'నా భర్తను పరిచయం చేస్తున్నా'.. రష్మిక ఎమోషనల్ పోస్ట్ | Rashmika mandanna Introduces her Husband vijay devarakonda | Sakshi
Sakshi News home page

Rashmika: 'నా భర్తను పరిచయం చేస్తున్నా'.. రష్మిక ఎమోషనల్ పోస్ట్

Feb 26 2026 6:48 PM | Updated on Feb 26 2026 7:25 PM

Rashmika mandanna Introduces her Husband vijay devarakonda

తన పెళ్లి ఫోటోలను హీరోయిన్ రష్మిక సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాయ్ మై లవ్స్.. తన భర్త విజయ్‌ దేవరకొండను మీకు పరిచయం చేస్తున్నానంటూ పోస్ట్ చేసింది. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నాకు నేర్పించిన వ్యక్తి అని విజయ్‌ను కొనియాడింది. ప్రశాంతంగా ఎలా ఉండాలో నాకు చూపించిన వ్యక్తి అని ప్రశంసలు కురిపించింది. నా కలలు నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పిన ఏకైక వ్యక్తి అంటూ  భర్త విజయ్‌ దేవరకొండను ఆకాశానికెత్తేసింది. ఇది చూసిన అభిమానులు రష్మిక-విజయ్ జంటకు అభినందనలు చెబుతున్నారు. 

రష్మిక తన ఇన్‌స్టాలో రాస్తూ..' హాయ్ మై లవ్స్.. ఇప్పుడు మీకు నా భర్తని పరిచయం చేస్తున్నా.  మిస్టర్ విజయ్ దేవరకొండ.. నిజమైన ప్రేమ, ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్పించిన వ్యక్తి.  ప్రతిరోజు  పెద్ద కలలు కనడం.. నేను ఎప్పుడైనా సాధించగలనని చెప్పగలిగే వ్యక్తి. స్నేహితులతో ప్రయాణించడం నాకు చూపించిన వ్యక్తి. నన్ను నమ్మండి.. నేను ఈ వ్యక్తి గురించి ఒక పుస్తకం రాయగలను. నేను ఎప్పుడూ కలలు కన్న స్త్రీని అయ్యా.. ఎందుకంటే మీరు ఈ రోజు నాదిగా మార్చారు. ఈరోజు నన్ను నిజంగా ఆశీర్వదించారు.  విజ్జు నీ పట్ల నాకున్న భావాలను వర్ణించడానికి నాకు మాటలు లేవు!! నేను ఎప్పుడూ నీకు చెబుతూనే ఉన్నానంటూ' పోస్ట్ చేసింది.

అంతేకాకుండా..'నా విజయాలు, కష్టాలు, ఆనందం, విచారం, జీవితం అన్నీ నీకు తెలుసు. ఇప్పుడు ప్రతిదీ చాలా అర్థవంతంగా ఉంది. ఎందుకంటే నేను నీతో ఉన్నా. ఇది మన జీవితంలో అన్నింటిలో అతిపెద్ద భాగం. నేను నీ భార్యగా మారడానికి చాలా ఉత్సాహంగా ఉన్నా. మీ భార్యగా ఉండటానికి.. మీ భార్యగా పిలవడానికి.. ఇప్పుడిది పూర్తిగా పార్టీ సమయం. మనిద్దరం కలిసి ఎప్పుడూ లేనంత ఉత్తమ జీవితాన్ని గడుపుదాం. ఐ లవ్ యూ'  అంటూ ఎమోషనల్‌ పోస్ట్ చేసింది.'

ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్..

టాలీవుడ్ జంట విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇవాళ ఉదయం ఈ ఫేమస్ స్టార్స్‌ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఎట్టకేలకు ఒక్కటయ్యారు. ఈ గ్రాండ్‌ వెడ్డింగ్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా నిలిచింది. తెలుగు సంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగ్గా.. సాయంత్రం కర్ణాటకలోని కొడవ సంప్రదాయం ప్రకారం కూడా పెళ్లి వేడుక జరగనుంది. ఈ పెళ్లి వేడుకలో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 

 

Advertisement
 
Advertisement
Advertisement