35 ఏళ్లకే భారీ పాపులారిటీ, కోట్ల ఆస్తి.. అంతులేని విషాదం!
పంజాబీ గాయకుడు(Punjabi Singer) రాజ్‌వీర్ జవాండా (Rajvir Jawanda) అకాల మరణం యావత్ సంగీత ప్రపంచానికి కుదిపివేసింది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి,35 ఏళ్ల వయసులో అనంత లోకాలకు చేరుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేసింది. ఒక రత్నాన్ని కోల్పోయామంటూ సంగీతాభిమానులు, పెద్దలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకుని, చిన్న వయసులోనే పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొని, ఇంకా మరింత బంగారు భవిష్యత్తును చూడాల్సిన ఆయన మరణం అత్యంత విషాదకరం. రాజ్‌వీర్ జవాండా ఆస్తుల విలువ(Net worth) ఎంత అనేది నెట్టింట చర్చకు దారి తీసింది.
ఆస్తి ఎంత అంటే?
రాజ్‌వీర్ జవాండా సంగీతం, పలు మూవీల్లో నటన, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు , ఇతర పెట్టుబడుల ద్వారా భారీ సంపదను కూడబెట్టాడు. పంజాబీ సంగీత రంగంలో ప్రముఖ వ్యక్తిగా, రాజ్‌వీర్ జవాండా తన పాటల బహుళప్రజాదరణ పొందాడు. భారీ ఆదాయాన్ని సంపాదించాడు. సర్దారీ, కంగాని , మేరా దిల్‌తో సహా అనే పాటలు అనేక ప్లాట్‌ఫాంలలో మోత మోగిపోయాయి. మిలియన్ల కొద్దీ స్ట్రీమ్స్ సాధించాయి. దీనికి రాయల్టీ కూడా భారీ మొత్తంలోనే సంపాదించాడు. వీటితోపాటు కెనడా,యూకే, యూఎస్ వంటి దేశాలలో అంతర్జాతీయ పర్యటనలు, లైవ్ షోలు మరో ప్రధాన ఆదాయ వనరు. దీనికి సోషల్ మీడియా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న రాజ్‌వీర్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పాన్సర్డ్ పోస్టులు, బ్రాండ్ డీల్స్ తో సంపాదన కూడా తక్కువేమీ కాదు. అలా అక్టోబర్ 8, 2025 నాటికి, రాజ్‌వీర్ నికర విలువ రూ. 4–5 కోట్ల మధ్య ఉంటుందని సమాచారం.సంగీతంతో పాటు,సుబేదార్ జోగిందర్ సింగ్, జింద్ జాన్ , మిండో తసీల్‌దార్ని లాంటి పంజాబీ చిత్రాలలో నటనతో కూడా ఆకట్టుకున్నాడు రాజ్‌వీర్. అలాగే ముందు చూపుతో ఇతర ఇతర వెంచర్లలో జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది.
చదవండి: Mounjaro వెయిట్‌లాస్ మందు దూకుడు, డిమాండ్ మామూలుగా లేదు!
పంజాబ్‌లోని లూధియానాలో 1990లో జన్మించిన రాజ్‌వీర్ జవాండా పాఠశాల విద్య తరువాత జగ్రాన్‌లోని డీఎవీ కళాశాల నుండి పట్టభద్రు డయ్యాడు. తరువాత పాటియాలాలోని పంజాబీ విశ్వవిద్యాలయం నుండి థియేటర్ అండ్ టెలివిజన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందాడు. తండ్రి కరం సింగ్ బాటలో నడుస్తూ 2011లో పంజాబ్ పోలీస్‌లో కానిస్టేబుల్‌గా చేరాడు. అయితే, ఆయన సంగీతం పట్ల తనకున్న మక్కువతో ఉద్యోగం చేస్తూనే సైడ్ కెరీర్‌గా పాటలు రికార్డ్ చేయడం , తన షిఫ్ట్‌ల తర్వాత ప్రదర్శన ఇచ్చేవారు. మంచి పాపులారిటీ రావడంతో పూర్తిగా దీనిపైనే దృష్టిపెట్టేందుకు అందువల్ల, 2019 లో పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
2020-21లో ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన జరిగినప్పుడు, రాజ్‌వీర్ కూడా రైతులకు మద్దతుగా వచ్చాడు. నిరసన తెలుపుతున్న రైతుల కోసం వేదికపై ఉచితంగా పాడేవాడు. ఢిల్లీ సరిహద్దులో రైతుల నిరసన సందర్భంగా, ఒక ప్రదర్శన సమయంలో తన తండ్రియ చనిపోయారు. ఈ వార్త తెలిసినా కూడా వేదికపై పాటను పూర్తి చేసి, అంత్యక్రియల కోసం బయలుదేరాడు.
రాజ్‌వీర్‌కు బైక్‌లంటే పిచ్చి
రాజ్‌వీర్ జవాండాకు బైకింగ్ అంటే చాలా ఇష్టం. అతను తరచుగా తోటి బైకర్లతో కలిసి కొండలకు విహారయాత్రలకు వెళ్లేవాడు. ఈ పర్యటనల సమయంలో, అతను హోటళ్లలో బస చేయకుండా రోడ్డు పక్కన క్యాంప్ చేసేవాడు. రాజ్‌వీర్ కొన్ని నెలల క్రితం రూ. 27 లక్షల విలువైన కొత్త BMW బైక్‌ను కొనుగోలు చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తన అభిమానులతో పంచుకున్నాడు , దానిని ఒక పాటలో కూడా ఉపయోగించాడు. ప్రమాదం జరిగిన సమయంలో అతను ఈ BMW బైక్‌ను నడుపుతున్నాడు. బైకింగ్‌కు అవసరమైన అన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నప్పటికీ అతన్ణి మృత్యువు వీడలేదు.
చదవండి: Rajvir Jawanda పోలీసు కాస్త గాయకుడిగా..భార్య వద్దన్నా వినలేదు..శోకసంద్రంలో ఫ్యాన్స్
రాజ్‌వీర్ జవాండా కుటుంబం
రాజ్‌వీర్ తాత సౌదాగర్ సింగ్. అమ్మమ్మ సుర్జిత్ కౌర్ తండ్రి రిటైర్డ్ ఏఎస్‌ఐ కరం సింగ్ . తల్లి పరమ్‌జిత్ కౌర్ ఈమె మాజీ సర్పంచ్. జవాందా, భార్య అశ్విందర్ కౌర్‌తో పాటు, ఇద్దరు పిల్లలు కుమార్తె హేమంత్ కౌర్ చ కుమారుడు దిలావర్ సింగ్. జవాందాకు కమల్‌జిత్ కౌర్ అనే సోదరి కూడా ఉంది.


