
ప్రముఖ యాంకర్ సుమ కనకాల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఏళ్ల తరబడి టీవీ షోలలో తన యాంకరింగ్‌తో అలరిస్తోంది. ఒక్క చేత్తో టీవీ షోలు, మరో చేత్తో సినిమా ఈవెంట్లు, విదేశీ టూర్లతో నిరంతరం బిజీగానే ఉంటుంది. అందర్నీ మెప్పించే వాక్చాతుర్యం, ఛలోక్తులు, ఎక్కడలేని ఎనర్జీతో అభిమానుల విశేషాభిమానం, పాపులారిటీతో పాటు చేతి నిండా సంపాదనే. ఇది చాలదన్నట్టు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు ప్రేరణగా నిలుస్తూ ఉంటుంది.తాజాగా 84 ఏళ్ల తన మాతృమూర్తి వీడియోను ఇన్‌స్టాలోప్టె్ చేసింది. దీంతో ఇది అభిమానుల మనసు దోచుకుంటోంది.
నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోలో సుమ తల్లి 84 వయస్సులో కూడా ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ఉండటం విశేషం. ‘84 ఏళ్ల మదర్, వెర్సస్ డాటర్’ అనే క్యాప్షన్‌తో సమ వీడియో పోస్ట్ చేసింది. అయితే 84 ఏళ్ల వయసులో తల్లి అంటూ తల్లి వయసు చెప్పింది గానీ, తన వయసు మాత్రం చెప్ప లేదు. పైగా మీకు తోచినంత అని చమత్కరించింది.
ఈ ఏజ్‌లో కూడా అమ్మ ఫిట్‌నెస్ గ్రేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేయగా, మీ ఏజ్ 62, 28 ..48? అంటూ మరికొందరు ఫన్నీగా కమెంట్స్ చేశారు.