టూత్‌పిక్‌తో టవర్‌ నిర్మించి రికార్డు సృష్టించాడు..! | A teenager built the record breaking toothpick tower | Sakshi
Sakshi News home page

టూత్‌పిక్‌తో టవర్‌ నిర్మించి రికార్డు సృష్టించాడు..!

Feb 27 2026 5:29 PM | Updated on Feb 27 2026 5:47 PM

A teenager built the record breaking toothpick tower

ఒక రంగంపై మంచి ఆసక్తి ఎంతటి అనితరసాధ్యమైనదైనా సాధించేలా చేస్తుంది. అందుకు ఉదాహరణ ఈ యువకుడు. అతడికి ఇంజనీరింగ్‌ పట్ల ఉన్న మక్కువ ఏకంగా అత్యంత అల్పమైన టూత్‌పిక్‌లతో టవర్‌ నిర్మించేలా చేసి, గిన్నిస్‌ రికార్డులకెక్కేలా చేసింది. ఆ కుర్రాడు ఎవరంటే..

యునైటెడ్‌ స్టేట్స్‌లోని ఇల్లినాయిస్‌లోని నేపర్‌విల్లేకు చెందిన ఎరిక్‌ కేబుల్‌ అనే యువకుడు ఇంజనీరింగ్‌ పట్ల తనకున్న ప్రేమను రికార్డు క్రియేట్‌ చేసే విజయంగా మార్చుకున్నాడు. నెలల తరబడి టూత్‌పిక్‌లు జిగురు మాత్రమే ఉపయోగించి 17 అడుగుల ఎత్తైన టవర్‌ని నిర్మించాడు. ఈ నిర్మాణం ఎత్తు 5.28 మీటర్లు. ఇది పూర్తిగా టూత్‌పిక్‌తో నిర్మించిన ఎత్తైన భవనంగా నిలిచి..గిన్నిస్‌ రికార్డులకెక్కింది.

ఆ యువకుడు ప్రసిద్ధ ఈఫెల్‌ టవర్‌ని ‍ప్రేరణగా తీసుకుని ఈ ఎత్తైన టవర్‌ని నిర్మించినట్లు తెలిపాడు. ఆ యువకుడు ఎరిక్‌ 2020లో పాప్సికల్ స్టిక్స్‌తో ఎత్తైన టవర్‌ని నిర్మించి రికార్డు క్రియేట్‌ చేశాడు. తాజాగా ఇప్పుడు ఈ టూత్‌పిక్‌లతో తన రికార్డుని తానే బ్రేక్‌ చేశాడు. చిన్న వయసులో రికార్డులు సృష్టించడం ఒక థ్రిల్లింగ్‌ అనుభవం అని, అందుకే మళ్లీ మళ్లీ అలాంటిదే చేయాలనే ఆకాంక్ష బలంగా ఉంటుందంటున్నాడు ఎరిక్‌. 

అయితే ఈసారి మరింత కఠినతరమైనది నిర్మించాలనే ఛాలెంజ్‌ తీసుకున్నానని అన్నాడు. ఆ నేథ్యంలో ఇలా టూత్‌పిక్‌లు ఎంచుకున్నానట్లు తెలిపాడు. ఇవే ఎందుకంటే పాప్సికల్ స్టిక్స్ అంత బలంగా ఉండదు కాబట్టి వీటితే నిర్మిస్తేనే కథ అసలైన టాలెంట్‌, కిక్‌ అని అంటున్నాడు ఎరిక్‌. ముందుగా చిన్న చిన్న నిర్మాణాలను నిర్మించడం సాధన చేసి..ఆ తర్వాత పెద్ద టవర్‌ని నిర్మించేందుకు ఉపక్రమించానని అంటున్నాడు. 

ఆ టవర్‌ లోపలి ప్రత్యేక విభాగాలను ఇంటివద్ద నిర్మించి ఆ తర్వాత నేపర్‌విల్లేలోని ఒక బహిరంగ కార్యక్రమంలో దాన్ని నిర్మించినట్లు వివరించాడు. STEM (స్టెమ్) అనే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్‌, మ్యాథ్స్‌ కలయికతో కూడిన ప్రతిష్టాత్మక కోర్సుపై ఉన్న మక్కువ వల్లే రికార్డు స్థాయిలో ఈ టూత్‌పిక్‌ టవర్‌ని నిర్మించాడు. 

(చదవండి: రష్మిక మందన్న మేలి ముసుగుపై శక్తిమంతమైన ఆ పదాలు..!)

 

Advertisement
 
Advertisement
Advertisement