేస్తుండగా సోమ వారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగంలోకి దిగింది. సీఐడీ నమోదుచేసిన ఎఫ్ఐఆర్ను ఆధారంగాచేసుకుని మనీ లాండరింగ్ కోణంలో మరో కేసును ఈడీ నమోదుచేసి దర్యాప్తు ఆరంభించింది. ఈ కేసుతో సంబంధం ఉన్నవారందరికీ సమన్లు జారీచేసి పిలిపించి ప్రశ్నించనుంది. అవసరమైతే అరెస్ట్లుచేసే ఆస్కారముంది. జార్ఖండ్ జనరల్ గ్రాడ్యుయేట్ కంబైన్డ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అక్రమాల్లో నిగ్గుదేల్చేందుకు విద్యార్థులు సీబీఐ దర్యాప్తుకోరుతుంటే ఈడీ రంగంలోకి దిగడం గమనార్హం. ఐసీయూలో మహతో సోమవారం అసెంబ్లీ మార్చ్‌లో పాల్గొన్న మహతోను తీవ్ర అనారోగ్యం కారణంగా తోటి ఉద్యమకారులు ఆస్పత్రిలో చేర్పించారు. మహతో గత 9 రోజులుగా నిరాహారదీక్ష చేస్తూ 10 కేజీలకుపైగా బరువుతగ్గడం తెల్సిందే. రక్తంలో చక్కర స్థాయిలో బాగా పడిపోయాయని, ఆయన ఆరోగ్యపరిస్థితి ‘క్లిష్టమైన’స్థాయికి పడిపోయిందని రాంచీలోని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. రాంచీ సదర్ ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స చేస్తున్నామని మెడికల్ ఆఫీసర్ నాన్సీ ప్రియా తెలిపారు. అయితే లాఠీచార్జ్ వేళ మహతోనూ పోలీసులు కొట్టారని అతని సహాయకుడు పంకజ్‌కుమార్ వెల్లడించారు. -
CBI సంచలన రిపోర్టు CBI NEET పేపర్ లీక్ చేసింది ఆ ముగ్గురే..!
-
‘నీట్’ లీక్: పరీక్షకు కొన్ని గంటల ముందే..
తిరువనంతపురం: నీట్ యూజీ-2026 ప్రశ్నాపత్రం లీకేజీ ఉదంతంలో సీబీఐ దర్యాప్తు పలు కీలక విషయాలను వెలుగులోకి తెచ్చింది. ఢిల్లీ నుంచి కేరళలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్ వరకు డిజిటల్ ఆధారాల ఆధారంగా ఈ అక్రమ నెట్‌వర్క్‌ను దర్యాప్తు సంస్థ ఛేదించింది. వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా ప్రశ్నపత్రాలు రాష్ట్రాల సరిహద్దులు దాటి, పరీక్షకు కొన్ని గంటల ముందే కేరళలోని అదూర్ (పతనంతిట్ట) విద్యార్థులకు చేరినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.రాజస్థాన్‌లోని సికార్‌కు చెందిన ఓ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాజీ విద్యార్థి, కేరళలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో తన రూమ్మేట్కు లీకైన పీడీఎఫ్ ఫైళ్లను పంపడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సుమారు 450కి పైగా పరిష్కరించిన ప్రశ్నలతో కూడిన ఈ పత్రాలను పరీక్షకు ముందు రోజు విద్యార్థులకు అందించారు. మధ్యవర్తులు ఫోన్‌పే ద్వారా రూ. 30,000 వసూలు చేసి ఈ ప్రశ్నాపత్రాలను చేరవేశారు. సికార్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఆర్కే ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ’ ఈ లీకేజీకి ప్రధాన కేంద్రమని, అక్కడి నుంచి దళారుల ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు చేరాయని తేలింది.ఈ భారీ లీకేజీకి మూల కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నియమించిన పూణేకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్ నిపుణులే. ఢిల్లీలోని ఓఖ్లాలో ఉన్న ఎన్టీఏ భవనంలో ప్రశ్నపత్రాల తయారీ, అనువాదాల సమయంలో భద్రతా లోపాలను నిందితులు తమకు అనుకూలంగా మలుచుకున్నారు. చిన్న చీటీలు, చేతితో రాసుకున్న నోట్స్ లేదా జ్ఞాపకశక్తి ద్వారా ప్రశ్నలను బయటికి తీసుకువచ్చారు. నిపుణులు, విద్యార్థుల కదలికలను గుర్తించేందుకు పూణేలోని ఒక నివాస సముదాయం విజిటర్ యాప్, మొబైల్ లొకేషన్ డేటాను సీబీఐ ఫోరెన్సిక్ ఆధారాలుగా ఉపయోగించింది. ఢిల్లీలో జరిగిన నిబంధనల ఉల్లంఘనలను కేరళలోని లబ్ధిదారులతో అనుసంధానించడంలో ఈ డిజిటల్ ఆధారాలు కీలకంగా మారాయి.ఇది కూడా చదవండి: శ్రీదేవితో రహస్య వివాహం నుంచి భార్య బెదిరింపుల వరకు.. -
పేపర్ లీక్ కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రాయ్‌పూర్: పేపర్ లీకేజ్‌ల కేసులో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలను లీక్ చేయడం అనేది హత్య కంటే మరింత ఘోరమైన నేరం అని మండిపడింది. ఆ అంశం లక్షలాది మంది పోటీపరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల భవిష్యత్తును నాశనం చేస్తుందని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీవన్ కిశోర్ ధ్రువ్ కు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.ఏం జరిగింది?2020–2022 మధ్య జరిగిన ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామక ప్రక్రియలో అక్రమాలకు అక్రమాలకు పాల్పడ్డాడడని అప్పటి కమిషన్ కార్యదర్శిగా పనిచేసిన జీవన్ కిశోర్ ధ్రువ్ ను 2025 సెప్టెంబర్‌లో సీబీఐ అరెస్టు చేసింది. ఈ నియామక పరీక్షలో డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికైన ఆయన కుమారుడు సుమిత్ ధ్రువ్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం బెయిల్ నిరాకరిస్తూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది."ఈ కేసులో ఇతర నిందితుల బెయిల్ దరఖాస్తులను పరిశీలించినప్పుడు చేసిన వ్యాఖ్యలను మరోసారి పునరుద్ఘాటిస్తున్నాం. పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్‌కు పాల్పడే వ్యక్తి, ఆ పరీక్షల కోసం రాత్రింబవళ్లు కష్టపడి సిద్ధమవుతున్న లక్షలాది మంది యువ అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుంటాడు. అలాంటి చర్య హత్య నేరం కంటే కూడా ఘోరమైనది. ఒక వ్యక్తిని హత్య చేస్తే ఒక కుటుంబం మాత్రమే నష్టపోతుంది. కానీ లక్షలాది మంది అభ్యర్థుల కెరీర్‌ను నాశనం చేస్తే మొత్తం సమాజమే తీవ్రంగా ప్రభావితమవుతుంది."అందువల్ల ఈ కేసులో నిందితులపై ఉన్న ఆరోపణలను సాధారణ నేరాలుగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.ప్రాసిక్యూషన్ సమర్పించిన ప్రాథమిక ఆధారాలను పరిశీలించిన హైకోర్టు, 2021 మెయిన్ పరీక్ష ప్రశ్నాపత్రాలను జీవన్ కిశోర్ ధ్రువ్ తన అధికారాన్ని దుర్వినియోగం చేసి గోప్యంగా తన వద్ద ఉంచుకున్నారని, అనంతరం వాటిని తన కుమారుడికి అందించినట్లు సూచించే ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. అదేవిధంగా సుమిత్ ధ్రువ్ పరీక్షకు ముందు ప్రత్యేకంగా నాలుగు అంశాలను మాత్రమే సిద్ధం చేశాడని, అవే అంశాలు పరీక్షలో ప్రశ్నలుగా వచ్చినట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపింది. జీవన్ కిశోర్ ధ్రువ్ నివాసంలో స్వాధీనం చేసుకున్న వస్తువులు, సాక్షుల వాంగ్మూలాలు, పత్రాధారాలు కూడా ఈ కుట్రలో ఆయన ప్రమేయాన్ని ప్రాథమికంగా సూచిస్తున్నాయని కోర్టు పేర్కొంది.అయితే విచారణ సందర్భంగా జీవన్ కిశోర్ ధ్రువ్ తరఫున న్యాయవాది దేవర్షి ఠాకూర్ వాదనలు వినిపించారు. CGPSC కార్యదర్శిగా పనిచేసిన కారణంగానే తన క్లయింట్ కిషోర్ ధృవ్‌ను తప్పుడు కేసులో ఇరికించారని, అసలు ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కూడా లేదని తెలిపారు.అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ తప్ప ఎలాంటి అభ్యంతరకర పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం కాలేదని, ప్రశ్నాపత్రాలను లీక్ చేశారని లేదా తన పిల్లలకు అందించారని నిరూపించే ప్రత్యక్ష ఆధారాలు లేవని ఆయన వాదించారు.జీవన్ కిశోర్ ధ్రువ్ కుమారుల్లో ఒకరు పరీక్షలో అర్హత సాధించలేదని, మరో కుమారుడు కూడా మొదటి ర్యాంకు కాకుండా చాలా తక్కువ ర్యాంకు సాధించాడని తెలిపారు.సీబీఐ వాదనజీవన్ కిశోర్ ధ్రువ్, అప్పటి CGPSC చైర్మన్, పరీక్షల నియంత్రణాధికారి (కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్)తో పాటు ఇతర నిందితులతో కలిసి నేరపూరిత కుట్ర పన్ని, 2021 మెయిన్ పరీక్ష గోప్యమైన ప్రశ్నాపత్రాలను లీక్ చేసి, తన కుమారుడికి అక్రమ ప్రయోజనం కల్పించినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ పేర్కొంది.ధ్రువ్ నివాసంలో నిర్వహించిన సోదాల్లో జనరల్ స్టడీస్ పేపర్–VIIకు సంబంధించిన ప్రశ్నలు, సమాధానాలు, అలాగే ఎస్సే పేపర్ ప్రశ్న-సమాధాన బుక్లెట్ ప్రతులు స్వాధీనం చేసుకున్నట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది.ఇతర సహ నిందితుడికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినందున తన క్లయింట్‌కు కూడా అదే వర్తించాలని రక్షణ పక్షం చేసిన వాదనను సీబీఐ ఖండించింది. బెయిల్ పొందిన వ్యక్తి ఒక ప్రైవేట్ వ్యక్తి కాగా, జీవన్ కిశోర్ ధ్రువ్ మాత్రం పరీక్షల గోప్యత, సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత కలిగిన సీనియర్ ప్రభుత్వ అధికారి అని స్పష్టం చేసింది.ఈ కేసులో అరెస్టైన వారిలో మాజీ CGPSC చైర్మన్ తమన్ సింగ్ సోన్వానీ, ఆయన మేనల్లుళ్లు నితేష్ సోన్వానీ, సాహిల్ సోన్వానీ, మాజీ డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ లలిత్ గన్వీర్, పారిశ్రామికవేత్త శ్రవణ్ కుమార్ గోయల్, ఆయన కుమారుడు శశాంక్ గోయల్, కోడలు భూమిక కటియార్ తదితరులు ఉన్నారు. -
చర్చలకు సిద్ధం
రాంచీ: జార్ఖండ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన పోటీ పరీక్షల్లో అక్రమాలకు చరమగీతం పాడాలని, సంస్కరణల బాటలో హేమంత్ సోరెన్ సర్కార్ పయనించాలన్న డిమాండ్లతో 13 రోజులుగా ఆందోళన చేస్తున్న పరీక్షార్థులు, విద్యార్థులు ఎట్టకేలకు ప్రభుత్వంతో చర్చలకు ముందుకొచ్చారు. త్వరలో ప్రభుత్వంతో జరిగే చర్చల కోసం 11 మందితో ప్రతినిధి బృందాన్ని ఏర్పాటుచేసినట్లు ఉద్యమనేతలు గురువారం ప్రకటించారు. జార్ఖండ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు మొదలైన తొలిరోజే సభలో విపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వ వ్యతిరేక, ఉద్యమ అనుకూల నినాదాలతో హోరెత్తించిన వేళ ఉద్యమనేతలు చర్చలకు ముందుకురావడం గమనార్హం. ఎనిమిది మంది విద్యార్థులు, ఇద్దరు నిపుణులైన పాత్రికేయుడు, ఒక న్యాయవాదితో ప్రతినిధి బృందాన్ని ఏర్పాటుచేశామని ఉద్యమనేతలు తెలిపారు. రాంచీలోని జైపాల్‌సింగ్ ముండా స్టేడియంలో ‘జేపీఎస్సీ–జేఎస్ఎస్సీ రిఫారŠమ్స్ మంచ్’పేరిట జరుగుతున్న ఉద్యమం గత కొన్నేళ్లలో జార్ఖండ్‌లో ఎన్నడూలేనంతటి అతిపెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందిన విషయం విదితమే. ఐదుగురు సభ్యుల ప్రభుత్వ ప్యానెల్‌తో గురువారమే చర్చలు ఆరంభంకానున్నట్లు తెలుస్తోంది. 14వ జేపీఎస్సీ పరీక్షను రద్దుచేయాలని, జేఎస్ఎస్సీలో సంస్కరణలు తేవాలని, గత పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ లేదా ఇతర రాష్ట్రాల హైకోర్టు రిటైర్డ్ జడ్జీల నేతృత్వంలో స్వతంత్య్ర దర్యాప్తు జరిపించాలని విద్యార్థులు తమ డిమాండ్లను ప్రభుత్వ బృందం ఎదుట విన్పించనున్నారు. జేపీఎస్సీతోపాటు జేఎస్ఎస్సీలో సంస్కరణలు తేవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలో విపక్ష ఎమ్మెల్యేలు నిరసన ప్రదర్శన చేశారు. ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి సమస్యల్ని పరిష్కరించాలి అని రాసి ఉన్న మాస్‌్కలు ధరించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. మరోవైపు 7, 10 తేదీల్లో అసెంబ్లీ వద్ద ధర్నాకు విద్యార్థులు పిలుపునిచి్చన నేపథ్యంలో అసెంబ్లీ సమీపంలో గుమిగూడకుండా ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీస్ యంత్రాంగం తెలిపింది. -
విద్యార్థులను చూస్తే గర్వంగా ఉంది
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పేపర్ లీకేజీపై నిరసన తెలియజేసిన విద్యార్థులపై జరిగిన హింసాకాండకు ముమ్మాటికీ అమిత్ షా బాధ్యుడని ఆరోపించారు. విద్యార్థుల విషయంలో ఏం జరిగిందో పార్లమెంట్లో వివరించే ధైర్యం ఆయనకు లేదని విమర్శించారు. జూలై 20న పోలీసుల దాడికి గురైన విద్యార్థుల బృందంతో రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువ నిరసనకారులను ఇప్పుడే కలిసి చర్చించానని తెలిపారు. రాజ్యాంగం, విద్యా వ్యవస్థ, భారతదేశ భవిష్యత్తు కోసం పోరాడిన వేలాది విద్యార్థులను చూస్తే తనకు చాలా గర్వంగా ఉందన్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. తమపై జరిగిన దాడి, తగిలిన దెబ్బలు, ఎదురవుతున్న బెదిరింపుల గురించి వారు వివరించారని పేర్కొన్నారు. వారు రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం సాగించారని, భారతదేశం అనే భావనను, దేశ భవిష్యత్తును కాపాడారని రాహుల్ ప్రశంసించారు. లోపభూయిష్టమైన, కుప్పకూలిపోతున్న, నిష్ప్రయోజనమైన విద్యా విధానం గురించి ఫిర్యాదు చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. వ్యవస్థనే మార్చాలని విద్యార్థులు కోరుతున్నారని చెప్పారు. వారు హింసకు పాల్పడలేదని, దురుసుగా ప్రవర్తించలేదని గుర్తుచేశారు. అయినప్పటికీ వారిపై దాడి చేసి, కొట్టి, బెదిరించారని ధ్వజమెత్తారు. ఆన్లైన్లో వేధిస్తున్నారు: రియా ఆహిర్ విద్యార్థుల బృందాన్ని కలిసిన ఫొటోలను రాహుల్ గాంధీ ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేశారు. ‘‘భారతదేశ భవిష్యత్తును చూడండి. యువత నిర్భయులు, నిర్మొహమాటంగా మాట్లాడుతారు. వారికి దేశభక్తి ఉంది. మరి ప్రధానమంత్రి, హోంమంత్రి సంగతి ఏంటి? పార్లమెంట్‌కు వచ్చే ధైర్యం గానీ, సమాధానాలు చెప్పే తెగింపు గానీ వారికి లేవు’’అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాహుల్ గాంధీ పక్కన సీజేపీకి చెందిన రియా ఆహిర్, నూతన్ టోపో, భరత్, ఫర్హానాజ్, ముస్కాన్ ఉన్నారు. వీరిలో మోడల్ రియా ఆహిర్ ముంబైలో విద్యార్థుల నిరసనల సమయంలో పోలీసు వ్యాన్‌ను అడ్డుకున్న సంగతి తెలిసిందే. తనకు ఆన్లైన్లో వేధింపులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తూ ఆమె పోలీసులను ఆశ్రయించారు. గాంధీ పక్కన నిల్చొని ఆమె విలేకరులతో మాట్లాడారు. తాను 20 మంది పిల్లలను అక్రమ అరెస్టుల నుంచి కాపాడనని, ఇప్పుడు తనను ఆన్లైన్లో వేధిస్తున్నారని చెప్పారు. తాను ఎదుర్కొంటున్నది ట్రోలింగ్ కాదని, అది ఒక నేరమని స్పష్టం చేశారు. -
ఎంబీబీఎస్ గైనకాలజీ పేపర్ లీక్?
తిరువనంతపురం: కేరళ ఆరోగ్య విశ్వవిద్యాలయం (కేయూహెచ్ఎస్) నిర్వహించిన ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గైనకాలజీ ప్రశ్నపత్రం లీకయ్యిందనే ఆరోపణలు వినవస్తున్నాయి. జూలై 31న జరిగిన ఈ పరీక్షలో మొత్తం 15 ప్రశ్నలకు గాను 6 ప్రశ్నలు, విశ్వవిద్యాలయ వెబ్సైట్లో ముందుగానే అందుబాటులో ఉన్న మోడల్ ప్రశ్నాపత్రం నుంచి యథాతథంగా వచ్చినట్లు తేలింది. దీనివల్ల 24 మార్కులు (24 శాతం) మోడల్ పేపర్ నుంచే రావడంతో పరీక్ష విశ్వసనీయతపై విద్యార్థులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ ఆరు నాలుగు మార్కుల ప్రశ్నలు మోడల్ పేపర్లోని క్రమ సంఖ్యతో పాటు అచ్చం అలాగే పునరావృతం కావడం విశేషం. ప్రశ్నపత్రం రూపొందించిన అధ్యాపకుడికి, దానిని పరిశీలించిన పరిశీలకుడికి (స్క్రూటినీ) మోడల్ పేపర్ ముందే ఇచ్చినప్పటికీ ఈ పొరపాటును గుర్తించడంలో విఫలమయ్యారని పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. విశ్వవిద్యాలయానికి విద్యార్థులు ఫిర్యాదు చేసినా స్పందన కరువైంది. మరోవైపు ఆగస్టు 5 నుంచి ప్రారంభమైన ప్రాక్టికల్ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ స్ట్రక్చర్డ్ క్లినికల్ నిర్వహణ విధానంపై కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల అనుసారమే పలు మార్పులు చేశామని విశ్వవిద్యాలయం సమర్థించుకుంది.ఇది కూడా చదవండి: అత్యాచార ఆరోపణలు.. మూకదాడిలో యువకుడు మృతి -
ప్రశ్నపత్రాల లీకేజీ ముఠా గుట్టు రట్టు
ముంబై: మహారాష్ట్రలో కలకలం సృష్టించిన ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టీఈటీ) 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబై సమీపంలోని థానే నగర పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో పెద్దఎత్తున కుట్ర భగ్నమైంది. టీఈటీ పరీక్షకు కేవలం రెండు రోజుల ముందు పోలీసులు ఈ ముఠాను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బ్రిజేంద్ర గుప్తాతో పాటు మరో 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఈ ముఠా ఒక్క టీఈటీ పేపర్ లీకేజీతో ఆగకుండా, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం కోసం నిర్వహించే ‘సెట్’ పరీక్షా పత్రాన్ని కూడా లీక్ చేయడానికి ప్లాన్ చేసినట్లు విచారణలో తేలింది. ఆగ్రాలోని ఓ ముద్రణాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్న సంజయ్ కుమార్ శర్మ ద్వారా ఈ పత్రాలను రహస్యంగా సేకరిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.ఆఫ్‌లైన్, ఆన్లైన్ విధానాల ద్వారా ఈ ముఠాలు ఏవిధంగా ప్రశ్నపత్రాలను తస్కరిస్తున్నాయనే విషయాన్ని పోలీసులు బయటపెట్టారు. ప్రింటింగ్ ప్రెస్‌లలో నిఘా ఉంచి, కిందిస్థాయి సిబ్బందిని ఆకర్షించి పత్రాలను బయటికి పంపడం, అలాగే ఆన్లైన్ పరీక్షా కేంద్రాలను దక్కించుకుని వేరే వ్యక్తులతో పరీక్ష రాయించడం వంటి పద్ధతులను ఈ నెట్వర్క్ వాడుతున్నట్లు తేలింది.టీఈటీ పరీక్షా పత్రాన్ని రూ. 8,000 పెట్టి కొనుగోలు చేసిన ఈ ముఠా, మహారాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులకు రూ. 80,000 నుంచి రూ. 1.5 లక్షల వరకు విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. భివాండి నగరంలో ఈ పేపర్లు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో థానే పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి హరియాణా, బిహార్‌కు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతో ఈ భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది.ఇది కూడా చదవండి: కూలిన పైకప్పు.. నిద్రలోనే కన్నుమూసిన దంపతులు -
'అలాంటి వారికి మార్గనిర్దేశం చేయాలి': ప్రధాని మోదీ పిలుపు
భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో వీడియో రిలీజ్ చేశారు. నీట్ పేపర్ లీక్ అంశంపై మరోసారి మాట్లాడారు. జంతర్‌మంతర్‌లో ఏం జరిగిందో దేశ ప్రజలంతా చూశారని అన్నారు. నిరసనలో కొందరు అసభ్యకరమైన పదాలు వాడారని అన్నారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని తెలిపారు. అయినప్పటికీ అందరినీ తాను క్షమించానని ప్రధాని మోదీ వెల్లడించారు. సరికొత్త భారత్ కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తప్పుదోవ పట్టిన వారికి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని సూచించారు. కాగా.. నీట్ పేపర్ లీక్ కావడంతో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన చేపట్టింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగింది. ఈ నిరసనను కొన్ని రాజకీయ పార్టీలు అవకాశంగా మార్చుకున్నాయి. కాంగ్రెస్‌తో పాటు పలు ప్రతిపక్ష నాయకులు ఢిల్లీలో హంగామా చేశారు. చివరికీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా ఇవాళ మరో వీడియో సందేశమిచ్చారు. Abuses never solve anything. Let’s guide the misguided. Let’s work together. Let’s work for Bharat. pic.twitter.com/yAePG60KYL— Narendra Modi (@narendramodi) July 31, 2026 -
పదవి వదిలేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారండి
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న తరుణంలో విద్యార్థులతో సంప్రదింపుల కోసం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాను వినియోగించుకోవడంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకొని, దానికి బదులుగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మారా లని సూచించారు. నరేంద్ర మోదీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా వ్యవహరించడానికే సరిగ్గా సరిపోతారని ఎద్దేవా చేశారు. ఆయన పదవి నుంచి తప్పుకోవాలని, దేశాన్ని నడిపే బాధ్యతను మరొకరికి అప్పగించాలని అన్నారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనను విరమించినప్పటికీ నిరసనకారులపై వేధింపులు ఆగడం లేదని దీప్కే ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. కేంద్ర మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన నిరసన కారుల ఆగ్రహం చల్లారలేదని తేల్చిచెప్పారు. యువత ఆగ్రహాన్ని బీజేపీ ఎందుకు అర్థం చేసుకో లేకపోతోందని ప్రశ్నించారు. -
'పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలే ప్రసక్తే లేదు'.. పీఎం మోదీ స్ట్రాంగ్ వార్నింగ్
పేపర్ లీక్ గ్యాంగ్‌లను వదిలిపెట్టే ప్రసక్తే లేదనిస ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అందుకే పార్లమెంట్లో యాంటి పేపర్ లీక్ బిల్ పాస్ చేశామని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియాలో మరో వీడియో రిలీజ్ చేశారు. పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు కొనసాగుతాయని నరేంద్ర మోదీ తెలిపారు. విద్యార్థుల జీవితాలతో ఆటలు ఆడేవారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. కాగా.. ఈ ఏడాది నీట్ పరీక్ష పేపర్ లీకైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షను దేశవ్యాప్తంగా మరోసారి నిర్వహించారు. ఈ పేపర్ లీక్‌పై కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు దిగింది, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టారు. సీజేపీ చీఫ్ అభిజీత్ దిప్కే ఆధ్వర్వంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. దీంతో నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం యాంటి పేపర్ లీక్ బిల్‌ను తీసుకొచ్చింది. ఈ బిల్లుకు లోక్ సభ కూడా ఆమోదం తెలిపింది. Parliament passes a Bill that makes our examination system more robust! pic.twitter.com/OEvLKXoUaf— Narendra Modi (@narendramodi) July 30, 2026 -
విద్యార్థులను హింసించే హక్కు ఎవరిచ్చారు
న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ పేపర్ లీక్‌పై ఆందోళనకు దిగిన విద్యార్థులను కఠినంగా అణచివేయాలంటూ పోలీసులకు ఆదేశాలిచ్చారని ఆరోపించారు. నిరసనకారులపై పోలీసుల అరాచకాలు, కాల్పులకు అమిత్ షా ఆమోదం తెలిపారని మండిపడ్డారు. పేపర్ లీక్ సవరణ బిల్లుపై బుధవారం లోక్‌సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. బీజేపీని, ఆ పార్టీ మద్దతుదారులను పరోక్షంగా ఎద్దేవా చేశారు. ఇందుకోసం మూడు వర్గాలను ప్రస్తావించారు. విద్యార్థులు, తమకు అంతా తెలుసని భావిస్తూ దేవుడిలా నటించేవారు, ఆ రెండో వర్గమే సాక్షాత్తూ దేవుడని నమ్మే అంధభక్తులు ఉన్నారని విమర్శించారు. హోంమంత్రి అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఈ రోజు సభకు రాలేదని రాహుల్ అన్నారు. విద్యార్థులపై హింసకు పాల్పడే హక్కు అమిత్ షాకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఆయన మన విద్యార్థుల శరీరంలోకి పెల్లెట్లను(తుపాకీ గుళికలను) దించారని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలో విద్య నేడు ఖరీదైన వ్యాపారంగా, విద్యా వ్యవస్థ క్రూరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్ఎస్ఎస్ గుప్పిట్లోకి విద్యా వ్యవస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై కూడా రాహుల్ తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యా వ్యవస్థను ప్రభావితం చేస్తూ, విద్యార్థులకు ఏమి బోధించాలనే దానిని ఆ సంస్థే నిర్దేశిస్తోందని ఆరోపించారు. విద్యా వ్యవస్థ ఆత్మను ఆర్ఎస్ఎస్ తన గుప్పిట్లోకి తీసుకుందని చెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్ ఎప్పుడూ విద్యా శాఖను నడపలేదని, ఆ పని చేసింది ఆర్ఎస్ఎస్ మాత్రమేనని ఆక్షేపించారు. విద్యార్థుల అసలైన శత్రువు ఆర్ఎస్ఎస్ అని విమర్శించారు. అన్‌పార్లమెంటరీ పదం తొలగింపు కొంతమంది విద్యార్థులతో జరిపిన సంభాషణ యువత విద్య, జ్ఞానాన్ని ఎలా చూస్తుందనే దానిపై తనకు ఒక అవగాహన కల్పించిందని రాహుల్ అన్నారు. విద్యారి్థగా ఉండడం అంటే ఏమిటని తాను ఒక విద్యారి్థని అడిగానని చెప్పారు. అంటే కళాశాల లేదా పాఠశాలలో చదువుకోవడం, పుస్తకాలు చదవడం అని అర్థమా? అని అడిగితే.. విశాలమైన దృక్పథం, విశాలమైన హృదయం కలిగినవారే విద్యార్థి అని ఆమె సమాధానమిచ్చారని పేర్కొన్నారు. ‘‘విద్యార్థి అంటే తనకు అన్నీ తెలియవని అంగీకరించే వ్యక్తి. తనకు తెలిసిన విషయాల స్థానంలో కొత్త జ్ఞానం వచ్చి చేరుతుంది. విశ్వం నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుందని అతనికి తెలుసు. జ్ఞానం కూడా నిరంతరం మారుతూ ఉంటుందని అతను అర్థం చేసుకుంటాడు. విద్యారి్థకి ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం వినమ్రత అని ఆమె అన్నారు’’అని రాహుల్ వెల్లడించారు. తమకు అన్నీ తెలుసని భావించే మరో వర్గం గురించి కూడా ఆమె వివరించారని పేర్కొన్నారు. ‘‘తమకు అన్నీ తెలుసని కొందరు వ్యక్తులు దృఢంగా నమ్ముతారు. విశ్వం స్థిరమైనదని, జ్ఞానం తమ అంతరంగం నుంచే ఉద్భవిస్తుందని వారు భావిస్తారు. వారు అహంకారంతో ఉంటారు. వారు ఇతరుల మాట వినరు, సత్యాన్ని గౌరవించరు’’అని చెప్పారు. ఈ క్రమంలో రాహుల్ గాంధీ ఉపయోగించిన ఒక పదంపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యారి్థని తనతో చెప్పిన మాటలనే సభలో ప్రస్తావించానని, సభలోని ఏ సభ్యుడినీ ఉద్దేశించి అనలేదని రాహుల్ బదులిచ్చారు. రాహుల్ ఉపయోగించిన అన్‌పార్లమెంటరీ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కోరారు. దాంతో స్పీకర్ ఆ పదాన్ని తొలగించారు. ఎన్డీయే సభ్యుల తీవ్ర అభ్యంతరం సభలో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల పట్ల అధికార ఎన్డీయే సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. అరుపులు కేకలతో సభ దద్దరిల్లింది. దాంతో సభను రెండుసార్లు వాయిదా వేయాల్సి వచి్చంది. రాహుల్ అబద్ధాల పుట్ట అంటూ బీజేపీ ఎంపీలు ఎదురుదాడికి దిగారు. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేస్తున్నారని, అందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం జోక్యం చేసుకున్నారు. ఇక్కడ చర్చ జరుగుతున్నది అమిత్ షాపై కాదని అన్నారు. ఆరోపణలకు ఆధారాలు చూపించాలని రాహుల్‌కు సూచించారు. -
కదిలిన YSRCP యువత.. లోకేష్ వెన్నులో వణుకు.. రాజీనామా చేస్తాడా..?
-
DSC స్కామ్ లో చంద్రబాబు హస్తం..! ఇవే ప్రూఫ్ లు.. DSC అభ్యర్థి షాకింగ్ కామెంట్స్!
-
అసలు మెగా DSC స్కామ్ ఎలా బయటపడిందంటే.. విద్యార్థుల కళ్ళు తెరిపించే వీడియో..
-
ఏపీలో డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ పదవి నుంచి తప్పుకోవాల్సిందే...
-
ఢిల్లీ సీన్ రిపీట్.. జగన్ కు సవాల్ విసరడం కాదు.. దమ్ముంటే డిబేట్ కు రా
-
పేపర్ లీక్ బిల్లు చరిత్రాత్మకం
న్యూఢిల్లీ: పేపర్ లీకేజీలను అరికట్టడానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’చరిత్రాత్మకమని కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు చట్టాన్ని తీసుకురావాలన్న అసంపూర్ణ కార్యాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం 2024లో పూర్తి చేసిందని తెలిపారు. 2024 నాటి చట్టాన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టిందని అన్నారు. ఈ బిల్లు విద్యార్థులు, యువత ప్రయోజనాలు కాపాడాలన్న ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. సవరణ బిల్లును సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టగా, మంగళవారం చర్చ ప్రారంభమైంది. మంత్రి జితేంద్ర సింగ్ చర్చకు శ్రీకారం చుట్టారు.ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50 లక్షల భారీ జరిమానా వంటి కఠినమైన శిక్షలు విధించేలా ‘పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను రూపొందించిన సంగతి తెలిసిందే. బిల్లుపై వివిధ పార్టీల సభ్యులు మాట్లాడారు. మంగళవారం అర్ధరాత్రి వరకు చర్చ కొనసాగింది. నిరసన వ్యక్తంచేసిన విద్యార్థులపై లాఠీచార్జీ చేయడాన్ని విపక్ష సభ్యులు తప్పుపట్టారు.ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యా రంగంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అధికార పక్ష సభ్యులు బిల్లును సమరి్థంచారు. విద్యార్థుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు స్పష్టంచేశారు. పేపర్ లీకేజీలను అరికట్టడానికి పటిష్టమైన చట్టం తీసుకొస్తుండడం కీలక పరిణామం అని వెల్లడించారు. అనంతరం చర్చ బుధవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యులది రాజకీయ ప్రసంగం: రిజిజు ప్రతిపక్షాలు పేపర్ లీక్ నిరోధక బిల్లు గురించి కాకుండా ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు విమర్శించారు. మొత్తం చర్చ బిల్లు యోగ్యతపై కేంద్రీకృతమై ఉండాల్సిందని అన్నారు. ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. విపక్ష సభ్యులు బిల్లు గురించి మాట్లాడలేదని, కేవలం రాజకీయాలు చేశారని అన్నారు. అందరూ రాజకీయ ప్రసంగాలు చేశారని ఆక్షేపించారు. సభలో ఇలా చేయడం సరైంది కాదన్నారు. -
ధర్మేంద్రను తొలగించి ప్రధానికి కాపాడారు.. అఖిలేష్
కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూఎన్నో ఎంట్రన్స్ పేపర్లు, ఉద్యోగ పరీక్షల పేపర్లు లీకయ్యాయిపేపర్ లీకేజ్‌కు పాల్పడిన ముఠా రూ. 10 కోట్లు చెల్లించాలిలీకేజ్కు పాల్పడిన నిందితులకు 10 ఏళ్ల జైలు శిక్షపేపర్ లీకేజ్‌ల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయబోతున్నాంఈ బిల్లు ద్వారా బాధితులకు సత్వరం న్యాయం జరుగుతుంది. అఖిలేష్ యాదవ్ కామెంట్స్ యువత కేంద్రం మెడలు వంచింది.గతంలో రైతులు కూడా ఈ విధంగానే చేశారుధర్మేంద్రను తొలగించి ప్రధానిని కాపాడారుఎన్డీఏ హయాంలో అనేకసార్లు పేపర్లీకేజ్లు ఎన్డీఏ హయాంలోనే రామ్‌మందిర్‌లో చోరీ జరిగింది -
ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో నేడు (మంగళవారం) ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ కోరగా, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌పై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ఇదే పరిస్థితి రాజ్యసభలోనూ తలెత్తడంతో ఉభయ సభలు వాయిదా పడ్దాయి. కాగా పబ్లిక్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీలను అరికట్టేందుకు ఉద్దేశించిన ‘పబ్లిక్ పరీక్షల (అక్రమాల నిరోధక) సవరణ బిల్లు, 2026’ను లోక్‌సభలో ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు చర్చించి ఆమోదించనున్నారు. మరోవైపు రాజ్యసభలో ‘సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026’ను ప్రవేశపెట్టనుండగా, ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026’ను ఆమోదం కోసం ప్రవేశపెట్టనున్నారు.లోక్‌సభ జాబితా ప్రకారం.. దేశవ్యాప్తంగా కలకలం రేపిన పేపర్ లీకేజీలు, పరీక్షల అక్రమాలను కఠినంగా శిక్షించేందుకు 2024 చట్టాన్ని మరింత బలోపేతం చేసే ఈ సవరణ బిల్లును సిబ్బంది శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ సభలో ప్రవేశపెట్టి ఆమోదం కోరనున్నారు. ఈ దిగువ సభలో ప్రశ్నోత్తరాల సమయం తర్వాత, కేంద్ర మంత్రులు పత్రాలను సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజాపంపిణీ స్టాండింగ్ కమిటీ నివేదికల సమర్పణ, పార్లమెంటరీ కమిటీ సిఫారసుల అమలుపై ప్రకటనలు ఉంటాయి. గౌహతి ఎయిమ్స్ పాలకమండలికి లోక్‌సభ సభ్యుడి ఎన్నిక కోసం తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టనున్నారు.మరోవైపు రాజ్యసభలో.. 2006 నాటి ఎంఎస్ఎంఈ అభివృద్ధి చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన ‘ఎంఎస్ఎంఈ అభివృద్ధి (సవరణ) బిల్లు, 2026’ను కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ ప్రవేశపెట్టనున్నారు. అలాగే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘జాతీయ గౌరవానికి భంగం వాటిల్లకుండా నిరోధించే (సవరణ) బిల్లు, 2026’ను పరిశీలన, ఆమోదం కోసం సభ ముందుకు తీసుకురానున్నారు. -
YSRCP LIVE : YSRCP భారీ ర్యాలీ..
-
లోకేష్ కే షాక్.. DSC స్కాంపై జెన్ జీ ఉద్యమం.
-
పరిష్కారమా... కొత్త సవాలా?
