ఎంతగా అలంకరించుకున్నా, ఎంత మంచి యాక్సెసరీస్ ధరించినా పిగ్మెంటేషన్ ఉండటం వల్ల ముఖం కళావిహీనంగా కనిపిస్తుంది. దీనిని తొలగించుకునే మార్గం ఆలోచించకుండా చాలామంది మేకప్‌తో కవర్ చేయాలని చూస్తారు. అయితే చిన్న ఇంటి చిట్కాల ద్వారా పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడవచ్చు.
అవేమిటో చూద్దాం...
అర కప్పు యాపిల్ సిడార్ వెనిగర్ లో అర కప్పు నీరు కలపండి. పిగ్మెంటేషన్ ఉన్న చోట ఈ నీటిని పోయండి. నాలుగైదు నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండుసార్లు నెల రోజుల పాటు చేయడం వల్ల పిగ్మెంటేషన్ మటు మాయం అవుతుంది.
అంతకన్నా సులువైన చిట్కా మరోటి ఉంది. అదేమిటంటే... ఒక బౌల్‌లో ఐదారు టీ స్పూన్ల పసుపు తీసుకుని అందులో తగినంత పాలు పోసి మెత్తటి పేస్ట్ లా చేయండి. పిగ్మెంటేషన్ ఉన్నచోట ఈ పేస్ట్ అప్లై చేసి ఐదునిమిషాలపాటు గుండ్రంగా మసాజ్ చేయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. రోజూ స్నానానికి ముందు ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఎంతగా అలంకరించుకున్నా, ఎంత మంచి యాక్సెసరీస్ ధరించినా పిగ్మెంటేషన్ ఉండటం వల్ల ముఖం కళావిహీనంగా కనిపిస్తుంది. దీనిని తొలగించుకునే మార్గం ఆలోచించకుండా చాలామంది మేకప్‌తో కవర్ చేయాలని చూస్తారు. అయితే చిన్న ఇంటి చిట్కాల ద్వారా పిగ్మెంటేషన్ సమస్య నుంచి బయట పడవచ్చు. అవేమిటో చూద్దాం...
అర కప్పు యాపిల్ సిడార్ వెనిగర్ లో అర కప్పు నీరు కలపండి. పిగ్మెంటేషన్ ఉన్న చోట ఈ నీటిని పోయండి. నాలుగైదు నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. ఇలా రోజుకి రెండుసార్లు నెల రోజుల పాటు చేయడం వల్ల పిగ్మెంటేషన్ మటు మాయం అవుతుంది.
అంతకన్నా సులువైన చిట్కా మరోటి ఉంది. అదేమిటంటే... ఒక బౌల్‌లో ఐదారు టీ స్పూన్ల పసుపు తీసుకుని అందులో తగినంత పాలుపోసి మెత్తటి పేస్ట్ లా చేయండి. పిగ్మెంటేషన్ ఉన్నచోట ఈ పేస్ట్ అప్లై చేసి ఐదునిమిషాలపాటు గుండ్రంగా మసాజ్ చేయండి. ఆరిన తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయండి. రోజూ స్నానానికి ముందు ఒకసారి ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
ఫేషియల్ క్లెన్సర్
ఒక కప్పు క్యాబేజ్ తురుము, ఒక టీస్పూను ఓట్స్ పొడి కలిపి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడగాలి. పొడి చర్మానికయితే చివరగా ముఖానికి మాయిశ్చరైజింగ్ క్రీమ్ కానీ పాల మీగడ లేదా వెన్న రాయాలి.
రెండు టేబుల్ స్పూన్ల ఓట్ పౌడర్ కాని మొక్కజొన్న పొడి కాని తీసుకుని అందులో కోడిగుడ్డు సొన కలిపి నురగ వచ్చే వరకు చిలకాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి తుడిచిన తర్వాత ఈ మిశ్రమాన్ని రాసి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. ఈ ప్యాక్‌ను జాగ్రత్తగా శుభ్రం చేయాలి.
ముందుగా తడి టవల్‌తో మెల్లగా రుద్దుతూ ప్యాక్‌ను పూర్తిగా తొలగించిన తరవాత ఒకసారి వేడినీటితోనూ మరొకసారి చన్నీటితోనూ కడగాలి. నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్ అయితే అలాగే వదిలేయవచ్చు, పొడిచర్మం అయితే మాత్రం శీతకాలం కాబట్టి అవసరమనిపిస్తే కొద్దిగా క్రీమ్ రాసుకోవచ్చు.
(చదవండి: రుచుల రాణి... మన బిర్యానీ! బెస్ట్ రైసు వంటకంగా ఏ స్థానంలో ఉందంటే..)


