
మొన్న అసోం గాయకుడు జుబీన్ గార్డ్ అకాల మరణం వార్తను ఇంకా మర్చిపోకముందే పంజాబ్‌కు చెందిన మరో ప్రముఖ గాయకుడి మరణం సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పంజాబీ గాయకుడు రాజ్‌వీర్ జవాండా(Rajvir Jawanda) విషాద మరణం ఎంటర్‌టైన్‌మెంట్ పరిశ్రమలో దిగ్భ్రాంతి రేపింది. ఈసెప్టెంబర్ 27న తీవ్రమైన ప్రమాదానికి గురైన గాయకుడు 11 రోజులు వెంటిలేటర్‌పై చికిత్స పొందాడు. చివరికి అవయవాలు ఫెయిల్ కావడంతో తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని అభిమానులు, స్నేహితులు కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
రాజ్‌వీర్ జవాండా ప్రమాదానికి కారణం ఏమిటి?
తన కెంతో ఇష్టమైన 1300సీసీ బైక్‌పై విహార యాత్రకు వెళ్లిన రాజ్‌వార్ రోడ్డు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. అడ్డొచ్చిన పశువులను తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. రాజ్‌వీర్ 5-6గురు స్నేహితులతో కలిసి సిమ్లాకు విహారయాత్రకు వెళ్లిన సందర్భంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతని స్నేహితులు స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. అయితే తీవ్రంగా గాయడపిన రాజ్‌వీర్‌ను మొహాలిలోని ఫోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి చాలా విషమంగా మారిపోయింది. తీవ్ర గాయాలు, ప్రమాదంలో వెన్నెముక రెండచోట్ల విరిపోయిందనీ, ఇంకా పొట్టలో తీవ్ర గాయాలయ్యాయి. మెడ విరిగిపోయింది. దీంతో మెదడుకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లైఫ్ సపోర్ట్‌మీద ఉంచినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆర్గాన్ పెయిల్యూర్, గుండెపోటు కారణంగా రాజ్‌వీర్ చివరకు అక్టోబర్ 8న ప్రపంచానికి వీడ్కోలు పలికారు. ఆయన మరణ వార్తను ప్రముఖ పంజాబీ గాయని జస్బీర్ జస్సీ ధృవీకరించారు.
2014లో తన సంగీత జీవితాన్ని ప్రారంభించి అనతిలోకాలంలో పాపులారీటీ సాధించాడు. అయితే రాజ్‌వీర్ జవాంద మొదట్లో పోలీసు అధికారి కావాలని భావించాడు. కానీ అనుకోకుండా సింగింగ్ కరియర్‌లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించు కున్నాడు. కానీ దాన్ని పూర్తిగా అనుభవించకముందే .. చిన్న వయసులోనే నూరేళ్లు నిండిపోవడం విషాదం. అయితే అతని సక్సెస్ వెనుక అతని భార్య కృషి ఉన్నట్టు తెలుస్తోంది.
(జుబీన్ గార్గ్ మృతిలో మరో ట్విస్ట్ : డీఎస్‌పీ అరెస్ట్)
రాజ్‌వీర్ జవాండా భార్య హెచ్చరిక
రాజ్‌వీర్ జవాండా తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచిన నేపథ్యంలో, అతని భార్య కూడా ఎవరికీ తెలియదు. కానీ భర్తను ఆమె ఎప్పుడూ తెరవెనుక ఉండి నడిపించేదని సన్నిహితులు చెబుతున్న మాట.. ప్రమాదం జరిగిన రోజు తమ ఇంటి నుండి బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది రాజ్‌వీర్ భార్య. రాబోయే కీడును ఊహించే ఆమె అలా హెచ్చరించిందట. భద్రత గురించి తన ఆందోళనను స్పష్టంగా వ్యక్తం చేసిందట. కానీ రాజ్‌వీర్ పట్టించు కోలేదని రాజ్‌వీర్ సన్నిహితులు అంటున్నారు.
ఇదీ చదవండి: Happy Divorce విడాకులను సెలబ్రేట్ చేసుకున్న తల్లీ కొడుకులు