2026 ‘నీట్’ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా ఆందో ళనకు దారితీశాయి. ఫలితంగా పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది నుంచి నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే ప్రశ్నాపత్రాన్ని కాగితం నుంచి కంప్యూ టర్కు మార్చడమే సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని గుర్తించాలి. అసలు సమస్య పరీక్షా విధానంలో కాదు, ప్రశ్నపత్రాల గోప్యత, భద్రత, జవాబుదారీతనం వంటి వ్యవస్థాగత లోపాల్లో ఉంది. అంతర్జాతీయ అనుభ వాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రవేశ పరీక్షలలో ఒకటైన చైనా గావ్కావ్, దక్షిణ కొరియా సీఎస్ఏటీ ఇప్పటికీ పేపర్–పెన్సిల్ విధానంలోనే అత్యంత కట్టు దిట్టమైన భద్రతతో విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. దీనివల్ల పరీక్షా విధానం కంటే పటిష్టమైన భద్రతా వ్యవస్థ, పారదర్శకత, క్రమశిక్షణే విశ్వస నీయ పరీక్షలకు పునాది అని స్పష్టమవుతోంది. నీట్‌ను కంప్యూటర్ ఆధారిత పరీక్షగా నిర్వహిస్తే, కోట్లాది మంది విద్యార్థులను ఒకే సమయంలో పరీక్షించడం సాధ్యం కాదు. అందువల్ల బహుళ షిఫ్టులు తప్పనిసరి అవుతాయి. జేఈఈ మెయిన్‌లో కనిపించినట్లుగా వివిధ షిఫ్టుల్లో ప్రశ్న పత్రాల క్లిష్టతలో తేడాలు రావడం, నార్మలైజేష¯Œ పై వివాదాలు తలెత్తడం వల్ల సమాన ప్రతిభ కలిగిన విద్యార్థులకు కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల శాట్, జీఆర్ఈ వంటి పరీక్షల్లో ఉపయోగించే ఐటమ్ రెస్పాన్స్ థియరీ వంటి శాస్త్రీయ మనో కొలమాన పద్ధతులను అధ్యయనం చేసి అమలు చేయడం మరింత సముచితం.కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మరో ప్రధాన సవాలు డిజిటల్ అంతరం. పట్టణ విద్యార్థులతో పోలిస్తే గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల విద్యార్థులకు కంప్యూటర్ వినియోగం, ఆన్లైన్ పరీక్షల అనుభవం తక్కువగా ఉండే అవకాశం ఉంది. వైద్య విద్య వంటి అత్యంత కీలకమైన ప్రవేశ పరీక్షలో సాంకేతిక పరిజ్ఞాన పరిచయం విద్యార్థి ప్రతిభను ప్రభావితం చేయకూడదు. కాబట్టి ఆన్లైన్ విధానాన్ని అమలు చేయాలంటే ముందుగా దేశవ్యాప్తంగా సమాన డిజిటల్ మౌలిక సదుపాయాలు, శిక్షణ, మాక్ పరీక్షలు అందుబాటు లోకి తీసుకురావడం అత్యవసరం. పరీక్షపై నమ్మకాన్ని పునరుద్ధరించడం. ప్రశ్నాపత్రాల భద్రతను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లడం, లీకేజీలకు పాల్పడిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవడం, అత్యవసరం. కోట్లాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడిన పరీక్షల్లో సంస్కరణలు హడా వుడిగా కాకుండా సమగ్ర ప్రణాళికతో చేపట్టాల్సిన అవసరం ఉంది.– ఏటూరి శేఖర్ శర్మ, విశ్రాంత జిల్లా విద్యాశాఖాధికారి -
ఏపీలో Gen-Z తుఫాన్ నారా మోసం అంతా ఇంతా కాదు
-
ఎన్డీఏ పాలనలో విద్యాశాఖ వివాదాలు
భారతదేశ విద్యా వ్యవస్థను అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్లాల్సిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా తీవ్ర వివాదాలు, కుదుపులకు లోనైంది. ఎన్డీఏ ప్రభుత్వ పన్నెండేళ్ల పాలనా కాలంలో నలుగురు వేర్వేరు మంత్రులు ఈ కీలక బాధ్యతలను నిర్వర్తించినప్పటికీ, వారిలో ముగ్గురు కనీసం మూడేళ్లు కూడా పదవిలో కొనసాగలేకపోయారు. కేవలం ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఐదేళ్ల పూర్తి కాలం పని చేసినప్పటికీ, చివరికి ‘నీట్’ పరీక్షల లీకేజీలు, చెలరేగిన దేశవ్యాప్త నిరసనల సెగతో ఆయన కూడా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 2014 నుంచి ఇప్పటివరకు విద్యాశాఖను చుట్టుముట్టిన సంచలన వివాదాలివే..మారిన పేర్లు.. రద్దయిన ఎఫ్‌వైయూపీ2014 మే 26 నుంచి 2016 జూలై 5 వరకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ (ఇప్పుడు విద్యా మంత్రిత్వ శాఖ) బాధ్యతలు చేపట్టిన స్మృతి ఇరానీ హయాంలో పలు సంచలన నిర్ణయాలు వెలువడ్డాయి. ఆమె పదవీకాలంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయాలలో ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అమలవుతున్న నాలుగేళ్ల అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (ఎఫ్‌వైయూపీ) రద్దు చేయడం ఒకటి. దీనివల్ల విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. అయితే ఇదే సమయంలో జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ముసాయిదా రూపకల్పనకు శ్రీకారం చుట్టడంతో పాటు, నేషనల్ ఇన్స్టిట్యూషనల్ రేంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)ను ఆమె ప్రారంభించారు.జేఎన్‌యూ వివాదాలు, రోహిత్ వేముల ఆత్మహత్యస్మృతి ఇరానీ పదవీకాలం అనేక రాజకీయ తుఫాన్లకు కేంద్రబిందువుగా మారింది. జేఎన్‌యూలో చెలరేగిన భారీ నిరసనలు, నాటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ అరెస్టు దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాలపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అలాగే 2016 జనవరిలో చోటుచేసుకున్న రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం ప్రభుత్వంపై తీవ్ర నైతిక ఒత్తిడి తెచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో 2016 జూలైలో ఆమెను విద్యాశాఖ నుంచి తప్పించి జౌళి శాఖకు బదిలీ చేశారు.ఐఐఎంలకు స్వయంప్రతిపత్తి.. ఎన్టీఏ ఏర్పాటుస్మృతి ఇరానీ తర్వాత విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్ జవదేకర్ 2016 జూలై 5 నుంచి 2019 మే 30 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆయన హయాంలో ప్రవేశపెట్టిన ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)యాక్ట్-2017’ ద్వారా ఐఐఎం సంస్థలకు మరింత స్వయంప్రతిపత్తి లభించింది. అలాగే దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల నిర్వహణను ఒకే గొడుగు కిందకు తెచ్చే ఉద్దేశంతో ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ)ను ఆయన ఏర్పాటు చేశారు. అయితే ఆ తర్వాతి కాలంలో నీట్ పేపర్ లీక్ అంశంలో ఇదే ఎన్టీఏ తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది.నో డిటెన్షన్ పాలసీ రద్దు.. సీబీఎస్ఈ పేపర్ లీక్జవదేకర్ హయాంలో విద్యా హక్కు చట్టానికి సవరణ చేసి, ఐదు, ఎనిమిది తరగతుల్లో పిల్లలను ఫెయిల్ చేయకుండా పై తరగతులకు పంపే ‘నో డిటెన్షన్ పాలసీ’ని రద్దు చేశారు. అయితే 2018లో సీబీఎస్ఈ బోర్డు పరీక్షల పేపర్ లీక్ కావడంతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ తీవ్ర విమర్శలపాలైంది. అంతేకాకుండా, జియో ఇన్స్టిట్యూట్కు ‘ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఎమినెన్స్’ హోదా కట్టబెట్టడం కూడా పెద్ద వివాదానికి దారితీసింది.నిశాంక్ హయాంలో జాప్యమైన కీలక నియామకాలు2019లో ప్రకాష్ జవదేకర్ స్థానంలో డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ విద్యామంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన హయాంలో 2020 జూలైలో నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపీ)ఆమోదం పొందడం ఒక మైలురాయిగా నిలిచినా, దాని రూపకల్పనలో సింహభాగం అంతకుముందే పూర్తయింది. అయితే ఆయన కాలంలో జెఎన్యూ, బీహెచ్‌యూ, ఢిల్లీ వర్సిటీ వంటి ప్రముఖ కేంద్ర విశ్వవిద్యాలయాలకు నెలల తరబడి వైస్‌చాన్సలర్ల నియామకాలు జరగలేదు. అలాగే ఐదు ఐఐటీ సంస్థలకు పూర్తిస్థాయి డైరెక్టర్లను నియమించడంలో తీవ్ర జాప్యం జరిగింది. అనారోగ్య కారణాలరీత్యా ఆయన 2021 జూలైలో పదవికి రాజీనామా చేశారు.ధర్మేంద్ర ప్రధాన్ రాక.. జాతీయ స్థాయిలో సంక్షోభాలురమేష్ పోఖ్రియాల్ నిష్క్రమణ తర్వాత విద్యాశాఖ పగ్గాలు చేపట్టిన ధర్మేంద్ర ప్రధాన్ సుదీర్ఘకాలం పదవిలో కొనసాగినప్పటికీ, ఆయన కూడా వివాదాల నుంచి తప్పించుకోలేకపోయారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ మార్పులు, పాఠ్యాంశాల తొలగింపు వంటి అంశాలపై మేధావులు, విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్నాయంటూ బీజేపీ పాలనలో లేని రాష్ట్రాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.‘నీట్’ తుఫాన్.. పదవిని కోల్పోయిన మంత్రిధర్మేంద్ర ప్రధాన్ హయాంలో ‘నీట్-యూజీ’ ప్రవేశ పరీక్షలో తలెత్తిన పేపర్ లీక్ కుంభకోణం, గ్రేస్ మార్కుల వివాదం దేశవ్యాప్తంగా విద్యార్థులను రోడ్డెక్కేలా చేశాయి. సుప్రీంకోర్టు జోక్యం, సీబీఐ దర్యాప్తు వరకు వెళ్లిన ఈ వ్యవహారం ఎన్టీఏ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసింది. పరీక్షల మాఫియా అంతుచూస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ, దేశవ్యాప్తంగా చెలరేగిన తీవ్ర నిరసనలు, ఆందోళనల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ చివరకు తన విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.ఇది కూడా చదవండి: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామా.. ఎక్కడంటే.. -
హైపవర్డ్ యాక్షన్
దేశంలో తీవ్ర కలకలం రేపిన నీట్ ప్రశ్న పత్రం లీకేజీ వ్యవహారంలో పలు పరిణామాల అనంతరం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినా.. ఆ వేడి మాత్రం ఇంకా తగ్గలేదు. ఆదివారం కూడా ఇదే అంశం చుట్టూ దేశ రాజకీయాలు పరిభ్రమించాయి. ఢిల్లీలో 37 రోజులపాటు చేసిన యువత ఆందోళనలు ఆగిపోయినప్పటికీ.. పరీక్షల్లో లీకేజీలు, అక్రమాల విషయంలో వారిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తిని కేంద్రం గుర్తించింది. ఈ అంశంపై ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, లీకేజీలకు పాల్పడితే పదేళ్ల జైలుశిక్ష వంటి చర్యలు తీసుకునే దిశగా సాగుతున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో సంస్కరణల కోసం హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో ఈ టాస్క్ ఫోర్స్‌ను నియమించినట్లు చెప్పారు. పటిష్ట, పారదర్శక పరీక్ష విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్‌ఫోర్స్ సూచనలు ఇస్తుందన్నారు. మరోవైపు పేపర్ లీకేజీలపై ఉక్కుపాదం మోపడానికి, పరీక్షల వ్యవస్థలో పారదర్శకత పెంచడానికి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు–2026’ను కేంద్రం సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో తాము మరింత విజృంభించాలని విపక్షాలు కూడా భావిస్తున్నాయి. విద్యార్థులపై పాశవికంగా దాడికి దిగడం, వారిపై కేసులు నమోదు చేయడంపై పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలదీయడానికి సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులపై లాఠీచార్జ్ చేసి బాష్పవాయుగోళాలు ప్రయోగించి, పెల్లెట్ గన్స్ వినియోగించాలంటూ అనుమతిచి్చంది మీరేనా? అంటూ హోంమంత్రి అమిత్ షాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖాస్త్రం సంధించారు. మరోవైపు నీట్ ఆందోళనలను పతాకస్థాయికి తీసుకెళ్లి ధర్మేంద్ర ప్రదాన్ చేత రాజీనామా చేయించడంతో విజయం సాధించిన కాక్రోచ్ జనతా పార్టీ కూడా తమ పోరాటాన్ని ఆపేది లేదని స్పష్టంచేసింది. పంజాబ్‌లో ఫార్మసీ రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై త్వరలో ఉద్యమించబోతున్నట్లు ఆ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే సంకేతాలిచ్చారు. ఇలా ఎవరికి వారు తమ హైపవర్డ్ కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంటు సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరీక్షల్లో సంస్కరణలకు టాస్క్‌ఫోర్స్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థలో సంస్కరణలపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. పరీక్షల వ్యవస్థలను ఎలా మెరుగుపరచాలన్న అంశాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు ‘ఇన్ఫోసిస్’ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని నేతృత్వంలో ఒక ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. ఈ మేరకు ఆదివారం ఒక వీడియోను ‘ఎక్స్’లో పోస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా రాబోయే రోజుల్లో పరీక్షల విశ్వసనీయతను మరింత పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. పటిష్టమైన, పారదర్శకమైన పరీక్షా విధానాన్ని ఏర్పాటు చేసేందుకు సాంకేతికతను గరిష్టంగా వినియోగించుకోవడంపై ఆ టాస్క్ ఫోర్స్ సూచనలు ఇస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారు జైళ్లలో మగ్గుతున్నారని చెప్పారు. పేపర్ లీకేజీలు, పరీక్షల్లో అక్రమాలను అరికట్టడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు ఉద్ఘాటించారు. కఠినమైన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని రూపొందించే దిశగా ముందుకు సాగుతున్నామని స్పష్టంచేశారు. ఇందుకు సంబంధించిన బిల్లును సోమవారం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టబోతున్నట్లు వివరించారు. విశ్వసనీయంగా, పారదర్శకంగా... నీట్ పేపర్ లీకేజీ వివాదంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన మరుసటి రోజే హైపవర్డ్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై ప్రధాని స్వయంగా ప్రకటన చేయడం గమనార్హం. మనం భవిష్యత్తు గురించి ఆలోచించాలని ఆయన చెప్పారు. మన పరీక్షా విధానం విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. అలాగే, అందులో సాంకేతిక పరిజ్ఞానాన్ని గరిష్టంగా వినియోగించుకోవాలని అభిప్రాయపడ్డారు. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పరీక్షల సంస్కరణలపై దృష్టి సారించేందుకు ప్రఖ్యాత సాంకేతిక నిపుణుడు నీలేకని నేతృత్వంలో ఉన్నతస్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టాస్క్‌ఫోర్స్ సభ్యులు నీలేకని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన హైపవర్డ్ టాస్క్ ఫోర్స్‌లో మొత్తం ఆరుగురు సభ్యులను నియమించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పరీక్షా విధానాన్ని, ముఖ్యంగా సాంకేతిక కోణంలో వ్యవస్థాగత సంస్కరణల పరంగా పునరుద్ధరించడంలో సహాయపడేందుకు వివిధ రంగాలకు చెందిన నిపుణులకు ఇందులో స్థానం కల్పించింది. → టెక్నాలజీ నిపుణుడు నందన్ నీలేకని → ఇస్రో మాజీ చైర్మన్ ఎస్.సోమనాథ్ → ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ డేకా → ఐఐటీ–చెన్నై డైరెక్టర్ వి.కామకోటి → విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కార్వాల్ → లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనాటెక్నాలజీ దిగ్గజం నీలేకని నందన్ నీలేకని భారతీయులకు సుపరిచితులే. ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్‌కు ఆయన సహ వ్యవస్థాపకుడు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) వ్యవస్థాపక చైర్మన్‌గా సేవలందించారు. ‘ఆధార్’ ప్రాజెక్టు విజయవంతం కావడం వెనుక ఆయనదే కీలకపాత్ర. 2023 జనవరిలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై ఏర్పాటు చేసిన జీ20 టాస్క్ ఫోర్స్ సహ–అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బెంగళూరులో జన్మించిన నందన్ నీలేకని ఐఐటీ–బాంబే నుండి బ్యాచిలర్ డిగ్రీని పొందారు. పద్మభూషణ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు, గౌరవాలు అందుకున్నారు.ఫోర్బ్స్ ఆసియా బిజినెస్‌మేన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, బిజినెస్ స్టాండర్డ్ లైఫ్‌టైమ్ అఛీవ్మెంట్ అవార్డు ఆయనను వరించాయి. ఏక్‌స్టెప్ ఫౌండేషన్‌ను నిలేకని స్థాపించారు. ‘టైమ్స్’ పత్రిక విడుదల చేసిన ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో(2006, 2009), ఏఐ రంగంలో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల(2024) జాబితాలో ఆయన చోటు దక్కించుకున్నారు. వ్యాపారం, ఆవిష్కరణలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల రంగాల్లో అందించిన సేవలకు గాను నీలేకని అనేక అవార్డులను పొందారు.టాస్క్ ఫోర్స్ బాధ్యతలు → నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సంబంధించిన పరీక్షల వ్యవస్థను పునర్వ్యస్థీకరించడం→ పరీక్షల నిర్వహణలో నిర్మాణాత్మక సంస్కరణలను సిఫార్సు చేయడం→ పేపర్ లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి అనైతిక పద్ధతులను అరికట్టడానికి నూతన వ్యవస్థను రూపొందించడం → జాతీయ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహించడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయడం. -
మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ సూత్రధారి.. బిహార్‌లో దొరికాడు
గత కొంతకాలంగా పరారీలో ఉన్న మహారాష్ట్ర టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితుడు బిజేంద్ర గుప్తా ఎట్టకేలకు మహారాష్ట్ర పోలీసులకు చిక్కాడు. బీహార్‌లో అదుపులో తీసుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అతడు బీహార్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడకు వెళ్లి పట్టుకున్నారు. ఈ కేసులో మరో నిందితుడైన అతడి అనుచరుడ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.గుప్తా భార్యతో పాటు మరికొందరిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గుప్తా మాత్రం పోలీసులకు చిక్కకుండా కొంతకాలం పరారీలో ఉండటంతో మహారాష్ట్ర పోలీసులు విస్తృతంగా గాలించారు. పేపర్ లీక్ రాకెట్‌తో బిజేంద్ర గుప్తా భార్యకు కూడా సంబంధం ఉందని.. సిండికేట్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు ఈమె సమక్షంలోనే జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఢిల్లీ, పాట్నాలలో ఆస్తుల కొనుగోలుపై దర్యాప్తు చేస్తున్నారు.బిజేంద్ర గుప్తా భార్యతో సహా 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు దేశవ్యాప్తంగా అనేక పరీక్షల ప్రశ్నపత్రాల లీక్ కేసులతో బిజేంద్ర గుప్తాకు సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.జూన్ 28న జరగాల్సిన మహారాష్ట్ర టెట్ పరీక్షకు ముందు థానేలోని కొంగావ్ ప్రాంతంలో లీకైన ప్రశ్నపత్రాలను విక్రయించడానికి ప్రయత్నిస్తున్న ఆకాష్ కుమార్, రాజీవ్ కుమార్, ధీరజ్ సింగ్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో మహారాష్ట్ర స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ పరీక్షను వాయిదా వేసింది. ఆరు లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం పడింది. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులు బిజేంద్ర గుప్తాను ట్రాన్సిట్ రిమాండ్‌పై రాష్ట్రానికి తీసుకువచ్చారు. -
లోకేష్ తో వెంటనే రాజీనామా చేయించు చంద్రబాబు
-
నీట్ పేపర్ లీక్ వెనుక AI... ఇంటర్ మానేసిన కుర్రోడు.. ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో..!
-
యువతకు ధన్యవాదాలు మోదీ మరో వీడియో వైరల్
-
రాజీనామా కుదరదు!
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఎంతమాత్రం లేదని, అది ఎట్టిపరిస్థితుల్లోనూ సాధ్యం కాదని ప్రభుత్వ వర్గాలు తేల్చిచెప్పాయి. పదవికి రాజీనామా చేయడం చాలా సులభమైన పనే అయినప్పటికీ.. అలా చేస్తే ప్రజలు అప్పగించిన బాధ్యత నుంచి పారి పోవడమే అవుతుందని శుక్రవారం పేర్కొన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి తప్పించాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ, ఆయన రాజీనామా చేయబోరని ప్రభుత్వం విస్పష్టంగా చెబుతుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రజలు మాకు అధికారాన్ని కట్టబెట్టారు. వారి ఆకాంక్షలను నెరవేర్చాల్సిన బాధ్యత మాపై ఉంది’’అని ప్రభుత్వం తేల్చిచెప్పింది. సీజేపీ ప్రతినిధులతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్ సమావేశమైన రోజే ప్రభుత్వ వర్గాల నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. పేపర్ లీకేజీలను అరికట్టే విషయంలో నామమాత్రపు చర్యలు చేపట్టడానికి బదులుగా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)లో వ్యవస్థాగత లోపాలను సరిదిద్దడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఎన్టీఏకు సంబంధించిన లోపాలపై సమగ్ర జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. త్వరలోనే వీటిని సరిదిద్దేందుకు కార్యాచరణ ప్రారంభం కానుంది. పేపర్ లీకేజీల్లో ప్రమేయం ఉన్న ముఠాలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. దోషులపై తదుపరి చర్యలు తీసుకోనున్నామని తెలిపారు. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే దాకా జంతర్‌మంతర్‌వద్ద ఆందోళన కొనసాగిస్తామని సీజేపీ ఇప్పటికే ప్రకటించింది. -
అణచివేయాలని చూస్తే ప్రభుత్వాన్ని తొక్కేస్తారు
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని మోదీ ఎవరితో పెట్టుకోకూడదో వారితోనే పెట్టుకున్నారు. యువతరం సీబీఐ, ఈడీ దాడులకు భయపడే రకం కాదు.. వారి స్వరం మారుతోంది. శ్రీలంకలో ఈ యువతరమే ప్రభుత్వాన్ని పాతరవేసింది. తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతరాన్ని తీవ్ర వాదులు, దేశద్రోహులు పాకిస్తానీలంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఆగ్రహంతో ఉన్న యువత స్వరాన్ని అణచివేయాలని చూస్తే మీ ప్రభుత్వాన్ని ఒక్కో మెట్టు ఎక్కి తొక్కుతారు..’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. ఢిల్లీలో విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అణిచివేతకు, దాష్టీకానికి పాల్పడుతోందని విమర్శిస్తూ భారత్ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) శుక్రవారం ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో కేటీఆర్ ప్రసంగించారు. ‘లీక్ ఇన్ ఇండియా’గా మార్చేశారు.. ‘ఏ రాజకీయ నాయకుడి అండ లేకున్నా దేశ నలుమూలల నుంచి వేలాది మంది ఢిల్లీ జంతర్ మంతర్‌కు తరలి వస్తున్నారు. యువత ఆగ్రహం కేవలం నీట్ పేపర్ లీక్‌కు సంబంధించినదే కాదు. 12 ఏళ్లుగా కేంద్రంలోని బీజేపీ చేస్తున్న మోసాలు, ద్రోహాలపై వారు మండిపడుతున్నారు. పాలనను పక్కదోవ పట్టిస్తూ మతం పేరిట ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పుకుంటున్న తీరును యువత అర్ధం చేసుకుంది. మేకిన్ ఇండియా అడిగితే ‘లీక్ ఇన్ ఇండియా’ను ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం నుంచి యువతరం జవాబుదారీతనాన్ని కోరుకుంటోంది. విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని చూడలేక బీఆర్ఎస్ చేపట్టిన నిరసన వెనుక ఎలాంటి రాజకీయం లేదు.ఇద్దరు పిల్లలకు తండ్రిగా విద్యార్థులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ నిరసనలో పాల్గొంటున్నా. యువతరం ప్రధాన మంత్రి కుర్చీనో, కేంద్ర మంత్రి పదవినో అడగడం లేదు. తమకు న్యాయం చేసి, భవిష్యత్తును కాపాడమని అడగడంలో అన్యాయం ఏముంది? మీడియా మద్దతు లేకున్నా సోషల్ మీడియా అండతో జెన్ జీ యువత దేశాన్ని కదిలిస్తోంది. 50 ఏళ్ల క్రితం ‘జీనాహైతో మర్నా సీఖో.. కదం కదం పర్ లడ్నా సీఖో’అంటూ తెలంగాణ గడ్డ మీద నుంచి ఒక యువకుడు ఇచ్చిన నినాద బలంతో దేశ యువత ప్రస్తుతం పోరాడుతోంది..’అని కేటీఆర్ అన్నారు. భవిష్యత్తు నిర్మాతలు మేల్కొన్నారు.. ‘రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపినట్లు చెప్పుకున్న ప్రధాని ఢిల్లీలో పిల్లల మీద జరుగుతున్న దాడిని ఎందుకు ఆపడం లేదు? మోదీకి వ్యతిరేకంగా గొంతు విప్పితే నొక్కేసే ప్రయత్నం చేస్తూ మీడియాను అడ్డుపెట్టుకుని వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. ఈ దేశ భవిష్యత్తు నిర్మాతలు మేల్కొన్నారు. మీడియాతో ఎజెండాను సెట్ చేసే రాజకీయం ఇకపై నడవదు. కాక్రోచ్లు ఢిల్లీలో దండయాత్ర చేస్తున్నాయి. పిల్లలు గర్జిస్తుంటే విశ్వ గురువు నోరు విప్పడం లేదు. ‘పరీక్షా పే చర్చా’అంటూ ప్రసంగాలు చేసే ప్రధాని ప్రశ్నపత్రాల లీక్‌లకు సమాధానాలు చెప్పాలి. విద్యార్థుల డిమాండ్ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. విద్యార్థులపై దాష్టీకానికి పాల్పడి అక్రమ కేసులు నమోదు చేయడంపై క్షమాపణ చెప్పడంతో పాటు పోలీసు కేసులను వెనక్కి తీసుకోవాలి. రేప్ కేసుల్లో నిందితులుగా ఉన్న కేంద్ర మంత్రులు కుమారులకు బెయిల్ సులభంగా వస్తోంది కానీ పేపర్ లీక్‌లపై ప్రభుత్వం నుంచి సమాధానం ఎందుకు రావడం లేదో బీజేపీ నేతలు చెప్పాలి. రాజకీయ ఎజెండాల పట్ల అప్రమత్తంగా ఉండాలి.. ఢిల్లీలో యువత, విద్యార్థులు చేస్తున్న పోరాటాన్ని పా ర్టీల జెండాలు, ఎజెండాలతో కలుషితం చేయొద్దు. ఎజెండాను హైజాక్ చేసే ప్రయత్నాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. స్వతంత్రంగానే మీ ఎజెండా మేరకు మీ ఉద్యమాన్ని కొనసాగించండి. పా ర్టీలతో కలిసి మీరు కొట్లాడితే మిమ్మల్ని ఆయా పార్టీల ఏజెంట్లు అని మీ ఉద్యమాన్ని, మీ డిమాండ్లను బలహీనపరిచే ప్రమాదం ఉంది. మీకు మా సంపూర్ణ మద్దతు ఉంటుంది. విద్యార్థులు, యువతకు అవసరమైన సమయంలో కేసీఆర్ వెంట నిలుస్తారు. కేంద్రం దిగి వచ్చే దాకా విద్యార్థులకు అండగా ఉంటాం..’అని కేటీఆర్ చెప్పారు. నేను తప్పు చేస్తే నిరూపించి ఉరితీయించు ‘పేపర్ లీక్ అంశంపై రేవంత్‌రెడ్డి నాపై దు్రష్పచారం చేస్తున్నారు. నేను తప్పు చేస్తే నిరూపించి నన్ను ఉరి తీయి. నేను మోదీని ప్రశి్నస్తే రేవంత్‌రెడ్డి అనే కేడీకి కోపం ఎందుకు వస్తోంది? ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలో కొట్లాడుతుంటే నల్లమల పులిని అని చెప్పుకునే రేవంత్ పిల్లిలా కొడంగల్‌లో దాక్కున్నాడు. రేవంత్ కూతురునో, మనవడినో ఢిల్లీలో పిల్లలను కొట్టినట్లు కొడితే ఆయన ఊరుకుంటాడా. దేశమంతా మోదీ, ధర్మేంద్ర ప్రధాన్‌ను ప్రశి్నస్తుంటే రేవంత్ మాత్రం కేటీఆర్, కేసీఆర్‌ను విమర్శిస్తున్నాడు..’అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన యువత బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమానికి యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ, ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేశ్, దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పేపర్ లీక్ చేస్తే.. 10 ఏళ్లు జైలుకే.. మోదీ కేబినెట్ కఠిన నిర్ణయాలు
-
150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు
న్యూఢిల్లీ: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదంపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థుల కోసం నాగాలాండ్‌కు చెందిన ఒక వ్యక్తి చేసిన వినూత్నసహాయం సోషల్ మీడియాలో పలువురి హృదయాలను గెలుచుకుంది. ఏకంగా 150 పిజాలు ఆర్డర్ చేసి, ఆకలిగా ఉన్నవారికి ఇవ్వండి అంటూ మానవత్వాన్ని చాటుకున్న వైనం విశేషంగా నిలుస్తోంది.నాగాలాండ్‌కు చెందిన 'ఝా-లౌ' (Zha-Lhou) అనే వ్యక్తి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన ఊరి నుంచే డొమినోస్ యాప్ ద్వారా 150 "చీజ్ బర్స్ట్" (Cheese Burst) పిజాలను ఆర్డర్ చేసి నేరుగా జంతర్ మంతర్‌కే డెలివరీ చేయించారు. జులై 22న కొరియన్ స్వీట్ చిల్లీ, ఫార్మ్‌హౌస్ రకాలకు చెందిన పిజాలకు మొత్తం బిల్లు రూ. 67,734.18 అయింది. మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేశారు.పిజాలు డెలివరీ చేయడానికి వచ్చిన డెలివరీ బాయ్ ఈ ఆర్డర్ ఎవరికి ఇవ్వాలి? అని ఫోన్ చేసి అడగ్గా, అక్కడ ఇంకా ఆహారం తినకుండా ఆకలితో ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే, వారికి ఇచ్చేయండి అని ఝా-లౌ చెప్పారు.అంతేకాదు ఈ విషయాన్ని ఆయన స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించడం వైరల్‌గా మారింది. "నేను నాగాలాండ్‌లో ఉన్నాను, వేలాది మంది విద్యార్థులు మంచి భవిష్యత్తు, న్యాయమైన విద్యా వ్యవస్థ కోసం జంతర్ మంతర్ వద్ద పోరాడుతున్నారు. ప్రత్యక్షంగా అక్కడ ఉండలేకపోయాను, కాబట్టి నా వంతుగా నేను చేయగలిగిన చిన్న సహాయం ఇది" అని ఆయన తన ఇన్స్టాగ్రామ్ (@adiespoems) ఖాతాలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించేదాకా, చర్చల ప్రసక్తే లేదు : రాహుల్ గాంధీఅంతేకాకుండా, ప్రశంసల కోసం తాను ఈ పోస్ట్ పెట్టలేదని, ఇతరులకు కూడా తమకు తోచిన రీతిలో సహాయం చేసేందుకు ప్రేరణగా ఉంటుందని మాత్రమే షేర్ చేశానని తెలిపారు. ఆ తర్వాత విద్యార్థుల కోసం మరో రూ. 5,000 విలువైన బిస్కెట్లను కూడా ఆర్డర్ చేసినట్లు ఆయన వెల్లడించారు.ఇదీ చదవండి: ఐఫోన్ రాలేదు, ఆయిల్ వచ్చింది.. కట్ చేస్తే రూ. 1.81 లక్ష -
కేంద్రం కీలక నిర్ణయం..10ఏళ్ల జైలు శిక్ష, రూ.10 కోట్ల జరిమానా!
సాక్షి,న్యూఢిల్లీ : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీకేజీ చట్టసవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమల్లోకి వచ్చాయి. ఇకపై పేపర్ లీకేజీకి పాల్పడినట్లు తేలితే ఎంతటి వారైనా పదేళ్ల జైలుశిక్ష, పదికోట్లు జరిమానా విధించేలా కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నీట్ పేపర్ లీకేజీ అంశంపై విద్యార్థులు చేస్తున్న నిరసనల నేపథ్యంలో.. పేపర్ లీక్‌లు, మోసాలకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. పేపర్ లీకేజీ పాల్పడిన నిందితులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అర్ధరాత్రి వీడియో సందేశంలో దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.కొన్ని గంటల వ్యవధిలోనే కేంద్రం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024కు ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ సవరణల ద్వారా చట్టానికి మరింత బలం చేకూర్చింది. రాబోయే మార్పులను వివరిస్తూ పేపర్ లీక్ కేసుల విచారణ కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసే నిబంధనను చట్టంలో చేర్చినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్-ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని తాను ఆదేశించినట్లు ప్రధాని మోదీ గురువారం ఉదయం పోస్ట్ చేశారు. ఈ ఫాస్ట్-ట్రాక్ కోర్టులు మూడు నెలల్లోగా కేసును పరిష్కరించి, శిక్షను ప్రకటించాల్సి ఉంటుంది. పేపర్ లీక్‌లలో పాల్గొన్న వారికి జైలు శిక్ష,జరిమానాలను కూడా పెంచే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన సమావేశంలో కేంద్ర కేబినెట్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. More strict actions against paper leaks to come in tomorrow’s Cabinet! pic.twitter.com/NRysBukk5U— Narendra Modi (@narendramodi) July 23, 2026గురువారం అర్ధరాత్రి ప్రధాని మోదీ వీడియో సందేశంలో పేపర్ లీకేజీకి పాల్పడిన నేరస్తులను పట్టుకున్నాం. వాళ్లిప్పుడు జైల్లో ఉన్నారు. విద్యార్థుల ఎడ్యుకేషన్ ఇయర్ వృథా కాకూడదనే వెంటనే నీట్ పరీక్ష నిర్వహించాం. కనీసం 22 లక్షల మంది విద్యార్థులకు సజావుగా పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం తన పూర్తి శక్తిని వినియోగించింది.ఫాస్ట్-ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించి నేను సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశాను. ఆయా శాఖలు తీవ్రంగా శ్రమించి, రాత్రికి రాత్రే దీనికి ఆమోదం తెలిపాయి. రేపు (శుక్రవారం) దీనిపై మంత్రివర్గంలో చర్చ జరుగుతుంది. మంత్రివర్గ సభ్యుల సూచనల అనంతరం దీనికి తుది రూపం ఇస్తారు. పార్లమెంట్ సమావేశాల రెండో వారం ప్రారంభమయ్యే సోమవారం నుంచే, ఆ బిల్లును వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు ప్రయత్నిస్తాం’అని అన్నారు.ప్రధాని మోదీ వీడియో ప్రకటనపై స్పందిస్తూ.. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థులు కోరుకుంటున్నారంటూ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి నొక్కి చెప్పారు. -
NEET పేపర్ లీక్ పై మోదీ సంచలన వీడియో
-
బూటు కాళ్లతో తన్ని.. పిడిగుద్దులు గుద్ది..
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జిని ఖండించడంతోపాటు నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు విజయవాడలో చేపట్టిన చలో లోక్‌భవన్ కార్యక్రమం గురువారం ఉద్రిక్తంగా మారింది. విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునివ్వడంతో ముందస్తుగా పోలీసులు లోక్‌భవన్‌కు వెళ్లే మార్గాలన్నింటినీ దిగ్బంధించారు. మ్యూజియం రోడ్డు, బందరు రోడ్డులో అడుగడుగునా బారికేడ్లు ఏర్పాటుచేశారు. పోలీసులు భారీగా మోహరించారు.శాంతియుతంగా ర్యాలీ చేస్తూ లోక్‌భవన్‌కు వెళ్తున్న విద్యార్థులను అడుగడుగునా అడ్డుకున్నారు. అయినా అన్ని ఆటంకాలను అధిగమించి విద్యార్థులు, యువకులు భారీగా మ్యూజియం రోడ్డు నుంచి బందరు రోడ్డుకు చేరుకోవడంతో పోలీసులు అవాక్కయ్యారు. వారిని అడ్డుకునేందుకు తీవ్రంగా యత్నించారు. అయినా విద్యార్థులు బారికేడ్లను నెట్టుకుంటూ లోక్‌భవన్‌కు వెళ్లేందుకు బందరు రోడ్డు వెంట పరుగులు తీశారు. దీంతో పోలీసులు వారి వెంటపడ్డారు. ఈ సమయంలో పోలీసులు, విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది.సివిల్ దుస్తుల్లో ఉన్న కొందరు పోలీసులు విద్యార్థులను రోడ్డుపై పడేసి కాలర్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. వారిపై పిడిగుద్దులు కురిపించారు. రోడ్డుకేసి కొడుతూ బూటుకాళ్లతో తన్నారు. విద్యార్థినులు, యువతులపైనా విచక్షణారహితంగా దాడిచేశారు. దీంతో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. కొందరు సొమ్మసిల్లి పడిపోయారు. ఒకరిద్దరు పోలీసులు విద్యార్థి సంఘాల కండువాలు కప్పుకుని మరీ విద్యార్థులపై దాడికి పాల్పడడం గమనార్హం. ఏఎస్సై రవికుమార్ ఓ విద్యార్థిపై దాడి చేయడంతో మిగిలిన విద్యార్థులు ఆయనను అడ్డుకున్నారు.రోడ్డుపై బైఠాయింపు అనంతరం.. విద్యార్థి సంఘాల ప్రతినిధులను లోక్‌భవన్‌కు తీసుకెళ్తామని, గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పిస్తామని పోలీసు అధికారులు నమ్మబలికారు. అయితే, అపాయింట్మెంట్ ఇప్పించే వరకు వెనక్కు వెళ్లేది లేదంటూ మ్యూజియం రోడ్డులో విద్యార్థులు భైఠాయించారు. గంట తర్వాత గవర్నర్ అపాయింట్మెంట్ దొరకలేదని, వెనక్కు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడంతో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది. లోక్‌భవన్‌కు వెళ్లేందుకు విద్యార్థులు ముందుకు కదిలారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు మరోసారి వారిపై దాడి చేశారు. ఈడ్చిపడేస్తూ మ్యూజియం రోడ్డులోకి నెట్టేశారు.పోలీసుల దాడిని విద్యార్థులు ప్రతిఘటించారు. పోలీసుల తీరు, చంద్రబాబు సర్కారు వైఖరిపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె. ప్రసన్నకుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజు, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు భాస్కర్ తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా శుక్రవారం జరపతలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
జవాబుదారీతనం పెంచేలా లేదు
న్యూఢిల్లీ: పేపర్ లీక్ కేసుల్లో విచారణ పట్ల ప్రధాని మోదీ చేసిన ప్రకటనపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) అసంతృప్తి వ్యక్తంచేసింది. మోదీ ప్రకటన పరీక్షల్లో జవాబుదారీతనం పెంచేలా లేదని పేర్కొంది. నీట్–యూజీ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని పునరుద్ఘాటించింది. ఈ మేరకు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘హాయ్.. నా పేరు ఏమీ లేదు’అనే శీర్షికతో ధర్మేంద్ర ప్రధాన్ ఫొటోను షేర్ చేశారు. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసేదాకా జంతర్‌మంతర్‌ను వదిలిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదని సీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అశుతోష్ రాంకా తేలి్చచెప్పారు. పేపర్ లీక్ కేసులపై మోదీ స్పందించడాన్ని స్వాగతిస్తున్నామని, అయితే అసలైన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేదని ఆక్షేపించారు. ప్రశ్నపత్రం లీక్ అయిన శిక్ష విధిస్తామంటే ప్రయోజనం ఉండదన్నారు. దానివల్ల సమస్య పరిష్కారం కాదన్నారు. అసలు ప్రశ్నపత్రాల లీకేజీ ఎందుకు జరుగుతోందన్నదే అసలైన ప్రశ్న అని పేర్కొన్నారు. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలని చెప్పారు. గాయం అయిన తర్వాత మందు పూయడం కంటే అసలు ఆ గాయం జరగకుండా నివారించడమే తెలివైన పని అని సూచించారు. వ్యవస్థను నడిపే వారికి జవాబుదారీతనం, సామర్థ్యం లేకపోవడం వల్లే ఇలాంటి గాయాలు పునరావృతం అవుతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సరిపోవచ్చని చెప్పారు. పేపర్ లీక్ అంశంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఇప్పుడు ప్రధాని మోదీ వైపు ఎక్కువగా మళ్లుతోందని, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నిరసనకారుల సంఖ్య పెరుగుతోందని రాంకా పేర్కొన్నారు. -
ఆగని ‘లీకేజీలు’.. ఉత్తరాఖండ్‌లో వర్శిటీ పరీక్షలు రద్దు!
డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ‘వీర్ మాధో సింగ్ భండారి ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ’కి చెందిన రెండు సెమిస్టర్ పరీక్షల ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే లీకయ్యాయి. విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రొఫెసర్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రశ్నపత్రాలను ముందుగానే షేర్ చేసినట్లు విచారణలో తేలడంతో, వర్సిటీ యంత్రాంగం ఆ రెండు పరీక్షలను రద్దు చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని 12 ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయాల్సి వస్తున్నది.డెహ్రాడూన్‌లోని శివాలిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆశిష్ కుమార్ గుప్తా.. విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లు, ఆన్లైన్ పోర్టల్‌లో ప్రశ్నపత్రాలను షేర్ చేసినట్లు వర్సిటీ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు ఒక హైలెవల్ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. వర్సిటీ కమిటీ, కాలేజ్ ఇంటర్నల్ ఎంక్వైరీలో ఈ ఆరోపణలు ప్రాథమికంగా నిజమని తేలాయి. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకున్న వర్శిటీ.. ప్రొఫెసర్ డాక్టర్ ఆశిష్ కుమార్ గుప్తాను రాబోయే ఏడేళ్ల పాటు విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఎలాంటి పరీక్షల విధుల్లోనూ పాల్గొనకుండా నిషేధించింది.అదే విధంగా పరీక్షల గోప్యతను కాపాడటంలో విఫలమైనందుకు శివాలిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు కూడా తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. ‘మెషిన్ లెర్నింగ్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’, ‘ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ’ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసినట్లు పరీక్షల కంట్రోలర్ డాక్టర్ వీకే పటేల్ తెలిపారు. రద్దయిన ఈ రెండు పేపర్లకు సంబంధించిన పరీక్షలను ఆగస్టు మూడో వారంలో తిరిగి నిర్వహిస్తామన్నారు. ఈ పేపర్ లీక్ వ్యవహారం బయటపడటానికి రెండు రోజుల ముందు డెహ్రాడూన్‌లో విద్యార్థులు నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. -
పేపర్ లీకేజీ... ఘోరమైన పాపం
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన నీట్–యూజీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ప్రశ్నపత్రాలను లీక్ చేయడం ‘ఘోరమైన పాపం’గా అభివర్ణించారు. ఈ పాపానికి ఒడిగట్టినవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. యువత భవిష్యత్తుతో ఆటలాడితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టంచేశారు. మంగళవారం పార్లమెంట్ లైబ్రరీ భవనంలో ‘మంగళ్ మిలన్’పేరిట జరిగిన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తమ కూటమి ఎంపీలను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. పేపర్ లీక్ అనేది పార్టీల రాజకీయాలకు సంబంధించిన అంశం కాదని.. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశమని వెల్లడించారు. ఈ జాఢ్యాన్ని అంతం చేయడానికి కేంద్రం, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలతో ఆప్యాయత, అనురాగంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాలని, యువత విశ్వాసాన్ని పొందాలని ఎన్డీయే ఎంపీలకు సూచించారు. ‘మంగళ్ మిలన్’ముగిసిన అనంతరం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. మోదీ ప్రసంగం వివరాలను వెల్లడించారు. ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వార్తలు రాగానే ప్రభుత్వం తక్షణమే స్పందించిందని, 13 మందిని అరెస్టు చేసి జైలుకు పంపిందంటూ ప్రధానమంత్రి చెప్పారని వెల్లడించారు. ఈ సమావేశం ఎంతో ఫలప్రదంగా సాగిందని, ప్రధాని అనేక ముఖ్యమైన అంశాలపై మాట్లాడారని రిజిజు పేర్కొన్నారు. యువతతో ఎంపీలు మమేకం కావాలి విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ‘నీట్’పునఃపరీక్షకు ప్రాధాన్యతనిచి్చ, దానిని విజయవంతంగా నిర్వహించి, ఫలితాలను ఎటువంటి జాప్యం లేకుండా ప్రకటించినట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పేపర్ లీక్‌లు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటుందన్నారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన కీలకమైన అంశంలో రాజకీయాలు చేయడం తగదని పేర్కొన్నారు. యువత విశ్వాసాన్ని పొందాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా యువతతో మమేకం కావాలన్నారు.వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించాలని చెప్పారు. నీట్ పేపర్ లీకేజీలో ప్రమేయం ఉన్నవారికి కఠిన శిక్ష పడేలా చూసేందుకు అత్యంత సమర్థులైన న్యాయవాదులను రంగంలోకి దించినట్లు గుర్తుచేశారు. దోషులను శిక్షించాలని, పేపర్ లీకేజీలు జరగకుండా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉద్ఘాటించారు. విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకూడదని అన్నారు. వారిని తప్పుదోవ పట్టించడం సులభమే అయినప్పటికీ సరైన మార్గంలో నడిపించడం మాత్రం కష్టమని వ్యాఖ్యానించారు. వారు మంచిమార్గంలో నడిచేలా చూడడం మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ, యువత భవిష్యత్తు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలన్నారు. ఎఫ్‌టీఏలతో దేశానికి లాభం అలాగే గత కొన్ని నెలల్లో దేశం సాధించిన విజయాల మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవల అనేక దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల(ఎఫ్‌టీఏ) గురించి ఎన్డీయే ఎంపీలకు వివరించారు. ఈ ఒప్పందాలతో మన రైతాంగానికి, మన దేశానికి లాభమే తప్ప ఎలాంటి నష్టం జరగదన్నారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. దేశ శ్రేయస్సు కోసం జీవితంలోని ప్రతి క్షణాన్నీ అంకితం చేయాలని ఎంపీలను కోరారు. ‘‘దేశమే ప్రథమం, దేశ పురోగతి, సంక్షేమం కోసం మనం నిరంతరంకృషి చేయాలి’’అని పిలుపునిచ్చారు. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన సభ్యులకు ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ‘‘ప్రధాన సేవక్ (ప్రధాని మోదీ) శరీరంలోని ప్రతి అణువూ, ఆయన సమయంలోని ప్రతి క్షణమూ పిల్లల భవిష్యత్తు కోసమే అంకితం’’ అని బీజేపీ ‘ఎక్స్’లో పోస్టు చేసింది. -
ప్రధాని నివాసం 'యుద్ధరంగం'
న్యూఢిల్లీ: నీట్–యూజీ పేపర్ లీక్ అంశంపై ప్రతిపక్షాల ధర్నాతో ఢిల్లీ లోక్‌కల్యాణ్ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాస ప్రాంతం అట్టుడికింది. న్యాయం చేయాలని కోరిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని విపక్షాలు మంగళవారం గొంతెత్తాయి. కాంగ్రెస్ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్ సహా పలు పార్టీల ఎంపీలు, నేతలు హైసెక్యూరిటీ జోన్ అయిన ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాల హోరుతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అరుపులు, తోపులాటలతో యుద్ధ రంగాన్ని తలపించింది. దాదాపు 20 నిమిషాల తర్వాత కేంద్ర ప్రభుత్వ దూతగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్‌తో కలిసి ధర్నా స్థలికి చేరుకున్నారు. నిరసన విరమించాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఫోన్లో మాట్లాడారు. నీట్–యూజీపై పార్లమెంట్లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు కాంగ్రెస్ నేతలు అంగీకరించలేదు. మోదీ రాజీనామా చేయాల్సిందేనని, లేకపోతే రాత్రంతా ఇక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. చేసేది లేక జితేంద్ర సింగ్ వెనుదిరిగారు. ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు విధించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు తమ చేతులను తాళ్లతో కట్టేసుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగింది. చివరకు పోలీసులు ప్రతిపక్ష నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకొని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు..విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై దాడి జరిగినట్లేనని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఎలాంటి సమాధానాలు చెప్పకుండా, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోకుండా తప్పించుకోగలనని ప్రధాని మోదీ భావిస్తున్నారని.. కానీ, ఈసారి అలా చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. మన విద్యార్థులకు న్యాయం జరగాలని విశ్వసించే దేశభక్తి గల ప్రతి భారతీయుడు ఈ ధర్నాలో తమతో చేరాలని రాహుల్ కోరారు. విద్యార్థుల గళాన్ని ఎవరూ విస్మరించలేరని చెప్పారు. ‘‘సోమవారం విద్యార్థులపై జరిగిన అరాచకాలకు సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం కోరేందుకు ఆయన నివాసానికి ర్యాలీగా వెళ్లాం. జరిగిన దానికి బాధ్యత వహించడానికి గానీ, దీనిపై పార్లమెంట్లో చర్చ జరపడానికి గానీ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి రాజీనామా చేయాలి. విద్యార్థుల హక్కులు, వారి న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుంది’’ అని రాహుల్ గాంధీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘విద్యార్థులపై లాఠీచార్జి, బలప్రయోగం చేసినందుకు ఈ పిరికిపంద, నియంతృత్వ ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు. మోదీ, అమిత్ షా మన యువత పట్ల తప్పు చేశారు. వారు పదవుల నుంచి తప్పుకోవాల్సిందే’’ అని మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. విద్యార్థులకు న్యాయం చేసి, వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే దాకా తమ పోరాటం ఆపబోమని కాంగ్రెస్ ఎంపీ పవన్ ఖేరా పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకూ వెనక్కి తగ్గబోమన్నారు. పోలీసులు తమపై బలప్రయోగం చేశారని కొందరు ఎంపీలు ఆరోపించారు. సోమవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.అరెస్టు.. విడుదల ప్రధానమంత్రి నివాసం ఎదుట బైఠాయించిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టుచేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులను కాంగ్రెస్ శ్రేణులు ప్రతిఘటించేందుకు ప్రయత్నించాయి. పోలీసులను తనను అరెస్టు చేసే సమయంలో రాహుల్ గాంధీ నేలపై పడుకొని కనిపించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆయనకు స్వల్ప గాయమైంది. రాహుల్‌కు, అఖిలేష్ యాదవ్‌ను పోలీసులు నిర్బంధించి, ఛత్రసాల్ స్టేడియంకు తరలించారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుతం అమలవుతోంది’’ అని రాహుల్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నేతలు. చిత్రంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, అనిల్‌కుమార్ యాదవ్ తదితరులు రాహుల్ గాంధీ కంటి కింద గాయం కావడంతోపాటు చేతులు, కాళ్లపై కూడా స్వల్ప గాయాలయ్యాయని కాంగ్రెస్ నేతలు చెప్పారు. రాహుల్ ముక్కు నుంచి రక్తం కారినట్లు తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తున్న ఫొటోలను ఆయన ‘ఎక్స్’లో షేర్చేశారు. ‘‘మోదీజీ, మీరు ఎంత ఒత్తిడి తెచ్చినా, మీ సర్వశక్తులు ఒడ్డినా సరే విద్యార్థుల న్యాయం జరగడం కోసం సాగుతున్న ఈ పోరాటం మాత్రం ఇప్పుడు ఆగదు’’ అని ఉద్ఘాటించారు. మంగళవారం రాత్రి రాహుల్, అఖిలేష్‌ను ఛత్రసాల్ స్టేడియం నుంచి పోలీసులు విడుదల చేశారు. ప్రియాంక గాంధీని మందిర్‌మార్గ్ స్టేషన్‌కు తరలించారు. ఆమె తల్లి సోనియా గాంధీ స్టేషన్‌కు చేరుకొని ప్రియాంకను పరామర్శించారు. తర్వాత ప్రియాంకను పోలీసులు విడుదల చేశారు.పార్టీ నేతలను అరెస్టు చేసి తరలించిన మందిర్‌మార్గ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సోనియాగాంధీ రాహుల్ గాంధీ మాట మార్చారు నీట్–యూజీకి సంబంధించిన అన్ని అంశాలపై, దానిపై జరుగుతున్న ఉద్యమంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై చర్చకు అంగీకరించిన రాహుల్ గాంధీ కొద్ది నిమిషాల్లోనే వెనక్కి తగ్గారని, ఆ స్థాయి నాయకుడికి ఇది తగదని పేర్కొన్నారు. పార్లమెంట్లో చర్చించడంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలని పట్టబట్టారని చెప్పారు. నీట్–యూజీపై పార్లమెంట్లో నిబంధనల ప్రకారం అధికారిక చర్చ కోసం కాంగ్రెస్ ఇప్పటివరకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు. రాహుల్ గాంధీ వంటి సీనియర్ నాయకుడు, ప్రతిపక్ష నేత మాట తప్పడం దురదృష్టకరం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని జితేంద్ర సింగ్ ఆక్షేపించారు. పార్లమెంట్లో చర్చకు ఇకనైనా ముందుకు రావాలని ప్రతిపక్షాలకు సూచించారు. -
వాంగ్‌చుక్ దీక్ష భగ్నం!
న్యూఢిల్లీ: సామాజిక ఉద్యమకారుడు, పర్యా వరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నిరవధిక నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చే యాలన్న డిమాండ్‌తో దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆయన సాగిస్తున్న దీక్ష 21వ రోజుకు చేరుకోగా, ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తుండడంతో ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా దీక్షా వేదిక వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులను అడ్డుకొనేందుకు వాంగ్‌చుక్ మద్దతుదారులు ప్రయత్నించారు. వాంగ్‌చుక్‌తోపాటు జూన్ 28న నిరాహార దీక్ష ప్రారంభించిన ఆలిండియా స్టూడెంట్స్ అసోసియేషన్(ఏఐఎస్ఏ) సభ్యులు నేహా, అమీన్, మనీష్ ను సైతం అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. ముగ్గురూ యథాతథంగా దీక్ష కొనసాగిస్తున్నారు. మరో వైపు వాంగ్చుక్ను ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే నిరాహార దీక్ష ప్రారంభించారు. జంతర్‌మంతర్ వద్ద ఆయనపై ఓ మహిళ సిరా చల్లడం సంచలనాత్మకంగా మారింది. వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేయడాన్ని కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ తదితరులు తీవ్రంగా ఖండించారు. వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించలేదని, ఆసుపత్రి నుంచే దీక్షను కొనసాగిస్తారని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ‘ఎక్స్’లో పోస్టుచేసింది. నాటకీయ పరిణామాలు వాంగ్‌చుక్ దీక్షను భగ్నం చేసే విషయంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు ఒక్కరోజు ముందే కేంద్ర హోంశాఖ ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీశ్ గోల్చాను ఆకస్మికంగా తప్పించి, ఆయన స్థానంలో అనురాగ్ కుమార్‌ను నియమించింది. కొత్త కమిషనర్ వెంటనే తన కార్యాచరణ ప్రారంభించారు. శుక్రవారం రాత్రి పోలీసు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శనివారం తెల్లవారుజామున సిబ్బందితో సహా హాజరు కావాలని ఆదేశించారు. ‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాల భద్రతా సన్నాహాల‘పేరుతో పోలీసులు ఉదయం 5 గంటలకు జంతర్‌మంతర్ వద్దకు చేరుకున్నారు. దీక్షలు జరుగుతున్న ప్రాంతంలో మొబైల్ ఫోన్ జామర్ ఏర్పాటు చేశారు. సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసులు దీక్షా వేదిక చుట్టూ తెల్ల దుప్పట్లు ఏర్పాటు చేసి వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. ఈ దృశ్యాలను ఎవరూ ఫోన్లలో చిత్రీకరించకుండా తెల్ల దుప్పట్లను అడ్డంగా పెట్టారు. పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు మానవహారంగా నిలిచారు. అయినప్పటికీ దాదాపు ఐదుగురు పోలీసులు వాంగ్చుక్ను బలవంతంగా అంబులెన్స్‌లోకి చేర్చి, వెంటనే సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. కోర్టు ఆదేశాల మేరకే వాంగ్చుక్ను ఆసుపత్రిలో చేర్చామని, ఆయనకు వైద్య చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలోని కీలక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్ చికిత్సకు వాంగ్‌చుక్ నిరాకరిస్తున్నారని డాక్టర్లు చెప్పారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని చికిత్సకు అంగీకరించేలా కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంట్రావీనస్ ఫ్లూయిడ్స్, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇతర ఔషధాలను తీసుకోవడానికి నిరాకరించారని పేర్కొన్నారు. ఈ మేరకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. 59 ఏళ్ల వాంగ్‌చుక్ 20 రోజులుగా ఘనాహారం తీసుకోలేదు. ఆరోగ్యం క్షీణించింది. ప్రస్తుతం స్పృహలోనే ఉన్నారని వైద్యులు తెలియజేశారు. అలాగే నాడి, రక్తపోటు, ఆక్సిజన్ స్థాయిలు స్థిరంగా ఉన్నాయని, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపించాయని వివరించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చికిత్సకు అంగీకరించేలా ఒప్పించాలని వాంగ్‌చుక్ కుటుంబ సభ్యులను డాక్టర్లు కోరారు. అసత్యం, హింస మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలు: కాంగ్రెస్ జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొంటున్న సోనమ్ వాంగ్చుక్ను అక్కడి నుంచి తరలించడంపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని అత్యంత అప్రజాస్వామిక రాజకీయ పార్టీ పాలించడం సిగ్గుచేటు అని పేర్కొంది. ‘‘గంగా నదిని కాపాడేందుకు 111 రోజుల పా టు ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రొఫెసర్ జి.డి. అగర్వాల్‌ను, హరియాణాకు చెందిన ఒలింపిక్ రెజ్లర్లను, దేశానికి అన్నం పెట్టే 750 మంది రైతులు, దళితులు, ఆదివాసీలను, పరీక్షా పత్రాల లీకేజీ బాధితులైన 25 మంది విద్యార్థులను, వారి కుటుంబాలను ఈ నియ ంతృత్వ ప్రభుత్వం వదిలిపెట్టలేదు’’అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా గొంతెత్తితే దేశద్రోహిగా లేదా పరాన్నజీవిగా ముద్ర వేస్తారని మండిపడ్డారు. ‘‘ఈ రోజు జంతర్‌మంతర్ వద్ద జరిగిన సంఘటన మన ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై మరో మరక’’అని ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అహింసాత్మక నిరాహార దీక్షలో ఉన్న వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి తొలగించడం ముమ్మా టికీ తప్పేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు. అసత్యం, హింస నేడు మోదీ ప్రభుత్వ సిద్ధాంతాలుగా మారాయని ఆరోపించారు. విద్యార్థుల సమస్యలపై పోరాటం సాగించకుండా ఏ రకమైన బలప్రయోగం కూడా అడ్డుకోలేదని తేల్చిచెప్పారు. ఖండించిన విపక్ష నేతలు వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తరలించడాన్ని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, సీపీఎం నాయకురాలు బృందా కారత్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్, ఎంపీలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా, ఎన్సీపీ(ఎస్పీ) నేత శరద్ పవార్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్æయాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి, శివసేన(ఉద్ధవ్) నాయకుడు ఆదిత్య ఠాక్రే తదితరులు తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా సాగుతున్న పోరాటాన్ని బలప్రయోగంతో అణచి వేయాలనుకోవడం దారుణం అంటూ మండిపడ్డారు. దీక్షలో నేను కూడా పాల్గొంటా: భగవాన్ దీప్కే పాకిస్తాన్ పౌరులు కాకుండా.. భారతీయ పౌరులైన విద్యార్థుల పట్ల మన ప్రభుత్వం ఇంతటి నిర్దయతో ఎలా వ్యవహరించగలదని అభిజిత్ దీప్కే తండ్రి భగవాన్ దీప్కే ప్రశ్నించారు. జంతర్‌మంతర్ వద్ద తన కుమారుడు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్యార్థులు నిరవధిక నిరాహార దీక్షలు చేస్తు న్నారని చెప్పారు. ఎవరైనా చనిపోయే వరకు ప్రభుత్వం వేచి చూస్తుందా? అని ప్రశ్నించారు. విద్యార్థులు లేవనెత్తిన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తన కుమారుడు చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలో తాను కూడా పాల్గొంటానని తేల్చిచెప్పారు. వెంటనే డిశ్చార్జి చేయాలి: గీతాంజలి తన అనుమతి లేకుండా వాంగ్చుక్కు ఎలాంటి చికిత్స అందించవద్దని ఆయన భార్య గీతాంజలి జె.ఆంగ్మో అన్నారు. తన భర్తను ఆసుపత్రి నుంచి వెంటనే డిశ్చార్జి చేయాలని కోరారు. వైద్య సంరక్షణలో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. ఈ మేరకు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. వాంగ్‌చుక్ మెడికల్ రిపోర్టుల కాపీలు తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిపై నమ్మకం సన్నగిల్లడం, చికిత్సలో పారదర్శకత లోపించడం వంటి కారణాలను ప్రస్తావిస్తూ ఆయనను తమ కుటుంబం ఎంపిక చేసుకున్న ఆసుపత్రికి తరలిస్తామని స్పష్టంచేశారు. వాంగ్‌చుక్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని తెలియజేశారు. జూలై 20న తలపెట్టిన పార్లమెంట్ మార్చ్ కచ్చితంగా జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. అయితే, మెడికల్ రిపోర్టులు ఇచ్చేందుకు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నిరాకరించింది. అభిజిత్ దీప్కేపై సిరాతో దాడి మరోవైపు తాను నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్లు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ప్రకటించారు. జంతర్‌మంతర్ వద్ద ఓ మహిళ దీప్కేతో మాట్లాడుతూ తన చేతిలో ఉన్న సిరాను ఆయనపై చల్లడంతో ఒక్కసారిగా నిరసనలు మిన్నంటాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె వివరాలు, దాడికి గల కారణాలు ఇంకా వెల్లడికాలేదు. ఢిల్లీ పోలీసులు తనపై దాడి చేసి అదుపులోకి తీసుకున్నారని, జంతర్‌మంతర్ నిరసన ప్రాంగణంలోకి అనుమతించ లేదని దీప్కే ఆరోపించారు. ఈ చర్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా శాంతియుత నిరసనలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎవరు ఎంతగా అణచివేసినా తమ ఉద్యమం కొనసాగుతుందని, ప్రధాని నరేంద్ర మోదీ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. -
విద్యాసంస్థలపై పార్టీలకు, సంస్థలకు పెత్తనం తగదు
డెహ్రాడూన్: దేశంలోని విద్యాసంస్థలపై ఏ ఒక్క రాజకీయ పార్టీకి లేదా సంస్థకు పెత్తనం ఉండరాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ ఘటనలపై రాజకీయ ఏకాభిప్రాయం అవసరమని, ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని ఆయన చెప్పారు. శుక్రవారం సాయంత్రం డెహ్రాడూన్‌లో ఆయన కాంగ్రెస్ చేపట్టిన చాత్రోం కీ గుంజ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. విద్యావ్యవస్థలో అట్టడుగు నుంచి అత్యున్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరూ పేపర్ లీకేజీలకు కారణమని, వీటి కారణంగా ఇప్పటి వరకు కనీసం 7.5 కోట్ల మంది విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. కోచింగ్ సెంటర్లు, పరీక్ష కేంద్రాలు, పేపర్ రూపకల్పన చేసేవారు, ట్రాన్స్‌లేటర్లు, రవాణాదారులు, విక్రేతలు ఇంకా, ఎన్టీఏ, అన్నిటికంటే పైన విద్యాశాఖ మంత్రి సహా మొత్తం వ్యవస్థ అంతా ఈ అక్రమాలకు కారణమయ్యారని ఆరోపించారు. వీరిపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ‘మన విద్యాసంస్థలు స్వతంత్రంగా ఉండాలి. ఏ ఒక్క రాజకీయ పార్టీ, లేదా సంస్థ మన విద్యాసంస్థలపై పెత్తనం చేయరాదు. ఎన్టీఏ చీఫ్, వర్సిటీల వైస్ చాన్స్లర్లుగా ఏదో ఒక సంస్థతో సంబంధాలున్న వారిని నియమించరాదు’అని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ ఘటనలను అంతం చేయాలంటే రాజకీయ ఏకాభిప్రాయం ఎంతో అవసరమని ఆయన తెలిపారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యతని రాహుల్ పేర్కొన్నారు. లాభాపేక్ష మాత్రమే కలిగి ఉండే ప్రైవేట్ సంస్థలకు పరీక్షల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించరాదని తెలిపారు. పరీక్షల నిర్వహణ ప్రభుత్వ బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. పేపర్ లీకేజీ ఘటనలు బయటకు వచ్చిన వెంటనే బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదే సమయంలో, బాధితులైన విద్యార్థులకు పరిహారం చెల్లించడం, రక్షణ కల్పించడం, వెంటనే మళ్లీ పరీక్ష నిర్వహించడం వంటి తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. -
21న ఎన్డీఏ కీలక సమావేశం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ, అయోధ్య విరాళాల చోరీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో, దీన్ని తిప్పికొట్టాలని అధికారపక్షం ఎన్డీఏ సిద్ధమవుతోంది. ఈనెల 21న అత్యంత కీలకమైన పార్లమెంటరీ సమావేశం నిర్వహించనుంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల (జూలై 20 నుంచి ఆగస్టు 13) సందర్భంగా ఈ భేటీ జరగనుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. మోదీ ప్రభుత్వం తన శాసన, పరిపాలనాపరమైన ఎజెండాను నిర్దేశించడానికి ఎన్డీఏ సమావేశం దోహదం చేయనుంది. జోరుగా ప్రచారం సాగుతోన్న కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అంశం కూడా ఈ ఎజెండాలో అన్నింటి కంటే ముఖ్యంగా ఉంటుందనే ఊహగానాలు సాగుతున్నాయి. ప్రతిపక్ష పారీ్టల్లో ఇటీవల వచ్చిన చీలికలు, పెరిగిన సంఖ్యాబలం నేపథ్యంలో తమ ప్రతిష్టాత్మక బిల్లులను ఆమోదింపజేసుకోవడమే లక్ష్యంగా ఎన్డీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సన్నద్ధతలో భాగంగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఈనెల 17న ఎన్డీఏ మంత్రుల వ్యూహాత్మక సమావేశం జరగనుంది. అలాగే, 19వ తేదీన అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ బిల్లును గట్టెక్కించేందుకు.. ఏప్రిల్ జరిగిన బడ్జెట్ సమావేశాల్లో మూడింట రెండొంతుల మెజారిటీ లేకపోవడంతో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు (నియోజకవర్గాల పునరి్వభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లు)ను కొన్ని మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. లోక్‌సభ స్థానాల సంఖ్యను దాదాపు 850కి పెంచడం, అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా 50 శాతం సీట్లు పెంచేలా ప్రతిపాదన తేవడం ద్వారా ప్రాంతీయ పారీ్టల మద్దతు కూడగట్టాలని భావిస్తోంది. ఇటీవల టీఎంసీలోని 20 మంది ఎంపీలు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)గా చీలిపోయి ఎన్డీఏకి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే శివసేన (యూబీటీ) నుంచి ఆరుగురు లోక్‌సభ ఎంపీలు షిండే వర్గంలో చేరారు. రాజ్యసభలో ముగ్గురు టీఎంసీ ఎంపీలు, ఏడుగురు ఆప్ ఎంపీలు బీజేపీలోకి చేరారు. ఈ కొత్త సమీకరణలతో పార్లమెంటు ఉభయ సభలలో బలం పుంజుకున్న ఎన్డీఏ ఈసారి 131వ రాజ్యాంగ సవరణ బిల్లును గట్టెక్కించాలని చూస్తోంది. -
ఢిల్లీలో వాంగ్‌చుక్ నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ ముందుగా ప్రకటించిన విధంగానే ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష ప్రారంభించారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్రమే బాధ్యత వహించాలని, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. వాంగ్‌చుక్ దీక్షకు కాక్రోచ్ జనతా పార్టీ మద్దతు తెలిపింది. ఆ పార్టీ కూడా 20వ తేదీ నుంచి ఇదే వేదికపై నీట్ పేపర్ లీకేజీపై ఆందోళన కొనసాగిస్తుండటం తెల్సిందే. దీక్ష ప్రారంభించడానికి ముందుగా వాంగ్‌చుక్, సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలిసి రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం జంతర్‌మంతర్‌లో నిరసన స్థలిలో అంతా కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. వందల సంఖ్యలో హాజరైన విద్యార్థులు, యువకులు తరలివచ్చి వాంగ్‌చుక్ దీక్షకు మద్దతు ప్రకటించారు. -
28 నుంచి జంతర్‌మంతర్‌లో నిరాహార దీక్ష
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేని పక్షంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేపడతానని ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) చేపడుతున్న నిరసనలకు ప్రభుత్వం నుంచి స్పందన కోసం ఈ నెల 27వ తేదీ వరకు ఎదురుచూస్తానన్నారు. విద్యారంగంలో జవాబుదారీతనం, తన సొంత లద్దాఖ్ పర్యావరణం, సంస్కృతి, అక్కడి ప్రజల సంక్షేమానికి సంబంధించిన విషయాలలో జవాబుదారీతనం అనే రెండు కీలక అంశాలపైనే తన దృష్టి ఉందన్నారు. విద్యను ప్రభావితం చేసే నిర్ణయాల్లో పౌరులకు స్థానం ఉండాలని, అలాగే పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునే విషయాల్లో లద్దాఖ్ ప్రజల అభిప్రాయాలకు విలువివ్వాలని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. శనివారం కల్లా ఈ రెండింటిపై స్పందన రాకపోతే, సీజేపీ నాయకులతో కలిసి నిరాహార దీక్షకు కూర్చుంటానన్నారు. -
మంత్రి ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో 30 నుంచి కాంగ్రెస్ ఆందోళనలు
అహ్మదాబాద్/భోపాల్/నాగ్‌పూర్: నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 30వ తేదీ నుంచి దేశవ్యాప్త ప్రచారోద్యమం చేపట్టనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. విద్యార్థుల గళం పేరుతో 40 రోజులపాటు జరిగే దేశవ్యాప్త నిరసనలు, ఆగస్ట్ 9వ తేదీన ‘ఢిల్లీ ఛలో’తో ముగియనుందని ఆ పార్టీ పేర్కొంది. నిరసనల సమయంలో మొత్తం 28 నగరాల్లోని విద్యార్థులు, ఉద్యోగార్థులు, కోచింగ్ కేంద్రాలు, కాలేజీ క్యాంపస్‌లు, గ్రంథాలయాల్లో ప్రభుత్వ నిర్వాకాన్ని వివరిస్తామంది. కరపత్రాల పంపిణీ, వీధివీధినా సమావేశాలు, క్యాంపస్‌లో విద్యార్థులతో ముఖాముఖి వంటివి చేపడతామంది. అహ్మదాబాద్, భోపాల్, నాగ్‌పూర్ తదితర నగరాల్లో 30వ తేదీ నుంచి సాగే ఆందోళనలకు సంబంధించిన వివరాలను ఆ పార్టీ నేతలు మీడియాకు వివరించారు. పదేపదే జరుగుతున్న పరీక్షల అవకతవకల కారణంగా విద్యార్థులకు వ్యవస్థపై నమ్మకం తగ్గిపోయిందని, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని అహ్మదాబాద్‌లో కాంగ్రెస్ నేత సతేజ్ పాటిల్ ఆరోపించారు. 130 కోట్ల మంది కలిగిన దేశాన్ని నడిపిస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం..కేవలం 23 లక్షల మంది కోసం పక్కాగా పరీక్షను సైతం నిర్వహించలేకపోతోందని ఎద్దేవా చేశారు. పరీక్ష పత్రాలు ముందుగానే లీకవడం మామూలు అంశంగా మారిపోయిందని, ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని పాటిల్ విమర్శించారు. గతంలో ఇలాంటి అనేక కేసుల్లో కేవలం మధ్యదళారులను మాత్రమే అరెస్ట్ చేసి, వాటి వెనుక ఉన్న కుంభకోణాల నెట్‌వర్క్‌ను మాత్రం వదిలేసిందని దుయ్యబట్టారు. కోచింగ్ కేంద్రాలు, పరీక్ష పత్రాల లీక్ నెట్‌వర్క్‌ల మధ్య ఉన్న సంబంధాలను బయటపెట్టాలన్నారు. వార్షిక పరీక్షలు, వాటి ఫలితాలు, నియామకాలకు సంబంధించిన తేదీలను ముందుగానే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. పరీక్షా విధానంలో సమూల ప్రక్షాళన చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాన్ క్షమాపణ చెప్పాలి: రాహుల్ పరీక్ష పత్రాల లీకేజీలపై నిరసన తెలుపుతున్న విద్యార్థులను ఉగ్రవాదులంటూ వ్యాఖ్యానించిన విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ ఆయన మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పుకోవాలన్నారు. ప్రభుత్వాన్ని విమర్శించిన ప్రతి ఒక్కరినీ ద్రోహులంటూ బీజేపీ ప్రభుత్వం ముద్రవేస్తోందని రాహుల్ గురువారం ఎక్స్‌లో ఆ రోపించారు. -
‘ఒక్క ఎగ్జామ్‌తో అయిపోలేదు’.. యాక్టర్ ఎమోషనల్ మెసేజ్!
ముంబై: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) 2026 రీ-ఎగ్జామినేషన్ ఆదివారం(జూన్ 21) జరగనుంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్ష రాయనున్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్ నటుడు ఉపేంద్ర చౌహాన్ విద్యార్థుల్లో ధైర్యాన్ని నింపేందుకు ‘టైమ్స్ నౌ డిజిటల్’ ద్వారా ఒక సందేశాన్ని పంచుకున్నారు. పరీక్షలో విజయం సాధిస్తే మంచిదేనని, ఒకవేళ విఫలమైనా అది జీవితాంతం కాదని చెబుతూ, మానసిక ఒత్తిడిలో ఉన్న అభ్యర్థులకు ఆయన ధైర్యాన్ని నూరిపోశారు.‘జీవితంలోనూ లెక్కలేనన్ని అపజయాలు’తాను కూడా కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులను, లెక్కలేనన్ని తిరస్కరణలను ఎదుర్కొన్నానని ఉపేంద్ర చౌహాన్ గుర్తుచేసుకున్నారు. ఒకానొక సమయంలో తన కలలు చేజారిపోతున్నాయని, జీవితంలో ఇంకేమీ మిగల్లేదని తీవ్ర నిరాశకు గురైన క్షణాలను ఆయన పంచుకున్నారు. అయితే ఆ కష్ట కాలమే తనను ఈ రోజు ఒక బలమైన వ్యక్తిగా తీర్చిదిద్దిందని, జీవితాన్ని చూసే సరైన మార్గాన్ని నేర్పిందని వివరించారు. జీవితం అనే పెద్ద ప్రయాణంలో ఇలాంటి కఠినమైన పరీక్షలు చాలా చిన్నవని, అపజయాలే మనిషి ఎదుగుదలకు, పరిమితులను దాటి ముందుకు సాగడానికి దోహదపడతాయని ఆయన తెలిపారు.సాఫ్ట్వేర్ ఇంజనీర్ టు యాక్టర్తన సొంత జీవిత ప్రయాణాన్ని ఉదాహరణగా చూపుతూ ఉపేంద్ర విద్యార్థులకు కీలక విషయాలను వివరించారు. తాను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, మొదట సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని అనుకున్నట్లు తెలిపారు. కానీ, ఆ తర్వాత అనుకోకుండా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి ఏడేళ్లపాటు విజయవంతంగా బిజినెస్ రన్ చేశానని చెప్పారు. ఆ సమయంలో తనకు నటుడిని అవుతానని అస్సలు తెలియదని, జీవితంలో తన అసలైన లక్ష్యం చాలా ఆలస్యంగా గుర్తించానని అన్నారు. ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రతి ఒక్కరూ జీవితానికి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.‘పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే.. జీవితాన్ని దాని దారిన సాగనివ్వండి. జీవితం చాలా అందమైనది, దానిని ప్రేమించండి’ అంటూ విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.ఇది కూడా చదవండి: అగ్రహీరో బ్యానర్లో ద్రౌపది ముర్ము బయోపిక్ -
ఒడిశా లెక్కలే ధర్మేంద్ర ప్రధాన్‌ను కాపాడుతున్నాయా?
న్యూఢిల్లీ: నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పరీక్ష నిర్వహణలో తెలెత్తిన అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. విపక్షాలు ఆయన రాజీనామా చేయాలంటూ గట్టిగా పట్టుబడుతున్నప్పటికీ, బీజేపీ మాత్రం ప్రధాన్‌కు అండగా నిలుస్తోంది. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా, గట్టిగా వెనకేసుకొస్తుండటం వెనుక బలమైన రాజకీయ, ఎన్నికల వ్యూహాలు దాగి ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.బీజేపీ ట్రబుల్ షూటర్.. అమిత్ షా తర్వాత..ధర్మేంద్ర ప్రధాన్ కేవలం మంత్రి మాత్రమే కాదు, బీజేపీ అగ్రనాయకత్వంలో అత్యంత నమ్మకమైన ఎన్నికల వ్యూహకర్త. అమిత్ షా తర్వాత పార్టీలో సంక్లిష్టమైన ఎన్నికల వ్యవహారాలను చక్కదిద్దగల సమర్థుడిగా ఆయనకు పేరుంది. ఎలాంటి హడావుడి లేకుండా, తెరవెనుక ఉండి వ్యూహాలు రచించడంలో ఆయన దిట్ట. విబేధాలను పరిష్కరించడం, రాష్ట్రాల నాయకత్వాలను సమన్వయం చేయడం, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడంలో ప్రధాన్ శైలి ప్రత్యేకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాలతో ఉన్న సన్నిహిత సంబంధాలు పార్టీలో ఆయన స్థానాన్ని మరింత పటిష్ఠం చేశాయి.ఒడిశాలో చారిత్రాత్మక విజయం2024 ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన చారిత్రాత్మక విజయం ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయ ఎదుగుదలకు మైలురాయిగా నిలిచింది. ఒడిశాకు చెందిన సీనియర్ నేతగా, అక్కడ దాదాపు 24 ఏళ్ల నవీన్ పట్నాయక్ సుదీర్ఘ పాలనకు ముగింపు పలకడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ అద్భుత విజయంతో ఒడిశాలో బీజేపీ తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. హిందీ మాట్లాడే రాష్ట్రాలకే పరిమితం కాకుండా, ఇతర ప్రాంతాలకు పార్టీని ఎలా విస్తరించాలో ప్రధాన్ తన వ్యూహాలతో నిరూపించారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యం, దేశవ్యాప్త రాజకీయ నెట్వర్క్ ఆయనను పార్టీలో కీలక నేతగా మార్చాయి.హర్యానా, బిహార్లలో ఊహించని విజయాలురాజకీయంగా ఎంతో సవాలుతో కూడుకున్న రాష్ట్రాల్లో ధర్మేంద్ర ప్రధాన్ తన వ్యూహాలతో పార్టీని గెలిపించారు. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉన్నప్పటికీ, ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ గెలుస్తుందని అంచనా వేసినా.. ప్రధాన్ నేతృత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ కూటమి ఘనవిజయం సాధించడంలో క్షేత్రస్థాయి వ్యూహకర్తగా ప్రధాన్ కీలక పాత్ర పోషించారు. సీట్ల సర్దుబాటు, కూటమి నిర్వహణను ఆయన సమర్థవంతంగా అదుపు చేశారు.యూపీ టర్నింగ్ పాయింట్.. నందిగ్రామ్ సంచలనంభారతదేశంలోనే అత్యంత సంక్లిష్టమైన 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ధర్మేంద్ర ప్రధాన్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించారు. బూత్ స్థాయి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి, 255కు పైగా స్థానాలతో బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చేలా చేశారు. అంతకుముందు 2017 ఉత్తరాఖండ్ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 57 స్థానాలు సాధించడంలో, 2014 జార్ఖండ్ గెలుపులో ఆయన పాత్ర ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా 2021 పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘నందిగ్రామ్’ నియోజకవర్గ బాధ్యతలను ప్రధాన్ తీసుకుని, మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించేలా వ్యూహాలు రచించడం బీజేపీ చరిత్రలో ఒక మైలురాయి.లీకుల వివాదం ఉన్నా.. నీట్ వివాదం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్నందున విపక్షాల డిమాండ్ సమంజసమే అయినప్పటికీ, బీజేపీ మాత్రం ప్రధాన్ రాజీనామాకు ఒప్పుకోవడం లేదు. రాజకీయ విశ్లేషకురాలు నీర్జా చౌదరి అభిప్రాయం ప్రకారం.. విపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఇప్పుడు ప్రధాన్‌తో రాజీనామా చేయిస్తే, అది ఒక సంప్రదాయంగా మారి భవిష్యత్తులో మరిన్ని రాజీనామాలకు విపక్షాలు డిమాండ్ చేసే అవకాశం ఉందని బీజేపీ భయపడుతోంది. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో పవన్ బన్సల్, కామన్వెల్త్ గేమ్స్ వివాదాల సమయంలో ఇలాగే జరిగిందని పార్టీ గుర్తు చేసుకుంటోంది. ఒకవేళ ప్రధాన్‌ను మార్చాలనుకున్నా, విపక్షాల ఒత్తిడితో కాకుండా తర్వాత ఎప్పుడైనా క్యాబినెట్ విస్తరణలో భాగంగానే ఆ పని చేయవచ్చని ఆమె విశ్లేషించారు.జవాబుదారీతనంపై చర్చమరోవైపు నీట్, సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్-స్క్రీన్ మార్కింగ్ అవకతవకల నేపథ్యంలో విద్యాశాఖలో మంత్రుల జవాబుదారీతనంపై తీవ్ర చర్చ నడుస్తోంది. రాజకీయ విశ్లేషకుడు నిఖిల్ జైన్ ప్రకారం.. పార్టీకి రాజకీయంగా, సంస్థాగతంగా అవసరమైన నాయకులను మంత్రులుగా నియమించడం సాధారణమే. అయితే, మంత్రిత్వ శాఖ పరిధిలో వివాదాలు వచ్చినప్పుడు మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుంది. రోజువారీ పరిపాలనను బ్యూరోక్రాట్లు (అధికారులు) చూసుకున్నప్పటికీ, విధానపరమైన నిర్ణయాలు, ప్రజలకు, పార్లమెంటుకు సమాధానం చెప్పే బాధ్యత మంత్రులదే. గతంలో రైలు ప్రమాదాలు జరిగినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ లాల్ బహదూర్ శాస్త్రి, నితీష్ కుమార్ వంటి నేతలు రాజీనామా చేసిన ఉదాహరణలను ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: అమెరికా-ఇరాన్ యుద్ధం: ప్రపంచాన్ని కుదిపేసిన మహా నష్టం -
టెలిగ్రామ్‌పై నిషేధం సబబే
సాక్షి, న్యూఢిల్లీ: నీట్ రీ–ఎగ్జామ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. పేపర్ లీకేజీలను నివారించేందుకు జూన్ 22 వరకు యాప్‌ను బ్యాన్ చేస్తూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ తేజస్ కరియా సారథ్యంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. టెలిగ్రామ్ యాప్‌లోని సాంకేతిక ఫీచర్ల ద్వారా ఆటోమేటెడ్ బాట్ అకౌంట్లను సష్టించి, ఒకేసారి పెద్ద ఎత్తున సమాచారాన్ని బదిలీ చేసే అవకాశం ఉందన్నారు. ఒక బాట్‌ను బ్లాక్ చేస్తే, దానంతటదే మరో బాట్‌కు సమాచారం బదిలీ అయ్యే (మిర్రర్ ఛానల్) వ్యవస్థ ఇందులో ఉందని వివరించారు. 21న జరిగే నీట్ రీ–ఎగ్జామినేషన్ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ), కేంద్ర ఉన్నత విద్యా శాఖ సిఫార్సుల మేరకే తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు వివరించారు. అయితే, నీట్‌కు సంబంధించి చట్టవిరుద్ధంగా ఉన్న 900 పైగా లింకులను ఏఐ సాంకేతికత ద్వారా ఇప్పటికే తొలగించామని టెలిగ్రామ్ వాదించింది. కొందరు చేసిన తప్పులకు 15 కోట్లకు పైగా ఉన్న సాధారణ యూజర్లను శిక్షించడం వారి హక్కులను హరించడమేనని పేర్కొంది. కేవలం ఒక వర్గానికి చెందిన అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారనే కారణంతో, ఏ సంబంధం లేని 15 కోట్ల మంది సాధారణ యూజర్ల యాప్ వినియోగాన్ని ఎలా నిరోధిస్తారని ఈ సందర్భంగా ధర్మాసనం కేంద్రాన్ని మౌఖికంగా ప్రశ్నించింది. వాదనల అనంతరం టెలిగ్రామ్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు జస్టిస్ తేజస్ కరియా తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఒక సామాజిక మాధ్యమ వేదికను బ్లాక్ చేసే అధికారం కేంద్రానికి ఉందని స్పష్టం చేశారు. జరగబోయే నష్టాన్ని నివారించేందుకు కేంద్రం అనుసరించిన విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. -
మేం ఎన్నికల్లో పోటీ చేయం
నాగ్‌పూర్: ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం తమకు లేదని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో మంగళవారం నాగ్‌పూర్‌లో తలపెట్టిన నిరసనలో పాల్గొనేందుకు వచ్చిన దీప్కే మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో అభ్యర్థులను పోటీకి నిలబెడతారా అని ప్రశ్నించగా, ‘మేం ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయాలి. నా ఉద్దేశం ప్రతి ఒక్కరూ తమ హక్కుల కోసం ఎన్నికల్లో పోటీకి దిగడం సబబా?’అని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీకేజీతో తీవ్ర ఆందోళనకు గురైన విద్యార్థులను ప్రధాని మోదీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా బలవన్మరణాలకు పాల్పడిన ఐదారుగురు విద్యార్థుల తల్లిదండ్రులకు ముందుగా ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని దీప్కే డిమాండ్ చేశారు. ‘మోదీజీ ప్రపంచంలోనే ఏం జరిగినా ట్వీట్లు చేస్తుంటారు. కానీ, ఇక్కడ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మాత్రం పట్టించుకోరు. కనీసం సంతాప సందేశం కూడా ట్వీట్ చేయరు. మన్‌కీ బాత్, పరీక్షా పే చర్చ ఇంకా ఎన్ని రోజులు..? కనీసం విద్యార్థుల మన్‌కీబాత్ వినిపించుకోండి’అంటూ దీప్కే తీవ్రంగా స్పందించారు. సోమవారం జైపూర్‌లో నిరసన సందర్భంగా తనపై జరిగిన దాడిపై దీప్కే స్పందిస్తూ.. ‘ఈ ఘటన వెనుక ఆర్ఎస్ఎస్ నేతల హస్తముందని’ దిప్కే పేర్కొన్నారు. -
DSC పేపర్ లీక్‌కు ఇదే సాక్ష్యం..ఆధారాలతో బయటపెట్టిన YS జగన్
-
ధరల పెరుగుదల, పేపర్ లీకేజీలపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం
న్యూఢిల్లీ: పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, పరీక్ష పత్రాల లీకేజీలు, ఎన్నికల్లో అవకతవకలపై ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ సిద్ధమైంది. ప్రభుత్వం తీరును ఎండగడుతూ జూన్ చివర్లో దేశవ్యాప్త నిరసన ఉద్యమం చేపట్టాలని నిర్ణయించింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన గురువారం ఇందిరా భవన్లో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసింది. సమావేశంలో రాహుల్ గాందీ, ప్రియాంకా గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్ జైరాం రమేశ్, భూపేశ్ బఘెల్లతోపాటు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల పార్టీ ఇన్చార్జులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ భేటీకి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ‘నీట్, సీబీఎస్ఈ వంటి పరీక్షల పత్రాల లీకేజీలను అరికట్టేందుకు రెండేళ్ల క్రితమే చట్టం చేసిన కేంద్రం పకడ్బందీగా అమలు చేయలేకపోయింది. ఫలితంగానే లీకయ్యాయి. అదేవిధంగా, ఈ నెల 22న అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశముందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ ఒప్పందం ప్రభావం ఉత్తరాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి అంశాలన్నిటినీ రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ప్రస్తావించారు’అని జైరాం రమేశ్ చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్న డబుల్ ఇంజన్. ఇందులో ఒక ఇంజన్ ఓట్ చోరీ కాగా, మరోటి సీట్ చోరీ’అని ఆయన పేర్కొన్నారు. సమావేశం అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పరీక్షల కుంభకోణాలు, సామాజిక అసమానతలు వంటి తీవ్ర సమస్యలను దేశం నేడు ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. దశాబ్దాలుగా నిర్మించుకుంటూ వచ్చిన వ్యవస్థలను మోదీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బలహీనపర్చిందని ఆరోపించారు. దేశ రాజ్యాంగం ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం రాజకీయ పోరాటం సాగించడటం తమ బాధ్యతని ఖర్గే వివరించారు. మోదీ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో మొదలయ్యే తమ దేశవ్యాప్త పోరాటం రెండు, మూడు నెలలపాటు కొనసాగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత) కేసీ వేణుగోపాల్ చెప్పారు. ప్రభుత్వ వైఫల్యాలకు దేశ ప్రజలకు ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. -
పేపర్ లీక్ ఎలా చేశారంటే...? DSC స్కామ్ ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే...
-
ఇప్పుడు క్యూట్ వంతు
న్యూఢిల్లీ: అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్– యూజీ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీ, సీబీఎస్ఈ పునర్మూల్యాంకనంలో లోపాలు, పరీక్షఫీజు చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలో పరువు పోగొట్టుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మరోసారి తన అసమర్థతను బయటపెట్టుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, పలు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్ధేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్–అండర్ గ్రాడ్యుయేట్(క్యూట్–యూజీ) పరీక్ష రాసేందుకు శనివారం సిద్ధమైన వేలాది మంది విద్యార్థులు అవస్థలుపడ్డారు. సాంకేతిక సమస్యతో పరీక్ష రాయలేక చివరకు వెనుతిరిగారు. మధ్యాహ్నం సెషన్లో 2.30 గంటలకు పరీక్షహాల్లోకి అనుమతించారు. మూడు గంటలకు పరీక్ష మొదలుకావాల్సి ఉండగా గంటపాటు అభ్యర్థులు లాగిన్కాలేకపోయారు. 4 గంటలకు పరీక్ష మొదలుపెట్టారు. సాంకేతిక సమస్యతో దేశవ్యాప్తంగా 3,765 మంది అభ్యర్థులు పరీక్షరాయలేక చివరకు వెనుతిరిగారు. ఉదయం సెషన్లోనూ ఇలాంటి సమస్య తలెత్తగా ఆలస్యంగా పరీక్ష మొదలైంది. వాళ్లకు మాత్రం కోల్పోయిన కాలం మేరకు అదనపు సమయాన్ని కేటాయించారు. మ«ధ్యాహ్నం సెషన్లో మాత్రం వేలాది మంది పరీక్షరాయలేకపోయారని వాళ్లకు మాత్రం వేరేరోజు ఎగ్జామ్ నిర్వహిస్తామని ఎన్టీఏ తర్వాత ఒక ప్రకటనలో పేర్కొంది. క్యూట్–యూజీ పరీక్షకు టెక్నికల్ సరీ్వస్ ప్రొవైడర్‌గా ఉన్న ‘టీసీఎస్ ఐఆన్’సంస్థ నుంచి వివరణ కోరామని ఎన్టీఏ తన ‘ఎక్స్’ఖాతాలో వెల్లడించింది. అభ్యర్థుల్లో పరీక్షపై ఏమైనా సందేహాలు ఉంటే +91–11–40759000 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్‌చేసి లేదా cuet-ug@nta. ac.in ఈమెయిల్ ఐడీకి మెయిల్‌చేసి సందేహాలు నివృత్తిచేసుకోవచ్చని ఎన్టీఏ స్పష్టంచేసింది. సాంకేతిక సమస్య కారణంగా ఉదయం సెషన్ రెండు గంటలు ఆలస్యంగా చేపట్టామని టీఎస్ఎస్ సంస్థ సీఈఓ, ఎండీ కె.కృతివాసన్ తెలిపారు.వెల్లువెత్తిన విమర్శలు పరీక్ష కోసం లోపలికి వెళ్లిన అభ్యర్థులు ఎంతకీ బయటకురాకపోవడంతో మండుటెండలో వేచిచూసిన విద్యార్థుల బంధువులు, తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘‘మూడు, నాలుగు గంటలు బయట ఎండలో వేచిచూసి అలసిపోయాం. తీరా బయటికొచ్చి పరీక్ష రాయలేదు అని వాళ్లు చెప్పడంతో ఒళ్లు మండింది. జాతీయస్థాయి పరీక్షలను ఇలాగేనా నిర్వహించేది? వాళ్లు లోపల పరీక్ష రాయట్లేదనే విషయం బయట ఉన్న మాలో ఒక్కరికీ చెప్పలేదు’’అని ఒక పరీక్షార్థి తల్లి ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘సుదూరం నుంచి ఉదయం ఆరు గంటలకే పరీక్ష కేంద్రానికి వచ్చాం. తీరాచూస్తే 11 గంటలకైనా ఎగ్జామ్ మొదలెట్టలేదు. మా వాళ్లు ఎదురుచూసి అలసిపోయి వెనుతిరిగారు’’ అని మరో నెటిజన్ ‘ఎక్స్’ వేదికగా అసహనం వ్యక్తంచేశారు.ఇది ప్రధాన్ మంత్రి–మంత్రి ప్రధాన్ జుగల్బందీ: కాంగ్రెస్ క్యూట్–యూజీ ఉదయం సెషన్ ఆలస్యం, వేలాది మంది మధ్యాహ్నం పరీక్ష రాయలేకపోవడంపై విపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఎన్టీఏ వైఫల్యాలకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బాధ్యుడిని చేయకుండా ఆయనను ప్రధాని మోదీ వెనకేసుకొస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. తాజా క్యూట్–యూజీ ఘటనను ‘ప్రధాన్ మంత్రి–మంత్రి ప్రధాన్ జుగల్బందీ’గా అభివరి్ణంచింది.‘విశ్వగురువు’ ఒక్క పరీక్షా సవ్యంగా నిర్వహించట్లేరు: రాహుల్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ అజమాయిషిలోని సంస్థ క్యూట్–యూజీ పరీక్ష సవ్యంగా నిర్వహించలేకపోవడంతో లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీ మరోసారి మోదీ సర్కార్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘‘భారత్ విశ్వగురువే. కానీ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మాత్రం అది సాధ్యపడట్లేదు. కనీసం ఒక్క పరీక్షను సవ్యంగా, సమర్థవంతంగా నిర్వహించలేకపోతున్నారు. మొన్న నీట్, నిన్న సీబీఎస్ఈ, ఎస్ఎస్సీ, నేడు క్యూట్’’ అంటూ విమర్శించారు. -
సీబీఐతో విచారించాలి
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: మెగా డీఎస్సీ పేరుతో చంద్రబాబు సర్కారు దగా చేసిందని టీచర్ పోస్టుల అభ్యర్థులు, నిరుద్యోగులు భగ్గుమన్నారు. డీఎస్సీ అవకతవకలపై వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ 2025లో అక్రమాలపై వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన విద్యార్థి పోరుకు భారీ స్పందన వచి్చంది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. నిరుద్యోగులు, టీచర్ అభ్యర్థులు వేలాదిగా తరలివచ్చి చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. డీఎస్సీలో అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగులు, విద్యార్థులు, పార్టీ నేతలు పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా దుర్వినియోగం, అర్హతలేని వారికి ఉద్యోగాల కేటాయింపు, పేపర్ లీకేజీ ఆరోపణలు, ఫేక్ సరి్టఫికెట్లతో ఎంపికలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ పేరుతో ప్రభుత్వం యువత భవిష్యత్తుతో చెలగాటమాడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారు నిర్వాకాలను ఎండగడుతూ నిర్వహించిన నిరసన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైనట్లు వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. శుక్రవారం గుంటూరులో పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. లాడ్జి సెంటర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద బైఠాయించి వినతి పత్రం సమర్పించారు. పూర్తిగా పారదర్శకత లోపించిన మెగా డీఎస్సీ తంతులో పేపర్లు లీక్, డేటా డిలీట్, మెరిట్ లిస్టు మాయం లాంటి అనేక అవకతవకలు జరిగాయని పానుగంటి చైతన్య ధ్వజమెత్తారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ డబ్బులు వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నారని మండిపడ్డారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ జిల్లా, నగర అధ్యక్షులు అంబటి రాంబాబు, షేక్ నూరిఫాతిమా, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, చంద్రగిరి ఏసురత్నం, పార్టీ నేతలు పోతిన మహేష్, అంబటి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ..⇒ పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సు«దీర్ భార్గవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.⇒ బాపట్లలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చేపట్టిన నిరసన ర్యాలీలో పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున, మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి తదితరులు పాల్గొన్నారు.⇒ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పార్టీ శ్రేణులతో కలసి పాల్గొన్నారు. విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని నినదించారు.⇒ డీఎస్సీ 2025 నియామకాల్లో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ తిరుపతి, చిత్తూరు జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ ప్రధాన ద్వారం ఎదుట నిర్వహించిన ధర్నాలో పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో కలసి ఆయన పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సూచనల మేరకు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో ఒక్కో ఉద్యోగాన్ని రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు అమ్ముకున్నారని ఆరోపించారు.⇒ మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగులను నట్టేట ముంచేశారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు శశిదీప్, నియోజవర్గ అధ్యక్షులు సద్ధాం ఆరోపించారు. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో చిత్తూరు దర్గా సర్కిల్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో ధర్నా నిర్వహించి విద్యాశాఖ మంత్రి లోకేశ్‌కు వ్యతిరేకంగా నినదించారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న నారా లోకే‹శ్మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.⇒ ఉమ్మడి విశాఖ జిల్లాల్లో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. డాబాగార్డెన్స్ అంబేడ్కర్ విగ్రహం వద్దవైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీవత్సవ్ నేతృత్వంలో దగాడీఎస్సీపై నిరసన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, కుంభా రవిబాబు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణే‹Ùకుమార్,సమన్వయకర్తలు తిప్పల దేవాన్‌రెడ్డి, మొల్లి అప్పారావు పాల్గొన్నారు.⇒ మెగా డీఎస్సీ నిర్వహణలో అక్రమాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం విగ్రహం నుంచి కోటిపల్లి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించింది. సకల శాఖా మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు.⇒ కాకినాడలో వైఎస్సార్సీపీ విద్యారి్థ, యువజన విభాగాల ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు.⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం జనుపల్లిలో అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు.⇒ ఒంగోలులో నిరసన ర్యాలీ, ధర్నా కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ,ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహా్మనందరెడ్డి, ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న తదితరులు పాల్గొన్నారు. అంబేడ్కర్ భవనం నుంచి ర్యాలీ నిర్వహించారు.⇒ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాల్లో ‘విద్యార్థి పోరు’ పేరుతో నిరసన ర్యాలీలు నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.⇒ నెల్లూరు వీఆర్సీ సెంటర్లో శాంతియుతంగా నిరసన చేపట్టిన విద్యార్థి విభాగం నాయకులను పోలీసులు బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును⇒ చంద్రబాబు సర్కారుకు డీఎస్సీపై శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యముందా అని వైఎస్సార్సీపీ నేతలు నిలదీశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినా‹Ù, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించిన చంద్రబాబు, లోకేశ్ డౌన్ డౌన్ అంటూ నినదించారు.⇒ దగా డీఎస్సీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నంద్యాల బొమ్మలసత్రం వద్ద అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు.⇒ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం అంబేడ్కర్ సెంటర్, ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. -
నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ
-
15లక్షలకు DSC ఉద్యోగాలు అముకున్నారు వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్స్
-
DSC పేపర్ లీక్ జరగలేదంటే.. మెరిట్ లిస్ట్ వెంటనే విడుదల చేయండి
-
సీబీఎస్ఈ అక్రమాలపై దర్యాప్తు జరపాలి
న్యూఢిల్లీ: సీబీఎస్ఈ ఆన్–స్క్రీన్ మార్కింగ్(ఓఎస్ఎం) వ్వవస్థలో అక్రమాలపై స్వతంత్ర జ్యుడీషియల్ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ మొత్తం కుంభకోణంలో నిజాలను బహిర్గతం చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) సైతం నియమించాలని అన్నారు. తెలంగాణలో వివాదాస్పద నేపథ్యం ఉన్న ఒక సంస్థకు సీబీఎస్ఈ ఈ ఓఎస్ఎం కాంట్రాక్టును అప్పగించిందని ఆరోపించారు. సీబీఎస్ఈ తీరు వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారని చెప్పారు. కానీ, ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం నోరుమెదపడం లేదని రాహుల్ ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. 12వ తరగతి సీబీఎస్ఈ పరీక్షకు సంబంధించి నమ్మశక్యంకాని వివరాలు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేశారు. ఈ పరీక్షకు ఓఎస్ఎం చేసిన కోంపెంట్ ఎడ్యుటెక్ అనే కంపెనీ అసలు పేరు గ్లోబరెనా అని తెలిపారు. ఈ గ్లోబరెనా ఇంతకుముందు తెలంగాణలో 2019, 2023లో స్కామ్‌కు పాల్పడిందిన్నారు. తెలంగాణలో 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ఓఎస్ఎం ఆధారిత లోపాలే కారణమని తేల్చిచెప్పారు. మళ్లీ అదే కోంపెంట్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టడం వెనుక ఉద్దేశం ఏమిటని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఖండించిన సీబీఎస్ఈ కోంపెంట్ ఎడ్యుటెక్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను సీబీఎస్ఈ బుధవారం ఖండించింది. అందులో ఎంతమాత్రం నిజం లేదని పేర్కొంది. ఓఎస్ఎం కాంట్రాక్టును కోంపెంట్కు ఇచ్చిన మాట నిజమేనని వెల్లడించింది. అయితే, రాహుల్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టంచేసింది. నిబంధనల ప్రకారమే కాంట్రాక్టును కట్టబెట్టామని తేల్చిచెప్పింది. రాహుల్ ఆరోపణలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని ఆక్షేపించింది. -
‘నీట్’ కేసు: 40 రోజుల్లో రిటైర్మెంట్.. ఇంతలోనే అరెస్ట్!
పూణె: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ‘నీట్-యూజీ - 2026’ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతమైంది. ఈ క్రమంలో పూణెలోని సేథ్ హీరాలాల్ సరాఫ్ పాఠశాల ప్రిన్సిపల్ మనీషా సంజయ్ హవాల్దార్‌ను సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం విద్యాశాఖ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఆమె మరో 40 రోజుల్లో పదవీ విరమణ చేయనుండగా ఇంతలోనే ఈ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.పాఠశాల యాజమాన్యం షాక్సీబీఐ చర్య దరిమిలా విద్యా ప్రసరిణి సభ ట్రస్ట్.. మనీషా హవాల్దార్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పాఠశాల 102 ఏళ్ల చరిత్రలో ఇలాంటి వివాదం జరగడం ఇదే మొదటిసారని ట్రస్ట్ కార్యదర్శి సతీష్ గవాలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్ అక్రమ కార్యకలాపాలపై తమకు ముందస్తు సమాచారం లేదని, నిజాన్ని నిగ్గు తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో అంతర్గత కమిటీని ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.అంకితభావం కలిగిన ఉపాధ్యాయురాలిగా గుర్తింపు1992లో అసిస్టెంట్ టీచర్‌గా వృత్తిని ప్రారంభించిన మనీషా హవాల్దార్, తన విద్యా అర్హతలతో పాఠశాలలో క్రమశిక్షణ కలిగిన ఉపాధ్యాయురాలిగా పేరు తెచ్చుకున్నారు. 2024లో ఆమె ప్రిన్సిపల్‌గా పదోన్నతి పొందారు. సుదీర్ఘకాలం పనిచేసిన ఆమె ఇలాంటి నేరంలో చిక్కుకోవడం నమ్మశక్యంగా లేదని తోటి ఉపాధ్యాయులు అంటున్నారు. ఒక సీనియర్ విద్యావేత్త ఇటువంటి క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.సోదాలు.. కీలక ఫైళ్లు స్వాధీనం శుక్రవారం ఉదయం మనీషా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి, ఆమెను సుదీర్ఘంగా ప్రశ్నించారు. అదే సమయంలో పాఠశాలలోనూ సోదాలు జరిపి, కీలకమైన కంప్యూటర్ హార్డ్ డిస్కులు, అడ్మినిస్ట్రేటివ్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. నీట్ పరీక్షకు ముందే గోప్యమైన సమాచారం లీక్ అయ్యిందా లేదా అనే కోణంలో సీబీఐ ఫోరెన్సిక్ విశ్లేషణను ముమ్మరం చేసింది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవితవ్యం ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో ఇటువంటి అక్రమాలు వెలుగుచూడటం పరీక్షల భద్రతపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. -
ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే
న్యూఢిల్లీ: నీట్(యూజీ)–2026 పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పారీ్ట(సీజేపీ) డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సోషల్ మీడియాలో పోరాటం ఆరంభించింది. ఆ పార్టీ ‘ఎక్స్’ఖాతాలను ప్రభుత్వం నిలిపివేయడంతో ‘కాక్రోచెస్ నెవర్ డై’అనే ట్యాగ్‌లైన్‌తో ‘కాక్రోచ్ ఈజ్ బ్యాక్’పేరిట కొత్త ఖాతాను సృష్టించుకుంది. ఇదే ఖాతా నుంచి పోస్టులు చే స్తోంది. ఇన్స్టా్రగామ్లోనూ చురుగ్గా వ్యవహరిస్తోంది. విద్యా రంగంలో కేంద్రం దారుణంగా విఫలమైందని, పరీక్షలు సైతం సక్రమంగా నిర్వహించలేకపోతోందని సీజేపీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తూ ఆన్లైన్లో పెట్టిన పిటిషన్‌కు మద్దతు ఇవ్వాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కోరారు. తాజాగా ఒక వీడియో సందేశం పోస్టుచేశారు. ‘‘బొద్దింకల్లారా.. ఎలా ఉన్నారు? ఇంటర్నెట్లో మీరంతా బాగా రాణిస్తున్నారని అందరూ అంటున్నారు. కానీ ఇప్పుడు నిజమైన పని చేయాల్సిన సమయం వచ్చింది. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో ఈ రోజు ఆన్లైన్లో ఒక పిటిషన్‌ను ప్రారంభిస్తున్నాం. దీనికి అందరూ మద్దతివ్వాలి’’అనికోరారు. విద్యా వ్యవస్థలోని వైఫల్యాలు విద్యార్థులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే జవాబుదారీతనం ఉండాలన్నారు. అందుకు సమయం వచ్చిందన్నారు. 22 లక్షలకు పైగా విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినడానికి, నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి వ్యవస్థే కారణమని ఆరోపించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని అభిజిత్ దీప్కే తేల్చిచెప్పారు. ధర్మేంద్ర ప్రధాన్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తనకు బెదిరింపులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. చంపేస్తామంటూ హెచ్చరిస్తున్నారని చెప్పారు.దీప్కే భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే భద్రతపై ఆయన తల్లిదండ్రులు భగవాన్, అనితా దీప్కే ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి ప్రాణాలకు ఎవరైనా ముప్పు తలపెట్టే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. ఆ పార్టీకి సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. పార్టీ ఎక్స్ ఖాతాను ప్రభుత్వం నిలిపివేసింది. మరోవైపు అభిజిత్‌కు బెదిరింపులు సైతం వస్తున్నట్లు తెలుస్తోంది. తమ కుమారుడు ఇబ్బందుల్లో పడతాడేమో లేక అరెస్టును కూడా ఎదుర్కొంటాడేమోనన్న భయంతో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. అభిజిత్‌కు ఆమ్ ఆద్మీ పారీ్టతో సంబంధాలున్నాయి. అతడి తల్లిదండ్రులు మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్లో నివసిస్తున్నారు. తమ బిడ్డ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తమకు ఎంతమాత్రం ఇష్టం లేదని వారు చెప్పారు. అతడి భద్రత పట్ల ఆందోళన చెందుతున్నామని, నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నామని వెల్లడించారు. ఇంటికి తిరిగిరావాలని అభిజిత్‌ను కోరారు. -
వాళ్లు మనోవేదనలో మీరు రీల్స్ మోజులో
న్యూఢిల్లీ: భవిష్యత్తును నిర్ణయించే నీట్–యూజీ పరీక్షను రాత్రింబవళ్లు కష్టపడి చదివి రాశాక అది రద్దయిందని తెలిసి లక్షలాది మంది అభ్యర్థులు వేదనలో మునిగిపోతే విదేశాల్లో ప్రధాని మోదీ ‘రీల్స్’చేస్తూ సంతోషంగా కన్పిస్తున్నారని లోక్‌సభలో విపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. రాహుల్ గురువారం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ఖాతాలో మోదీ వైఖరిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘పేపర్‌లీక్ ఉదంతంలో న్యాయం కావాలంటూ ఓవైపు యువత వీధుల్లోకి వచ్చి పోరాడుతుంటే మోదీ ఇటలీలో మెలోడీ అంటూ రీల్స్చేస్తున్నారు. దేశంలో ఎక్కడ మంచి పని జరిగినా తన ఘనతే అని చెప్పుకుని తిరిగే మోదీ నీట్–యూజీ పేపర్ లీక్ అయితే బాధ్యత ఎందుకు తీసుకోవట్లేరు? కనీసం నీట్–యూజీ పరీక్షల నిర్వహణను కేంద్రస్థాయిలో చూసుకునే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను ఎందుకు ఇంకా పదవి నుంచి తొలగించలేదు? ఈ విషయంపై మోదీ ఎందుకు ఇప్పటిదాకా ఒక్క మాట మాట్లాడలేకపోతున్నారు? న్యాయం కోరుతూ పలు రాష్ట్రాల్లో ఉద్యమిస్తున్న విద్యార్థులకు బాసటగా నిలిచిన ఎస్ఎస్యూఐ, కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు లాఠీల వర్షం కురిపిస్తున్నాయి. లాఠీలతో ప్రభుత్వం చెప్పే సమాధానం ఏరకంగానూ జవాబుదారీ అన్పించుకోదు. సమాధానం చెప్పే ధైర్యంలేక భయంతో మమ్మల్ని లాఠీలతో చావబాదుతున్నారు. అయినా మేం భయపడబోం. ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించేదాకా, దేశంలో పేపర్ లీకేజీలులేని పటిష్టమైన పరీక్షా విధానం అమల్లోకి వచ్చేదాకా ఉద్యమిస్తాం. లీకేజీలతో విద్యార్థుల భవితను ప్రభుత్వం దోచుకుంటోంది’’అని రాహుల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. జైపూర్‌లో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద ఉద్యమిస్తున్న విద్యార్థులపైకి పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్న ఫొటోను రాహుల్‌గాంధీ ఈ పోస్ట్‌కు ట్యాగ్‌చేశారు. -
పేపర్ కొట్టేసి నీట్ లో టాపర్
-
నీట్ పేపర్ లీకేజీ కేసు.. లాతూర్‌లో కోచింగ్ సెంటర్ యజమాని అరెస్ట్
న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో సీబీఐ అధికారులు మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన కోచింగ్ సెంటర్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. రేణుకాయీ కెమిస్ట్రీ క్లాసెస్(ఆర్సీసీ) పేరుతో కోచింగ్ సెంటర్ నెలకొల్పిన శివరాజ్ రఘునాథ్ మోటెగావొంకర్ ఆదివారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఇతడి ఫోన్లో ఈ నెల 3వ తేదీన లీకైన నీట్ ప్రశ్నపత్రం లభించింది. అంతకుముందు లాతూర్‌లోని శివనగర్‌లో ఉన్న కోచింగ్ సెంటర్‌తోపాటు అతడి నివాసంలోనూ సోదాలు జరిపారు. శివరాజ్‌ను అతడి నివాసంలోనే దాదాపు 8 గంటలపాటు అధికారులు ప్రశ్నించారు. పేపర్ లీకేజీ ముఠాలో శివరాజ్ కీలకంగా ఉన్నాడని, ఇతడి కోచింగ్ సెంటర్‌కు 9 బ్రాంచీలుండగా, లాతూర్‌లోనిది ప్రధాన కేంద్రమని అధికారులు వెల్లడించారు. లీకేజీ కుట్రలో భాగంగా పరీక్షకు దాదాపు 10 రోజులు ముందుగానే, ఏప్రిల్ 23వ తేదీనే ప్రశ్నపత్రం, జవాబులు ఇతడికి అందాయన్నారు. వీటిని ఇతడు చేత్తో రాసిన నోట్స్ రూపంలో ఇతరులకు అందజేశాడని, పరీక్ష అనంతరం వీటిని తగులబెట్టారన్నారు. నీట్ నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)తో సంబంధాలున్న కెమిస్ట్రీ లెక్చరర్ పీవీ కులకరి్ణకి శివరాజ్ సన్నిహితుడని వివరించారు. ఇతడి ఇల్లు, కోచింగ్ సెంటర్లలో జరిపిన సోదాల్లో 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షలోని ప్రశ్నలున్న కెమిస్ట్రీ క్వశ్చన్ బ్యాంక్ లభించిందని చెప్పారు. ‘గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాల్లోని ఐదు చోట్ల సోదాలు చేపట్టి, కీలక పత్రాలతోపాటు ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్లను స్వా«దీనం చేసుకున్నాం. వీటిని విశ్లేషించే పని చురుగ్గా సాగుతోంది’అని సీబీఐ ప్రతినిధి తెలిపారు. ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, పుణే, లాతూర్, అహల్యానగర్‌లలో 10 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. ఇలా ఉండగా, సోమవారం శివరాజ్ రఘునాథ్ మొటెగావొంకర్ను సీబీఐ అధికారులు ఢిల్లీలోని కోర్టులో హాజరుపర్చారు. ఇతర ఆధారాలతోపాటు నీట్ పేపర్లోని ప్రశ్నలను తన కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు వెల్లడిస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియోను కూడా చూపారు. దీంతో, ప్రత్యేక సీబీఐ కోర్టు జడ్జి అజయ్ గుప్తా అతడిని 9 రోజుల సీబీఐ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. -
కనీసం.. సారీ చెప్పాలని అనిపించలేదా?
నీట్–యూజీ అనేది ఐదో తరగతి లేదా పదో తరగతి వంటి సాధారణ పరీక్ష కానేకాదు. ఉన్నత చదువుల భవితవ్యాన్ని నిర్దేశించే అత్యంత కీలక ప్రవేశ పరీక్ష. దాని కోసం లక్షలాది మంది విద్యార్థులు నెలల తరబడి రాత్రింబవళ్లు కష్టపడి చదివి సంసిద్ధమవుతారు. శాయశక్తులా కృషిచేసి పరీక్షరాశాక వారం పది రోజులకే అది రద్దయిందని ప్రకటిస్తే అన్ని రోజులు పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే. అలా పన్నీరుగా మారుతున్న పరీక్షార్థుల శ్రమ నుంచే ఆగ్రహాగ్ని పుట్టింది. నిమ్మకు నీరెత్తినట్లు మౌనంగా ఉండిపోయిన ఈ పరీక్షల నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) బాధ్యతారాహిత్యం, నిర్లక్ష్య వైఖరిపై ప్రశ్నిస్తూ నీట్–యూజీ అభ్యర్థిని ఆద్రికా బాజ్పేయీ ఎన్టీఏకు ఒక లేఖ రాశారు. ఇప్పుడా లేఖ ఆన్లైన్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ఆ లేఖ పూర్తిపాఠం ఇదీ.. ‘‘నాకు 18 ఏళ్లు. ఈఏడాది నీట్–యూజీ పరీక్షను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రాశా. 12వ తరగతిలో ఉన్నప్పటి నుంచే దీని కోసం ప్రిపరేషన్ మొదలెట్టా. సోషల్‌మీడియా ఖాతాల జోలికి పోలేదు. స్నేహితులతో కబుర్లు కట్టిపెట్టా. బంధువుల పార్టీలకు వెళ్లడం మానేశా. నీట్పరీక్షపైనే పూర్తిగా దృష్టిపెట్టి తోబుట్టువులతోనూ పెద్దగా మాట్లాడటం మానేశా. ఇన్ని త్యాగాలు ఎందుకు చేశానో తెలుసా. డాక్టర్ కావడం నా కల. వైద్యవృత్తిలో స్థిరపడాలని నిర్ణయించుకున్నా. పరీక్ష దగ్గరపడుతున్న కొద్దీ నాలో ఆందోళన ఎగసింది. పరీక్షకు పది రోజుల ముందు ఎన్టీఏ ఒక హెచ్చరిక చేసింది. ఇది స్కూల్ పరీక్షవంటి ఆషామాషీ పరీక్షకాదు జాతీయస్థాయిలో అభ్యర్థులను వడబోసే భారీ క్రతువు అని ప్రకటించింది. నీట్–యూజీ అనేది స్కూల్పరీక్ష కాదు. కనీసం స్కూల్లో ప్రశ్నపత్రం లీకేజీ అనేది ఎక్కడా వినలేదు చూడలేదు. మాకు మాత్రం మీరు సుద్దులు చెబుతారు. అంకితభావంలో మేం మీకంటే 10 రెట్లు ఎక్కువ అని బీరాలు పలికారు. ఇది నిజంగా మీరు సిగ్గుపడాల్సిన విషయం. పరీక్షకేంద్రంలోకి అడుగుపెట్టేముందు మమ్మల్ని పలు రకాలుగా చెక్చేస్తారు. ఆ డ్రెస్ రకం అనుమతిలేదు ఈ షూ వేసుకోవద్దు ఈ హెయిర్‌బ్యాండ్, స్మార్ట్‌వాచ్ పెట్టుకోవద్దు అని సవాలక్ష షరతులు పెడతారు. జుట్టు ముడివేసుకుని అంతా విప్పేసి వేళ్లు దూర్చి మరీ చెక్‌చేశారు. టీ–షర్ట్ బటన్లనూ కత్తిరించారు, ప్యాంట్లకున్న జేబులనూ కత్తిరించారు. ఇక పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సంగతి చెప్పనక్కర్లేదు. ఎగ్జామ్‌హాల్‌లోకి కనీసం ట్రాన్స్పరెంట్గా ఉండే నీళ్లసీసాను కూడా అనుమతించలేదు. మేమేమైనా పేపర్ లీక్ చేసే ముఠా సభ్యులమా? మా కలలను సాకారం చేసుకునేందుకు మీరు పెట్టే ఇలాంటి ఎన్నో కండీషన్లనూ మేం భరించాం. అయినా ఇంతటి తనిఖీలుచూశాక ఇక పేపర్ లీక్ కాదు అనే భరోసాతో పరీక్ష హాల్లోకి వెళ్లా. ఇంతాచేసి అక్కడికెళ్లాక మేం ఎగ్జామ్‌లో ప్రశ్నలతో కంటే బయటి వ్యవస్థతోనే అతిపెద్ద యుద్ధం చేయాల్సి వస్తోంది. వ్యవస్థలో ఒకరిద్దరు తప్పుచేసినా మొత్తం ఎగ్జామినేషన్ వ్యవస్థ అభాసుపాలవుతోంది. ఇక్కడితో ఇది ఆగట్లేదు. ఎన్టీఏను ట్విట్టర్ ఖాతాలో లక్షలాది మంది విద్యార్థులు అడిగే సూటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ముఖం చాటేస్తోంది. అయినాసరే కనీసం ఈసారి అయినా ఇలా జరగదేమోననే ఆశతో పరీక్షరాశా. మళ్లీ మా నమ్మకాన్ని ఎన్టీఏ వమ్ముచేసింది. జాగ్రత్తలో మాకంటే నాలుగు ఆకులు ఎక్కువ చదువుకున్నామని చెప్పే ఎన్టీఏ ఇప్పుడు మమ్మల్ని నిరాశ లోయలో నెట్టేసి చేతులు దులిపేసుకుంటోంది. అయినాసరే వీటన్నింటినీ భరిస్తూ మేం మరోసారి పుస్తకాల పురుగులుగా మారేందుకు సిద్ధపడతాం. మా కలల సాకారం కోసం కష్టపడక తప్పదు. కానీ తప్పుచేసిన మీకు కనీసం సారీ అయినా చెప్పాలని అనిపించలేదా? ఇంత జరిగాక కూడా అభ్యర్థులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలనే స్పృహ మీకు ఎప్పుడొస్తుంది? జాతీయస్థాయిలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించే ఇలాంటి పరీక్షపేపర్ లీక్ అయితే బాధ్యతాయుత స్థాయిలో ఉన్న మీ నుంచి మేం సారీ ఆశించకూడదా?. మాకెన్ని కలలున్నాయో మీరు కనీసం ఒక్కసారైనా ఊహించారా? పరీక్ష పూర్తయ్యాక తోబుట్టువులతో హాయిగా ఉండొచ్చని సంబరపడ్డాం. రెండ్రోజుల్లోనే ఆకాశం విరిగిపడినట్లు దుర్వార్త మోసుకొచ్చారు. మళ్లీ పరీక్ష పెడతారని తెల్సిన క్షణాన వరదలో ఇల్లు మొత్తం కొట్టుకుపోయినంత విషాదం మాలో అలుముకుంది. మా డాక్టర్ కలల సౌధాన్ని కూల్చేశారు. అప్పుడు 11 ఏళ్ల నా చెల్లి నాతో ఒకమాట చెప్పింది. ‘‘అక్కా అతిగా ఆశలుపెట్టుకోకు. దేశంలో మన భవిష్యత్తు గురించి ఎవరికీ పట్టదు’’అన్న మాటలు నా మనసుని మెలిపెట్టాయి. చెల్లి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నా దగ్గర మాటల్లేవు. ఇంత జరిగినా వ్యవస్థ మనతోనే ఉంది అని చెల్లికి ఎలా భరోసా ఇవ్వాలి? ఇలాంటి వ్యవస్థలో మేం బాధితులుగా మిగిలిపోవాల్సిందేనా? అభద్రతాభావం అనేది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. భారత్‌లో ఉన్నత విద్యనభ్యసించడం తమకు ఇష్టంలేదు అని తోబుట్టువులు చెప్పారు. ఇలాంటి తరుణంలో ‘ఈ దేశంలో ఉన్నందుకు మేమెంతో గర్విస్తున్నాం’అని ఎలా చెప్పగలను? ఒకవేళ సరిహద్దు కంచెలు లేకపోయినాసరే నేను ఈ దేశంలోనే ఉండిపోతా అని చెప్పగలనా?. చెప్పలేనేమో. ఎందుకంటే నిబంధనలు అనేవి కాగితం పులులుగా మారిపోయాయి. మీపట్ల మా నమ్మకం ప్రతిసారీ వమ్ము అవుతోంది. కష్టపడి చదివిన చదువుకు, ప్రిపరేషన్‌కు విలువ ఉన్న చోటే ఉండాలనుకుంటున్నాను. ఇట్లు, ఎంతో అసంతృప్తి చెందిన మీ పరీక్షార్థి’’.–సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒక్కో స్టూడెంట్ నుంచి 30 లక్షలు.. NEET కేసులో దిమ్మతిరిగే నిజాలు
-
జూన్ 21న నీట్ రీఎగ్జామ్
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా సంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–యూజీ రీఎగ్జామ్ జూన్ 21న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించారు. ఈ నెల 3న నిర్వహించిన నీట్(యూజీ)–2026 పరీక్షను పేపర్ లీక్ కారణంగా రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నీట్ పరీక్షలో ఇకపై ఎలాంటి అవకతవకలు జరగకుండా సంస్కరణలు ప్రారంభిస్తున్నామని, ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. ఆయన శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్తుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. నీట్(యూజీ) పరీక్షలో అక్రమాలను సహించే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రద్దయిన నీట్‌ను జూన్ 21న మళ్లీ నిర్వహించబోతున్నామని, ఈసారి పరీక్ష వ్యవధిని మరో 15 నిమిషాలు పెంచినట్లు తెలిపారు. ఎక్కడ పరీక్ష రాయాలన్నది అభ్యర్థులు నిర్ణయించుకోవచ్చని, జూన్ 14 కల్లా అడ్మిట్ కార్డులు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి నీట్ అభ్యర్థులకు రవాణా ఏర్పాట్లను కేంద్రం సమన్వయం చేస్తుందన్నారు. ఎలాంటి సందేహాలు, భయాందోళనలు లేకుండా పరీక్షకు హాజరు కావాలని, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అభ్యర్థులకు ధర్మేంద్ర ప్రధాన్ భరోసా ఇచ్చారు. పొరపాట్లకు తావులేకుండా అత్యంత పకడ్బందీగా పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వం మాఫియా కుట్రలు, ధన బలం వంటివి విద్యార్థుల మెడికల్ సీటును లాక్కోవాలని తాము కోరుకోవడం లేదని ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమన్నారు. ఇప్పటిదాకా జరిగిన దానికి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. గెస్ పేపర్ ముసుగులో కొన్ని ప్రశ్నలు పరీక్షకు ముందే బయటకు వచ్చాయంటూ ఫిర్యాదులు అందాయని, వాటి ఆధారంగా ప్రాథమిక విచారణ ప్రారంభించామని చెప్పారు. మే 3న పరీక్ష జరిగే, 7న ఫిర్యాదులు వచ్చాయన్నారు. పేపర్ లీక్‌పై సీబీఐ దర్యాప్తు చేస్తోందని, దోషులను శిక్షించడం తథ్యమని పేర్కొన్నారు. గతంలో నీట్ పరీక్షలో అక్రమాలు బయటపడిన తర్వాత రాధాకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేశామని, ఆ కమిటీ సిఫార్సులను అమల్లోకి తీసుకొచ్చామని వెల్లడించారు. అయినప్పటికీ ఈ ఏడాది పేపర్ లీకేజీ ఘటన జరిగిందని, అందుకే మొదటి చర్యగా పరీక్షను రద్దు చేశామని తెలియజేశారు. నీట్ విషయంలో ఎవరైనా భయాందోళనలు, అవాంతరాలను సృష్టిస్తే కఠిన శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. మన వ్యవస్థను విశ్వసించాలి ఓఎంఆర్ విధానంతో పోలిస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానం కొంత మెరుగైనదని ధర్మేంద్ర ప్రధాన్ అభిప్రాయపడ్డారు. ఈ తరహా పరీక్షకు కొంత రక్షణ ఉంటుందన్నారు. మరోవైపు సైబర్ నేరాలు పెద్ద సమస్యగా మారాయని చెప్పారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో సవాళ్లు ఉన్నప్పటికీ, మన దేశ వ్యవస్థను మనం విశ్వసించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో జరిగే రీటెస్టుకు సిద్ధం కావాలని అభ్యర్థులకు సూచించారు. ఏ నగరంలో పరీక్ష రాయాలో నిర్ణయించుకోవడానికి వారం రోజుల సమయం ఇస్తున్నట్లు తెలిపారు. నీట్ టెస్టు జూన్ 21న మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.15 గంటల దాకా జరుగుతుందన్నారు. -
నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై రాహుల్ రియాక్షన్
ఢిల్లీ: నీట్ విద్యార్థుల ఆత్మహత్యలపై లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘‘నేను ఇకపై పోటీ పరీక్షలు రాయను అంటూ లఖింపూర్ ఖేరీకి చెందిన 21 ఏళ్ల హృతిక్ మిశ్రా పలికిన చివరి మాటలు ఇవి. మూడోసారి నీట్ పరీక్ష రాస్తున్న ఆ విద్యార్థి పరీక్ష రద్దు కావడంతో తీవ్రంగా కుంగిపోయాడు. గోవాలో కూడా నీట్ పరీక్ష రాసిన ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పిల్లలు పరీక్ష చేతిలో ఓడిపోలేదు.. అవినీతి వ్యవస్థ చేతిలో హతమయ్యారు. ఇది ఆత్మహత్య కాదు.. వ్యవస్థ చేసిన హత్య’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.‘‘2015 నుండి 2026 వరకు 148 పరీక్షల కుంభకోణాలు జరిగాయి. 87 పరీక్షలు రద్దు.. 9 కోట్ల మంది పిల్లల భవిష్యత్తుపై ప్రభావం పడింది. 148 కుంభకోణాలలో, కేవలం ఒక్క వ్యక్తికి మాత్రమే శిక్ష పడింది. సీబీఐ 17 కేసులు, ఈడీ 11 కేసులు తీసుకున్నాయి. ఎవరికీ శిక్ష పడలేదు. ఒక్క నీట్, ఏఐపీఎంటీ, ఇతర వైద్య పరీక్షలలోనే 15 కుంభకోణాలు జరిగాయి. అత్యంత సిగ్గుచేటైన విషయం ఏమిటంటే ఈ కుంభకోణాలకు బాధ్యులైన ఒక్క అధికారి గానీ, మంత్రి గానీ రాజీనామా చేయలేదు. వారిని తొలగించి, ఆ తర్వాత రహస్యంగా ఉన్నత పదవులలో తిరిగి నియమిస్తున్నారు’’ అంటూ ఎక్స్ వేదికగా రాహుల్ నిలదీశారు.‘‘మోసానికి సహకరించేవారికి బహుమతులు లభిస్తుండగా.. పరీక్షలు రాసే పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. మోదీ జీ.. మీలో జవాబుదారీతనం మేల్కొనడానికి ఇంకా ఎంతమంది హృతిక్‌లు కావాలి?. విద్యార్థుల బాధ నా బాధ. విద్యార్ధుల కష్టం నా కష్టం. విద్యార్ధుల భవిష్యత్తును దొంగిలించిన వారు సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఎంత కాలం పట్టినా సరే.. ఎవరినీ వదిలిపెట్టం.. ఇది నా వాగ్దానం. ఈ యుద్ధాన్ని మనం కలిసి పోరాడదాం.. మనం గెలుస్తాం’’ అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు.“अब नहीं देनी प्रतियोगी परीक्षा।”लखीमपुर खीरी के 21 साल के ऋतिक मिश्रा के ये आख़िरी शब्द थे। तीसरी बार NEET देने वाला यह बच्चा, परीक्षा रद्द होते ही टूट गया।गोवा में भी एक NEET अभ्यर्थी ने जान दे दी।ये बच्चे परीक्षा से नहीं हारे, इन्हें एक भ्रष्ट तंत्र ने मारा है।यह…— Rahul Gandhi (@RahulGandhi) May 15, 2026 -
NEET పేపర్ లీక్ స్కామ్‌లో షాకింగ్ నిజాలు
-
డౌట్ లేకుండా నీట్ ఉండదా?
జాతీయ స్థాయిలో ఎంబీబీఎస్‌తో సహా మరో పది కోర్సుల్లో చేరేందుకు ప్రవేశార్హతను నిర్ణయించే నీట్ యూజీ పరీక్ష, ఈ ఏడాది ప్రశ్నపత్రం లీక్ అయిన కారణంగా రద్దు కావడం గర్హనీయం. 23 లక్షల మంది విద్యార్థులు, రెండున్నర లక్షల సీట్ల కోసం పోటీ పడిన ఈ పరీక్ష ఉన్నఫళంగా రద్దు కావడం, మళ్లీ రాయాల్సి రావడం వారికీ, వారి కుటుంబాలకూ ఆర్థికంగా, భావోద్వేగపరంగా ఎంతో భారం.దేశంలో వైద్య, ఇంజినీరింగ్ కోర్సులకు ఉన్న విపరీతమైన డిమాండ్‌ను సొమ్ము చేసుకునేలా ఇబ్బడిముబ్బడిగా కోచింగ్ సెంటర్లు వెలిశాయి. వీటివల్ల విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెరగడమే కాకుండా, వారి కుటుంబాలకు ఆర్థిక భారం తప్పడం లేదు. ఇన్ని కష్టాల మధ్య రాసిన పరీక్ష కూడా రద్దు కావడం వల్ల విద్యార్థులకు జరుగుతున్న నష్టం వర్ణనాతీతం.ఈ పరీక్షను అన్ని రాష్ట్రాలకూ ఉమ్మడిగా నిర్వహించే విధానం 2013లో మొదలైంది. ఆ తర్వాత 2019లో దీని నిర్వహణ బాధ్యతల కోసం ప్రభుత్వం ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ (ఎన్టీఏ)ని స్థాపించింది. కానీ, ఏ సంవత్సరం కూడా ఈ పరీక్షల నిర్వహణ వివాదరహితంగా జరగలేదు. 2024లో కూడా తొలుత పరిమిత సంఖ్యలో పరీక్షను పాక్షికంగా రద్దు చేసి, మళ్లీ నిర్వహించాల్సి వచ్చింది. అయితే, ఇలా పరీక్షను పూర్తిగా రద్దు చేయాల్సిన పరిస్థితి ఇదే మొదటిసారి.ప్రపంచంలోనే ఒక దేశంలో అత్యధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొనే అతి పెద్ద పరీక్ష ‘నీట్’. అందుకు తగ్గట్టుగా లోపరహితమైన వ్యవస్థ ఏర్పాటు జరగలేదు. పరీక్షను పూర్తిగా ఆన్లైన్ విధానంలో కానీ లేదా హైబ్రిడ్ విధానంలో కానీ నిర్వహిస్తే కొన్ని లొసుగులను అధిగమించవచ్చని నిపుణులు సలహాలిచ్చారు. అయినా ఆ దిశగా చర్యలు లేవు. లక్షలాది విద్యార్థుల భవి ష్యత్తును, వారి కుటుంబాల ఆర్థిక స్థితిని ఒక్క పెట్టున మార్చగలిగే కీలకమైన పరీక్షను సరిగ్గా నిర్వహించలేకపోవడం దేశానికి సిగ్గుచేటు, ఒక సామాజిక నేరం. ఇప్పుడు ఈ రద్దుపై దర్యాప్తు జరగనుంది. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలి.చదవండి: నీట్ పేపర్ లీక్.. సంచలన విషయాలువ్యవస్థలో దిద్దుబాట్లు జరిగి, లోపరహితమైన, మేలైన పరీక్షా విధానం అమలులోకి వచ్చేలా చర్యలు చేపట్టాలి. నీట్ పరీక్షా కేంద్రాలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను వెనక్కి పంపడం గొప్పతనం కాదు. ఒక్క లోపమూ లేకుండా, ఎటువంటి అనుమానాలకు తావులేకుండా పరీక్షను పక్కాగా నిర్వహించడమే అసలైన గొప్పతనం. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా పని చేయాలి. నీట్ పరీక్షను ‘నీట్’గా నిర్వహించాలి, ‘డౌట్’గా కాదు.– డాక్టర్ డి.వి.జి. శంకరరావు, పార్వతీపురం మాజీ ఎంపీ -
NEET పరీక్షకు 45 గంటల ముందు కొంపముంచిన టెలిగ్రామ్.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ నిజాలు..
-
నీట్ పేపర్ లీక్.. సంచలన విషయాలు
నాసిక్: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్) పేపర్ లీకేజీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తిని మంగళవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్తాన్ పోలీసులు అందించిన వివరాలు, సోషల్ మీడియాలో లభించిన సమాచారం ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.నాసిక్ పోలీసుల ప్రకారం.. నాసిక్ జిల్లాలోని నందగావ్ ప్రాంత నివాసి అయిన నిందితుడు బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ డిగ్రీ కలిగివున్నాడు. తన స్నేహితులతో కలిసి నాసిక్‌లో ఒక మెడికల్ అడ్మిషన్ కౌన్సెలింగ్ కేంద్రాన్ని అతడు నడుపుతున్నాడు. నిందితుడు రూ. 10 లక్షలు చెల్లించి నీట్ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వివిధ రాష్ట్రాల్లోని 10 మందికి ఒక్కో సెట్‌ను రూ. 15 లక్షలకు విక్రయించినట్లు పోలీసులు కనుగొన్నారు.“మంగళవారం మధ్యాహ్నం నాసిక్‌లోని నందగావ్, ఇందిరా నగర్లో నిందితుడిని అరెస్టు చేశాం. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి నిందితుడు తన వేషధారణ, కేశాలంకరణ మార్చుకున్నాడు. అతను లీకైన పేపర్‌ను రూ.10 లక్షలకు కొనుగోలు చేసి, ఆ తర్వాత దానిని 10 సెట్లుగా తయారుచేసి, వైద్య ప్రవేశ కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు ఒక్కో సెట్‌ను రూ.15 లక్షలకు విక్రయించాడ''ని నాసిక్ పోలీసులు వెల్లడించారు. ఈ పేపర్ లీక్ నెట్వర్క్ రాజస్థాన్, మహారాష్ట్ర, హర్యానా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించిందని వారు తెలిపారు.ప్రింటింగ్ ప్రెస్ నుంచే లీక్?కాగా, నాసిక్‌లోని ప్రింటింగ్ ప్రెస్ నుంచే నీట్ ప్రశ్నాపత్రం లీకయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. లీక్ అయిన పేపర్ తొలుత రాజస్తాన్‌లోని జైపూర్‌కు, తర్వాత సికార్ పట్టణానికి, అక్కడి నుంచి దేశంలో ఇతర ప్రాంతాలకు సోషల్ మీడియా వేదికల ద్వారా చేసినట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాసిక్ ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన ఓ అనుమానిత వ్యక్తిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు నీట్ పేపర్‌ను చైన్ నెట్వర్క్ ద్వారా ఇతరులకు చేరవేసినట్లు అనుమానిస్తున్నారు.చదవండి: నీట్ పేపర్ లీకేజీ.. ఎలా బయటపడింది?గెస్ పేపర్ లేదు: డీఎస్పీనీట్ పేపర్ లీకేజీ కేసులో ఇప్పటివరకు వివిధ రాష్ట్రాల్లో 15 మంది వరకు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌లోనూ పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిల్లో తమకు ఎలాంటి ప్రశ్నపత్రం గానీ, గెస్ పేపర్ గానీ లభించలేదని రాజ్‌గిర్ డీఎస్పీ సునీల్ కుమార్ సింగ్ మీడియాకు తెలిపారు. కేవలం నగదు లావాదేవీలకు సంబంధించిన చాట్లు మాత్రమే బయటపడ్డాయని వెల్లడించారు. విద్యార్థి సంఘాల ఆందోళనలునీట్-యూజీ 20026 పరీక్ష లీకేజీ నేపథ్యంలో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బుధవారం ఆందోళన చేపట్టాయి. కేరళంలోని పాలక్కాడ్, కన్నూరుయ ప్రాంతాల్లో ఎస్ఎఫ్ఐ కార్యకర్తలు నిరసన చేపట్టారు. బ్యారికేడ్లు అడ్డుపెట్టి వారిని పోలీసులు నిలువరించడంతో తోపులాట చోటుచేసుకుంది. ఢిల్లీలోని ఎన్టీఏ కార్యాలయం ఎదుట ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఎన్టీఏ డైరెక్టర్ రాజీనామా చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఎన్టీఏ కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. -
NEET క్యూస్షన్ పేపర్ లీక్.. పేపర్ లీక్ వ్యవహారం..!
-
ఒక్క రాత్రిలో 22 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు వేలం పాట!
-
‘నీట్’ పరీక్ష రద్దు
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య అభ్యసించి, డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తూ జీవితంలో ఉన్నతస్థాయికి ఎదగాలన్న ఆశయంతో జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)కు హాజరైన లక్షలాది మంది అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) పిడుగులాంటి వార్త వినిపించింది. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షను రద్దు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. నీట్ ప్రశ్నపత్నం లీక్ అయినట్లు అనుమానాలు తలెత్తిన నేపథ్యంలో జాతీయ పరీక్షా వ్యవస్థలో పారదర్శకతను కాపాడటం, విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేసింది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీబీఐని కేంద్రం ఆదేశించిందని, దర్యాప్తు సంస్థకు తమ పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని, అవసరమైన రికార్డులు సమకూరుస్తామని ఎన్టీఏ స్పష్టంచేసింది. పరీక్ష జరిగిన నాలుగు రోజుల తర్వాత.. అంటే మే 7న సాయంత్రం అవకతవకలకు సంబంధించిన సమాచారం ఎన్టీఏకు అందింది. స్వతంత్ర ధ్రువీకరణతోపాటు అవసరమైన చర్యల కోసం మే 8వ తేదీ ఉదయం కేంద్ర దర్యాప్తు సంస్థలకు నివేదించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడేందుకే.. పరీక్షకు ముందే 410 ప్రశ్నలతో కూడిన ‘గెస్ పేపర్’కొందరు అభ్యర్థుల మధ్య సర్క్యులేట్ అయ్యిందని, అందులో 120 కెమిస్ట్రీ, 100కు పైగా బయాలజీ ప్రశ్నలు అసలైన ప్రశ్నపత్రంతో యథాతథంగా సరిపోలాయన్న ప్రచారంతో ‘నీట్’ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించడమే ఉత్తమమన్న నిర్ణయానికి వచ్చినట్లు ఎన్టీఏ పేర్కొంది. ఈ నెల 3న భారత్‌తోపాటు విదేశాల్లో జరిగిన నీట్(యూజీ)–2026 పరీక్షను 22.79 లక్షల మంది రాశారు.పేపర్ లీకేజీతో వారంతా నిరాశకు గురయ్యారు. పరీక్ష మళ్లీ నిర్వహిస్తామని, అభ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని ఎన్టీఏ ప్రకటించింది. పరీక్ష తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలియజేసింది. పరీక్షను మళ్లీ నిర్వహించడం వల్ల అభ్యర్థులకు, తల్లిదండ్రులకు అసౌకర్యం కలిగే మాట నిజమేనని ఎన్టీఏ అంగీకరించింది. కానీ, పరీక్షా వ్యవస్థపై నమ్మకాన్ని కాపాడేందుకు నీట్ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ‘గెస్ పేపర్’కోసం రూ.30 లక్షలు ‘గెస్ పేపర్’కోసం ఒక్కో విద్యార్థి దాదాపు రూ.30 లక్షల చొప్పున వెచ్చించినట్లు తమ విచారణలో తేలిందని రాజస్తాన్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్(ఎస్ఓజీ) ఏడీజీ విశాల్ బన్సాల్ మీడియాకు తెలిపారు. ఈ గెస్ పేపర్ పరీక్షకు 15 రోజుల ముందే అభ్యర్థులకు చేరిందన్నారు. డెహ్రాడూన్ నుంచి కేరళ మీదుగా సికార్‌కు చేరిన ఈ పేపర్‌ను ఒక్కో విద్యార్థి రూ.20 వేల నుంచి రూ.30 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడిందన్నారు.పరీక్ష ముందు రాత్రి అంటే.. మే 2వ తేదీ రూ.30 వేలకు కూడా కాపీలు అమ్మినట్లు ఆధారాలు లభించాయని ఎన్టీఏకు, కేంద్ర పభుత్వానికి నివేదించారు. ఎస్ఓజీ దర్యాప్తులో భాగంగా లభించిన ఆధారాలతో ఇప్పటివరకు మాస్టర్‌మైండ్ సహా 20 మందికి పైగా అదుపులోకి అనుమానితులను తీసుకున్నట్లు సమాచారం. నీట్ పేపర్ లీకేజీకి జైపూర్‌కు చెందిన మనీష్ అనే వ్యక్తిని మాస్టర్ మైండ్‌గా గుర్తించారు. రాజస్తాన్‌లో సికార్ పట్టణానికి చెందిన ఒక కోచింగ్ కెరీర్ కౌన్సెలర్‌ను అరెస్టు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ నీట్ పేపర్ లీక్ అంశం దేశవ్యాప్తంగా దుమారం సృష్టించింది. పలు ప్రాంతాల్లో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎన్టీఏ స్పందించి పరీక్షను రద్దు చేసింది. లీకేజీ వ్యవహారంలో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. సీబీఐ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాజస్తాన్ పోలీసుల దర్యాప్తులో లభించిన వాట్సాప్ చాటింగ్‌లు, స్క్రీన్షాట్లు, బ్యాంక్ లావాదేవీల వివరాలు, యూపీఐ చెల్లింపులు, క్రిప్టో చెల్లింపులను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. పరీక్ష జరిగిన అన్ని సెంటర్ల సీసీటీవీ ఫుటేజీ, బయోమెట్రిక్ డేటాను సేకరించారు. ఆ డేటాను, ఆధారాలను రాజస్తాన్ పోలీసులు సీబీఐకి అప్పగించారు. నీట్(యూజీ) పేపర్ లీక్ అంశంపై సీబీఐ మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ముఖం చాటేసిన విద్యాశాఖ మంత్రి నీట్ పేపర్ లీక్‌పై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మౌనం వహించారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను మీడియా ప్రతినిధులు ప్రశ్నించేందుకు ప్రయత్నించగా, తప్పించుకుని కారెక్కి వెళ్లిపోయారు. మహారాష్ట్రలో వ్యక్తి అరెస్టు నీట్ పేపర్ లీక్ అంశానికి సంబంధించి మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రాజస్తాన్ పోలీసులు అందించిన సమాచారం మేరకు అతడిని మంగళవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అతడిని కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించడానికి రాజస్తాన్ పోలీసుల బృందం రానున్నట్లు పేర్కొన్నారు. సందేహాలు – సమాధానాలునీట్ రద్దు కావడంతో అభ్యర్థులు, తల్లిదండ్రుల్లో రకరకాల సందేహాలు తలెత్తుతున్నాయి. వీటిపై నీట్ వర్గాలు కొంత స్పష్టత ఇచ్చాయి. ⇒ మళ్లీ పరీక్ష ఎప్పుడు? నీట్ తేదీని ఇంకా ప్రకటించలేదు. ఎప్పుడు నిర్వహించాలన్నది ఇంకా నిర్ణయించలేదు.⇒ మళ్లీ రిజిస్టర్ చేసుకోవాలా? అవసరం లేదు. ఇప్పటికే చేసుకున్న రిజిస్ట్రేషన్ డేటా, అభ్యర్థిత్వాన్ని త్వరలో మళ్లీ నిర్వహించే పరీక్షకు బదిలీ చేస్తారు.⇒ ఫీజు చెల్లింపు మాటేమిటి? ఈ ఏడాది నీట్ రాసిన అభ్యర్థులు మళ్లీ పరీక్ష రాయడానికి అదనంగా ఫీజులు చెల్లించాల్సిన పనిలేదు. గతంలో చెల్లించిన రుసుమును అభ్యర్థులకు తిరిగి(రీఫండ్) చెల్లిస్తారు. ⇒ అడ్మిట్ కార్డులు కొత్తగా ఇస్తారా? అవును. కొత్త అడ్మిట్ కార్డుల జారీపై త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తారు. ⇒ పరీక్షా కేంద్రాలను మారుస్తారా? మే 3న జరిగిన పరీక్షకు ఎంచుకున్న కేంద్రాలనే తిరిగి నిర్వహించే పరీక్షకు కూడా కొనసాగిస్తారు.పది రోజుల్లోగా షెడ్యూల్: ఎన్టీఏ డైరెక్టర్నీట్ పునఃపరీక్ష షెడ్యూల్‌ను రాబోయే 7 నుంచి 10 రోజుల్లోగా ప్రకటిస్తామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మంగళవారం తెలిపారు. అతి త్వరలో తన బృందంతో చర్చిస్తానని, పూర్తి పరీక్షల షెడ్యూల్, తేదీలను ప్రకటిస్తామని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల విద్యా క్యాలెండర్, ప్రవేశాల షెడ్యూల్‌కు అంతరాయం కలగకుండా వీలైనంత తక్కువ సమయంలోనే పరీక్ష నిర్వహించడానికి కృషి చేస్తామని చెప్పారు. మరో వారం, పది రోజుల్లోగానే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. లీకేజీ ఘటన నిజంగా బాధాకరమని, ఇలాంటివి తక్షణమే ఆగిపోవాలని అభిషేక్ సింగ్ తేల్చిచెప్పారు. పేపర్ లీకేజీలు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే మొత్తం వ్యవస్థకు ఆందోళన కలిగించే విషయమని వ్యాఖ్యానించారు. జరిగిన దానికి తాము బాధ్యత తీసుకుంటామని తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి అవకతవకలు జరగకుండా పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టంచేశారు. నీట్‌కు ముందు విద్యార్థుల మధ్య పీడీఎఫ్ ఫార్మాట్లో సర్క్యులేట్ అయిన కొన్ని ప్రశ్నలు అసలు ప్రశ్నపత్రంతో సరిపోలడంతో పరీక్షను రద్దు చేయాలని తాము సిఫార్సు చేశామని వివరించారు. మొత్తం పేపర్ లీక్ కాలేదని చెప్పారు. -
పేపర్ లీక్.. నీట్ 2026 పరీక్ష రద్దు.
-
షాకింగ్: నీట్ యూజీ 2026 రద్దు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరిగిన వైద్యవిద్య ప్రవేశ పరీక్ష ‘నీట్-యూజీ 2026’ రద్దయింది. మే 3న జరిగిన ఈ పరీక్షలో రాజస్థాన్‌లో ‘గెస్ పేపర్’ లీకైందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, జాతీయ పరీక్షా వ్యవస్థ పారదర్శకతను కాపాడేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.అసలేం జరిగింది?కేంద్ర దర్యాప్తు సంస్థల ప్రాథమిక సమాచారం మేరకు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయినట్లు తేలడంతో ఎన్టీఏ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్‌లో ‘గెస్ పేపర్’ పరీక్షకు ముందే ఎలా సర్క్యులేట్ అయింది? దీని వెనుక ఏమైనా వ్యవస్థీకృత ముఠా ఉందా? అన్న కోణంలో సమగ్ర విచారణ జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చేతికి అప్పగించింది. విచారణకు అవసరమైన అన్ని రికార్డులను సీబీఐకి అందించి పూర్తిగా సహకరిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది.త్వరలోనే రీ-ఎగ్జామ్.. విద్యార్థులకు ఊరటపరీక్ష రద్దు వల్ల విద్యార్థులు, వారి కుటుంబాలకు అసౌకర్యం కలిగినా, పరీక్షల వ్యవస్థపై నమ్మకం నిలబెట్టేందుకే మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. లీకేజీతో దెబ్బతిన్న ఆశావాహులకు న్యాయం చేయడానికే ఈ రీ-ఎగ్జామ్ జరగనుంది. త్వరలోనే అధికారిక మార్గాల ద్వారా కొత్త తేదీలను ప్రకటించనున్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలను నమ్మకుండా, అధికారిక సమాచారం కోసం వేచిచూస్తూ విద్యార్థులు తమ సన్నద్ధతను కొనసాగించాలని సూచించింది.కొత్త రిజిస్ట్రేషన్ అవసరం లేదు.. ఫీజు వాపసుమళ్లీ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఎవరూ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. పాత రిజిస్ట్రేషన్ డేటానే పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో ఎంచుకున్న పరీక్షా కేంద్రాలే దాదాపు చెల్లుబాటు అవుతాయి. దీనికోసం ఎలాంటి అదనపు రుసుము వసూలు చేయరు సరికాదు, ఇప్పటికే చెల్లించిన ఫీజును విద్యార్థులకు వాపసు (రీఫండ్) చేయనున్నారు. కొత్త పరీక్ష తేదీకి ముందు ఎన్టీఏ తాజా అడ్మిట్ కార్డులను జారీ చేస్తుంది. -
టెన్త్ పేపర్ లీక్..! సోషల్ మీడియాలో వైరల్
-
నాకేపాపం తెలియదు.. ప్రశ్నాపత్రం లీకేజీలో నా పాత్రలేదు..
శాలిగౌరారం: నాకేపాపం తెలియదు.. ప్రశ్నాపత్రం లీకేజీలో నా పాత్రలేదు.. పరీక్షా కేంద్రంలో కిటికీ పక్కన ఉన్న నన్ను కిటికీలో నుంచి గుర్తుతెలియని వ్యక్తి బెదిరించి నా ముందున్న ప్రశ్నాపత్రాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసుకున్నాడు. నన్ను అన్యాయంగా డిబార్ చేశారు. నా డిబార్‌ను రద్దు చేసి పరీక్షలకు అనుమతించాలి అని నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రానికి చెందిన పదో తరగతి విద్యార్థిని బల్లెం ఝాన్సీలక్ష్మి బుధవారం రాష్ట్ర హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయాన్ని ఆ విద్యార్థిని తల్లిదండ్రులు బుధవారం రాత్రి ‘సాక్షి’కి వెల్లడించారు. పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, నల్లగొండ జిల్లా విద్యాధికారి, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యూకేషన్ సెక్రటరీ, నకిరేకల్‌లోని పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిండెంట్లను ప్రతివాదులుగా పేర్కొంటూ న్యాయవాది కర్ణాకర్‌రెడ్డి ద్వారా లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశామని ఝాన్సీలక్ష్మి తల్లిదండ్రులు చెప్పారు. న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్ తమ పిటిషన్‌ను విచారించి ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఈ నెల 21న ఎస్సెస్సీ పరీక్ష ప్రారంభం కాగా పరీక్షలు ప్రారంభమైన పావుగంటకే నకిరేకల్‌లోని సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాల పరీక్షా కేంద్రంలో తెలుగు ప్రశ్నాపత్రం లీకై నకిరేకల్, శాలిగౌరారం మండలాలలోని యువకుల వాట్సాప్‌లలో చక్కర్లు కొట్టిన విషయం విదితమే. ప్రశ్నాపత్రం లీకై న సంఘటనను సీరియస్‌గా తీసుకున్న విద్యాశాఖ అధికారులు బాధ్యులను గుర్తించి నకిరేకల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ప్రశ్నాపత్రం క్రమసంఖ్య నెంబర్ ఆధారంగా విద్యార్థిని ఝాన్సీలక్ష్మిని గుర్తించిన అధికారులు.. ఆమెను పరీక్షలకు హాజరు కాకుండా డిబార్ చేశారు. ప్రశ్నాపత్రం లీకేజీలో పాల్గొన్న యువకులపై పోలీసులు కేసు నమోదు చేయడంతోపాటు కొందరిని రిమాండ్‌కు తరలించిన విషయం విదితమే. -
చంద్రబాబు సర్కార్ అంటేనే లీకేజీలు: రవిచంద్ర
సాక్షి, తాడేపల్లి: పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని నారా లోకేష్‌కు మంత్రిగా పనిచేసే అర్హత లేదని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర మండిపడ్డారు. లోకేష్ వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇది లీకేజీల ప్రభుత్వమంటూ రవిచంద్ర దుయ్యబట్టారు.కడప జిల్లాలో టెన్త్ పేపర్ వాట్సాప్‌లో ఎలా వచ్చింది? అంటూ రవిచంద్ర ప్రశ్నించారు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఎలా వెళ్తున్నాయి?. నారా లోకేష్ అసమర్థ మంత్రిగా నిలిచిపోయారు. బీఈడీ పరీక్షలను కూడా సరిగా నిర్వహించలేకపోయారు. అధికారులను సమర్థవంతంగా ఎందుకు వినియోగించలేకపోతున్నారు?. చంద్రబాబు ప్రభుత్వం అంటేనే లీకేజీల ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. రామబ్రహ్మం 1997లో ఇంటర్ పేపర్ లీక్ చేశారు. ఆ తర్వాత నారాయణ సంస్థల్లోనూ పరీక్ష పేపర్లు లీక్ అయ్యాయి. నారాయణ సంస్థలకే ర్యాంకులు రావాలని పేపర్లు లీక్ చేశారు. అప్పట్లో నారాయణ సంస్థల వైఎస్ ప్రిన్సిపాల్‌ని కూడా అరెస్టు చేశారు’’ అని రవిచంద్ర గుర్తు చేశారు.‘2024లో చంద్రబాబు రాగానే మళ్లీ పేపర్లు లీకవుతున్నాయి. 6 లక్షల 19 వేల మంది విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏనాడూ పేపర్ల లీకేజ్ అనేదే లేదు. నారాయణ సంస్థల ఉద్యోగిని ఇంటర్మీడియట్ బోర్డులో సభ్యునిగా పెట్టారు. తద్వారా ఇంటర్మీడియట్ బోర్డును తమ చేతుల్లోకి మంత్రి నారాయణ తీసుకున్నారు’’ అని రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ప్రమాదంలో విద్యార్థుల భవిష్యత్.. పేపర్ లీకేజీలపై రాహుల్ ట్వీట్
ఢిల్లీ: ప్రశ్నాపత్రాల లీకేజీలను వ్యవస్థాగత వైఫల్యంగా కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభివర్ణించారు. మరోసారి మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. గురువారం ఆయన ఎక్స్ వేదికగా.. లీక్‌ల కారణంగా కష్టపడి చదివే ఎంతో మంది విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని.. దీనిపై పోరాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కన పెట్టి కలిసి రావాలంటూ పిలుపునిచ్చారు.‘ప్రశ్నాపత్రాల లీకులతో ఆరు రాష్ట్రాల్లోని 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడిందన్న రాహుల్.. వీటి కారణంగా కష్టపడి చదివే విద్యార్థులతో పాటు వారి కుటుంబాలు కూడా ఒత్తిడికి గురవుతున్నాయన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం అందడం లేదన్నారు. దీంతో కష్టపడి పనిచేయడం కంటే నిజాయితీగా లేకపోవడమే మంచిదనే తప్పుడు సంకేతాలు భవిష్యత్ తరాలకు వెళ్తుందంటూ అభిప్రాయవ్యక్తం చేసిన రాహుల్.. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు.‘‘ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం లీకులను అడ్డుకోలేకపోయింది. ఇది వారి వైఫల్యానికి నిదర్శనం. అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు విభేదాలు పక్కనబెట్టి దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అప్పుడే వీటిని అరికట్టగలం. ఈ పరీక్షలు మన పిల్లల హక్కు. దాన్ని ఎలాగైనా రక్షించాలి’ అంటూ రాహుల్ ట్వీట్ చేశారు.6 राज्यों में 85 लाख बच्चों का भविष्य ख़तरे में - पेपर लीक हमारे युवाओं के लिए सबसे ख़तरनाक "पद्मव्यूह" बन गया है।पेपर लीक मेहनती छात्रों और उनके परिवारों को अनिश्चितता और तनाव में धकेल देता है, उनके परिश्रम का फल उनसे छीन लेता है। साथ ही यह अगली पीढ़ी को गलत संदेश देता है कि… pic.twitter.com/nWHeswvMOC— Rahul Gandhi (@RahulGandhi) March 13, 2025 -
Year Ender 2024: లీకుల నామ సంవత్సరం
2024లో దేశంలో భారీ రిక్రూట్మెంట్లు జరిగాయి. అలాగే వివిధ కోర్సులలో చేరేందుకు ప్రవేశపరీక్షలు కూడా నిర్వహించారు. ఈ నేపధ్యంలో పలు పేపర్ల లీకుల కేసులు వెలుగు చూశాయి. దీంతో దేశంలో జరుగుతున్న పరీక్షలపై లెక్కకుమించిన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్ లీక్ కేసు 2024 ఫిబ్రవరిలో వెలుగు చూసింది. ఆ తర్వాత నీట్ యూజీ, సీయూఈటీ, బీహార్ సీహెచ్ఓ, ఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షా పత్రాలు లీకయ్యాయి.యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష 2024 ఫిబ్రవరిలో జరిగిన యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు దాదాపు 45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష పేపర్ లీక్ కావడంతో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేశారు. 2024 ఫిబ్రవరి 18న పరీక్ష ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు పేపర్ లీక్ అయింది. యూపీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్ష పేపర్లను రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించారని తేలింది. ఈ కేసులో 244 మందిని అరెస్టు చేశారు.సీఎస్ఐఆర్ ఎస్ఓ ఎఎస్‌ఓ రిక్రూట్మెంట్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్.. ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లలో 444 ఎస్ఓ, ఏఎస్ఓ పోస్టులకు అంటే సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ కోసం పరీక్షను నిర్వహించింది. ఈ పరీక్ష పేపర్‌ను లీక్ చేసిన ఉదంతంలో పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు, సాల్వర్ ముఠాలు పోలీసులకు చిక్కారు. వీరు ఎనీడెస్క్ యాప్ ద్వారా కాపీయింగ్‌కు సహకరించారని తేలింది.యూపీపీఎస్సీ ఆర్ఓ, ఏఆర్ఓ పేపర్ లీక్ ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2024, ఫిబ్రవరి 11న ఆర్ఓ, ఏఆర్ఓ ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించింది. పేపర్ లీక్ విషయం వెలుగులోకి రావడంతో యూపీపీఎస్సీ ఆర్ఓ, ఏఆర్ఓ పరీక్షను రద్దు చేశారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం హర్యానాలోని మనేసర్, మధ్యప్రదేశ్‌లోని రేవాలో రిసార్ట్లు బుక్ చేశారు. అక్కడ ప్రశ్నాపత్రాలు లీక్ చేశారు. నీట్ యూజీ పేపర్ లీక్ నీట్ యూజీ పేపర్ లీక్ వార్త చాలాకాలం వార్తల్లో నిలిచింది. ఈ మెడికల్ ప్రవేశ పరీక్ష మే 5న జరిగింది. నీట్ యూజీ పేపర్ లీక్ దరిమిలా 1,563 మంది అభ్యర్థులు లబ్ధిపొందినట్లు తేలింది. ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో నీట్ పరీక్షలో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. నీట్ యూజీ నిర్వహణ అధికారులు రివైజ్డ్ రిజల్ట్‌లో టాపర్ల సంఖ్య 61 నుండి 17కి తగ్గించారు.యూజీసీ నెట్ పేపర్ లీక్ 2024 జూన్ 18న జరిగిన యూజీసీ నెట్ పరీక్షను విద్యా మంత్రిత్వ శాఖ జూన్ 19న రద్దు చేసింది. డార్క్‌నెట్‌లో యూజీసీ నెట్ పేపర్ లీక్ అయిందని, టెలిగ్రామ్ ద్వారా అభ్యర్థులకు అందించారని తేలిందని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.జెఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పేపర్ లీక్ జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (జెఎస్‌ఎస్‌సీ) సీజీఎల్ పరీక్ష 2024 సెప్టెంబర్ 21,22 తేదీలలో జరిగింది. అభ్యర్థులు ఎస్ఎస్సీ సీజీఎల్ సర్కారీ రిజల్ట్ కోసం ఎదురుచూస్తుండగా, ఇంతలో ఎస్ఎస్సీ సీజీఎల్ పేపర్ లీక్ అయినట్లు వెల్లడయ్యింది.రాజస్థాన్ ఎస్ఐ పరీక్ష రాజస్థాన్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) రిక్రూట్మెంట్ ఎగ్జామ్ 2024 పేపర్ లీక్ కేసులో 37 మందిని అరెస్టు చేశారు. స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్ఓజీ) విచారణలో దీని వెనుక రెండు ముఠాలు ఉన్నట్లు తేలింది . 859 పోస్టుల కోసం జరిగిన ఈ రిక్రూట్మెంట్ పరీక్షకు 7.97 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షను 2021 సెప్టెంబర్ 13, 14, 15 తేదీల్లో నిర్వహించారు. ఈ పరీక్షా పత్రాల లీకుతో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఆర్‌సీఎస్‌సీ) పనితీరుపై పలు అనుమానాలు తలెత్తాయి.ఎస్ఎస్సీ ఎంటీఎస్ ఫలితాలు బీహార్‌లోని పట్నాలో గల పూర్నియా డిజిటల్ పరీక్షా కేంద్రంలో ఎస్ఎస్సీ ఎంటీఎస్ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తేలింది. నకిలీ అభ్యర్థుల ద్వారా ఎస్ఎస్సీ ఎంటిఎస్ పరీక్షను రాయిస్తున్నారని తేలింది. ఈ విషయం తెలిసిన నేపధ్యంలో పోలీసులు ఈ కేంద్రంపై దాడి చేసి, ఏడుగురు ఉద్యోగులు, 14 మంది నకిలీ అభ్యర్థులతో పాటు 14 మంది అసలు అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు.బీహార్ సీహెచ్ఓ పేపర్ లీక్ బీహార్ సీహెచ్ఓ పరీక్ష 2024, డిసెంబరు 1, 2, 3 తేదీలలో జరగాల్సి ఉంది. పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ పరీక్షను రద్దు చేశారు. బీహార్ సీహెచ్ఓ పేపర్ లీక్ కేసులో ఇప్పటివరకు 37 మంది నిందితులను అరెస్టు చేశారు.పేపర్ లీక్‌లను నిరోధించడానికి రూపొందిన చట్టాన్ని 2024 జూన్ నుంచి అమలులోకి తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం పరీక్షల్లో పేపర్ లీక్ లాంటి అక్రమ చర్యలకు పాల్పడేవారికి మూడు నుంచి ఐదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. అలాగే రూ.10 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. వ్యవస్థీకృత పేపర్ లీకేజీకి కోటి రూపాయల వరకూ జరిమానా విధించనున్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ప్రధాని మోదీ పర్యటించిన దేశాలివే.. మీరూ ట్రిప్‌కు ప్లాన్ చేసుకోవచ్చు -
NEET paper leak case: ‘మాస్టర్‌మైండ్’ అరెస్ట్
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మరో ముందడుగు వేసింది. తాజాగా ఈ కేసులో ఒడిశాకు చెందిన సుశాంత్ కుమార్ మొహంతిని దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ ఉదంతంలో సుశాంత్ ప్రధాన సూత్రధారి అని సమాచారం. ప్రస్తుతం అతనిని సీబీఐ ఐదు రోజుల పాటు రిమాండ్‌కు తరలించింది.ఈ కేసులో ఇప్పటి వరకు 42 మందిని అరెస్టు చేశారు. ఆగస్టు 4న నీట్ పేపర్ లీక్ కేసులో సాల్వర్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. సాల్వర్ సందీప్ రాజస్థాన్‌లోని భిల్వారాలోని మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. సందీప్‌ను పట్నాలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. అనంతరం 5 రోజుల రిమాండ్‌కు తరలించారు.నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఆగస్టు ఒకటిన చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీటులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ 13 మంది పేర్లను నమోదు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్థులు, ఒక జూనియర్ ఇంజనీర్, ఇద్దరు కింగ్పిన్ల పేర్లు ఉన్నాయి. ఈ కేసులో కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు కూడా ఉన్నాయని సీబీఐ వెల్లడించింది. -
నీట్ యూజీ-2024పై సుప్రీం సమగ్ర తీర్పు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ప్రకంపనలు రేపిన నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు శుక్రవారం తుది తీర్పు వెలువరించింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. నీట్ పేపర్ లీకేజీలో వ్యవస్థీకృత ఉల్లంఘనలు జరగలేదని స్పష్టం చేసింది. పేపర్ లీకేజీ హజారీబాగ్, పాట్నాలకు మాత్రమే పరిమితమైందని స్పష్టం చేసింది.అయితే పరీక్ష వ్యవస్థలో ఉన్న లోపాలను నివారించాలని నేషనల్ టెస్టింగ్ ఏజ్సెన్సీతోపాటు కేంద్రానికి సుప్రీం సూచించింది. పేపర్ లీకేజ్ ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని, కమిటీ నివేదిక అమలుపై రెండు వారాల్లో సుప్రీంకోర్టుకు కేంద్ర విద్యాశాఖ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.పేపర్ లీకేజీ ఆరోపణలు, పరీక్షలో ఇతర అవకతవకలపై తీవ్ర వివాదం ఉన్నప్పటికీ, నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)-యుజి మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేయకపోవడానికి గల కారణాలను సుప్రీంకోర్టు శుక్రవారం తన తీర్పులో వివరించింది. సుప్రీం చేసిన సూచనలు..1. ఎవల్యూషన్ కమిటీ ఏర్పాటు చేయాలి2. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రూపొందించాలి 3. పరీక్షా కేంద్రాల కేటాయింపు ప్రక్రియను సమీక్షించాలి 4. గుర్తింపు, తనిఖీ ప్రక్రియలను మరింత మెరుగుపరచాలి 5. అన్ని పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ లను ఏర్పాటు చేయాలి 6. పేపర్ టాంపరింగ్ జరగకుండా భద్రతను పెంచాలి 7. ఫిర్యాదుల పరిష్కారానికి మెరుగైన వ్యవస్థను ఏర్పాటు చేయాలి 8. సైబర్ సెక్యూరిటీ రంగంలో సాంకేతికతను అభివృద్ధి చేసుకునేందుకు అంతర్జాతీయ సహకారం తీసుకోవాలి నీట్ లీక్ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. మే 5న జరిగిన ఈ పరీక్షను రద్దుచేసి.. మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టును పలువురు ఆశ్రయించగా.. అందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమే కానీ.. దీని ప్రభావం స్వల్పమేనని అభిప్రాయపడింది. నీట్ రీ ఎగ్జామ్ అవసరం లేదని పేర్కొంది. ఈ పిటిషన్లపై నేడు సర్వోన్నతన్యాయస్థానం సమగ్ర తీర్పు వెలువరించింది.మరోవైపు నీట్ పేపర్ లీకేజ్‌పై విచారణ చేస్తో న్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఇందులో నలుగురు అభ్యర్ధులు, ఓ జూనియర్ ఇంజనీర్, ఇద్దరు కుట్రదారులు సహా 13 మందిని నిందితులుగా చేర్చింది. -
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్
ఢిల్లీ: నీట్ పేపర్ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 13మంది నిందితులపై సీబీఐ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. నితీష్ కుమార్, అమిత్ ఆనంద్, సికిందర్ యాద్వెందు, అశుతోష్ కుమార్-1, రోషన్ కుమార్, మనీష్ ప్రకాష్, అశుతోష్ కుమార్-2, అఖిలేష్ కుమార్, అవదేశ్ కుమార్, అనురాగ్ యాదవ్, అభిషేక్ కుమార్, శివానందన్ కుమార్, ఆయుష్ రాజ్ వంటి నిందితుల పేర్లను చార్జిషీట్లో జత చేసింది. నీట్ పేపర్ లీకేజీ కేసులో దర్యాప్తు చేసిన సీబీఐ ఇప్పటి వరకు 40 మందిని అరెస్టు చేసింది. ఇందులో 15 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేశారు. ఇక నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి సీబీఐ అధికారులు 58 ప్రాంతాల్లో దర్యాప్తు సోదాలు నిర్వహించారు. CBI FILES FIRST CHARGESHEET IN THE NEET PAPER LEAK CASE pic.twitter.com/JIg8YG1CSi— Central Bureau of Investigation (India) (@CBIHeadquarters) August 1, 2024 -
ఆగస్ట్ 14 నుంచి .. నీట్ యూజీ 2024 కౌన్సెలింగ్
ఢిల్లీ: నీట్ యూజీ కౌన్సిలింగ్‌పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ఆగస్ట్ 14 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ఆగస్ట్ మొదటి వారంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కౌన్సిలింగ్‌పై అప్డేట్స్ను ఎంసీసీ వెబ్సైట్లో చూడాలని సూచించింది. ఈ మేరకు నీట్ అభ్యర్థులకు కేంద్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ ఒక నోటీసు విడుదల చేసింది. -
‘నీట్’రద్దుపై మరో రాష్ట్రం కీలక నిర్ణయం
కోల్‌కతా: నీట్ పరీక్షను రద్దు చేయబోమని, పేపర్ లీకేజీకి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పు పరిణామల అనంతరం నీట్ పరీక్ష కోసం రాజ్యాంగాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్న రాష్ట్రాల సంఖ్య రెండుకు చేరింది. ఇప్పటికే నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు రాజ్యాంగాన్ని సవరించాలని తమిళనాడు ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.తాజాగా, తమిళనాడు బాటలో పశ్చిమ బెంగాల్ చేరింది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మెడికల్ కాలేజీలో తమ విద్యార్థులను చేర్చుకోకుండా రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, నీట్ అమలుకు ముందు మాదిరిగా 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు మాట్లాడుతూ..తాము అఖిల భారత పరీక్షలకు (నీట్) ఎప్పుడూ అనుకూలంగా లేమని, అయితే అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రధాని నరేంద్రమోదీ ఒప్పించారని అన్నారు.#Breaking | West Bengal govt passes anti-NEET Resolution after the 'No Re-Test' Verdict of SC The anti-NEET resolution was passed after two days of discussion...: @pooja_news shares more details with @Swatij14 #NEETExam pic.twitter.com/R7vT0ATkv9— TIMES NOW (@TimesNow) July 24, 2024 నీట్‌లాంటి పరీక్షల నిర్వహణ బాధ్యతను కేంద్రం తీసుకునే సమయంలో మేం వ్యతిరేకించాం. నీట్ పరీక్షలను కేంద్రం నిర్వహించకూడదని అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ చెప్పారని ఆయన అన్నారు. అయినప్పటికీ నీట్ లాంటి పరీక్షలను కేంద్రమే నిర్వహిస్తోందికానీ ఇప్పుడు అలాంటి వ్యవస్థలోని లోపాలు విద్యా వ్యవస్థను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. కాబట్టే మేం పాత నీట్ పరీక్ష విధానాన్ని అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు తెలిపారు. -
నీట్ ప్రశ్నాపత్రం లీక్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
-
నీట్ విచారణ.. న్యాయవాదిపై సీజేఐ తీవ్ర ఆగ్రహం
