
ఢిల్లీ: నీట్-యూజీ 2024 పరీక్ష పేపర్ లీకేజీపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని.. కానీ, లీకేజీ ప్రభావం పెద్దగా లేదని అందులో పేర్కొంది.
పాట్నా(బీహార్) సెంటర్‌లలో, గోద్రా(గుజరాత్) కొందరి ద్వారా మాత్రమే నీట్ పేపర్ లీక్ అయ్యింది. కానీ, పేపర్ లీక్ వ్యవహారం దేశం మొత్తం మీద పరీక్ష నిర్వహణ, ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించలేదని ఎన్టీఏ ఆ అఫిడవిట్‌లో పేర్కొంది. ఇదిలా ఉంటే.. రేపు నీట్ రద్దు పిటిషన్లపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.
నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు ఆందోళనకు దిగడం.. దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ పరీక్షను రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. నీట్ పరీక్ష రద్దు చేసి చేసి తిరిగి నిర్వహించాలన్న 38 పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. నీట్ యూజీ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అయ్యిందనేది స్పష్టమైందని, అయితే రీ ఎగ్జామ్ నిర్వహణ చివరి ఆప్షన్‌గానే ఉండాలని.. పేపర్ లీకేజీతో నష్టం విస్తృత స్థాయిలో జరిగిందని విచారణలో తేలితే కచ్చితంగా మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఎన్టీఏను ఆదేశిస్తామని సీజేఐ బెంచ్ అభిప్రాయపడింది.
National Testing Agency (NTA) files affidavit in the Supreme Court in relation to the NEET-UG 2024 exam.
The NTA, having come to know about the malpractice by individuals at Godhra and few centers at Patna, has made an assessment of the performance of all the appeared… pic.twitter.com/PyHfzzC0Ih— ANI (@ANI) July 10, 2024