న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జర్మనీ చాన్స్‌లర్ ఫ్రెడరిక్ మెర్జ్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. నేడు (సోమవారం) ఉదయం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆయనకు ఘనస్వాగతం లభించింది. 2025,మే నెలలో చాన్స్‌లర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన మెర్జ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. జనవరి 12 నుండి 13 వరకు సాగే ఈ పర్యటన రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.
Welcome to India! Willkommen in Indien!
Federal Chancellor Friedrich Merz @Bundeskanzler has arrived in Ahmedabad on an official visit. Warmly received by Hon’ble Governor of Gujarat, Shri Acharya Devvrat at the airport.
India and Germany are celebrating 75 years of… pic.twitter.com/Qw4ZkQ0FpP— Randhir Jaiswal (@MEAIndia) January 12, 2026
ఈ పర్యటనలో భాగంగా మెర్జ్ సోమవారం ఉదయం 9:30 గంటలకు ఆయన ప్రధాని మోదీ కలిసి సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉదయం 10 గంటలకు సబర్మతీ రివర్‌ఫ్రంట్‌లో జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌లో ఇద్దరు నేతలు పాల్గొంటారు. ఉదయం 11:15 గంటల నుండి గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్‌లో ఇరు దేశాల ప్రతినిధి బృందాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నాయి. భారత్-జర్మనీల భాగస్వామ్యం 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో, గత పురోగతిని సమీక్షించడంతో పాటు రక్షణ, భద్రత, సైన్స్ అండ్ ఇన్నోవేషన్, గ్రీన్ డెవలప్‌మెంట్ వంటి కీలక రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరగనున్నాయి.
ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, నైపుణ్యాభివృద్ధి తదితర రంగాల్లో పరస్పర సహకారంపై నేతలు దృష్టి సారించనున్నారు. ఈ సమావేశాల్లో ఇరు దేశాల వ్యాపార, పారిశ్రామిక దిగ్గజాలతో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు, కెనడాలో జరిగిన జీ-7 శిఖరాగ్ర సమావేశంలో కుదిరిన భాగస్వామ్యాన్ని మరింత విస్తరించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
ఇది కూడా చదవండి: మన భోగి.. వారికి లోహ్రీ.. గమ్మత్తయిన పోలికలివే..