నీట్ పేపర్ లీకేజీపై మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ (సీజేఐ డీవై చంద్రచూడ్) నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పు మంగళవారం వెల్లడించింది.అయితే నీట్‌పై విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి చంద్రచూడ్.. నీట్ పరీక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషనర్ తరుపు సీనియర్ న్యాయవాది మాథ్యూస్ నెడుంపరపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కోర్టు నుంచి బయటకు వెళ్లిపోవాలి. లేదంటే సెక్యూరిటీని పిలవాల్సి వస్తుందంటూ మండిపడ్డారు. ఇలా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహానికి న్యాయవాది మాథ్యూస్ నెడుంపర వ్యవహారశైలే కారణం. మాథ్యూస్ నెడుంపర ఏమన్నారు?అత్యున్నత న్యాయ స్థానంలో నీట్ పిటిషన్లపై విచారణ జరుగుతుంది. పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు చేస్తే విద్యార్ధుల భవిష్యత్ పరిణామాలపై సీజేఐ మాట్లాడుతున్నారు. దాఖలైన పిటిషన్లపై పిటిషనర్లకు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే సమయంలో మాథ్యూస్ నెడుంపర మధ్యలో కలగజేసుకున్నారు. కోర్టు హాలులో ఉన్న లాయర్లు అందరికంటే నేనే సీనియర్. బెంచ్ వేసిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. కోర్టులో నేనే అమికస్ (అమికస్ క్యూరీ)అని మాట్లాడగా..ఇక్కడ నేను ఎవర్ని అమికస్ గా నియమించలేదు అంటూ సీజేఐ స్పందించారు. అందుకు ప్రతిస్పందనగా.. మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్లిపోతానంటూ సీజేఐ చంద్రుచూడ్ మాటలకు అడ్డు చెప్పారు నెండుపర .నెడుంపర మాటలకు వెంటనే చంద్రుచూడ్ మాట్లాడుతూ.. నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు కోర్టు గ్యాలరీలో మాట్లాడకూదు. సెక్యూరిటీని పిలవండి. నెడుంపరను బయటకు తీసుకెళ్లండి అంటూ గట్టిగా హెచ్చరించారు.చంద్రుచూడ్ వ్యాఖ్యలకు.. నేను వెళ్తున్నాను.. నేను వెళ్తున్నాను. అంటూ నెడుంపర అక్కడి నుంచి కదిలే ప్రయత్నం చేశారు.మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. వెళ్లిపోవచ్చు. నేను గత 24 ఏళ్లుగా న్యాయవ్యవస్థను చూస్తున్నాను. ఈ కోర్టులో న్యాయవాదులు విధి విధానాలను నిర్దేశించడాన్ని నేను అనుమతించలేను అని అన్నారు.కోర్టు నుంచి హాలు నుంచి బయటకు వెళ్తున్న నెడుంపర ఒక్కసారిగా చంద్రచూడ్ వ్యాఖ్యలకు మరోసారి తిరిగి సమాధానం ఇచ్చారు. నేను 1979 నుండి చూస్తున్నాను అని చెప్పడంతో ఆగ్రహానికి గురైన సీజేఐ చంద్రుచూడ్.. మీ వ్యవహార శైలిపై కఠిన చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ చేయాల్సి వస్తుంది. మీరు ఇతర లాయర్లకు ఆటంకం కలిగించకూడదు అని అన్నారు.దీంతో నెడుంపర అక్కడి నుంచి వెళ్లిపోయారు. కొద్ది సేపటికి మళ్లీ తిరిగి వచ్చారు. నన్ను క్షమించండి. నేనేమీ తప్పు చేయలేదు. నాకు అన్యాయం జరిగింది అని వ్యాఖ్యానించారు. మీ పట్ల అనుచితంగా మాట్లాడినందుకు క్షమించండి అని అన్నారు.సుప్రీం కోర్టులో నాటకీయ పరిణామాల నడుమ నీట్ పరీక్షను రద్దు చేసేందుకు వీలు లేదని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ధర్మాసనం తీర్పును వెలువరించింది. అంతేకాదు నీట్ పరీక్ష వ్యవస్థ లోపభూయుష్టంగా ఉందని వ్యాఖ్యానించింది. రీ ఎగ్జామ్ పెడితే 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని స్పష్టం చేసింది. లబ్ధిపొందిన 155 మందిపైనే చర్యలు తీసుకోవాలని నీట్‌పై సుప్రీం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అమికస్ అంటేచట్టపరమైన సందర్భాలలో అమికస్ లేదా అమికస్ క్యూరీ అని సంబోధిస్తారు. సందర్భాన్ని బట్టి కోర్టులో పలు కేసులు విచారణ జరిగే సమయంలో ఒకే కేసుపై పదుల సంఖ్యలో పిటిషన్ దాఖలైనప్పుడు..పిటిషనర్ల అందరి తరుఫున సీనియర్ లాయర్ కోర్టుకు సమాధానం ఇస్తారు. అలా కోర్టుకు రిప్లయి ఇచ్చే లాయర్లను అమికస్ లేదా అమికస్ క్యూరీగా వ్యవహరిస్తారు. -
‘నీట్’ పరీక్ష రద్దు లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: నీట్ యూజీ-2024 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మంగళవారం(జులై 23) తుది తీర్పు వెల్లడించింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా(సీజేఐ) డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పుకాపీని చదివి వినిపిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.‘నీట్ పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయి. పేపర్‌లీక్ వల్ల 155 మంది విద్యార్థులు మాత్రమే లబ్ధిపొందారు. పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదు. నీట్‌కు మళ్లీ పరీక్ష అక్కర్లేదు. నీట్‌పై అభ్యంతరాలను ఆగస్టు 24న వింటాం’అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశం కోసం మే 5న దేశవ్యాప్తంగా 4750 కేంద్రాల్లో నిర్వహించిన నీట్-యూజీ 2024 పరీక్షకు దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీటి ఫలితాలను జూన్ 14న వెల్లడించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) భావించినప్పటికీ.. ముందస్తుగానే జవాబు పత్రాల మూల్యాంకనం ముగియడంతో జూన్ 4నే ఫలితాలు వెల్లడించింది. అయితే, పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీ ఆరోపణలు రావడం దేశవ్యాప్తంగా ఆందోళనలకు కారణమయ్యింది. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన సీబీఐ.. బిహార్‌లో ఇప్పటికే పలువురు అనుమానితులను అరెస్టు చేసింది. నీట్-యూజీ పేపర్ లీకేజీ ఆరోపణలు రావడంతో కొత్తగా పరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. పిటిషన్‌ను విచారించిన సుప్రీం ధర్మాసనం స్పందన తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వంతోపాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ను ఆదేశించింది. అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్ మార్కులు కలపడం, నీట్‌ను రద్దు చేయడం, ఓఎంఆర్ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు వంటి అంశాలతో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటిని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తుది తీర్పు మంగళవారం వెల్లడించింది. -
పేపర్ లీక్ చాలా పెద్ద సమస్య: రాహుల్ గాంధీ
-
లోక్ సభలో నీట్ పేపర్ లీకేజీపై విపక్షాల నిరసన
-
నీట్ పేపర్ లీక్ కేసు.. పాట్నా ఎయిమ్స్ వైద్యుల అరెస్ట్
నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్)-యుజీ పేపర్ లీక్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. నీట్ వ్యవహారాన్ని విచారిస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజాగా బిహార్‌లోని ఎయిమ్స్ పాట్నాకు చెందిన ముగ్గురు వైద్యులను అరెస్ట్ చేసింది.ఈ ముగ్గురిపైనా పేపర్ లీక్, ప్రవేశ పరీక్షలో అవకతవకలు తదితర ఆరోపణలు ఉన్నాయి. నిందితుల గదులకు సీల్ వేసిన సీబీఐ.. ల్యాప్‌టాప్, మొబైల్‌ను సీజ్ చేసింది. ముగ్గురూ 2021 బ్యాచ్‌కు చెందిన వైద్యులుగా గుర్తించారు. నేడు వీరిని అధికారులు విచారించనున్నారు.కాగా రెండు రోజుల క్రితమే నీట్ పేపర్ దొంగతనం ఆరోపణలపై సీబీఐ ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. బిహార్‌లో పంకజ్ కుమార్, జార్ఖండ్‌లో రాజు సింగ్‌ను అరెస్ట్ చేసింది. పాట్నా ప్రత్యేక కోర్టు వీరిద్దరికీ 14, 10 రోజుల సీబీఐ కస్టడీకి పంపింది. ఈ కేసులో కింగ్‌పిన్ రాకేష్ రంజన్ అలియాస్ రాకీ కూడా కస్టడీలో ఉన్నాడు.ఇదిలా ఉండగా నేడు(గురువారం) నీట్ పేపర్ లీక్ సహా అక్రమాలకు సంబంధించిన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జూలై 11న జరిగిన విచారణలో కేంద్రం, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నుంచి స్పందన లేకపోవడంతో.. పరీక్షను రద్దు చేయాలని, మళ్లీ పరీక్ష నిర్వహించాలని, అక్రమాలపై దర్యాప్తు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు జూలై 18కి వాయిదా వేసింది.ఇదిలా ఉండగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్, ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించేదే నీట్-యూజీ పరీక్ష. ఈ ఏడాది మే 5న జరిగిన ఈ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వివాదం చెలరేగింది. బిహార్‌లో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పేపర్ లీకేజీకి సంబంధించినది కాగా, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో నమోదైనవి అభ్యర్థులను మోసగించిన వాటికి సంబంధించినవి -
నీట్ పిటిషన్లపై విచారణ వాయిదా
న్యూఢిల్లీ, సాక్షి: నీట్ యూజీ పేపర్ లీకేజీ రద్దు చేయాలంటూ పదుల సంఖ్యలో దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు గురువారం విచారణ /జరిగింది. అయితే నీట్ పరీక్ష రద్దు చేయాల్సిన అవసరం లేదని, అందుకు బలం చేకూరేలా ఆధారాలతో కేంద్రం, నీట్ పరీక్షను నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (నీట్)లు సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాయి. అదే సమయంలో కేసులో దర్యాప్తు స్టేటస్‌ను సీబీఐ కోర్టులో సబ్మిట్ చేసింది. ఈ అఫిడవిట్లను, సీబీఐ రిపోర్టును పూర్తి స్థాయిలో పరిశీలించాలని అభిప్రాయం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.నీట్ పేపర్ లీకేజీపై చర్చ జరిగే సమయంలో.. పరిమిత సంఖ్యలో లీకేజీ జరిగిందని, పేపర్ లీక్ అనే పదాన్ని వినియోగించేందుకు కేంద్రం అంగీకరించడం లేదు. నీట్లో మాల్ ప్రాక్టీస్ జరగలేదని కేంద్రం పేర్కొంది. ఈ లీకేజీ బీహార్‌లోని ఓ కేంద్రానికి పరిమితమైందని, పేపర్ సోషల్ మీడియాలో లీకవ్వలేదని చెప్పింది. రీ నీట్ టెస్ట్ అవసరం లేదని వెల్లడించింది. అదే సమయంలో సీబీఐ సైతం సోషల్ మీడియాలో పేపర్ లీక్ కాలేదని.. కేవలం స్థానికంగానే పేపర్ లీక్ అయ్యిందని తన దర్యాప్తు నివేదికను సమర్పించింది.నీట్ పరీక్ష కోసం 24 లక్షల మంది విద్యార్ధులు భవిష్యత్‌ను ఇబ్బందుల్లోకి నెట్టడం సరికాదని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. ఇప్పటికే దాఖలైన అఫిడవిట్లను పరిశీలించేందుకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని భావించిన సుప్రీం కోర్టు విచారణను జులై 18 కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. -
నీట్ పేపర్ లీక్ అయ్యింది, కానీ.. : NTA
ఢిల్లీ: నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని.. కానీ, లీకేజీ ప్రభావం పెద్దగా లేదని అందులో పేర్కొంది. పాట్నా(బీహార్) సెంటర్లలో, గోద్రా(గుజరాత్) కొందరి ద్వారా మాత్రమే నీట్ పేపర్ లీక్ అయ్యింది. కానీ, పేపర్ లీక్ వ్యవహారం దేశం మొత్తం మీద పరీక్ష నిర్వహణ, ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించలేదని ఎన్టీఏ ఆ అఫిడవిట్లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. రేపు నీట్ రద్దు పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు ఆందోళనకు దిగడం.. దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ పరీక్షను రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. నీట్ పరీక్ష రద్దు చేసి చేసి తిరిగి నిర్వహించాలన్న 38 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయితే రీ ఎగ్జామ్ నిర్వహణ చివరి ఆప్షన్‌గానే ఉండాలని.. పేపర్ లీకేజీతో నష్టం విస్తృత స్థాయిలో జరిగిందని విచారణలో తేలితే కచ్చితంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏను ఆదేశిస్తామని సీజేఐ బెంచ్ అభిప్రాయపడింది.National Testing Agency (NTA) files affidavit in the Supreme Court in relation to the NEET-UG 2024 exam. The NTA, having come to know about the malpractice by individuals at Godhra and few centers at Patna, has made an assessment of the performance of all the appeared… pic.twitter.com/PyHfzzC0Ih— ANI (@ANI) July 10, 2024 -
Video: కుర్చీ నుంచి స్కూల్ ప్రిన్సిపాల్‌ను బలవంతంగా తొలగించి
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఓ పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలి కుర్చీపై తీవ్ర దుమారం రేగింది. పాత హెడ్ మాస్టర్‌ను కుర్చీ నుంచి బలవంతంగా తొలగించి, కొత్త ప్రధానోపాధ్యాయురాలిని కూర్చోబెట్టారు మిగతా ఉపాధ్యాయురాలు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇందులో పాఠశాల సిబ్బంది బృందం ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి ప్రవేశించి ఆమెను వెంటనే తన కుర్చీని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు ప్రిన్సిపాల్ పరుల్ సోలమన్ నిరాకరించడంతో బలవంతంగా ఆమెను కుర్చీ నుంచి బయటకు తీసేశారు. ప్రిన్సిపల్ ఫోన్ కూడా లాక్కున్నారు.అనంతరం కొత్తగా నియమితులైన ప్రిన్సిపాల్‌ను ఆమె స్థానంలో కూర్చున్నారు, అక్కడ ఉన్న వారు చప్పట్లతో ఆమెకు స్వాగతం పలికారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని బిషప్ జాన్సన్ బాలికల పాఠశాలలో ఈ నాటకీయ దృశ్యాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు ప్రిన్సిపాల్ సీటును బలవంతంగా ఖాళీ చేయించడంపై పరుల్ సోలమన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పరుల్ పట్ల అనుచితంగా ప్రవర్తించలేదని ఆ స్కూల్ యాజమాన్యం పేర్కొంది. అయితే గతంలో పాఠశాలలో జరిగిన యూపీపీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రిన్సిపల్ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో ఆమె స్థానంలో మరొకరిని కూర్చొబెట్టారు. పేపర్ లీక్ ముఠా సభ్యుడు కమలేష్ కుమార్ పాల్ అలియాస్ కేకేకు ప్రిన్సిపల్ పరుల్ సోలోమన్‌కు సంబంధం ఉన్నట్లు బయటపడింది. దాంతో ఆమెను తొలగించారు. అయితే ఆమె స్థానంలో కొత్త ప్రిన్సిపాల్ షిర్లీ మాస్సీని నియమించిన తర్వాత కూడా సోలమన్ ఆమె సీటును ఖాళీ చేయడానికి నిరాకరించడంతో ప్రిన్సిపాల్ కార్యాలయంలో ఈ గందరగోళం నెలకొంది.Video: UP Principal Forcibly Removed From Office, Her Replacement WatchesFacts apart, y shld no action b taken agast d lawyer who with his band on acts extra judicially.Assuming he is for clg, yet,his role wud be limited to court @myogioffice https://t.co/CesaPaMbzl— Nawaz Haindaday مھمد نواز ہئنرارے (@nawazhaindaday) July 6, 2024 -
‘నీట్’పై నోరు మెదపరేమి?
తిరుపతి సిటీ (తిరుపతి జిల్లా)/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నీట్ పేపర్‌లీక్ వల్ల దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని, అయినా కేంద్రం నోరు మెదపకపోవడం దారుణమని ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్త విద్యార్థి సంఘాల పిలుపు మేరకు గురువారం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు మూతపడ్డాయి. తిరుపతి ఎస్వీ వర్సిటీ ఏడీ బిల్డింగ్ వద్ద జిల్లా ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.సంఘాల నేతలు మాట్లాడుతూ..లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఆయోమయంలో ఉన్నా రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి నేతలు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ స్పందించక పోవడం దారుణమన్నారు. ఎన్టీఏను రద్దు చేసి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసి యువతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రాసిన విద్యార్థులకు మోదీ సర్కార్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ, కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మలను దగ్దం చేసేందుకు ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసు అడ్డుకుని దిష్టిబొమ్మలను లాక్కొన్నారు.ధర్నాలో విద్యార్థి సంఘాల నేతలు రవి, అక్బర్, నవీన్, ప్రవీణ్, మల్లి కార్జున, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే, నీట్ లీకేజీ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాలని, పరీక్ష రద్దు చేయాలని కోరుతూ దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌లో భాగంగా విజయవాడ సిద్ధార్థ కళాశాల కూడలి వద్ద విద్యార్థి సంఘాల నాయకులు గురువారం ఆందోళన చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్న నాయకులు కళాశాల లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి మాచవరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
దేశానికి నీట్ అవసరం లేదు.. నటుడు విజయ్ కీలక వ్యాఖ్యలు
చెన్నై: వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నిర్వహణపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. నీట్ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ, పేపర్ లీక్ అయినట్లు విద్యార్ధులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అటు విపక్షాలు సైతం నీట్ అక్రమాలపై పార్లమెంట్లో చర్చ జరపాలని పట్టుబడుతున్నాయి.ఈ క్రమంలో తాజాగా తమిళ స్టార్ హీరో విజయ్ నీట్ వివాదంపై స్పందించారు. నీట్ పరీక్ష వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పేపర్ లీక్ కారణంగా ప్రజల విశ్వసనీయతను కోల్పోయిందన్నారు. వివాదాస్పద నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు.ఇటీవల జరిగిన పదోతరగతి, పన్నెండవ తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు ఉపకార వేతనాల ప్రదానోత్సవం రెండో దశ కార్యక్రమంలో తమిళనాడు వెట్రి కజగం పార్టీ అధ్యక్షుడైన విజయ్ నీట్ పరీక్షకు వ్యతిరేకంగా మాట్లాడారు. నీట్ పరీక్ష రద్దుకోసం తమిళనాడు స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో చేసిన తీర్మానానికి మద్దతు ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. ఈ సమస్యకు పరిష్కారంగా రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు.‘నీట్ పరీక్షపై ప్రజలకు నమ్మకం పోయింది. దేశానికి నీట్ అవసరం లేదు. నీట్ నుంచి మినహాయింపు ఒక్కటే పరిష్కారం. రాష్ట్ర అసెంబ్లీలో నీట్కి వ్యతిరేకంగా ఆమోదించిన తీర్మానాన్ని స్వాగతిస్తున్నాను. తమిళనాడు ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. విద్యను ఉమ్మడి జాబితా నుంచి రాష్ట్ర జాబితా కిందకు తీసుకురావాలి.నీట్ పరీక్ష కారణంగా తమిళనాడులో పెద్ద సంఖ్యలో పేద, అర్హులైన, అట్టడుగున ఉన్న విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించలేకపోతున్నారు’.అని తెలిపారు ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ప్రత్యేక ఉమ్మడి జాబితాను రూపొందించడానికి రాజ్యాంగాన్ని సవరించాలని అభిప్రాయపడ్డారు. దానికింద విద్య, ఆరోగ్యాన్ని చేర్చాలన్నారు.Chennai, Tamil Nadu | Speaking at a party event, TVK chief and actor, Vijay says, "People have lost faith in NEET examination. The nation doesn't need NEET. Exemption from NEET is the only solution. I wholeheartedly welcome resolution against NEET which was passed in the State… pic.twitter.com/PatKO7MSWU— ANI (@ANI) July 3, 2024 ఇక నీట్ పరీక్షను రద్దు చేయాలని తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో డీఎంకే ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానించిన విషయం తెలిసిందే. వైద్యసీట్లను భర్తీ చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలని, మునుపటిలా 12వ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. -
రాజ్యసభలోనూ నీట్ రగడ
న్యూఢిల్లీ: నీట్–యూజీ ప్రశ్నపత్రం లీకేజీ ఉదంతం రాజ్యసభను కుదిపేసింది. పేపర్ లీక్‌తో లక్షలాది యువత భవిష్యత్తును నాశనం చేసిందని, రేయింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిందని విపక్షాలు ఆందోళన వ్యక్తంచేశాయి. ‘‘ దేశంలో రెండు ఐపీఎల్‌లు జరుగుతున్నాయి. ఒకటి ఇండియన్ ప్రీమియర్ లీగ్, మరొకటి ఇండియన్ పేపర్ లీక్. ఒక ఐపీఎల్ బాల్, బ్యాట్‌తో ఆడితే ఇంకో ఐపీఎల్ యువత భవిష్యత్తుతో ఆడుకుంటోంది.నీట్–యూజీ పరీక్ష చేపట్టిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అంటే ఇకపై నో ట్రస్ట్ ఎనీమోర్(ఎన్టీఏ)గా పలకాలి’ అని ఆప్ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. ప్రతిష్టాత్మక పరీక్షల పేపర్ లీకేజీల అంశాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని ఇంకొందరు సభ్యులు డిమాండ్‌చేశారు. ‘‘ తీవ్ర వివాదాస్పదమైన నీట్ పరీక్షను కేంద్రం ఇకనైనా రద్దుచేస్తుందా లేదా? ’’ అని కాంగ్రెస్ నేత దిగి్వజయ్‌సింగ్ సూటిగా ప్రశ్నించారు.ఎన్టీఏ చైర్మన్‌కు గతంలో మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ స్కామ్‌తో సంబంధం ఉందని దిగ్విజయ్ ఆరోపించారు. ‘‘ నీట్, నెట్ లీకేజీల్లో కోచింగ్ సెంటర్లదే ప్రధాన పాత్ర. అయినా వాటిపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు’’ అని ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్‌ను తక్షణం డిస్మిస్ చేయకుండా రెండునెలల శాఖాపర దర్యాప్తు తర్వాత చర్యలు తీసుకుంటామని కేంద్రం చెప్పడంలో ఆంతర్యమేంటి?’ అని ఎస్పీ నేత రాంజీలాల్ సుమన్ అనుమానం వ్యక్తంచేశారు. -
నీట్ పేపర్ లీకేజీపై చర్చకు విపక్షాల పట్టు
-
నీట్ పేపర్ లీక్: జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ
రాంచీ: నీట్ యూజీ-2024 పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకలే దేశంవ్యాప్తంగా దుమారం రేపుతోంది. నీట్ పరీక్షను రద్దు చేయాలని విక్షాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు.. ప్రశ్న లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. సీబీఐ తాజాగా శనివారం ప్రశ్నపత్రం లీకేజీతో సంబంధాలు ఉన్నాయని జార్ఖండ్‌లోని హజారీబాగ్‌కు చెందిన ఓ జర్నలిస్ట్‌ను అరెస్ట్ చేసింది. ఓ హింది న్యూస్ పేపర్లో పనిచేసే.. జమాలుద్దీన్ అనే జర్నలిస్ట్ పేపర్ లీకేజీలో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌కు సాయం చేసినట్లు అభియోగాలతో సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇప్పటికే ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ ఎహసానుల్ హక్, వైస్ ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలంకు శుక్రవారం సీబీఐ అరెస్ట్ చేసింది.అదేవిధంగా గుజరాత్‌లోని 7 వేర్వేరు ప్రాంతాల్లో సీబీఐ బృందాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. గోద్రా, ఖేడా, అహ్మాదాబాద్, అనంద్ సోదాలు నిర్వహించింది. ఈకేసులో ఎఫ్ఐఆర్ ఆధారంగా గోద్రా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తొలిసారిగా ఇద్దరు నిందితులను పట్నాలో అరెస్టు చేసింది. నిందితులను మనీశ్ కుమార్, ఆశుతోష్‌గా గుర్తించారు. -
నీట్ రద్దుపై ప్రధాని మోదీ, ఎనిమిది రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలపై వివాదం కొనసాగుతున్న వేళ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోపాటు, ఎనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలని, జాతీయ స్థాయిలో ఈ వ్యవస్థను తొలగించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.వైద్య విధ్యలో విద్యార్ధుల ఎంపిక ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా కాకుండా ప్లస్ 2(12వ తరగతి) మార్కుల ఆధారంగా మాత్రమే ఉండాలని కోరారు. ఇది విద్యార్ధులపై అనవసరమైన అదనపు ఒత్తిడిని తగ్గిస్తుందని చెప్పారు."దీనికి సంబంధించి, తమిళనాడును నీట్ నుండి మినహాయించాలని మరియు 12వ తరగతి మార్కుల ఆధారంగా మెడికల్ అడ్మిషన్లు అందించాలని మేము మా శాసనసభలో ఏకగ్రీవంగా బిల్లును ఆమోదించాము. ఇది రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించాం. అయితే ఇంకా పెండింగ్‌లో ఉంది," అని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు.నీట్ మినహాయింపు కోసం తమిళనాడు చేస్తున్న డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాశారు. ఇటీవల నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై రాష్ట్రం వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని సీఎం తెలిపారు. నీటి తొలగింపుపై ఇతర రాష్ట్రాలు కూడా కోరుతున్నాయని పేర్కొన్నారు.పై విషయాలను పరిగణనలోకి తీసుకుని, నీట్ నుంచి తమిళనాడును మినహాయించే బిల్లుకు కేంద్ర ప్రభుత్వం తన సమ్మతిని అందించాలని, జాతీయ స్థాయిలో వైద్య కమిషన్ చట్టాన్ని కూడా సవరించాలని కోరుతూ తమిళనాడు శాసనసభ శుక్రవారం ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిందని చెప్పారు.కాగా.. నీట్‌ను రద్దు చేయడానికి తమ తమ అసెంబ్లీలలో ఇదే విధమైన తీర్మానాన్ని ఆమోదించడాన్ని పరిశీలించాలని కోరుతూ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌లోని సీఎంలను స్టాలిన్ లేఖల ద్వారా కోరారు. -
నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు
నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అరెస్టులు మొదలుపెట్టింది. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మనీశ్ కుమార్, అశుతోష్‌ను బిహార్‌లోని పట్నాలో అదుపులోకి తీసుకొంది.ఇప్పటికే పేపర్ లీక్‌కు సంబంధించి సీబీఐ క్రిమినల్ కేసు నమోదు చేసింది. దీంతోపాటు బిహార్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు నమోదుచేసిన అభియోగాలను కూడా తమకు బదలాయించాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే గుజరాత్‌లోని గోద్రా తాలుకా పోలీస్‌స్టేషన్‌లో మాల్‌ప్రాక్టీస్‌పై ఓ ఎఫ్ఐఆర్ నమోదైంది. సీబీఐ మొత్తం ఈ వ్యవహారంలో ఆరు కేసులను దర్యాప్తు చేస్తోంది.సీబీఐ వర్గాల ప్రకారం, మనీశ్ కుమార్ కొందరు విద్యార్థులను తన కారులో ఓ స్కూలుకు తరలించి అక్కడ వారికి పేపర్ అందజేసీ బట్టీ కొట్టించాడు. మరోవైపు ఆశుతోశ్ ఆ విద్యార్థులకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించాడు. గురువారం సీబీఐ తొలుత నిందితులిద్దరనీ ప్రశ్నించి అనంతరం అరెస్టు చేసింది.నీట్-యూజీ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా మే 5వ తేదీన నిర్వహించింది. దీనికి 24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పేపర్ బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో లీకైనట్లు ఇటీవల కాలంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మధ్యలోనే జూన్ 4న ఎన్టీఏ ఫలితాలు ప్రకటించడం వివాదాస్పదంగా మారింది. దీంతో కేంద్రం కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. కేంద్ర విద్యాశాఖ ప్రకటన అనంతరం కేసు బాధ్యతలు తీసుకున్న సీబీఐ ఇప్పటివరకూ ఆరు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసింది. -
పరారీలో నీట్ పేపర్ లీకేజీ మాస్టర్ మైండ్.. ఎవరీ సంజీవ్ ముఖియా
పాట్నా: నీట్ పేపర్ లీకేజీలో ప్రధాన సూత్ర దారి బీహార్‌లోని షాపూర్‌కు చెందిన సంజీవ్ ముఖియా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.దేశంలో వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు మే 5న నీట్-యూజీ ప్రవేశ పరీక్ష 2024 నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించింది. ఈ పరీక్ష నిర్వహణకు ముందు పేపర్ లీకేజీ కావడం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది.అయితే ఈ పేపర్ లీకేజీ అంతా బీహార్‌లోని పాట్నా ఓ బాయ్స్ హాస్టల్ కేంద్రంగా జరిగినట్లు తెలుస్తోంది. మే 5న నీట్ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 4న లీకేజీలో మాస్టర్ మైండ్ బీహార్ నూర్సరాయ్లోని నలంద కాలేజీ ఆఫ్ హార్టికల్చర్ టెక్నికల్ అసిస్టెంట్ సంజీవ్ ముఖియా బాయ్స్ హాస్టల్లో నీట్ పరీక్ష రాసే 25మంది విద్యార్ధులకు వసతి కల్పించాడు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సంజీవ్ ముఖియా నీట్ క్వశ్చన్ పేపర్, జవాబుల పత్రాన్ని అదే హాస్టల్లో విద్యార్ధులకు అందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆ హాస్టల్‌ను ప్రభాత్ రంజన్ అనే వ్యక్తి నుంచి తీసుకున్నాడు. ఇంతకీ ఎవరా ప్రొఫెసర్పేపర్ లీక్ కేసుకు సంబంధించి బీహార్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ప్రభాత్ రంజన్‌కు సైతం ప్రశ్నించారు. ఈ పేపర్ లీకేజీలో హస్తం ఉందని గుర్తించారు. రంజన్ నీట్ పేపర్లను ప్రొఫెసర్ నుంచి తీసుకొని సంజీవ్ ముఖియాకు ఇచ్చినట్లు తేలింది. పరీక్షకు ముందు రోజే పేపర్లు విద్యార్ధులకు అందుబాటులోకి వచ్చినా సమయం లేకపోవడం వల్ల పూర్తిగా చదవలేదని సమాచారం. ఇక, పోలీసులు దర్యాప్తు చేస్తున్న పేపర్ లీక్ కేసులో ముఖియాతో సంబంధం ఉన్న రవి అత్రి పేరు కూడా బయటపడింది.చదవండి : 👉 నీట్ పేపర్ లీక్‌పై కేంద్రం చర్యలుముఖియాను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మరం చేశారు. నీట్ పేపర్ లీక్‌తో ముఖియా ప్రమేయం ఉన్నట్లు సూచించే వివరాలు వెలుగులోకి రావడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు బీహార్ పోలీసుల ఆర్ధిక నేరాల విభాగం( ఈఓయూ) ప్రయత్నాలు ముమ్మరం చేసింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం..ఈఓయూ నలంద, గయా, నవాడా జిల్లాల్లోని పోలీసు బృందాలను అప్రమత్తం చేసింది. ఇదిలా ఉండగా, లీకైన పేపర్లు ఉత్తరప్రదేశ్ నుండి జార్ఖండ్ మీదుగా బీహార్‌కు చేరుకున్నాయని పోలీసులు అనుమానించడంతో జార్ఖండ్‌కు చెందిన పలువురు అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సంజీవ్ ముఖియా ఎవరు2010లో పరీక్ష పేపర్ లీకేజీ వార్తల సమయంలో సంజీవ్ ముఖియా పేరు మారు మ్రోగింది. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్‌ఈ) సహా అనేక పరీక్షల పేపర్ లీక్‌లకు సూత్రధారి. ఆ తర్వాత పేపర్ లీకేజీల కోసం ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. సంజీవ్ కుమారుడు శివ కుమార్ గతంలో బీపీఎస్‌ఈ పరీక్ష లీక్ వ్యవహారంలో అరెస్టయ్యాడు. ఇప్పటికీ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. సంజీవ్ ముఖియా భార్య మమతా దేవి గతంలో రామ్‌విలాస్ పాశ్వాన్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ నుంచి టికెట్‌పై పోటీ చేశారు. నిందితులపై కఠిన చర్యలుకాగా, వరుస పేపర్ లీక్‌లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కేంద్ర ప్రభుత్వం అందుకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొనేందుకు ది పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) యాక్ట్ 2024ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ఎవరైనా చట్టవిరుద్ధంగా పరీక్ష పేపర్లను అందుకున్నా, ప్రశ్నలు, జవాబులను లీక్ చేసినా, పరీక్ష రాసే వారికి అనుచితంగా సాయం చేసినా, కంప్యూటర్ నెట్‌వర్క్‌ను ట్యాంపరింగ్ చేసినా, నకిలీ పరీక్షలు నిర్వహించినా, నకిలీ ప్రవేశపరీక్ష కార్డులు జారీ చేసినా నేరంగా పరిగణిస్తారు. కారకులకు 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.కోటి వరకు జరిమానా విధించడానికి వీలుంది. -
పేపర్ లీక్ కట్టడికి యూపీ సర్కారు సరికొత్త ప్రణాళిక
దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో జరిగే పరీక్షల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు పలు చర్యలు ప్రారంభించాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ ఒకటి.ఉత్తరప్రదేశ్ జనాభాలో 56 శాతం మంది యువతే ఉన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టాలని ఇక్కడి యువత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటుంది. తాజాగా యూపీలోని యోగి సర్కారు పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రంలో జరిగే ఏ పరీక్షకైనా వాటి నిర్వహణ బాధ్యతను నాలుగు ఏజెన్సీలకు అప్పగిస్తారు.ప్రింటింగ్ ప్రెస్ ఎంపికలో గోప్యత ఉండటంతోపాటు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఆ ప్రింటింగ్ ప్రెస్‌ను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. ప్రింటింగ్ ప్రెస్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తారు. బయటి వ్యక్తులెవరూ ప్రెస్‌లోకి ప్రవేశించడానికి అనుమతించరు. ప్రింటింగ్ ప్రెస్‌లోనికి స్మార్ట్ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తారు.రాష్ట్రంలో జరిగే ఏదైనా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య నాలుగు లక్షలు దాటితే, ఆ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రతి షిఫ్ట్‌లో తప్పనిసరిగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పేపర్ సెట్లు అందుబాటులో ఉంచుతారు. ఒక్కో సెట్ ప్రశ్నాపత్రాల ముద్రణ వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతుంది. అలాగే ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పలు చర్యలు చేపట్టనున్నారు. -
‘నీట్’ లీకేజీపై నిరసన జ్వాల
తిరుపతి సిటీ/గుంటూరు ఎడ్యుకేషన్/లక్ష్మీపురం : నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఉదంతంపై గురువారం రాష్ట్రంలోని పలుచోట్ల నిరసనలు జరిగాయి. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించారు. పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ, ఎంఆర్ పల్లి దండి మార్చ్ సర్కిల్ వద్ద ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్ష పత్రం లీకేజీ బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు.మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా అంటూ ప్రగల్భాలు పలికే ప్రధాని మోదీ, రాష్ట్ర సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌లు కూడా నీట్ పేపర్ లీకేజీపై స్పందించాలని, విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారులు నైతిక బాధ్యత వహిస్తూ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షను మళ్లీ పకడ్బందీగా నిర్వహించాలని, దేశంలోని అన్ని విద్యార్థి సంఘాలు ఏకమై పార్లమెంట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు రవి, అక్బర్, రమేష్‌నాయక్, నాగేంద్ర ఏఐఎస్ఎఫ్ నాయకులు బండి చలపతి, చిన్న, నవీన్, ప్రవీణ్, పెద్ద సంఖ్యలో నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు పాల్గొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు చంద్రమౌళీనగర్ నుంచి లక్ష్మీపురంలోని మదర్‌థెరిసా విగ్రహం వరకు విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ ఎన్టీఏ నిర్వహించిన పరీక్షలన్నింటిపైనా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, గుంటూరు కొత్తపేట భగత్ సింగ్ విగ్రహం వద్ద అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చుని నిరసన చేపట్టారు.నీట్ పరీక్ష పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జంగాల చైతన్య, యశ్వంత్‌లు డిమాండ్ చేశారు. లేకుంటే వారి కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నీట్ వివాదం.. కేంద్ర విద్యాశాఖ మంత్రి కీలక ప్రకటన
నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీపై బిహార్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని పేర్కొన్నారు. పరీక్ష పేపర్ లీకేజ్‌పై పూర్తి స్థాయి రిపోర్టు అడిగామని తెలిపారు. దోషులెవరైనా వదిలి పెట్టమని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నీట్ వ్యవహారంపై ఉన్నస్థాయి కమిటీ వేస్తున్నామని చెప్పారు.దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య సంస్థలలో అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సులలో ప్రవేశం కోరుకునే విద్యార్థుల కోసం ప్రతి సంవత్సరం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. ఈ సంవత్సరం మే 5న నిర్వహించిన ఈ పరీక్షకు సుమారు 24లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జూన్ 4న ఫలితాలు ప్రకటించారు. కాగా 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో వీటిని కలిపారు. దీంతోపాటు అనేకమంది పూర్తి స్థాయి మార్కులు రావడంతో నీట్ పరీక్షలో అక్రమాలు జరిగినట్లు, పేపర్ లీకైనట్లు ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ కొనసాగుతోంది. -
'నీట్ పేపర్ లీక్‌తో.. తేజస్వి అనుచరుడికి సంబంధం'
పాట్నా: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వివాదం దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. జూన్ 4న వెలువడిన నీట్ యూజీ ఫలితాల్లో ఏకంగా 67 మందికి 720 మార్కులు రావడం, వీరిలో ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్లో పరీక్ష రాయడం సందేహాలకు దారి తీసింది. దీంతో పరీక్ష పేపర్ లీక్ అయ్యిందని.. మళ్లీ ఎగ్జామ్ నిర్వహించాలని విద్యార్ధులు పట్టుబడుతున్నారు. ప్రస్తుతం ఈ వివాదం కోర్టు పరిధిలో కొనసాగుతోంది. మరోవైపు కేసులో బిహార్ ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటుచేయగా.. ఇప్పటివరకు 14 మంది అరెస్టయ్యారు.తాజాగా నీట్ పేపర్ వ్యవహారంపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. పేపర్ లీక్‌తో బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్లు తెలిపారు.గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ బిహార్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ (ఆర్సీడీ) ఉద్యోగి ప్రదీప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సికందర్ ప్రసాద్ యాదవెందు అనే ఇంజినీర్ కోసం ఎన్హెచ్ఏఐ గెస్ట్ హౌస్‌లో రూమ్ బుక్ చేయమని చెప్పాడని ఆరోపించారు.పరీక్ష జరగడానికి నాలుగురోజుల ముందు ఈ కాల్ వెళ్లినట్లు చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వారికి అధికారం లేకపోయినా.. లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నారని విమర్శించారు. పట్నాలోని ఎన్హెచ్ఏఐ గెస్ట్‌హౌస్‌లో ఆ రూమ్ బుక్ చేసిన ఆర్సీడీ ఉద్యోగితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు సిన్హా చెప్పారు.మరోవైపు నీట్ నిందితులు తమ గెస్ట్ హాస్‌లో బస చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఎన్హెచ్ఏఐ ఖండించింది. పాట్నాలో తమకు గెస్ట్ హౌస్ సౌకర్యం లేదని ప్రకటించింది. -
NEET-UG 2024: ‘నీట్’పై కేంద్రం, ఎన్టీఏకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీలో చోటుచేసుకున్న అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. కేంద్ర ప్రభుత్వానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)కి నోటీసులు జారీ చేసింది. హతేన్‌సింగ్ కాశ్యప్‌తోపాటు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ కేంద్రానికి, ఎన్టీఏకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. రాజస్తాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు జరిగాయని ప్రస్తావించారు. దీనిపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. అనవసరమైన భావోద్వేగపూరిత వాదనలు చేయొద్దని హితవు పలికింది. -
NEET-UG 2024: సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: ఖర్గే
న్యూఢిల్లీ: నీట్ పరీక్షలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో పేపర్ లీక్‌లు, పరీక్షల్లో రిగ్గింగ్‌లతో కోట్లాది మంది యువత భవిష్యత్తును నాశనం చేసిందని మండిపడ్డారు. నీట్లో గ్రేసు మార్కులు మాత్రమే సమస్య కాదని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని, పేపర్ లీక్ అయ్యిందని, పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు. నీట్ కుంభకోణంపై సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. సీబీఐ దర్యాప్తునకు ప్రభుత్వం ముందుకు రాకపోతే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాత దర్యాప్తునకు తాము డిమాండ్ చేస్తామని తెలిపారు. -
రూ. 2 కోట్లకు ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షా పత్రాలు!
