
ప్రఖ్యాత అసోం గాయకుడు జుబీన్ గార్గ్ అకాలమరణం కేసు అనేక మలుపులు తిరుగుతోంది. తొలుత స్కూబా డైవింగ్ ప్రమదంలో చనిపోయాడని భావించిన ఈ కేసులో ఆ తర్వాత అనేక అనుమానాలు తలెత్తాయి. విషప్రయోగం కారణంగా చనిపోయాడని మరోవార్త వెలుగులోకి వచ్చింది. దీంతో జుబీన్‌గార్గ్‌కు సంబంధించిన వారిని అనుమానితులుగా అదుపులోకి తీసుకున్నారు. తాజాగా జుబీన్ మరణానికి ఆయన సమీప బంధువు, పోలీసు అధికారిని అరెస్ట్ చేశారు.ఈ కేసుకు సంబంధించి గతంలో అరెస్టయిన మరో నలుగురు ఇప్పటికేఈ పోలీసు కస్టడీలో ఉన్నారు.
గత నెలలో సింగపూర్‌లో జుబీన్మరణానికి సంబంధించి జుబీన్ గార్గ్ బంధువు , అస్సాం పోలీసు DSP సందీపన్ గార్గ్‌ను బుధవారం అరెస్టు చేసినట్లు ఒక సీనియర్ అధికారి తెలిపారు. ఈ కేసులో ఇది ఐదో అరెస్టు.
VIDEO | Guwahati: Zubeen Garg's cousin and Assam Police DSP Sandipan Garg arrested in connection with singer's death.#ZubeenGarg #AssamNews
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/BdAfazODSz— Press Trust of India (@PTI_News) October 8, 2025
గత నెలలో సింగపూర్‌లో గాయకుడి మరణంపై పట్టుబడిన పోలీసు అధికారిని గత కొన్ని రోజులుగా అనేకసార్లు విచారించారు. ఈ సంఘటనలో డిప్యూటీ ఎస్పీ, సందీపన్ గార్గ్ అతనితో ఉన్నట్టు పోలీసులు నిర్ధారించారు. సందీపన్ రిమాండ్ కోరుతామని మరొక సీనియర్ అధికారి తెలిపారు. కాగా ఈ కేసులో నార్త్ ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్‌కాను మహంత, గాయకుడి మేనేజర్ సిద్ధార్థ్ శర్మతో పాటు, ఇద్దరు బ్యాండ్ సభ్యులు శేఖర్ జ్యోతి గోస్వామి ,అమృత్ ప్రభా మహంతాలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.