
ఒకపుడు ఆమెను తమ సంస్థలో ఉద్యోగానికి తిరస్కరించింది.కట్ చేస్తే రెండేళ్లలోపే అదే కంపెనీలో ఉన్నత పదవికి ఎంపికైంది. ఇదే కదా సక్సెస్ కిక్ అంటే.. ఆ సక్సెస్ పేరే రాగిణి దాస్. ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారిన రాగిణీ దాస్ స్టోరీ ఏంటి? తెలుసుకుందాం ఈ కథనంలో
మహిళా-కేంద్రీకృత ప్రొఫెషనల్ నెట్‌వర్క్ లీప్.క్లబ్(Leap club) సహ వ్యవస్థాపకురాలు, FICCIలో ఉమెన్ ఇన్ స్టార్టప్స్ కమిటీ చైర్‌పర్సన్ రాగిణి దాస్ ఇపుడు గూగుల్ ఇండియాలో స్టార్టప్ హెడ్‌గా ఎంపికైంది. 2013లో గూగుల్ ఉద్యోగానికి సంబంధించి చివరి ఇంటర్వ్యూ రౌండ్‌లో ఎంపిక కాలేక పోయింది. కట్ చేస్తే లీప్.క్లబ్ సహ వ్యవస్థాపకురాలిగా జొమాటో వంటి సంస్థలతో కూడా పనిచేసిన అనుభవంతో గూగుల్ ఇండియా స్టార్టప్ హెడ్‌గా నియమితులైంది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. నిజంగా జీవితం చక్రం లాంటిది.. తిరిగి అవకాశం వచ్చింది అంటూ ట్విట్ చేసింది.
గూగుల్‌లో తన కొత్త బాద్యతలను గురించి వ్యాఖ్యానిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లను సమర్థులైన వ్యక్తులు, ఉత్పత్తులు , ఉత్తమ పద్ధతులతో అనుసంధానించడం ద్వారా వాటిని అభివృద్ధి చేయడంలో సహాయపడటానికి, వారికి సాయం అందించే లక్ష్యంతో ఉన్నామని తెలిపింది. (84 ఏళ్ల వయసులో తల్లి, కూతురి వయసు మాత్రం అడక్కండి: గుర్తుపట్టారా! )
Life has come full circle, and I’m excited to share that I’ve joined @Google as Head of Google for Startups - India 🍋
The backstory: In 2013, I sat for two interviews: one at Google and one at Zomato. pic.twitter.com/Hs9cqKHFxJ— Ragini Das (@ragingdas) October 6, 2025
ఎవరీ రాగిణి దాస్?
గురుగ్రామ్‌లో జన్మించిన రాగిణి దాస్, చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమంలో పాఠశాల విద్యను పూర్తి చేసింది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందింది. అందుకు ముందు సాంస్కృతిక కార్యదర్శిగా కూడా పనిచేసింది. అలాగే గ్రాడ్యుయేషన్ సమయంలో, ఆమె స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ , ఇతర సంస్థలతో ఇంటర్న్ గా, మార్కెట్ పరిశోధన మరియు భారత మార్కెట్ కోసం వ్యాపార ప్రణాళికలను డెవలప్ చేసింది. 2012లో, దేశీయ మార్కెటింగ్ కోసం ఫ్రంట్‌లైన్ వ్యవస్థాపకురాలిగా ట్రైడెంట్ గ్రూప్ ఇండియాలో చేరింది. అనంతరం యూరప్ అండ్ యుఎస్ మార్కెటింగ్ నిర్వహణలో పదోన్నతి పొందింది. తిరిగి ఒక్క ఏడాదిలోనే 2013లో, జొమాటోలో రాగిణి సేల్స్ అండ్ మార్కెటింగ్ మేనేజర్‌గా చేరింది. అకౌంట్ మేనేజర్, ఏరియా సేల్స్ మేనేజర్‌తో సహా వివిధ పాత్రల్లో ఆరేళ్లు తన సేవలను అందించింది.
చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్‌వీడియో
2017లో, ఆమె జోమాటో గోల్డ్ వ్యవస్థాపక బృందంలో భాగమైంది. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ఖతార్ మరియు లెబనాన్‌తో సహా 10 అంతర్జాతీయ మార్కెట్లలో జోమాటో గోల్డ్‌ను ప్రారంభించడంలో కీలక పాత్ర పోషించింది.
2020లో, వేలాది మంది మహిళల కోసం ఆన్‌లైన్ యాప్ మరియు ఆఫ్‌లైన్ క్లబ్‌ను leap.clubను సహ-స్థాపించింది వేలాది మంది మహిళలకు నెట్‌వర్కింగ్, ప్రొఫెషనల్ అవకాశాలు, క్యూరేటెడ్ ఈవెంట్‌లు ,ఆసక్తి-ఆధారిత కమ్యూనిటీలను అందిచింది. ఈ ఏడాది జూన్‌లో ఈ సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రస్తుతం రాగిణి దాస్, గూగుల్ ఫర్ స్టార్టప్స్ భారతదేశ విభాగానికి కొత్త హెడ్‌గా ఎంపికకావడం విశేషం.