రాజస్థాన్‌లో మరో అవినీతి కుంభకోణం వెలుగుచూసింది. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వ క్యాబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో నాలుగు లక్షల మంది అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఎస్ఐ రిక్రూట్మెంట్ పరీక్షను గత గెహ్లాట్ ప్రభుత్వం నిర్వహించింది. 2021 సెప్టెంబరులో ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహించారు. అయితే ఈ పరీక్షలో చీటింగ్ జరిగినట్లు తాజాగా వెల్లడైంది. గత ఏడాది మే నెలలో ఈ పరీక్షా ఫలితాలు వెలువడ్డాయి. విజయం సాధించినవారు ప్రస్తుతం రాజస్థాన్ పోలీసు అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఇన్నాళ్లకు ఈ పరీక్షలో పేపర్ లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ పరీక్షలో దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మంది అభ్యర్థులు మోసపూరితంగా ఉత్తీర్ణులయ్యారని ఆధార పూర్వకంగా తేలిందని కేబినెట్ మంత్రి కిరోరి లాల్ మీనా తెలిపారు. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు 42 మంది భాగస్వాములు పేర్లు వెల్లడయ్యాయి. వీరిలో 20 మందిని అరెస్టు చేశారు. రాజధాని జైపూర్‌లోని హస్నుపర్ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్ నుంచి ఈ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఈ పేపర్‌ను వాట్సాప్‌లో పంపారు. ఇందుకోసం సదరు స్కూల్ డైరెక్టర్ పది లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఈ పేపర్ రూ. 2 కోట్లకు పైగా మొత్తానికి అమ్ముడుపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. -
పేపర్ లీక్ చేస్తే కోటి ఫైన్.. లోక్‌సభలో కేంద్రం బిల్లు
న్యూఢిల్లీ: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడేవారికి కేంద్రం ఇక చెక్ పెట్టనుంది. ప్రశ్నాపత్రాల లీకేజీల వంటి వ్యవస్థీకృత నేరాలను అడ్డుకునేందుకు ఉద్దేశించిన పబ్లిక్ ఎగ్జామినేషన్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) బిల్లును కేంద్రం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రమంత్రి జితేందర్‌సింగ్ ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నాపత్రాల లీకేజీలో పాలు పంచుకునే అధికారులు, లీకేజీకి పాల్పడే ముఠాల ఆగడాలకు ఈ బిల్లుతో కళ్లెం వేయనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారిన తర్వాత దీని కింద నేరం రుజువైన వారికి గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష,రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. రాజస్థాన్, హరియాణా, గుజరాత్, బిహార్‌లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజీల కారణంగా కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. ఈ బిల్లు తీసుకురానున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ఇటీవల చేసిన ప్రసంగంలోనూ ప్రస్తావించారు. ఇదీచదవండి.. పేటీఎంపై సీబీఐ,ఈడీల మౌనం దేనికి: కాంగ్రెస్ -
భారత్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్
జోధ్‌పూర్: భారతదేశం గళాన్ని నేడు ప్రపంచ దేశాలు వింటున్నాయని, ఇది చూసి ప్రతిపక్ష కాంగ్రెస్ తట్టుకోలేకపోతుందని ప్రధాని మోదీ అన్నారు. ఆ పార్టీ బీజేపీని వ్యతిరేకించే క్రమంలో భారత్‌ను వ్యతిరేకించడం ప్రారంభించిందని విమర్శించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్తాన్‌లో మోదీ గురువారం పర్యటించారు. దాదాపు రూ.5,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం జోధ్‌పూర్‌లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. గహ్లోత్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పేపర్ లీక్ మాఫియా వల్ల లక్షలాది మంది యువత భవిష్యత్తు అంధకారంగా మారిందన్నారు. రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ అవినీతిని బయటపెడతామన్నారు. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ కాంగ్రెస్ పారీ్టకి రైతుల పట్ల గానీ, సైనికుల పట్ల గానీ ఏమాత్రం శ్రద్ధ లేదని మోదీ ఆరోపించారు. ఆ పారీ్టకి అధికారమే పరమావధిగా మారిందని ఆక్షేపించారు. సొంత ఓటు బ్యాంకును ప్రేమించడం తప్ప ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయని, ప్రపంచ దేశాల్లో మన ప్రభావం విస్తరిస్తోందని, విదేశాల్లో మన గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదంతా నచ్చడం లేదని అన్నారు. భారత్ త్వరలో ప్రపచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని, ఇది మోదీ ఇస్తున్న గ్యారంటీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందడం ప్రతిపక్షాలకు ఇష్టం లేదని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ బిల్లు పరిస్థితి ఏమిటో తెలిసిందేనని పేర్కొన్నారు. కేంద్రంలో తాము అధికారంలోకి వచి్చన తర్వాత దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. ‘ద వ్యాక్సిన్ వార్’పై మోదీ ప్రశంసలు బాలీవుడ్ చలనచిత్రం ‘ద వ్యాక్సిన్ వార్’పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందని అన్నారు. వివేక్ అగి్నహోత్రి దర్శకత్వం వహించిన ద వ్యాక్సిన్ వార్ సినిమా సెపె్టంబర్ 28న విడుదలైంది. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టడమే లక్ష్యంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి మన సైంటిస్టులు అహోరాత్రులు శ్రమించారని, వారి శ్రమను ఈ చిత్రంలో చక్కగా చూపించారని మోదీ కొనియాడారు. మన సైంటిస్టుల అంకితభావాన్ని తెరకెక్కించిన చిత్ర దర్శకుడు, నిర్మాతలను ప్రశంసించారు. -
ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు.. టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష పేపర్ల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్ చేయాలని నిర్ణయించింది. సిట్ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని టీఎస్పీఎస్సీ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్పీఎస్సీ నోటీసులు జారీ చేసింది. చదవండి: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు.. -
TSPSC కేసులో కొత్త కోణం
-
ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్ భయపడుతున్నారు: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. మంత్రి కేటీఆర్ 30 లక్షల మంది భవిష్యత్తును నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ రోజుకో మంత్రి అవతారం ఎత్తుతారంటూ ఎద్దేవా చేశారు. కాగా, బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో పంచాయతీ కార్యదర్శులు ఏం పాపం చేశారు?. పంచాయతీ కార్యదర్శులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. రెగ్యులర్ చేయాలని పోరాడుతున్నారు. పంచాయతీ కార్యదర్శులు ఉద్యమం ఆపొద్దు, మీకు బీజేపీ అండగా ఉంటుంది. ఎవరు ఉద్యమం చేసినా కేసీఆర్ భయపడుతున్నారు. కేటీఆర్ 30 లక్షల మంది భవిష్యత్తును నాశనం చేశారు. కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి. మళ్లీ టీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటే బీఆర్ఎస్ ఎందుకు పెట్టారు?. తెలంగాణలో అన్నీ స్కాములే. ఈ ప్రభుత్వానికి దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసు. తెలంగాణలో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు. ప్రధాని మోదీని తిట్టే అర్హత మీకు లేదు. మోదీ ప్రభుత్వం 10లక్షల ఉద్యోగాలకు పరీక్ష పెట్టినా ఎక్కడా స్కాం జరగలేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రానుంది. పేదలకు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత బీజేపీది. నిధులు ఇచ్చి, తెలంగాణను అభివృద్ధి చేసేది కేంద్ర ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: స్టేజీపైనే కొట్టుకున్నంత పనిచేసిన ఎమ్మెల్యేలు.. -
టెన్త్ రిజల్ట్ కాలమ్‌లో ‘మాల్‌ప్రాక్టీస్’.. ఫలితం ప్రకటించాలని విద్యార్థి వేడుకోలు
సాక్షి, హనుమకొండ: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటికి వచి్చన ఘటనలో కోర్టు అనుమతితో పరీక్షలు రాసిన విద్యార్థి దండబోయిన హరీశ్ ఫలితంలో ‘మాల్‌ప్రాక్టీస్’అని వచి్చంది. ఏప్రిల్ 4న కమలాపూర్‌లో హిందీ ప్రశ్నపత్రం ఔటైన ఘటనకు బాధ్యుడిని చేస్తూ హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల విద్యా ర్థి హరీశ్‌ను విద్యాశాఖ అధికారులు ఐదేళ్ల పాటు డీబార్ చేశారు. దీంతో అతను ఇంగ్లిష్, గణితం పరీక్షలు రాయలేకపోయాడు. అతడి తరఫున ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ హైకోర్టులో హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలుచేయగా మిగిలిన పరీక్షలు రాసేందుకు హైకోర్టు అనుమతిచి్చంది. దీంతో హరీశ్ సామాన్య, సాంఘికశాస్త్రం పరీక్షలు రాశాడు. అయితే, బుధవారం వెలువరించిన ఫలితాల్లో హరీశ్ రిజల్ట్స్ కాలమ్‌లో ‘మాల్‌ప్రాక్టీస్’అని ఉంది. తన ప్రమేయం లేకున్నా బలి చేశారని, తన ఫలితం ప్రకటించి న్యాయం చేయాలని హరీశ్ అధికారులను వేడుకుంటున్నాడు. చదవండి: పుట్టగానే తండ్రి వదిలేశాడు.. టెన్త్‌లో 10 జీపీఏతో సత్తాచాటిన కవలలు -
TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
-
‘అంగట్లో సరుకుల్లా క్వశ్చన్ పేపర్ల అమ్మకం.. కేసీఆర్ సర్కార్‌కు సిగ్గురాదు’
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగి నెలన్నర దాటుతున్నా.. ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదని లేదని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అంగట్లో సరుకులు అమ్ముతున్నట్లు టీఎస్పీఎస్సీ బోర్డు క్వశ్చన్ పేపర్లు అమ్మకానికి పెట్టినా కేసీఆర్ సర్కార్‌కు సిగ్గురాదని మండిపడ్డారు. వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. గతంలో నిరుద్యోగుల ఆత్మహత్యల నుంచి నేటి పేపర్ లీకేజీలతో నిరుద్యోగుల కష్టార్జీతం నీటిపాలైనా దొరకు(సీఎం కేసీఆర్) దున్నపోతు మీద వానపడినట్లే వ్యవహరిస్తున్నారని వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘నిరుద్యోగుల పక్షాన గళమెత్తితే పిరికిపందలా, అధికార మదంతో పోలీసులను పంపించి హౌజ్ అరెస్ట్ చేయించడం మాత్రమే కేసీఆర్‌కు చేతనవుతుంది. టీఎస్పీఎస్సీ స్కాంపై ఎలాంటి చర్యలు లేకుండానే పరీక్షలు నిర్వహించి, మళ్లీ క్వశ్వన్ పేపర్లు అమ్మి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా చేయాలన్నదే కేసీఆర్ లక్ష్యంగా ఉన్నట్లుంది. నిరుద్యోగుల మీద సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించి, దోషులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలి’ అని షర్మిల డిమాండ్ చేశారు. చదవండి: బంజారాహిల్స్ డీఏవీ స్కూల్ ఘటన.. డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష -
నిరుద్యోగ మార్చ్ కి మద్దతు తెలిపిన కేయూ, ఓయూ, జేఏసీలు
-
టీఎస్పీఎస్సీ ఉద్యోగులు పరీక్ష ఎలా రాస్తారు?
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్పీ) ఉద్యోగులు అది నిర్వహించే పరీక్షలు ఎలా రాస్తారు. వారిని పరీక్షపత్రాల తయారీకి ఎలా అనుమతిస్తారు?’అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. టీఎస్పీఎస్సీ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల ప్రశ్నపత్రం లీకేజీపై హైకోర్టుకు మంగళవారం సిట్ దర్యాప్తు స్థాయీ నివేదిక సీల్డ్ కవర్లో సమర్పించింది. అయితే నిందితుల వివరాలను ఇవ్వాలని సర్కార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. పేపర్ లీకేజీ కేసును సిట్ పారదర్శకంగా దర్యాప్తు చేయలేదని, సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌తోపాటు మరో ఇద్దరు నిరుద్యోగులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్ నివేదిక అందజేసి వాదనలు వినిపించారు. దర్యాప్తు నివేదికను పిటిషనర్లకు ఇవ్వాలని, వారి తరఫు సీనియర్ న్యాయవాది వివేక్ ఠంకా న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. సీల్డ్ కవర్ నివేదికలను బహిర్గతం చేయవచ్చని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొందని ఠంకా చెప్పారు. దర్యాప్తులో తీవ్ర లోపాలున్నాయని, సాక్ష్యాలు మాయమవుతున్నాయని అన్నారు. సిట్ చైర్మన్‌పై ఆరోపణలు ఉన్నాయని, సరీ్వస్ కమిషన్ ఏర్పాటులోనూ లోపాలున్నాయని పేర్కొన్నారు. ఈ కేసులో ప్రవాస భారతీయుల పాత్ర ఉందన్నారు. ఇది 30 లక్షల మంది భవిష్యత్‌తో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. సెక్షన్ అధికారి వద్ద మాత్రమే కాకుండా చైర్మన్, కార్యదర్శి వద్ద కూడా పాస్వర్డ్ ఉంటుందన్నారు. పారదర్శకంగా సాగని దర్యాప్తు సిట్ దర్యాప్తు పారదర్శకంగా సాగడంలేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వివేక్ ఠంకా అన్నారు. ఈ క్రమంలో ప్రశ్నపత్రాలను ఎవరు తయారీ చేశారు.. ఏ ఏజెన్సీకి అప్పగించారు.. అని న్యాయమూర్తి ప్రశ్నించారు. పరీక్షలు రాసేవారిని విధులకు ఎందుకు అనుమతించారని అడుగగా, పరీక్షలు రాసేవారిని నిర్వహణ ప్రక్రియకు దూరంగా పెట్టినట్లు ఏజీ చెప్పారు. దర్యాప్తు పురోగతిపై పూర్తి వివరాలతో నివేదికను సమరి్పస్తామని, ఎఫ్ఎస్ఎల్ రిపోర్టులతోపాటు మరికొన్ని వివరాలు అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో మొత్తం 18 మంది నిందితులుండగా, 17 మందిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఒకరు మాత్రం న్యూజిలాండ్‌లో ఉన్నారని అన్నారు. సీబీఐ దర్యాప్తు అవసరం లేదని నివేదించారు. ఏ ఒక్కరూ చట్టం నుంచి తప్పించుకోలేరని తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 24కి వాయిదా వేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజీ.. రంగంలోకి ఈడీ -
TSPSC పేపర్ లీక్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం
-
కవిత,కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సీఎం కేసీఆర్ కుటుంబంలోనే పరీక్ష పేపర్ల లీకు వీరులు, ప్రజలకు తాగించే లిక్కర్ వీరులు ఉన్నారని.. సీఎం కుమార్తె కవిత లిక్కర్ స్కాంలో, డ్రగ్స్ కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. టీఎస్పీఎస్సీ విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినందుకే తనపై కక్షగట్టి, పథకం ప్రకారం పదో తరగతి పేపర్ లీకేజీలో అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. తనపై పీడీ యాక్ట్ పెట్టాలంటున్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లు ఎంతో మంది మరణాలకు కారణమని.. వాస్తవానికి వారిపైనే పీడీ యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పదో తరగతిపేపర్ లీక్ కేసులో రిమాండ్ అయిన బండి సంజయ్.. శుక్రవారం ఉదయం 9 గంటలకు కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం జైలు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్ నాశనమైతుంటే సీఎం కేసీఆర్ స్పందించడం లేదేమని నిలదీశారు. టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీపై త్వరలోనే వరంగల్‌లో భారీఎత్తున నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. వారిపైనే కేసులు పెట్టాలి.. తనపై పీడీ యాక్ట్ పెట్టాలంటున్న మంత్రి హరీశ్‌రావుపై హత్యానేరం కేసు పెట్టాలని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఉద్యమ సమయంలో ఆత్మాహుతి చేసుకునేందుకు అగ్గిపెట్టె దొరకని మంత్రి హరీశ్‌రావు అని ఎద్దేవాచేశారు. ఆయన ధోరణితోనే 1,400 మంది బలిదానాలు చేసుకున్నారని పేర్కొన్నారు. అయితే కేటీఆర్‌ను సీఎం చేస్తే ముందు పార్టీ మారే జంప్ జిలానీ హరీశ్‌రావేనని ఎగతాళి చేశారు. రాష్ట్రంలో 27 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కారణమైన కేటీఆర్‌పై పీడీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కాంలో జైలుకు వెళ్లడం ఖాయమని.. త్వరలో కేటీఆర్ కూడా డ్రగ్స్ కేసులో అరెస్టు అవుతారని వ్యాఖ్యానించారు. పోలీసుల తీరు సరికాదు.. కొందరు పోలీసులు పోస్టింగులు, ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ‘‘అసలు పదో తరగతి పేపర్‌ను ఎవరో షేర్ చేస్తే నాకేం సంబంధం? ప్రభుత్వం, పోలీసుల చేతగానితనాన్ని మాపై నెడతారా? వరంగల్ పోలీస్ కమిషనర్ సీపీ రంగనాథ్ తన టోపీపై ఉన్న మూడు సింహాలపై ప్రమాణం చేసి నిజాయతీ నిరూపించుకోవాలి. కరీంనగర్, వరంగల్ పోలీసులపై పార్లమెంటు ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేస్తా..’’ అని పేర్కొన్నారు. తన సెల్‌ఫోన్ ఎక్కడుందో తనకే తెలియదని, టెక్నాలజీలో ఘనులమని చెప్పుకునే పోలీసులు అందులో ఏముందో తెలుసుకోలేరా? అని ప్రశ్నించారు. ఇక కమలాపూర్ పేపర్ లీకేజీలో బాలుడిని ఐదేళ్లపాటు డీబార్ చేయడాన్ని బండి సంజయ్ తప్పుబట్టారు. పేపర్ లీకేజీకి బాధ్యులను గుర్తించకుండా అమాయక విద్యార్థి భవిష్యత్‌ను దెబ్బతీయడం సరికాదని పేర్కొన్నారు. సంజయ్‌కు అమిత్‌షా ఫోన్ జైలు నుంచి విడుదలైన సంజయ్‌కు కేంద్రమంత్రులు అమిత్‌షా, స్మృతి ఇరానీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు సీనియర్ నేతలు ఫోన్ చేసి పరామర్శించారు. పోరాటం ఆపవద్దని.. కేంద్రం, జాతీయ నాయకత్వమంతా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సీఎంకు సభకు వస్తే గజమాల వేస్తాం రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని సభకు సీఎం కేసీఆర్ రావాలని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ వస్తే గజమాల వేసి, శాలువా కప్పి సన్మానం చేస్తామన్నారు. రాకుంటే మాత్రం కేసీఆర్ తెలంగాణ ద్రోహిగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. -
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని, గతంలో ఇంటర్ విద్యార్థులతో, తాజాగా పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేని కొన్ని పార్టీలు కుట్రలకు తెరలేపాయని పరోక్షంగా బీఆర్ఎస్ను విమర్శించారు. తనపై మోపిన పేపర్ లీకేజీ కేసు ఆ కుట్రలో భాగమే అని విమర్శించారు.ఇది అత్యంత క్లిష్ట సమయమని, పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో కుట్రలు, కుతంత్రాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుట్రలకు భయపడితే 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల జీవితాలు ప్రమాదంలో పడ్డట్లేనన్నారు. టెన్త్ పేపర్ల లీకేజీకి కుట్ర కేసులో ప్రస్తుతం కరీంనగర్ జైల్లో రిమాండ్‌లో ఉన్న సంజయ్.. గురువారం బీజేపీ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని కారాగారం నుంచే పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. తొలుత పార్టీ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన బండి.. పార్టీ నిర్మాణం కోసం శ్రమించిన వాజ్‌పేయి, డీఎన్ రెడ్డి మొదలు చలపతిరావు, రామారావు, టైగర్ నరేంద్ర, జితేందర్‌రెడ్డిల సేవలను స్మరించుకున్నారు. నిరుద్యోగుల పక్షాన గళమెత్తినందుకే.. కేసులు, జైళ్లు కొత్తకాదని.. ప్రజల కోసం ఎన్నిసార్లయినా జైలుకు వెళ్లేందుకు, ప్రాణమైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని సంజయ్ పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీలో వైఫల్యాలను, ప్రభుత్వ తప్పిదాలను, ఐటీశాఖ మంత్రిగా ఉన్న కేసీఆర్ కొడుకు పాత్రను ఎత్తిచూపుతూ 30 లక్షల మంది నిరుద్యోగ కుటుంబాల పక్షాన గళమెత్తినందుకే తనను కేసులో ఇరికించారని ఆరోపించారు. నాడు తన స్వార్థం కోసం 27 మంది ఇంటర్మీ డియట్ విద్యార్థులను ప్రభుత్వం బలి తీసుకుందని మండిపడ్డారు. ప్రధాని మోదీ నాకు స్ఫూర్తి ప్రధాని మోదీ తనకు స్ఫూర్తి అని, ఆయన ఈనెల 8న హైదరాబాద్‌కు వస్తున్నా తాను ఆ సభకు హాజరయ్యే అవకాశం కన్పించకపోవడంతో బాధగా ఉందని సంజయ్ పేర్కొన్నారు. మోదీ సభను కార్యకర్తలు విజయవంతం చేయాలని కోరారు. శ్యామ్‌ప్రసాద్.. దీన్ దయాళ్ సిద్ధాంతాలు, వాజ్‌పేయి త్యాగం, మోదీ ఆశలను నెరవేర్చేందుకు కృషి చేయాలని, కేసీఆర్ సర్కార్‌ను బొందపెట్టడమే లక్ష్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. బిడ్డ, కొడుకుల స్కాంలు బయటపడుతున్నాయి.. బిడ్డ, కొడుకు చేసిన స్కాంలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో నిస్పృహలో ఉన్న కల్వకుంట్ల కుటుంబం తనను అరెస్టు చేసి జైలుకు పంపడం ద్వారా ఉద్యమాలను అడ్డుకోవాలని చూస్తోందని సంజయ్ ఆరోపించారు. జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ వ్యాఖ్యల నుంచి దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నాడన్నారు. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి టీఎస్పీఎస్సీ లీకేజీకి బాధ్యుడైన కేసీఆర్ కొడుకును కేబినెట్ నుండి బర్తరఫ్ చేసేవరకు, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేవరకు, లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని బీజేపీ చీఫ్ పిలుపునిచ్చారు. నియంత పాలనకు చరమ గీతం పాడేదాకా పోరాడదామని అన్నారు. ‘గడీల్లో బందీ అయి విలపిస్తున్న తెలంగాణ తల్లిని బంధ విముక్తి చేయడమే మనందరి లక్ష్యం. అందుకోసం తెగించి కొట్లాడదాం.. రాబందుల రాజకీయ క్రీడ నుండి తెలంగాణ తల్లిని రక్షించుకుందాం. అందుకోసం మీరంతా కదిలిరండి..’అని విజ్ఞప్తి చేశారు. -
బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్.. జైలుకు తరలింపు..
సాక్షి, వరంగల్: మంగళవారం అర్ధరాత్రి అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను హన్మకొండ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ అనిత రావుల ముందు హాజరుపరిచారు పోలీసులు. బండి సంజయ్‌తో పాటు ప్రశాంత్, శివ గణేష్, మహయ్లను కూడా మెజిస్ట్రేట్ ముందుకు తీసుకెళ్లారు. టెన్త్ పేపర్ లీక్ వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వం, బండి సంజయ్ తరఫు న్యాయవాదుల వాదనలు విన్న మెజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు. వాడీవేడీగా వాదనలు.. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా ఉన్న బండి సంజయ్‌ను విచారించేందుకు 14 రోజుల రిమాండ్ విధించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాదులు మెజిస్ట్రేట్‌ను కోరారు. మరోవైపు బండి సంజయ్ అరెస్టు అక్రమమని అతని తరఫు న్యాయవాదులు వాదించారు. బెయిల్ మంజూరు చేయాలని కోరారు. వాదనల అనంతరం దాదాపు రెండు గంటల తర్వాత మెజిస్ట్రేట్ తీర్పు వెలువరించారు. భారీ భద్రత.. అంతకుముందు ముందుజాగ్రత్త చర్యగా హన్మకొండ కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే బండిని కోర్టు నుంచి మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు తీసుకెళ్తుండగా బీజేపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. బండి అరెస్టును నిరసిస్తూ వారు పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. ఈ క్రమంలో ఇరవర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. ఖమ్మం జైలుకు.. తీర్పు అనంతరం బండి సంజయ్‌ను కరీంనగర్ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మెజిస్ట్రేట్ ఇంటి వద్దకు బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు భారీగా తరలిరావడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చొక్కా విప్పిన బండి.. కాగా.. పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని బండి సంజయ్ తన న్యాయవాదులకు చెప్పారు. చొక్కా తీసి తన ఒంటిపై గాయాలను కూడా చూపించారు. పోలీసులు వ్యవహరించిన తీరు, అరెస్టు చేసిన విధానాన్ని బీజేపీ లీగల్ సెల్ ప్రతినిధులకు బండి వివరించారు. చదవండి: బండి సంజయ్‌పై నమోదైన కేసు ఇదే.. అరెస్టుపై అమిత్‌షా ఆరా.. ఏం జరిగిందో చెప్పిన కిషన్ రెడ్డి.. -
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తలపించేలా.. కోర్టు ముందుకు బండి సంజయ్..
సాక్షి, వరంగల్/హైదరాబాద్: తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను పోలీసులు కోర్టులో హజరుపర్చారు. కమలాపూర్, కరీంనగర్ టూటౌన్లో సంజయ్‌పై పేపర్ లీకేజీ కేసు నమోదైంది. ఆయనను హన్మకొండలో మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. కోర్టు పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఏ1గా బండి సంజయ్.. టెన్త్ పేపర్ లీక్ కేసులో ఏ1గా బండి సంజయ్ పేరును చేర్చారు. ఏ2 ప్రశాంత్, ఏ3 మహేష్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా శివగణేష్‌ను పోలీసులు చేర్చారు. 120(బి) సెక్షన్ కింద సంజయ్‌పై కేసు నమోదు చేశారు. హన్మకొండలో తీవ్ర ఉద్రిక్తత.. హన్మకొండ కోర్టు వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. సంజయ్‌ను తీసుకెళ్తున్న వాహనంపై చెప్పులు విసిరారు. బండి సంజయ్‌కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. లోక్‌సభ స్పీకర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ను తెలంగాణ బీజేపీ ఎంపీలు కలిశారు. బండి సంజయ్ అరెస్ట్‌పై ఫిర్యాదు చేశారు. కాగా, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్టుపై హైడ్రామా కొనసాగింది. థ్రిల్లర్ సినిమా తలపించేలా పలు ప్రాంతాలు తిప్పారు. అసలు బండి సంజయ్‌ని ఎందుకు అరెస్టు చేశారో చెప్పకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీజేపి లీగల్ సెల్ ఆందోళన వ్యక్తం చేసింది. పేపర్ బయటకు వచ్చిన కేసులో అనౌన్ పర్సన్ అని ఎఫ్ఐఆర్లో చూపి కుట్రపూరితంగా ఉద్దేశపూర్వకంగా బండి సంజయ్ ని అరెస్టు చేశారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కేసులను, అరెస్టులను న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేస్తున్నారు. బెయిలేబుల్ కేసులే అయినప్పటికీ దొంగలా రహస్యంగా కోర్టుకు తరలించడమేంటని ప్రశ్నిస్తున్నారు. టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీలో కుట్ర ఉంది: మంత్రి సబితా ఇదిలా ఉండగా, టీఎస్పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీలో కుట్ర ఉందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పర్యవేక్షణలోనే బండి సంజయ్ కుట్ర చేశారంటూ ఆమె ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ధ్వజమెత్తారు. నిందితులకు బీజేపీ నాయకులతో సంబంధాలున్నాయన్నారు. కేసీఆర్ సర్కార్‌ను అప్రతిష్టపాలు చేయాలనే కుట్రతోనే పేపర్ లీక్‌కు పాల్పడ్డారని మంత్రి సబితా మండిపడ్డారు. చదవండి: అర్థరాత్రి అరెస్ట్.. అసలేం జరిగిందో చెప్పిన బండి సంజయ్ సతీమణి -
టెన్త్ పేపర్ లీకేజీ.. కీలక విషయాలు వెల్లడించిన సిపి రంగనాథ్
సాక్షి, వరంగల్ జిల్లా: వరంగల్ లో కలకలం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ పై పోలీసులు కొరఢా ఝళిపించారు. పేపర్ ను ఫోటో తీసి బయటికి పంపిన మైనర్ బాలుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పేపర్ లీక్ అయిందంటూ ప్రచారం చేసిన వారిపై చర్యలకు ఉపక్రమించారు. మైనర్ బాలుడు కమలాపూర్ బాలుర ప్రభుత్వ పాఠశాల పరీక్ష కేంద్రంలోని చెట్టుపైకి ఎక్కి తన స్నేహితుడి కోసం హిందీ ప్రశ్న పత్రాన్ని ఫోటో తీసి మిత్రుడు శివగణేష్ కు పంపాడని సిపి రంగనాథ్ తెలిపారు. శివ గణేష్ ఓ జర్నలిస్టు మహేష్ కు పంపగా వారిద్దరు సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. దాన్ని మరో జర్నలిస్ట్ ప్రశాంత్ బిజెపి నాయకులతో పాటు జర్నలిస్ట్ గ్రూపులో బ్రేకింగ్ న్యూస్ అంటూ హిందీ పరీక్ష పేపర్ లీక్ అయిందని టెక్స్ట్ మెసేజ్ పోస్ట్ చేశాడని చెప్పారు. తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు పేపర్ బయటికి పంపిన మైనర్ బాలుడు పై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చదవండి: టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్ ప్రస్తుతం మైనర్ బాలుడితోపాటు శివ గణేష్, ప్రశాంత్‌ను అరెస్టు చేశామని మహేష్ పరారీలో ఉన్నాడని మరికొందరికి నోటీసులు ఇచ్చి విచారిస్తామన్నారు. వాస్తవంగా సెంటర్లో ఉన్నవారికి ఈ విషయం తెలియదని వారి నిర్లక్ష్యం ఉన్నట్లు భావించి డిపార్ట్మెంట్ పరంగా ఇన్విజిలేటర్, చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. - ఏవి.రంగనాథ్ - సిపి వరంగల్ -
టెన్త్ పేపర్ లీక్‌పై మంత్రి సబిత సీరియస్.. ఉద్యోగాలు పోతాయ్
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుండి శాశ్వతంగా తొలగించనున్నట్టు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సబిత వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ దేవసేన, పోలీస్ రేంజ్ ఐ.జిలు షానవాజ్ కాసీం , చంద్రశేఖర్ రెడ్డి లు కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం పరీక్షల నిర్వహణలో కట్టుదిట్టమైన చర్యలను చేపట్టిందని, ఈ పరీక్షల విషయంలో తమ స్వార్థ ప్రయోజనాలకై విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. ఈ పరీక్షల నిర్వహణలో దాదాపు 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారని, ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించవద్దని, పరీక్షల విధి నిర్వహణలో ఉన్న అధికారులు, సిబ్బందికి కూడా ఈ నిబంధన వర్తిస్తుందని సబితా స్పష్టంచేశారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ఈ విషయంలో ఏవిధమైన అపోహలకు, అనుమానాలకు తావు లేదని మంత్రి పేర్కొన్నారు. పరీక్షా పేపర్ల రవాణా విషయంలో మరింత భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీ లను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను పటిష్టంగా అమలు చేయడంతోపాటు జిరాక్స్ షాప్‌లను మూసివేయించాలని అన్నారు. ఇంటర్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించడంలో కృషిచేసిన అధికారులను మంత్రి అభినందించారు. చదవండి: పేపర్ లీక్ కాదు.. పరీక్ష మధ్యలో బయటకు వచ్చిందంతే!: వరంగల్ సీపీ -
వాట్సాప్ గ్రూప్ లో టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్
-
పేపర్ లీక్ కేసు చైర్మన్ కూడా విచారణకు రావలసిందే!
-
TSPSC పేపర్ లీక్ పై రంగంలోకి ఈడీ
-
నిందితులను రక్షించడానికే సిట్: ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
బిజినేపల్లి: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిందితులను పట్టుకోవడానికి కాకుండా..అసలు నిందితులను రక్షించడానికే పనిచేస్తుందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. పేపర్ లీక్ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ బోర్డుకు, ముఖ్యమంత్రి కుటుంబానికి సంబంధాలున్నాయనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయన్నా రు. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యుడు లింగారెడ్డి పీఏకు గ్రూప్–1లో 127 మార్కులు ఎలా వచ్చాయని, ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసే రాజశేఖర్‌రెడ్డికి లింగారెడ్డి స్వయంగా మేనబావని తెలిపారు. రాజ్యాధికార యాత్ర లో భాగంగా శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలో ప్రవీణ్ కుమార్ పర్య టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిట్ ఈ కేసులో అసలు దోషులను వదిలేసి, కిందిస్థాయిలో 12 మందిని అరెస్టు చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 2009 బ్యాచ్‌కు చెందిన 200 మంది ఎస్సైల పదోన్నతుల ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టారని, అలాంటి ఫైల్స్ చూడని హోంమంత్రిపై త్వర లోనే మిస్సింగ్ కంప్లైంట్ చేస్తామన్నారు. ప్రభుత్వానికి పనిచేయాల్సిన అడ్వొకేట్ జనరల్ కవిత లిక్కర్ స్కాం కేసు కోసం ఈడీ ముందు ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. -
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్.. నిందితుల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు నిందితుల రిమాండ్ రిపోర్టు సాక్షి టీవీ చేతికి అందింది. ఈ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు 12 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు సిట్ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తొమ్మిది మంది నిందితులతోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. రిమాండ్ రిపోర్టు ప్రకారం.. అరెస్టయిన వారిలో నలుగురు టీఎస్పీఎస్సీ ఉద్యోగులు.. A1 ప్రవీణ్ TSPSC సెక్రెటరీ పీఏ, A2 నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్, A10 ASO షమీమ్, A12 డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజశేఖర్ ఉన్నారు. నిందితుల్లో మరో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. 19 మంది సాక్షులను విచారించాం. టీఎస్పీఎస్సీ ఉద్యోగి శంకరలక్ష్మి ప్రధాన సాక్షి. ఫిర్యాదుదారుడు అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, టీఎస్పీఎస్సీ, తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీస్ ఉద్యోగులు, కర్మన్ ఘాట్‌లోని ఒక హోటల్లోని యాజమని, ఉద్యోగిని సాక్షి. ఈ నెల 4వ తేదీన ఆర్ స్క్వేర్ హోటల్లో నీలేష్, గోపాల్‌తో పాటు డాక్యా బస చేశారు. హోటల్లో రెండు గదులు (107,108) అద్దెకు తీసుకుని.. అక్కడే ప్రశ్నాపత్రం చూసి ప్రిపేర్ అయ్యారు. తర్వాత నీలేష్, గోపాల్ నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లారు. హోటల్లోని సీసీటీవి ఫుటేజీలో పేపర్ ఎక్స్చేంజ్ వ్యవహారం నిక్షిప్తమైంది. ప్రవీణ్, రాజశేఖర్ ఇచ్చిన సమాచారం మేరకు షమీమ్, రమేష్, సురేష్లను అరెస్ట్ చేశాం. ముగ్గురు నిందితుల నుంచి ఒక ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు నిందితులను కస్టడి కోరిన సిట్ మరోవైపు పేపర్‌లీక్ కేసులో ఇటీవల అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులను సిట్ ఏడు రోజులపాటు కస్టడీకి కోరింది. షమీం, రమేష్, సురేష్లను సిట్ గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
టీఎస్పీఎస్సీ వ్యవహారం.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి.. ప్రభుత్వానికి గవర్నర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) పేపర్ లీకేజీపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తీవ్రంగా స్పందించారు. మొదటిసారి పేపర్ లీక్ అయినప్పుడు కమిషన్ కార్యదర్శిని 48 గంటల్లో లీకేజీకి సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషన్‌కు లేఖ రాసిన సంగతి విదితమే. తాజాగా గురువారం మరో లేఖను ప్రభుత్వానికి, కమిషన్‌కు రాశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పోటీపరీక్షలకు హాజరైన కమిషన్ రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరు? కమిషన్ నుంచి అనుమతితో, అనుమతి లేకుండా హాజరైన వారెవరెవరు? పరీక్షల్లో సాధించిన మార్కులు ఎన్ని? పరీక్షల తర్ఫీదుకు సెలవులు తీసుకున్నారా? వంటి వివరాలతో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు తాజా పురోగతిపై 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాలతో ఈ మేరకు రాజ్‌భవన్ గురువారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, టీఎస్పీఎస్సీకి లేఖలు రాసింది. సిట్ దర్యాప్తులో పురోగతిని సైతం నివేదికలో తెలపాలని కోరింది. చదవండి: సిట్‌కు బండి సంజయ్ లేఖ.. ‘విచారణకు హాజరుకాలేను’ -
టీఎస్పీఎస్సీ వద్ద ప్లెక్సీల కలకలం.. ఇచ్చట అన్ని పేపర్లు లభించును..!
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ వద్ద బుధవారం ఉదయం ప్లెక్సీలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఇది జీరాక్స్ సెంటర్.. ఇచట అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పత్రాలు లభించును.. అంటూ నాంపల్లి టీఎస్పీఎస్సీ కార్యాలయం సమీపంలో గోడ పత్రికలు వెలిశాయి. అయితే టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాలు లీక్ కావడంపై ఆవేదనతో ఒక విద్యార్థిగా ఈ విధంగా నిరసన తెలిపినట్లు ఓయూ జేఏసీ ఛైర్మన్ అర్జున్ బాబు తెలిపాడు. గతవారం రోజులుగా విద్యార్థి లోకాన్ని అయోమయానికి గురి చేసిన టీఎస్పీఎస్పీ కార్యాలయం వద్ద తానే ఫ్లేక్సీలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నాడు. గోడ పత్రికలో ఆయన ఫొటో కూడా ముద్రించుకున్నాడు. పేపర్లు లీక్ చేసిన టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయకుండా పరీక్షను రద్దు చేయడమేంటని ప్రశ్నించాడు. శిక్ష ఎవరికి వేశారు? బోర్డుకా లేకా విద్యార్థులకా? అని ధ్వజమెత్తాడు. కస్టడీలో నిందితులు.. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంలో ప్రవీణ్, రాజశేఖర్, రేణుక సహా మొత్తం 9 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు. గ్రూప్–1 పరీక్ష పేపర్లు చేజిక్కించుకున్న అనుభవంతో ప్రవీణ్, రాజశేఖర్‌లు మిగిలిన పరీక్షల సమయంలోనూ తమ ప్రయత్నాలు కొసాగించారు. గత నెల ఆఖరి వారంలో మరో నాలుగు పరీక్షలకు సంబంధించిన పది క్వశ్చన్ పేపర్లు వీరికి చిక్కాయి. అయితే వాటిని ఎలా విక్రయించాలో అర్థం కాని ప్రవీణ్ తనతో సన్నిహితంగా ఉండే రేణుకను సంప్రదించాడు. తన సమీప బంధువైన కానిస్టేబుల్ శ్రీనివాస్ ద్వారా ఏఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నీలేశ్ నాయక్, గోపాల్ నాయక్‌లను రేణుక సంప్రదించింది. ప్రవీణ్ నుంచి పేపర్ అందగానే భర్త డాక్యాతో కలిసి స్వగ్రామమైన మహబూబ్‌నగర్ జిల్లా గండీడ్ మండలం పగిడ్యాల్ తండాకు వెళ్లి, రెండురోజుల పాటు తన ఇంట్లోనే నీలేశ్, గోపాల్‌తో చదివించింది. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు మంగళవారం రేణుక, డాక్యా నాయక్, నీలేశ్, గోపాల్‌లను ఆ తండాకు తీసుకువెళ్లి సీన్ రీ–కన్స్ట్రక్షన్ చేశారు. చదవండి: టీఎస్పీఎస్సీ లీకేజ్ కేసులో తెరపైకి కొత్త పేరు.. స్నేహితుడికీ షేర్ చేశాడు! -
కేటీఆర్‌కు నోటీసులిచ్చే దమ్ముందా?.. సిట్‌కు బండి సంజయ్ ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుట్ర వెనుక తనపాత్ర ఉందంటూ ఆరోపణలు చేస్తున్న మంత్రి కేటీఆర్‌కు.. ఆ ఆధారాలు సమర్పించాలని నోటీసులిచ్చే దమ్ము సిట్‌కు ఉందా? అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ ప్రశ్నించారు. తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి కేటీఆర్‌ను పిలిచి విచారించే ధైర్యముందా అని నిలదీశారు. ఈ లీకేజీ కేసులో సిట్ నోటీసుల పేరుతో ప్రతిపక్ష పార్టీల నేతల నోరు నొక్కేసే కుట్రకు సీఎం కేసీఆర్ తెరదీశారని సోమవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఈ కుట్ర కు కారకులైన వారిని వదిలేసి విపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. సిట్ నోటీసులకు, విచారణకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. తన కొడుకు, బిడ్డ తప్పుచేసినా ఉపేక్షించబోనని అసెంబ్లీలో ప్రకటించిన కేసీఆర్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, విపక్షాలకు నోటీసులు ఇవ్వడం కంటే ముందే కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన కొడుకు తప్పు చేయలేదని కేసీఆర్ భావిస్తే తక్షణమే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అప్పుడే తమవద్ద ఉన్న సమాచారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. కేసీఆర్ జేబు సంస్థగా సిట్ మారిందని, గతంలో డ్రగ్స్, నయీం డైరీ, మియాపూర్ భూములపై సిట్లు జరిపిన విచారణలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఆ కేసులను నీరుగార్చడంతోపాటు కేసీఆర్‌కు ప్రయోజనం చేకూర్చేలా సిట్లు పనిచేశాయని ఆరోపించారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. చదవండి: పార్టీ బలోపేతానికి కాంగ్రెస్ కీలక నిర్ణయం.. ఇక అనుబంధ సంఘాలపై ‘దృష్టి’ -
'మంత్రి పీఏనే లీకేజీ సూత్రధారి.. జైలులో ప్రవీణ్,రాజశేఖర్‌కు బెదిరింపులు'
సాక్షి, కామారెడ్డి: టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించిన పరీక్షల పత్రాల లీకేజీ వ్యవహారం మొత్తం మంత్రి కేటీఆర్ పేషీ నుంచే జరిగిందని, మంత్రి పీఏ తిరుపతే దీనికి ప్రధాన సూత్రధారి అని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్ష చేశారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్ష సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ లీకేజీ కేసులో అరెస్టు చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని విచారించకుండానే ఇద్దరి వల్లే పేపర్ లీక్ అయ్యిందంటూ మంత్రి కేటీఆర్ ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేటీఆర్ పీఏ తిరుపతి షాడో మంత్రి అని, ఆయన ద్వారానే అన్నీ జరుగుతున్నాయని ఆరోపించారు. టీఎస్పీఎస్సీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి కీలక బాధ్యతలు అప్పగించడంలోనే అసలు రహస్యం దాగి ఉందన్నారు. చంచల్‌గూడ జైలులో ఉన్న ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలు నోరు విప్పితే పెద్ద తలకాయల పేర్లు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో వాళ్లను ఎన్కౌంటర్ చేస్తామని జైలులో బెదిరించారని రేవంత్ ఆరోపించారు. ఈనెల 13 నుంచి 18 వరకు చంచల్‌గూడ జైలు సందర్శకుల వివరాలు, సీసీ ఫుటేజీని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్వోసీ ఎలా ఇచ్చారు.. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తున్న వారు పోటీ పరీక్షలు రాయడానికి అనర్హులని నిబంధనలు చెబుతున్నాయని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం అందులో పనిచేస్తున్న 20 మందికి పరీక్షలు రాయడానికి ఎన్వోసీ ఎలా ఇచి్చందని ప్రశ్నించారు. అమెరికానుంచి వచ్చిన మాధురికి గ్రూప్–1 మొదటి ర్యాంకు, జూనియర్ అసిస్టెంట్ రజనీకాంత్‌రెడ్డికి నాలుగో ర్యాంకు ఎలా వచ్చాయన్నారు. శ్రీలక్షి్మ, ప్రవీణ్, వెంకటాద్రి, శ్రీదేవి, రమేశ్, వాసు, మధులతలతో పాటు మరికొందరికి పరీక్షలకు అనుమతి ఇచ్చారా? లేదా? అనేది ప్రకటించాలని డిమాండ్ చేశారు. 2016లో ఒకే సెంటర్లో పరీక్ష రాసిన 25 మందికి గ్రూప్–1 ఉద్యోగాలు వచ్చాయని, దీనిపైనా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. ఏ2 రాజశేఖర్‌రెడ్డికి ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనే.. లీకేజీ వ్యవహారంలో ఏ2గా ఉన్న రాజశేఖర్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి దగ్గరి స్నేహితుడని, ఇద్దరిదీ ఒకే ప్రాంతమని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఆ పరిచయంతోనే రాజశేఖర్‌రెడ్డికి 2017లో ఉద్యోగం ఇప్పించాడని, వెనువెంటనే ప్రమోషన్ వచి్చందని, తర్వాత టీఎస్‌పీఎస్సీలోకి బదిలీ అయ్యాడని ఆయన వెల్లడించారు. వీటన్నింటికీ కేటీఆర్ పీఏ తిరుపతే కారణమని ఆరోపించారు. అలాగే లీకేజీ వ్యవహారంలో కాని్ఫడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకర్లక్ష్మి పాత్రపై విచారణ జరపాలన్నారు. తాజా గ్రూప్ వన్ ప్రిలిమ్స్‌లో మల్యాల ప్రాంతానికి చెందిన వంద మందికిపైగా అభ్యర్థులకు 103 కన్నా ఎక్కువ మార్కులు వచ్చాయని, వారి వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లకు అన్ని వివరాలు తెలిసి ఉంటాయన్నారు. సిట్ అధికారి కేటీఆర్ బావమరిదికి దోస్త్.. పేపర్ లీకేజీ కేసు బాధ్యతలు అప్పగించిన సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్.. మంత్రి కేటీఆర్ బావమరిదికి దగ్గరి స్నేహితుడని, ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించడంలో ఉద్దేశం ఏమిటో అర్థమవుతోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసును సీబీఐకి అప్పగించాలని, లేదంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల తరఫున పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. లీకేజీ వ్యవహారంపై తాము కోర్టులో వేసిన కేసుపై సోమవారం విచారణ జరగనుందని తెలిపారు. 21న గవర్నర్‌ను కూడా కలుస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నేతలు షబ్బీర్ అలీ, మహేశ్‌కుమార్ గౌడ్, అంజన్‌కుమార్ యాదవ్, సీతక్క, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో కొత్త కోణం.. ఎన్ఆర్ఐ లీడర్ సిఫారసుతోనే రాజశేఖర్‌కు ఉద్యోగం? -
రోజుకో మేలుపు తిరుగుతోన్నTSPSC లీకేజీ వ్యవహారం
-
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కుట్ర కోణంపై అనుమానాలు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ లీకేజ్ అంశం చాలా దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పులతో వ్యవస్థకు చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇది వ్యవస్థ వైఫల్యం కాదని స్పష్టం చేశారు. తప్పులు జరిగినప్పుడు ఎలా సరిదిద్దుకోవాలనే బాధ్యత తమపై ఉందన్నారు. అవకతవకలు జరిగాయనే ఇంటర్వ్యూలు రద్దు చేశామని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీలో గత ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు చేశామని కేటీఆర్ తెలిపారు. వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ప్రారంభించామని, ఇప్పటి వరకు 99 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు. 155 నోటీఫికేషన్ల ద్వారా 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్పారు. యూపీఎస్సీ ఛైర్మన్ రెండుసార్లు వచ్చిన మన సంస్కరణలు అధ్యయనం చేశారని గుర్తు చేశారు. 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషనర్లు వచ్చి పరిశీలించారని ప్రస్తావించారు. ‘పేపర్ లీకేజీపై సీఎం కేసీఆర్‌కు నివేదిక ఇచ్చాం. ప్రజలకు నిజానిజాలు తెలియాలని సీఎం కేసీఆర్ చెప్పారు. సీఎం ఆదేశాలతోనే సమీక్ష నిర్వహించాం. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ వెనక ఎవరున్న కఠినంగా శిక్షిస్తాం. రద్దైన నాలుగు పరీక్షలకు మళ్లీ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదు. గతంలో అప్లై చేసుకున్న వారంతా అర్హులే. మొత్తం నాలుగు పరీక్షల కోచింగ్ మెటీరియల్ ఆన్లైన్లో అందుబాటులో పెడతాం. 2 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరుగుతోంది. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నియామకాలు, నిధుల కోసం. యువత విషయంలో రాజకీయాలు చేయవద్దు. ఇద్దరు చేసిన తప్పును యువతలో అశాంతి చెలరేగేలా కొందరు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు నోటికొచ్చిన్నట్లు మాట్లాడటం సరికాదు. రాజకీయ నిరుద్యోగులు చేసే విమర్శలకు యువత రెచ్చిపోవద్దు. బీజేపీ నేతల తీరుపై అనుమానాలున్నాయి. నిందితుల్లో ఒకడైన రాజశేఖర్ బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. పేపర్ లీకేజీలో కుట్ర కోణం ఏదైనా ఉందా అనే అనుమానాలున్నాయి. దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతున్నా. సిట్ విచారణపై నమ్మకం లేదని ముందే అంటే ఎలా. ఇంటర్ బోర్డు, పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఏదైనా జరిగే ఐటీ మంత్రి రాజీనామా చేయాలంటున్నారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో పేపర్లు లీకైతే మంత్రులు రాజీనామా చేస్తారా?’ అంటూ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. చదవండి: మహిళా కమిషన్ ముందుకు బండి సంజయ్ -
తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు.. అరెస్టులు, ఉద్రిక్తతలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా బీజేపీ శనివారం భారీ ఆందోళనలు చేపట్టింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. మంచిర్యాల, కరీంనగర్, నిజామాబాద్ సహా పలు జిల్లా కేంద్రాల్లో బీజేపీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. దీంతో పలు చోట్ల ఉద్రికత్త పరిస్థితులు తలెత్తాయి. పోలీసులు పలువురు బీజేపీ నాయకులు, శ్రేణులను అరెస్టు చేసి పరిస్థితిని అదుపు చేశారు. కాగా.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన తొమ్మిది మంది నిందితులను పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం వీరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. 23వ తేదీ వరకు వారిని ప్రశ్నించి.. ఈ వ్యవహారంలో అన్ని వివరాలను ఆరా తీయనున్నారు. ఇదే సమయంలో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, శంకరలక్ష్యలను కలిపి విచారించి.. వాస్తవాలను వెలికితీయాలని అధికారులు నిర్ణయించారు. చదవండి: నిందితులను కస్టడీలోకి తీసుకున్న సిట్ -
టీఎస్పీఎస్సీ పేపర్‌లీక్‌పై గవర్నర్‌కు బీజేపీ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: రాజ్‌భవన్‌లో తెలంగాణ గవర్నర్‌ను బీజేపీ నేతల బృందం కలిసింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌పై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు బీజేపీ నేతలు ఈటల రాజేందర్, సీహెచ్ విట్టల్, మర్రి శశిధర్ రెడ్డి, రామచందర్ రావు తదితరులు ఫిర్యాదు చేశారు. 5 డిమాండ్లతో గవర్నర్‌కు బీజేపీ వినతి పత్రం అందజేశారు. టీఎస్పీఎస్సీ కొత్త కమిషన్ వేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయిన అభ్యర్థులకు రూ. లక్ష చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్, కేటీఆర్ తమ పదవులకు రాజీనామా చేయాలని మండిపడ్డారు. చదవండి: జీవితంలో స్థిరపడేలోపే... నిండు ప్రాణాల్ని మింగేసిన అగ్గి -
పేపర్ లీకేజీ కేసులో తవ్వే కొద్ది కొత్త విషయాలు
-
పేపర్ లీక్ కలకలం: మిగతా పరీక్షల రద్దుపై టీఎస్పీఎస్సీ ఏం చేప్తోంది!
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఇంజనీర్ అర్హత పరీక్షను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మిగతా పరీక్షలను కూడా రద్దు చేయాలనే డిమాండ్ తీవ్రమవుతోంది. గ్రూప్–1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు ఆ తర్వాత నిర్వహించిన పలు పరీక్షల ప్రశ్నపత్రాలు ఇతరుల చేతుల్లోకి వెళ్లాయంటూ అభ్యర్థులతో పాటు విద్యార్థి సంఘాలు ఆందోళనలు ఉదృతం చేస్తున్నాయి. ఈ దిశగా కమిషన్ కార్యాలయం వద్ద, జిల్లాల్లోనూ తీవ్రస్థాయిలో నిరసనలు, ధర్నాలు నిర్వహిస్తున్నారు. అయితే టీఎస్పీఎస్సీ మాత్రం దీనిపై స్పష్టమైన వైఖరితోనే ఉంది. సరైన ఆధారాలు ఉంటే పరిశీలించి చర్యలు తీసుకోనున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆదరబాదరా నిర్ణయం తీసుకోలేమని, తొందరపడి, ఒత్తిడికి గురై నిర్ణయాలు తీసుకుంటే అభ్యర్థుల భవిష్యత్తు తీవ్ర గందరగోళంలో పడుతుందని చెబుతున్నాయి. ఇప్పటివరకు కేవలం అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష ప్రశ్నపత్రం మాత్రమే లీకైనట్లు తేలడంతో, లోతుగా చర్చించి అభ్యర్థుల భవిష్యత్తు దృష్ట్యా ఆ పరీక్షను రద్దు చేసినట్లు కమిషన్ వర్గాలు వెల్లడించాయి. సిట్ విచారణలో తేలాకే.. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ, కంప్యూటర్ల నుంచి సమాచారం తస్కరణపై నమోదైన కేసులపై సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) దర్యాప్తు ముమ్మరం చేసింది. గత రెండ్రోజులుగా సిట్ సభ్యులు కమిషన్ కార్యాలయంలోని అధికారులను, ఉద్యోగులు, సిబ్బందిని పలు దఫాలుగా విచారిస్తూ సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఈ విచారణ అత్యంత వేగవంతంగా కొనసాగుతున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిట్ పరిశీలనలో తేలిన అంశాలు, నిందితుల ఫోన్లు, పెన్‌డ్రైవ్‌ల్లోని సమాచారం తదితరాలపై పూర్తిస్థాయి ఫోరెన్సిక్ నివేదిక అందిన తర్వాతే తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోవాలని టీఎస్పీఎస్సీ అధికారులు భావిస్తున్నారు. ఏఈ పరీక్షను రద్దు చేసిన అధికారులు..మిగతా పరీక్షలకు సంబంధించిన వ్యవహారాన్ని పూర్తిగా నిగ్గుతేలి్చన తర్వాతే నిర్ణయం తీసుకోనున్నారు. -
‘లీకేజీ’లకు నిరసనగా.. నేడు సంజయ్ దీక్ష
సాక్షి, హైదరాబాద్/చంచల్‌గూడ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్న పత్రాల లీకేజీలను నిరసిస్తూ శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఇతరనేతలు పార్టీ కార్యాలయంలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 గంటల దాకా నిరసన తెలపనున్నారు. పేపర్ లీకేజీలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ, ఐటీమంత్రి కేటీఆర్ బర్తరఫ్, నష్టపోయిన నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం వంటి డిమాండ్లతో ఈ దీక్ష నిర్వహిస్తున్నారు. బండి సంజయ్ తొలుత పార్టీ నేతలతో కలసి గన్‌పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అరి్పస్తారు. అనంతరం రాష్ట్ర కార్యాలయంలో నిరసన దీక్షలో పాల్గొంటారు. లీకేజీలో కేటీఆర్ ప్రమేయం: బండి సంజయ్ టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ ప్రమేయం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. లీకేజీ వ్యవహారానికి నిరసనగా ధర్నా చేసిన బీజేవైఎం నాయకులు భానుప్రకాశ్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. గురువారం వారిని ములాఖాత్‌లో పరామర్శించేందుకు బండి సంజయ్ జైలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేపర్ లీకేజీలపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. దీనికి సూత్రధారి రేణుక బీఆర్ఎస్కే చెందినవారని ఆరోపించారు. లీకేజీలతో బీజేపీకి సంబంధం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. -
టీఎస్పీఎస్సీ చైర్మన్ రాజీనామా చేయాల్సిందే
గన్¸ఫౌండ్రి , లిబర్టీ: టీఎస్పీఎస్సీ నియామక పరీక్షా పత్రాల లీకేజీపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పేపర్‌లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ, ఆమ్ఆద్మీ యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. లీకేజీ నిర్వాకానికి టీఎస్పీఎస్సీ చైర్మన్ బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించి యువతకు భరోసా ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తా మని హెచ్చరించారు. కార్యాలయంలోనికి వెళ్లేందుకు ప్రయతి్నంచిన నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో విద్యార్థి నాయకులను గోషామహల్ పోలీస్స్టేడియంతో పాటు పలు పోలీస్స్టేషన్లకు తరలించారు. అదేవిధంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయం, గాంధీభవన్ వద్ద గుమికూడిన వ్యక్తులను కూడా ముందస్తుగానే అదుపులోకి తీసు కున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ మాట్లాడుతూ నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ అధికారులు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ విద్యార్థి యువజన విభాగం నేతలు రణదీర్‌సింగ్, రాణాతేజ్, రాకేష్‌సింగ్ మాట్లాడుతూ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాగా, టీఎస్పీఎస్సీ కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఆందోళనలు చేపట్టకుండా నాలుగు రోజుల పాటు 144 సెక్షన్ విధిస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. -
నిఘా లేదు.. సర్వర్ లేదు! కీలకమైన టీఎస్పీఎస్సీలో ‘సెక్యూరిటీ’ లోపాలు
సాక్షి, హైదరాబాద్: అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్), ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ఉన్న అనేక సెక్యూరిటీ లోపాలను గుర్తించారు. దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమరి్పంచాలని నిర్ణయించారు. పరీక్ష పేపర్లను దొంగిలించిన టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడు పి.ప్రవీణ్‌కుమార్ వాటిని తన పెన్‌డ్రైవ్‌లో సేవ్ చేసుకున్నాడు. అందరికీ దాని యాక్సెస్ లేకుండా చేయడానికి డేటా లాక్ చేసి ఉంచాడు. దీన్నిబట్టి చూస్తే టీఎస్పీఎస్సీ తన డేటా రక్షణ కోసం ఈ మాత్రం చర్యలు కూడా తీసుకోలేదని స్పష్టమవుతోంది. కార్యాలయంలో నిఘా వ్యవస్థ, కంప్యూటర్లకు సర్వర్ లేకపోవడం విస్మయపరుస్తోంది. గేటు వద్దనే యాక్సెస్ కంట్రోల్.. టీఎస్పీఎస్సీలోనికి వెళ్లే వారిని కేవలం గేటు వద్ద, ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఆపి ప్రశ్నించే అవకాశం ఉంది. ఈ రెండు ప్రాంతాలు దాటి ముందుకు వెళ్లిన వ్యక్తి.. ఎక్కడకు వెళ్తున్నాడు? ఎవరిని కలుస్తున్నాడు? తదితరాలు పరిశీలించే అవకాశం కమిషన్‌లో లేదని పోలీసులు గుర్తించారు. కమిషన్ ప్రాంగణంలోని అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నా వాటిలో కొన్ని సరిగ్గా పని చేయట్లేదు. పరీక్ష పత్రాలు ఉండే కాన్ఫిడెన్షియల్ సెక్షన్ రెండో అంతస్తులో ఉంది. అయితే అక్కడ ఒక్క కెమెరా కూడా లేదు. దీంతో సెక్షన్లోకి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరిని కలిసారు? అనేది సాంకేతికంగా గుర్తించే అవకాశం లేకుండా పోయింది. సర్వర్ లేకపోవడంతో నిఘా కరువు.. లక్షల మంది జీవితాలను ప్రభావితం చేసే పరీక్షలు నిర్వహించే టీఎస్పీఎస్సీలో దాదాపు 130 వరకు కంప్యూటర్లు ఉన్నాయి. వీటికి ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు పెన్‌డ్రైవ్ యాక్సెస్ కూడా ఉంది. సాధారణంగా ఇలాంటి విభాగాల్లో కంపూటర్లను ల్యాన్ ద్వారా కనెక్ట్ చేయరు. పెన్‌డ్రైవ్ యాక్సెస్ కూడా ఇవ్వకుండా సర్వర్ ఏర్పాటు చేసుకుని దాని ఆధారంగానే నెట్వర్క్ నిర్వహిస్తారు. ఇలా చేస్తే ఎవరు ఏ కంప్యూటర్ ద్వారా ఎలాంటి పనులు చేస్తున్నారు అనేది తేలిగ్గా గుర్తించవచ్చు. కమిషన్‌లో ఇలాంటి వ్యవస్థ లేకపోవడం లీకు వీరులకు కలిసి వచి్చంది. మరోపక్క సైబర్ దాడులు, కంప్యూటర్ సేఫ్టీ, పాస్వర్డ్స్, యూజర్ ఐడీల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. ఇలా ఏ అంశం పైనా సిబ్బందికి కనీస అవగాహన కూడా లేకపోవడం గమనార్హం. సైబర్ ఆడిటింగ్ ఉన్నట్లా..? లేనట్లా..? టీఎస్పీఎస్సీ లాంటి కీలక సంస్థలకు అనునిత్యం సైబర్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. సాధారణంగా తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సరీ్వసెస్ (టీఎస్టీఎస్) ఆ«దీనంలోని నిపుణులు క్రమం తప్పకుండా దీన్ని నిర్వహించాలి. అక్కడి కంప్యూటర్లు, సర్వర్లు, ఫైర్ వాల్స్ తదితరాలను పరీక్షించి సమకాలీన సైబర్ దాడులు తట్టుకోవడానికి అవి సిద్ధంగా ఉన్నాయా? లేదా అన్నది తేల్చి నివేదిక ఇవ్వడంతో పాటు అవసరమైన సిఫారసులు కూడా చేయాల్సి ఉంది. అయితే ఈ ఆడిట్ జరుగుతోందా? సిఫారసులు చేస్తున్నారా? చేస్తే కమిషన్ పట్టించుకుంటోందా? తదితర అంశాలు జవాబులేని ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. ఫోరెన్సిక్ నివేదిక వస్తేనే లీకేజీలపై స్పష్టత వచ్చే పరిస్థితి నెలకొంది. చదవండి: మరో సంచలనం.. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసిన ప్రవీణ్.. ఆ పేపర్ కూడా లీక్ అయ్యిందా? -
TSPSC: ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం.. ప్రవీణ్ ఫోన్లో మహిళల అసభ్య ఫోటోలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు తొమ్మిది మందిని అరెస్టు చేశారు. టీఎస్పీఎస్సీ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరికొందరు పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం టాస్క్‌ఫోర్స్ పోలీసులను రంగంలోకి దించారు. తాజాగా ప్రధాన నిందితుడు ప్రవీణ్ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు ప్రవీణ్ 2017లో టీఎస్పీఎస్సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి నాలుగేళ్ల పాటు వెరిఫికేషన్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే అక్కడికి వచ్చే మహిళల ఫోన్ నంబర్లను నిందితుడు తీసుకునేవాడని తేలింది. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి సదరు మహిళలతో సాన్నిహిత్యతం పెంచుకున్నాడు. పలువురు మహిళలలో శారీరక సంబంధం కూడా పెట్టుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ సెల్ఫోన్లో ఎక్కువగా మహిళల నంబర్లు, వాట్సాప్ చాటింగ్‌లోనూ మహిళల నగ్న ఫొటోలు, వాట్సాప్‌లో న్యూడ్ చాటింగ్‌లు ఉండడాన్ని గుర్తించారు. ఏఈ పరీక్ష పత్రం కూడా రేణుక కారణంగానే లీక్ అయిందని పోలీసులు తేల్చారు. TSPSC కార్యాలయం వద్ద ఉద్రిక్తత టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీఎస్పీఎస్సీ చైర్మన్‌ను సస్పెండ్ చేయాలని కోరుతూ యువజన, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పేపర్ లీకేజీ వ్యవసహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ కార్యాలయం లోపలికి విద్యార్థి సంఘాల నాయకులు చొచ్చుకెళ్లడంతో.. పోలీసులు పలువురుని అదుపులోకి తీసుకున్నారు. మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని నెల 2న రూ.5 లక్షలు ఇచ్చిన రేణు, ఆమె భర్త.. మరోసారి 6న తేదీన ప్రవీణ్‌ను కలిసి ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రఘునాథ్ నేతృత్వంలోని బృందం.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవుడ్యావత్ డాక్యా, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసింది. వారి నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్ కంప్యూటర్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత.. అతను, రాజశేఖర్ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సస్ చేశారు? ఏమేం పేపర్లు డౌన్లోడ్ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు. ఉద్యోగులు ఇద్దరిపై వేటు అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై టీఎస్పీఎస్సీ వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఔట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. -
ఏఈ పేపర్ లీక్.. స్కామ్‌లో తొమ్మిది మంది అరెస్టు.. నిందితుల్లో కానిస్టేబుల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్స్ (ఏఈ సివిల్) పరీక్ష పేపర్లు లీకైనట్టు పోలీసులు తేల్చారు. టీఎస్పీఎస్సీ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడైన పి.ప్రవీణ్‌కుమార్ ఈ ప్రశ్నపత్రాలనే టీచర్ రేణుక, ఆమె భర్త లవుడ్యావత్ డాక్యాకు అందించాడని గుర్తించారు. వీటితోపాటు ప్రవీణ్‌కు చెందిన పెన్‌డ్రైవ్‌లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ కూడా ఉందని, దాన్ని విక్రయించేందుకు అతను ఒప్పందం చేసుకున్నాడని ఆధారాలు సేకరించారు. హైదరాబాద్ సౌత్‌వెస్ట్ జోన్ డీసీపీ కిరణ్ సోమవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావుతో కలసి లీకేజీ వ్యవహారం వివరాలను వెల్లడించారు. కారుణ్య నియామకం కింద వచ్చి.. ఏపీలోని రాజమండ్రికి చెందిన పి.హరిశ్చంద్రరావు కుమారుడు ప్రవీణ్‌కుమార్. హరిశ్చంద్రరావు ఉమ్మడి రాష్ట్రంలో డీజీపీ కార్యాలయం ప్రెస్‌కు అదనపు ఎస్పీగా పనిచేశారు. ఆయన ఉద్యోగంలో ఉండగానే అనారోగ్యంతో మరణించడంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్‌కుమార్‌కు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం వచ్చింది. బీటెక్ పూర్తిచేసిన ప్రవీణ్ 2017 నుంచి టీఎస్పీఎస్సీలో పనిచేస్తూ ప్రస్తుతం అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ హోదాలో కమిషన్ కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేణుక 2018లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్ష ద్వారా గురుకుల హిందీ టీచర్‌గా ఎంపికై.. ప్రస్తుతం వనపర్తిలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె భర్త లవుడ్యావత్ డాక్యా వికారాబాద్‌లోని డీఆర్డీఏలో పనిచేస్తున్నాడు. టీఎస్పీఎస్సీ పరీక్షకు సిద్ధమైన నాటి నుంచీ రేణుక, ప్రవీణ్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె తరచూ కమిషన్ కార్యాలయానికి వచ్చి ప్రవీణ్‌ను కలిసేది. ల్యాన్ ద్వారా యాక్సెస్ చేసి.. టీఎస్పీఎస్సీ ఉద్యోగ పరీక్షల పేపర్లు లీక్ చేసేందుకు రేణుక, లవుడ్యావత్ డాక్యా పథకం వేశారు. పేపర్లను తమకు ఇవ్వాలని ప్రవీణ్‌ను రేణుక కోరింది. టీఎస్‌టీఎస్‌లో ఔట్ సోర్సింగ్ విధానంలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేస్తున్న అట్ల రాజశేఖర్‌తో ప్రవీణ్ కలిసి పేపర్ లీకేజ్‌కి మార్గాలు అన్వేషించాడు. పరీక్ష పేపర్లన్నీ కమిషన్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్‌లోని కంప్యూటర్లో ఉంటాయి. ఈ సెక్షన్‌కు నేతృత్వం వహించే కస్టోడియన్ శంకరలక్ష్మి తన కంప్యూటర్ పాస్వర్డ్, యూజర్ ఐడీలను నిత్యం వినియోగించే పుస్తకం చివరి పేజీలో రాసి పెట్టుకున్నారు. ఈ విషయం తెలిసిన ప్రవీణ్ ఆమె కార్యదర్శి పేషీకి వచ్చినప్పుడు.. ఆమె పుస్తకం నుంచి తస్కరించాడు. ప్రవీణ్ కంప్యూటర్ నుంచే శంకరలక్ష్మి కంప్యూటర్ను యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో యాక్సెస్ చేశాడు. ఇద్దరూ కలిసి ఆ కంప్యూటర్లో నుంచి ఏఈ పరీక్షకు సంబంధించిన జనరల్ స్టడీస్, సివిల్ పేపర్లను, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్‌ను కాపీ చేసుకున్నారు. ప్రవీణ్ వీటిని తన పెన్‌డ్రైవ్‌లో వేసుకున్నాడు. ఏఈ పరీక్ష ప్రశ్నపత్రాలను ప్రింట్ ఔట్ తీసుకున్నాడు. ఇంట్లోనే చదివించి, దగ్గరుండి పరీక్ష రాయించి.. మరోవైపు టీచర్ రేణుక, లవుడ్యావత్ డాక్యా ఏఈ పరీక్ష పేపర్లు విక్రయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రేణుక సోదరుడు, మాన్సూర్‌పల్లి తండా సర్పంచ్ కుమారుడైన కేతావత్ రాజేశ్వర్‌నాయక్‌ను.. అతడి ద్వారా మేడ్చల్ ఠాణాలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కేతావత్ శ్రీనివాస్ (రాజేశ్వర్ సోదరుడు)ను సంప్రదించి ఏఈ పేపర్ విషయం చెప్పారు. ఎస్సై పరీక్షకు సిద్ధమవుతున్న శ్రీనివాస్.. తనకు ఏఈ పేపర్ వద్దని చెప్పి, పరిచయస్తులైన కేతావత్ నీలేశ్‌నాయక్, పత్లావత్ గోపాల్‌నాయక్‌ల పేర్లు చెప్పాడు. దీనితో వారిని సంప్రదించిన రేణుక, డాక్యా రూ.13.5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్స్ తీసుకున్నారు. ఏఈ పేపర్లు ప్రింట్ తీసుకున్న ప్రవీణ్.. ఈ నెల 2న రేణుక, డాక్యాలకు ఫోన్ చేసి చెప్పాడు. అప్పుడు మహబూబ్‌నగర్‌లో ఉన్న వారిద్దరూ వెంటనే బాలాపూర్ వరకు వచ్చి ప్రవీణ్‌ను కలిశారు. ఏఈ పరీక్ష పేపర్లు తీసుకుని రూ.5 లక్షలు ఇచ్చారు. నీలేశ్, గోపాల్‌తోపాటు నీలేశ్ సోదరుడు రాజేంద్రనాయక్‌లను గండీడ్ మండలం పంచగల్ తండాలోని తమ ఇంటికి తీసుకువెళ్లారు. 5న ఉదయం డాక్యా అభ్యర్థులను వెంటపెట్టుకుని సరూర్‌నగర్‌లోని పరీక్ష కేంద్రం వరకు వచ్చి.. పరీక్ష రాయించాక విడిచిపెట్టాడు. టీఎస్పీఎస్సీ ఉద్యోగులు ఇద్దరిపై వేటు అసిస్టెంట్ ఇంజనీర్ పేపర్ల లీక్ వ్యవహారంలో ఇద్దరు ఉద్యోగులపై టీఎస్పీఎస్సీ వేటు వేసింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. ఔట్సోర్సింగ్ విధానంలో కంప్యూటర్ నెట్వర్క్ ఎక్స్‌పర్ట్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించింది. ఇక ఈ వ్యవహారంలో భాగస్వాములైన గురుకుల టీచర్ రేణుక, పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగి, పోలీస్ కానిస్టేబుల్ ముగ్గురూ ప్రభుత్వ ఉద్యోగులే కావడంతో.. వారిపైనా చర్యలు తీసుకునేందుకు సంబంధిత శాఖలు సిద్ధమయ్యాయి. మరికొన్ని పేపర్ల లీకేజీపై అనుమానాలు 6న తేదీన మళ్లీ ప్రవీణ్‌ను కలిసిన రేణుక, ఆమె భర్త ప్రశ్నపత్రాల కాపీలతోపాటు మరో రూ.5 లక్షలు ఇచ్చారు. పేపర్ల లీకేజీపై అనుమానం వచ్చిన టీఎస్పీఎస్సీ శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎస్.రఘునాథ్ నేతృత్వంలోని బృందం.. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక, లవుడ్యావత్ డాక్యా, రాజేశ్వర్, నీలేశ్, గోపాల్, శ్రీనివాస్, రాజేందర్‌లను అరెస్టు చేసింది. వారి నుంచి పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ పెన్‌డ్రైవ్‌ను పరిశీలించిన పోలీసులు.. అందులో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పేపర్ ఉందని, దాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడని గుర్తించారు. ప్రవీణ్ కంప్యూటర్ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. ఆ నివేదిక అందిన తర్వాత.. అతను, రాజశేఖర్ ఎవరెవరి కంప్యూటర్లను యాక్సస్ చేశారు? ఏమేం పేపర్లు డౌన్లోడ్ చేశారనేది తేలుతుందని డీసీపీ వెల్లడించారు. -
కమిషన్ ప్రతిష్టకు దెబ్బ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రతిష్టకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ, హాల్‌టికెట్ల పంపిణీ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన దాకా ఆధునిక విధానాలను అనుసరిస్తూ దేశంలోనే ఉత్తమ పబ్లిక్ సర్విస్ కమిషన్‌గా టీఎస్పీఎస్సీ గుర్తింపు పొందింది. కానీ ఇప్పుడు పేపర్ లీకవడం, కమిషన్ ఉద్యోగులే దీనికి పాల్పడటంతో ఒక్కసారిగా అలజడికి గురైంది. మూడో వంతు టీఎస్పీఎస్సీ ద్వారానే.. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80వేల ఉద్యోగాల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో మూడో వంతుకుపైగా టీఎస్పీఎస్సీ ద్వారానే చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపు 20వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేసిన క మిషన్.. వాటిలో కొన్నింటికి దరఖాస్తులు స్వీకరిస్తోంది కూడా. ఇందులో కీలకమై న గ్రూప్–1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్షలు పూర్తవగా.. మెయిన్స్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తోంది. వివిధ కేటగిరీల్లో ఇంజనీరింగ్ ఉద్యోగ పరీక్షలు కూడా పూర్తయ్యాయి. మరికొన్ని కేటగిరీలకు త్వరలో అర్హత పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో కమిషన్‌కు చెందిన సీక్రెట్ కంప్యూటర్ల నుంచి సమాచారం బయటకు వెళ్లడంతో టీఎస్పీఎస్సీ పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయంటూ.. ఆదివారం జరగాల్సిన టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్, ఈనెల 15, 16 తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ ఉద్యోగాల అర్హత పరీక్షలను టీఎస్పీఎస్సీ వాయిదా వేసింది. కానీ టౌన్ ప్లానింగ్ పేపర్‌ను ఓ ఉద్యోగి స్వయంగా లీక్ చేసినట్టు వెల్లడికావడం కలకలం రేపింది. ఇంకా ఏమైనా లీకయ్యాయా? టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు/ఉద్యోగ పరీక్షల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. పేపర్ లీకేజీ ఘటనతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. టీఎస్పీఎస్సీ ప్రస్తుతం వాయిదా వేసిన రెండు పరీక్షల సమాచారం మాత్రమే బయటకు పొక్కిందా? లేక ఇంతకుముందే జరిగిన పరీక్షలు, త్వరలో జరగాల్సిన పరీక్షల సమాచారం ఏమైనా బయటికి వెళ్లిందా? అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాసిన, రాయాల్సిన ఉద్యోగ పరీక్షలతోపాటు నియామక ప్రక్రియలు నిలిచిపోతాయేమోననే ఆవేదనలో మునిగిపోతున్నారు. ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ పరీక్షకు సంబంధించి లీకేజీపై స్పష్టత రావడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మిగతా పరీక్షల పేపర్లు ఏమైనా లీకయ్యాయా అన్న కోణంలోనూ విచారణ జరుపుతున్నట్టు తెలిసింది. ఉద్యోగుల బాధ్యతలపై ‘సమీక్ష’! ఈ పరిణామాలతో అసలు కమిషన్‌లో అంతర్గతంగా ఏం జరుగుతోందన్న దానిపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు. ‘లీకేజీ’వీరులు ఇంకెందరు ఉన్నారనే కోణంలో పరిశీలన జరుపుతున్నారు. ప్రతి ఉద్యోగి నుంచి వివరాలు సేకరించడంతోపాటు ఉద్యోగులు నిర్వహిస్తున్న విధులను సమీక్షిస్తున్నారు. ప్రస్తుత కేసు ఓ కొలిక్కి వచ్చిన తర్వాత ఉద్యోగుల విధులు/బాధ్యతల్లో ప్రక్షాళన చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.


