
న్యూఢిల్లీ: రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోందన్న ఏకైక కారణంతో భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అదనపు సుంకాలు విధించడంపై కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఆయన మరోమారు స్పష్టం చేశారు. భారత్‌తో ఏదైనా సమస్య ఉన్న పక్షంలో ఈ దేశపు ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు జైశంకర్ స్పష్టం చేశారు.
‘ఎకనమిక్ టైమ్స్’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సులో ఎన్ జైశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా చమురు కొనుగోలు విషయంలో భారత్‌పై వెల్లువెత్తుతున్న విమర్శల అంశాన్ని ప్రస్తావించారు. భారత్-అమెరికా మధ్యవాణిజ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు. అయితే మన దేశానికంటూ కొన్ని ప్రయోజనాలున్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు. మన రైతులు, చిన్నస్థాయి ఉత్పత్తిదారుల ప్రయోజాలను కాపాడేందుకే తమ ప్రాధాన్యత ఉంటుందన్నారు.
#WATCH | Delhi: At The Economic Times World Leaders Forum 2025, EAM Dr S Jaishankar says, "It's funny to have people who work for a pro-business American administration accusing other people of doing business. If you have a problem buying oil or refined products from India, don't… pic.twitter.com/rXW9kCcVuv
— ANI (@ANI) August 23, 2025
ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, వ్యాపార అజెండాతో వ్యవహరిస్తున్న అమెరికా యంత్రాంగానికి మద్దతు పలుకుతూ, కొందరు తమపై నిందలు వేయడం హాస్యాస్పదమని జైశంకర్ పేర్కొన్నారు. నిజంగా మీకు(అమెరికాకు) భారత్‌తో సమస్య ఉంటే, ఈ దేశపు చమురును, శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేయకండి. వాటిని కొనాలంటూ మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడంలేదు. అవి మీకు నచ్చకపోతే కొనకండంటూ జైశంకర్ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్ అదనపు సుంకాల గురించి పూర్తిగా ప్రకటించడానికి ముందే, తాము రష్యా చమురు అంశం గురించి అమెరికాతో తాము ఎలాంటి చర్చలు జరపలేమని జైశంకర్ అన్నారు.