
ఎన్ జైశంకర్.. భారత విదేశాంగ మంత్రిగా సేవలందిస్తున్నారు. ఏదైనా విషయం వచ్చినప్పుడు సమయ స్ఫూర్తిగా స్పందించడంలో జై శంకర్‌ది ప్రత్యేక శైలి. ఆయనలోని చలోక్తిని కౌంటర్ అనుకోవచ్చు.. చమత్కారం అనుకోవచ్చు.. ఆయన మాటలు ప్రత్యర్థులకు బాధ కల్గించినా కాస్త కచ్చితత్వంతోనే ఉంటాయి. ఈ క్రమంలోనే నేడు(శనివారం, ఆగస్టు 23వ తేదీ) అమెరికా-పాకిస్తాన్‌లపై సెటైరిక్‌గా స్పందించారు.
ఎకనమిక్స్ టైమ్స్ ఆధ్వర్యంలోఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్ల ఫోరం సదస్సులో ఆయన పాల్గొన్నారు. దీనిలో భాగంగా జై శంకర్‌కు ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానంగా పాక్-అమెరికాల వైఖరిపై జై శంకర్ ఘాటుగా స్పందించారు. ఇరు దేశాల చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంది అంటూనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ ఇరు దేశాలు వారి చరిత్రను మర్చిపోయినట్లు ఉన్నాయంటూ సమాధానం చెప్పారు.
#WATCH | Delhi: "They have a history with each other, and they have a history of overlooking their history... It is the same military that went into Abbottabad (in Pakistan) and found who there?..." says EAM Dr S Jaishankar on relations between US and Pakistan, at The Economic… pic.twitter.com/wpYGfdLpbc
— ANI (@ANI) August 23, 2025
ఆ రెండు దేశాలు వారి చరిత్రను విస్మరించినట్లు ఉన్నారు అంటూ ఆల్ ఖైదా నాయకుడు బిన్ లాడెన్‌ను అమెరికా ఎలా హతమార్చిందనే సంగతిని ఇక్కడ ప్రస్తావించారు. అమెరికా-పాకిస్తాన్‌లకు చరిత్ర ఉంది. కానీ వారి చరిత్రను వారే మర్చిపోయారో, విస్మరించారో అనేది వారికే తెలియాలి అంటూ బుల్లెట్ లాంటి రిప్లై ఇచ్చారు జైశంకర్.
ఇదీ చదవండి: