న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు. ఈ పర్యటనలో చమురు కొనుగోళ్లు, రక్షణ మరియు వాణిజ్యం వంటి కీలక అంశాలపై చర్చలు ఉంటాయని భావిస్తున్నారు.
దేశ అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము కూడా రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు స్వాగతం పలుకుతారు. ఆయన గౌరవార్థం విందును ఏర్పాటు చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ ఇండియా-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి 2025 డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశంలో అధికారిక పర్యటన చేస్తారు" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
చదవండి: లక్ష కంఠ గీతా పారాయణం : ప్రధానికి ఘన స్వాగతం
పుతిన్ తన భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కూడా చర్చలు జరుపుతారు. పుతిన్ పర్యటన భారత, రష్యా ద్వైపాక్షిక సంబంధాలలో పురోగతిని సమీక్షించడానికి, ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాల మార్పిడికి అవకాశాన్ని కల్పిస్తుందని ప్రభుత్వం తెలిపింది.
ఈ ఏడాది ఆగస్టులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్ భారత పర్యటనను ప్రకటించారు. అయితే, ఆ సమయంలో తేదీలను ఖరారు చేయలేదు. తరువాత షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, పుతిన్ చైనాలో సమావేశమయ్యారు.
ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు


