రష్మిక చూసిన మొదటి తెలుగు సినిమా.. మన స్టార్ హీరోదే..! | Rashmika Old Video viral about Telugu cinema ahead of her wedding | Sakshi
Sakshi News home page

Rashmika: 'నేను థియేటర్లో చూసిన మొదటి తెలుగు సినిమా అదే'

Feb 26 2026 4:58 PM | Updated on Feb 26 2026 5:06 PM

Rashmika Old Video viral about Telugu cinema ahead of her wedding

స్టార్ హీరోయిన్ రష్మిక తెలుగింటి కోడలిగా మెట్టినింట అడుగుపెట్టనుంది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రష్ పెళ్లి వేడుక గ్రాండ్‌గా జరిగింది. కర్ణాటకకు చెందిన రష్మిక తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. కొన్నేళ్ల పాటు విజయ్‌తో ప్రేమలో ఉన్న ముద్దుగుమ్మ ఈ రోజే మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వీరి పెళ్లి వేదికగా నిలిచింది. ఈ వేడుకలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు.

అియితే రష్మిక మందన్నా తెలుగింటి కోడలిగా రానున్న తరుణంలో గత ఇంటర్వ్యూలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మికను మీకిష్టమైన తెలుగు సినిమా ఏది? ఎందుకు? అని ప్రశ్నించారు. దీనికి రష్మిక సమాధానమిచ్చింది.

తాను చూసిన ఫస్ట్ తెలుగు సినిమా మహేశ్ బాబు నటించిన బిజినెస్‌మెన్ అని తెలిపింది. నాన్నతో పాటు వెళ్లి బిజినెస్‌మెన్‌ థియేటర్‌లో చూశానని రష్మిక పంచుకుంది. నా కెరీర్‌ కాకుండా తెలుగులో నేను చూసిన మొదటి సినిమా ఇదేనని వెల్లడించింది. రష్మిక- విజయ్ పెళ్లి వేళ ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement