నటి సోనియా ఆకుల(Sonia Akula) గురించి ప్రత్యేక పరిచయం అవసరం పనిలేదు.
సినిమా నటికంటే రియాల్టీ షో బిగ్ బాస్(Bigg Boss-8) ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది.
తన అందం, ఆటతో మంచి ఫామ్‌లోకి వచ్చింది.
గత ఏడాది డిసెంబర్‌లో ప్రియుడు యష్ పాల్ వీరగోనిని పెళ్లాడి ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన పెర్సనల్ లైఫ్ విశేషాలు షేర్ చేసుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది.
ప్రస్తుతం గర్భిణిగా ఉన్న సోనియా శ్రావణ మాసంలోని ఆఖరి శుక్రవారం సందర్బంగా స్పెషల్ ఫోటోలనుషేర్ చేసింది.
భర్తతో కలిసి అమ్మవారికి అభిషేకం, తదితర పూజాదికాలు నిర్వహించింది.
సాంప్రదాయబద్ధంగా, ముత్తయిదువగా, నిండు గర్భిణిగా దిష్టి తగులేంత అందంగా, హుందాగా కనిపించింది.


