కూతురు గ్రాడ్యుయేషన్‌ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..! | mothers energetic cheer for daughter convocation ceremony in Canada | Sakshi
Sakshi News home page

కూతురు గ్రాడ్యుయేషన్‌ డే..ఆ తల్లి ఏం చేసిందంటే..!

Feb 23 2026 5:11 PM | Updated on Feb 23 2026 5:11 PM

mothers energetic cheer for daughter convocation ceremony in Canada

ఏ తల్లిదండ్రులకైనా తమ పిల్లలు గ్రాడ్యుయేషన్‌ డే అంటే ఎంతో సంతోషంతో ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. అది వారికి ఓ గొప్ప పండుగ. అలాంటి గొప్ప వేడుకలో ఓ తల్లి ఎంత పట్టరాని సంతోషంలో ఉందంటే..ఆ కార్యక్రమంలో ఉన్న వాళ్లందరి ముఖాల్లో నవ్వలు విరిసేలా చేసింది. కూతురు గ్రాడ్యుయేషన్‌ డేలో ఆ తల్లి సంతోషమే హైలెట్‌గా నిలిచింది. ఇది ఎక్కడ జరిగిందంటే..

కెనడాలో జరిగిన స్నాతకోత్సవ వేడుకలో తన కూతురి కోసం తల్లి పట్టరాని సంతోషంతో డ్యాన్స్‌లు వేస్తూ సందడి చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ స్నాతకోత్సవంలో కూతురు నల్లగౌనులో వేదికపైకి వచ్చి ప్రొఫెసర్‌తో కలిసి ఫోటోలకు ఫోజులిస్తుండగా..ఆ తల్లి సంతోషంతో నేను నిన్న ప్రేమిస్తున్నా తల్లి..అని గట్టిగా అరుస్తుంది. 

ఆ స్వరానికి అందరు ఆశ్చర్యపోతూ..అక్కడ ఒక్కసారిగా నవ్వుల వాతావరణం ఏర్పడుతుంది. ఆ తల్లి ఎంతో గర్వంగా ఉద్విగ్నంగా కూతురిని, ఆ ప్రొఫెసర్‌ని ప్లీజ్‌ రెండు స్టెప్‌లు వేయమని కోరడం..అందరికీ నవ్వు తెప్పిస్తుంది. పిల్లలు సాధించిన ఘనతలను సంబరం చేసుకుని ఆనందపడేది ఒక్క మన తల్లిదండ్రులే కదా..!. నిజంగా పేరెంట్స్‌ మనల్ని చూసి గర్వంగా ఉప్పొంగిన క్షణం మాటలకందని సన్నివేశం, మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం అది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.

 

(చదవండి: రష్మిక, విజయ్‌ల పెళ్లి వేదికగా ఐటీసీ మెమెంటోస్‌..! ఎంత ఖర్చు అవుతుందంటే..)

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement