‘భారత్‌ మాకు ఎంతో ముఖ్యం.. సంబంధాలు కీలకమే’: అమెరికా | Amid Tariff And H1B Visa Rows, US Marco Rubio Says India-US Is Critical Importance To Us | Sakshi
Sakshi News home page

‘భారత్‌ మాకు ఎంతో ముఖ్యం.. సంబంధాలు కీలకమే’: అమెరికా

Sep 23 2025 8:49 AM | Updated on Sep 23 2025 11:30 AM

Amid Tariff H1B visa Rows India is Critical to us Says US Rubio

సుంకాలు, హెచ్‌1బీ వీసా ఆందోళనలు(Tariffs, H1B Visa Chaos) కొనసాగుతున్న వేళ.. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్క్‌ రుబియో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో సంబంధాలు తమ దేశానికి ఎంతో కీలకమని వ్యాఖ్యానించారాయన. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో భేటీపై స్పందిస్తూ రుబియో తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్‌ చేశారు. 

ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ 80వ సమావేశం సందర్భంగా.. జైశంకర్‌, మార్కో రుబియో(Marco Rubio) భేటీ అయ్యారు. భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురు చర్చించారు. ఈ పరిణామంపై రుబియో స్పందిస్తూ.. భారత్‌ అమెరికాకు అత్యంత కీలక భాగస్వామి. వాణిజ్యం, రక్షణ, ఇంధనం, ఔషధాలు, కీలకమైన ఖనిజాలు.. తదితర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకోవాలి. ఇరు దేశాల అభివృద్ధికి ఈ సహకారం అవసరం. 

.. భారత్‌తో వ్యూహాత్మక సంబంధాలు బలోపేతం చేయడం ద్వారా రెండు దేశాలకు అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛా, ఓపెన్ విధానాన్ని ప్రోత్సహించేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తాం అని పేర్కొన్నారాయన. మరోవైపు.. రుబియోతో భేటీపై జైశంకర్(Jaishankar) స్పందిస్తూ.. మార్కో రూబియోతో సమావేశం సానుకూలంగా సాగింది. అయితే ప్రాధాన్య అంశాలపై మరిన్ని చర్చలు అవసరం అని పేర్కొన్నారు. 

ట్రంప్ ప్రభుత్వం భారతపై విధించిన సుంకాలు, H-1B వీసా ఫీజు పెంపు వంటి పరిణామాల తర్వాత జరిగిన తొలి సమావేశం ఇదే. ఇప్పటికే అమెరికా ప్రతినిధుల బృందం భారత్‌కు వచ్చి సంప్రదింపులు జరిపి వెళ్లిపోయింది. ప్రస్తుతం కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో బృందం వాషింగ్టన్‌లో వాణిజ్య చర్చలు జరుపుతోంది. నవంబర్‌ కల్లా వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేసుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఈ సమయంలోనే రుబియో-జైశంకర్‌ భేటీ జరగడం, ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి బలపడేలా వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదీ చదవండి: ట్రంప్‌ తెచ్చిన తంటా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement