
విడాకులు (Divoce) అంటేనే అదేదో వినకూడని మాటలాగా, కళంకం అన్న భావన మన సమాజంలో పాతుకుపోయింది. కానీ మనస్ఫర్తలతో, ఒకర్నొకరు ద్వేషించుకుంటూ, తీవ్ర ఒత్తిడిలో జీవించడం కంటే.. అభిప్రాయాలు కలవన్నప్పుడు, విభేదాలు తారాస్థాయికి చేరినప్పుడు.. స్త్రీపురుషులిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోవడమే మేలు అనేది నేటి మాట.
విడాకులు అనేవి అటు మహిళలకుగానీ, ఇటు పురుషులకు గానీ జీవితంలో ఒక ముగింపు కాదని ఒక కొత్త ప్రారంభమని తెలియజేసే ఘటనలో గతంలో కూడా చూశాం. గతంలో యూపీకి చెందిన అనిల్ కుమార్ అనే రిటైర్డ్ ఉద్యోగి, విడాకులు తీసుకున్న తన కూతురు ఉర్విని బారాత్ ఊరేగించి, ఘనంగా ఇంటికి స్వాగతం పలికిన ఘటన నెట్టింట తెగ సందడి చేసింది. తాజాగా ఢిల్లీలో జరిగిన ఉదంతం పలువుర్ని ఆలోచింప జేస్తోంది. విడాకులిచ్చిన కొడుక్కి పాలాభాషేకం, కొత్తబట్టలిచ్చి.. కొత్త జీవితానికి నాంది పలకమని ఆశీర్వదించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు హాట్ టాపిక్. స్టోరీ ఏంటి అంటే..
ఢిల్లీకి చెందిన డీకే బిరాదర్, భార్యకు విడాకులిచ్చాడు. ఆ తర్వాత అతని తల్లి కొడుక్కి పాలాభిషేకం చేసింది. పాత ఆలోచనలను మర్చిపొమ్మనే సంకేతంగా శుద్ధిగా సంకేతంగా భావించే పాలతో కొడుకుని శుద్ధి చేసింది. అనంతరం కొత్త పెళ్లి కొడుకులా ముస్తాబయ్యాడు అతను. బట్టలు, షూ, వాచీ.. ఇలా అన్నీ కొత్తవే అతనికిచ్చింది. అంతేకాదు ‘హ్యాపీ డివోర్స్’ కేక్ కట్ చేసి పెద్ద సంబరమే చేసుకున్నాడు. ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కేక్ పై భార్యకు భరణంగా ఇచ్చింది కూడా రాయడం. అంటే ‘120 గ్రాముల బంగారం, 18 లక్షల డబ్బుతో లభించిన అని అర్థం వచ్చేలా ‘హ్యాపీ డివోర్స్’ అని రాసి ఉండటం గమనార్హం. ఈ కేక్ కట్ చేసి తల్లికి తినిపించి, తానూ తినిపించాడు సంతోషంగా. ఈ వీడియో ఇన్‌స్టాలో వైరల్ అయ్యింది.
చదవండి: నో అన్న గూగుల్‌లోనే కీలక పదవి.. ఎవరీ రాగిణీ?
Man celebrates divorce with ritual, sweets, and a cake reading “Happy Divorce 120g gold 18L cash.” sharing a caption: “I’m single, happy, free my life, my rules.” Urges others to celebrate themselves.
pic.twitter.com/Rrhhlpqoqx— Ghar Ke Kalesh (@gharkekalesh) October 7, 2025
‘‘120 గ్రాముల బంగారం, రూ.18 లక్షలు తీసుకోలేదు. కానీ నేను ఇచ్చాను.. ఇప్పుడు సంతోషంగా, స్వేచ్ఛగా ఉన్నాను’’అని పేర్కొన్నాడు. ఈ వీడియో నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది. నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. వెడ్డింగ్ స్వీట్స్ టూ డివోర్స్ ట్రీట్స్ అని కొందరు, ఏమైనా గానీ మొత్తానికి బతికే ఉన్నాడు అనికొందరు కమెంట్ చేశారు. జీవితంలోతీవ్ర ఒత్తిడితో సఫర్ అయ్యి, చివరకు ఆ ఒత్తిడి నుండి ఉపశమనం వచ్చినపుడు జీవితాన్ని ఆస్వాదించాలని కోరుకుంటారు. బహుశా విడాకుల తర్వాత ఈ బ్రో ఒత్తిడి తగ్గిపోయి ఉండవచ్చు -అందుకే నిజంగా సంతోషంగా ఉన్నాడని మరొకరు వ్యాఖ్యానించారు.